జర్మనీలో మోదీకి ఘనస్వాగతం... పాటతో అలరించిన బాలుడు | PM Modi Greeted By Young Student With Patriotic Song | Sakshi
Sakshi News home page

Three Nation Visit To Europe: జర్మనీలో మోదీకి ఘనస్వాగతం...

Published Mon, May 2 2022 2:32 PM | Last Updated on Mon, May 2 2022 2:42 PM

PM Modi Greeted By Young Student With Patriotic Song - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌లో తన మూడు దేశల పర్యటన సందర్భంగా మొదటగా బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు భారత సంతతికి చెందిన ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు ఒక యువ విద్యార్థి దేశభక్తి పాటతో మోదీకి ఘన స్వాగతం పలకగా.. మాన్యా అనే అమ్మాయి పెన్సిల్-స్కెచ్‌తో గీసిన ప్రధాని మోదీ చిత్రాన్ని బహుకరించింది.  మోదీ ఈ పర్యటన భారత్‌, జర్మనీ ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింతగా పెంపొందింప చేస్తోందన్నారు

"నేను జర్మనీకి కొత్తగా నియమితులైన ఓలాఫ్ స్కోల్జ్‌తో చర్చలు జరుపుతాను. ఈ సమావేశంలో వ్యాపార ప్రముఖులతో కూడా సంభాషిస్తాను." అని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు ఒక యువ విద్యార్థి తన పాటతో మోదీకి ఘనస్వాగతం పలికిన వీడియోతో పాటు, విద్యార్థులు మోదీ కాళ్లకు పాదాభివందనం చేస్తున్న వీడియోలు ట్విట్టర్‌లో వైరల్‌ అవుతున్నాయి.

నార్డిక్ దేశాల నాయకులతో చర్చలు జరపడానికి మోదీ డెన్మార్క్‌ను కూడా సందర్శించాల్సి ఉంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఫ్రెంచ్‌ అధ్యక్షడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలవడానికి భారత ప్రధాని పారిస్‌కు వెళ్తారు. ఇది ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఈ ఏడాది మోదీ చేసిన తొలి విదేశీ పర్యటన. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం కారణంగా పలు సవాళ్లు ఎదుర్కొంటున్న యూరప్‌లో తాను పర్యటించబోతున్నాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

(చదవండి: తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్‌ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement