అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బడేమియా ఛోటేమియా’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీగానే నష్టాలు మిగిలాయి. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఇందులో మానుషి చిల్లర్, అలయా ఎఫ్ ,ఇమ్రాన్ హష్మి, పృథ్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఇందులో నటించారు.
‘బడేమియా ఛోటేమియా’ చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సంస్థపై రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, ఆయన తండ్రి వాసు భగ్నానీ అనేక చిత్రాలను నిర్మించారు. కానీ, ‘బడేమియా ఛోటేమియా’ చిత్రం కోసం రూ. 350 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ కావడంతో వారికి కేవలం రూ. 110 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ నిర్మాణ సంస్థకు కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులకు కూడా పూర్తి చెల్లింపులు చేయలేకపోయింది. బాలీవుడ్‌లో ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది.
ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ పెద్ద మనుసు చేసుకొని తమకు అండగా నిలిచారని ఆ చిత్ర నిర్మాత కుమారుడు జాకీ భగ్నాని తాజాగా తెలిపారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వమని అక్షయ్ కోరారని ఆయన అన్నారు. అందరికంటే ఎక్కువ మొత్తం కూడా అక్షయ్ కుమార్‌కే ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయినా సరే తనను నమ్మి సినిమా తీసిన నిర్మాణ సంస్థ ఇబ్బందులో పడకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో వారి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ముందకు వచ్చారట.
ఈ క్లిష్ట సమయంలో తన సహాయాన్ని అందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు జాకీ భగ్నాని కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ కుమార్ తనని ఇటీవల కలిశారని పరిస్థితి గురించి తెలియజేసిన తర్వాత ఆయన సాయం చేసేందుకు ముందుకు వచ్చారని జాకీ తెలిపాడు. 'అక్షయ్ సర్ .. కష్ట సమయంలో మా వెంట నిలబడ్డారు. మా పట్ల ఆయన చూపించిన ప్రేమకు మేము చాలా కృతజ్ఞులం' అని జాకీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment