
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ బుధవారం చెప్పారు. గవర్నర్ ప్రసంగ సమయంలో చోటు చేసుకున్న ఘటనలో ఆయన కంటికి గాయమైన విషయం తెలిసిందే. సరోజినీదేవి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగా, మెరుగ్గా ఉందని తెలిపారు. గురువారం ఉదయం మరోసారి పరీక్షించిన తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు.