Europe trip
-
నేహా శెట్టి గ్లామర్‌కు 'డిజె టిల్లు'తో పాటు ఎవడైనా పడిపోవాల్సిందే (ఫోటోలు)
-
సరిగ్గా జీ20 టైంలోనే.. రాహుల్ యూరప్ పర్యటన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్‌లో యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ ఫ్రాన్సులో అయిదు రోజులపాటు పర్యటించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 7న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో యూరోపియన్ కమిషన్ ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. 8న ప్యారిస్‌లో యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్‌లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 9న ప్యారిస్‌లో లేబర్ యూనియన్ ఆఫ్ ఫ్రాన్సు సమావేశంలో పాల్గొంటారు. 10న నార్వే రాజధాని ఓస్లోకు వెళతారు. అక్కడి ప్రవాస భారతీయులతో రాహుల్ గాంధీ ముఖాముఖి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. ఇక అదే టైంలో.. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 సమావేశాలను ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. సరిగ్గా అదే టైంలో రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్తుండటం గమనార్హం. ఇక విదేశీ పర్యటనలో రాహుల్ భారత్ అంతర్గత వ్యవహారాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారంటూ కేంద్రంలోని బీజేపీ మండిపడుతున్న సంగతి తెలిసిందే. -
నమ్మట్లేదా ? ఆధార్ కార్డు చూపించనా ?: యంగ్ హీరో
Kartik Aaryan Says Aadhar Card Dikha Doon: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లకు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇందులో భాగంగానే కార్తీక్ తాజాగా యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ సరదాగా తిరుగుతూ స్ట్రీట్‌ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న కార్తీక్‌కు వింత సంఘటన ఎదురైంది. యూరప్ వీధుల్లో స్ట్రీట్‌ఫుడ్ తింటూ ఆస్వాదిస్తున్న కార్తీక్ ఆర్యన్‌ను చూసి ఓ అభిమాని సందేహం వ్యక్తం చేశాడు. కార్తీక్ దగ్గరకు వెళ్లి 'మీరు హీరో కార్తీక్ ఆర్యన్ కదా ? మీతో ఒక ఫొటో తీసుకోవచ్చా ? ఎందుకంటే మీరు కార్తీక్ ఆర్యన్ అంటే మా ఫ్రెండ్స్ నమ్మట్లేదు' అందుకే అడుగుతున్నా అని చెప్పాడు. 'దీనికి అవును, నేను కార్తీక్ ఆర్యన్. నమ్మడం లేదా? నా ఆధార్ కార్డ్ చూపించనా ?' అంటూ చమత్కరించాడు. కార్తీక్ మాటలకు ఆనందంతో తన ఫ్రెండ్స్‌ని పిలిచి అతనితో ఫొటోలు దిగాడు ఆ ఫ్యాన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'కార్తీక్ మీరు చాలా సింపుల్, సరదాగా ఉన్నారు', 'కార్తీక్ మీ టైమింగ్ అదిరింది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
విదేశీ పర్యటనలో ఓ వ్యక్తి నాపై దాడి చేశాడు: కంగనా
Kangana Recall Her Europe Trip Incident: యూరప్ సోలో ట్రీప్‌కు వెళ్లిన తనపై ఓ వ్యక్తి దాడి చేశాడని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ షాకింగ్ విషయం చెప్పింది. తాజాగా ఆమె నటించిన థాకడ్ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె ఈ చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా కంగనా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా గతంలో తాను యూరప్ ట్రీప్‌కు వెళ్లానని అక్కడ తన పర్సు కొట్టేశారని చెప్పుకొచ్చింది. ‘యూరప్ ట్రీప్‌లో భాగంగా ఇటలీ-స్విట్జర్లాండ్ బోర్డర్లో స్కీయింగ్ చేయడానికి వెళ్లాను. చదవండి: షాకింగ్ లుక్‌లో కోవై సరళ, ఫొటో వైరల్ అక్కడ ఓ స్కూల్ ఉంది. ఆ భవంతిలో కొంతమంది రహస్యంగా జీవిస్తున్నారు. వారిని చూడగానే నాకు భయం వేసింది. దీంతో వెంటనే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని నిర్ణయించుకుని సమీపంలోని మోట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. స్టేషన్లో ఉండగానే ఓ వ్యక్తి నన్ను కొట్టాడు. ఆ తర్వాత నా పర్సు లాక్కున్నాడు. అందులో కొన్ని వేల డాలర్స్‌తో పాటు కార్డ్స్ కూడా ఉన్నాయి. అనంతరం నేను ట్రైన్ ఎక్కి నా బ్యాగ్ చూసుకుంటే పర్సు ఖాళీగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ‘ఆ సమయంలో నా దగ్గర ఒక్క పైసా లేదు. నేను ఓ కొత్త ప్రదేశంలో చిక్కుకుపోయాను. దీంతో నా సోదరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో తను నా మెనేజర్‌ను పంపించింది. చదవండి: Cannes Film Festival: పూజా హెగ్డేకు చేదు అనుభవం దీంతో ఆమె నా వద్దకీ మెనేజర్ని పంపింది. ఆ రోజు నా మెనేజర్ వచ్చే వరకు నేను ఆకలి, దప్పికలతోనే ఉండిపోయాను. యూరప్‌లో ఒక్కరు కూడా సహాయం చేయలేదు. కానీ, భారత్‌లో అయితే సమోసా అమ్మే వ్యక్తి కూడా కనీసం నీళ్లయినా ఇచ్చేవాడు’ అని కంగనా చెప్పింది. అయితే అదృష్టం ఏంటంటే ఆ సమయంలో తన పాస్‌పోర్టు మాత్రం చోరీ కాలేదని, లేదంటే పరిస్థితి ఇంకేలా ఉండేదో తలచుకుంటుంటేనే ఓళ్లు వణికిపోతుందని కంగనా పేర్కొంది. కాగా ఆమె నటించి ధాకడ్ చిత్రం శుక్రవారం(మే 20న) విడుదలైంది. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించాడు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, దివ్వా దత్తాలు కీలక పాత్రలు పోషించారు. -
మాక్రాన్‌తో మోదీ భేటీ
పారిస్: ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ఇండో–ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. ప్రపంచశాంతి కోసం ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రణాళికలపై ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. డెన్మార్క్ పర్యటన అనంతరం మోదీ ఫ్రాన్స్ స్వల్పకాలిక పర్యటనకు వచ్చారు. పారిస్‌లోని ఎలైసీ పాలస్‌లో మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరిపారని విదేశాంగ శాఖ తెలిపింది. మాక్రాన్‌ను కలవడం సంతోషాన్నిచ్చిందని, ఇండియా, ఫ్రాన్స్‌లు పలు రంగాల్లో కీలక భాగస్వాములని మోదీ ట్వీట్ చేశారు. వివిధ అంతర్జాతీయ సంక్షోభాలు, ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం, భారత్ కీలక పాత్ర పోషించే ఎఫ్‌ఏఆర్‌ఎం కార్యక్రమంపై మోదీతో చర్చించానని మాక్రాన్ ట్వీట్ చేశారు. వీలైనంత త్వరలో భారత పర్యటనకు రావాలని మాక్రాన్‌ను మోదీ ఆహ్వానించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిస్థాపనకు రెండుదేశాలు కీలక భాగస్వామ్యం కొనసాగిస్తున్నాయని, ఈ ప్రాంతం స్వేచ్ఛగా ఉండాలన్నది ఇరుదేశాల ఆకాంక్షని ఉమ్మడి ప్రకటన తెలిపింది. పరోక్షంగా ఈ ప్రాంతంపై చైనా పెత్తనాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో పౌర మరణాలను ఇరువురూ ఖండించారు. వెంటనే ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాలని, చర్చలు ఆరంభించాలని విజ్ఞప్తి చేశారు. ఐరాస నిబంధనలను అందరూ గౌరవించాలని కోరారు. శీతోష్ణస్థితి మార్పుపై ఉమ్మడి పోరాటం శీతోష్ణస్థితి మార్పును గతంలో కన్నా బలంగా ఎదుర్కోవాలని ఇండియా, ఫ్రాన్స్ నిర్ణయించాయి. పర్యావరణహిత సాంకేతికతలను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాక్రాన్, మోదీ చర్చలు జరిపారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) లక్ష్యాలకు తమ మద్దతు ప్రకటించారు. జాతీయ హైడ్రోజన్ మిషన్‌లో పాలుపంచుకోమని ఫ్రాన్స్‌ను భారత్ ఆహ్వానించింది. PM @narendramodi and President @EmmanuelMacron meet in Paris. This meeting will add momentum to the 🇮🇳 🇫🇷 friendship. pic.twitter.com/bblaQf96F8 — PMO India (@PMOIndia) May 4, 2022 -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. విజేతలు ఎవరూ ఉండరు: ప్రధాని మోదీ
జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై స్పందించారు. యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. ఏదేశమూ విజయం సాధించలేదని అన్నారు. భారత్ శాంతికి మద్దతిస్తుందని, యుద్ధం ముగించాలని ప్రధాని మోదీ కోరారు. బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్ ఒలాప్ స్కోల్జ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. శాంతియుత చర్చలే ముందున్న ఏకైక మార్గమమని మరోసారి పేర్కొన్నారు. యుద్ధం ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై కూడా చూపుతోందన్న మోదీ.. యుద్ధంతో ఏర్పడిన మానవతావాద పరిణామాల గురించి భారత్ ఆందోళన చెందుతోందని మోదీ పేర్కొన్నారు. కాగా 3 రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జర్మనీ చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి అధికారులు, ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెర్లిన్‌లో భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, సుస్థిర ఇంధన భాగస్వామ్యం, హైడ్రోజన్ టాస్క్‌ఫోర్స్ వంటి తొమ్మిది ఒప్పందాలపై భారత్-జర్మనీ సంతకాలు చేశాయి. చదవండి: ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! PM @narendramodi and @Bundeskanzler Olaf Scholz co-chaired the 6th IGC. Agreed to expand the India-Germany Strategic Partnership further to a partnership for: 1️⃣ Shared Values and Regional and Multilateral Interests 2️⃣ Green and Sustainable Development pic.twitter.com/2c2ErFo6ko — Arindam Bagchi (@MEAIndia) May 2, 2022 ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022 ఏడాదిలో మొదటి విదేశీ పర్యటన జర్మనీలో జరగడం సంతోషంగా ఉందన్నారు. జర్మనీలో జూన్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఆదేశ ఛాన్సలర్ స్కోల్జ్ తెలిపారు. అయితే గతేడాది డిసెంబరులో ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్కోల్జ్‌తో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. #WATCH | Germany: Prime Minister Narendra Modi greets the Indian diaspora, as he departs for Federal Chancellery in Berlin. (Source: DD) pic.twitter.com/Qx2vLDAxZ4 — ANI (@ANI) May 2, 2022 ఇక ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతుండగా భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఐరోపాలో మోదీ పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐరోపా దేశాలతో బంధాన్ని పటిష్ఠం చేసుకునే దిశగా మోదీ చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఇంధన భద్రతే ఈ చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది. చదవండి: ఫిలిప్పిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 6గురు మృతి, 80 ఇళ్లు దగ్ధం -
PM Modi Europe Visit: జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: యూరప్ దేశాల పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఆయన బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో భేటీ అవుతారు. ఆపై ఆరవ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)లో పాల్గొంటారు. ఐజీసీ ప్రతి రెండేళ్లకొకసారి ఇరు దేశాల మధ్య జరుగుతుంటుంది. రెండు దేశాలకు చెందిన టాప్ సీఈవోలు.. వీరిరువురితో ఇంటెరాక్ట్ అవుతారు. ఇక తన పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్‌లో, బుధవారం ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. ఈమధ్యే కొత్తగా ఫ్రాన్స్‌కు తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌కు పీఎం మోదీ శుభాకాంక్షలు తెలియజేసి.. భేటీ అవ్వనున్నారు. PM Modi gets a warm welcome from the Indian diaspora in Berlin He will hold his first in-person meeting with the newly appointed German Chancellor Olaf Scholz and co-chair the 6th India-Germany Inter-Governmental Consultations today pic.twitter.com/cs1c6GGMGZ — ANI (@ANI) May 2, 2022 -
ఛలో యూరప్
మిల్కీ బ్యూటీ తమన్నా యూరప్ వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. హాలిడే ట్రిప్ ప్లానింగ్ కాదు. ‘ఎఫ్ 2’ మూవీ షెడ్యూల్ షూటింగ్ కోసం వెళ్లారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. తాజా షెడ్యూల్ యూరప్‌లోని ప్రాగ్లో మొదలు కానుంది. ఈ షూట్లో జాయిన్ అవ్వడానికే తమన్నా యూరప్ వెళ్తున్నారు. ఇందులో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ నటిస్తున్నారు. తోడి అల్లుళ్లగా వెంకీ, వరుణ్ నటిస్తుండగా, అక్కాచెల్లెళ్లుగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
యూరప్‌లో టైఅప్
కనపడితే చాలు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, షేక్ హ్యాండ్లు, ఫొటోగ్రాఫర్స్ క్లిక్‌లు... ఇలా ఒకటా రెండా ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేయడానికి బాలీవుడ్ యాక్టర్ దీపికా పదుకోన్‌కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులోనూ ‘పద్మావతి’ సినిమా రిలీజ్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి, ఈవిడగారు కనపడితే చాలు.. ఆ సినిమా గురించి ప్రశ్నలు. అందుకే దీపిక తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఫుల్‌గా బ్లాక్ డ్రెస్ వేసుకుని, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని...ఆస్ట్రియాలోని వియన్నా వీధుల్లో హ్యాపీగా జాలీగా విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి ఇన్సెట్లో ఉన్న ఫొటో చూడండి.. దీపికా న్యూ అప్పియరన్స్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. మరోవైపు దీపిక లవర్ (ఈ ఇద్దరి గురించి బాలీవుడ్లో అలానే అనుకుంటారు) రణ్వీర్ సింగ్ లండన్‌లో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సో.. వీరిద్దరూ కలిసి యూరప్‌లో టైఅప్ అవుతారని, అక్కడ న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారన్నది చాలామంది ఊహ. మరి... ఈ ఊహ ఎంతవరకు నిజమవుతోంది జస్ట్ నాలుగు రోజుల్లో తెలిసిపోతుందిలేండి. వియన్నాలో దీపిక -
రాహుల్ వచ్చారు.. మీటింగ్ పెడుతున్నారు
న్యూఢిల్లీ: యూరప్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భారత్ తిరిగి వచ్చారు. ఆయన సోమవారం పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేశారు. తాను యూరప్ పర్యటనలో ఉండగా జరిగిన పరిణామాలేమిటి అన్నదానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గతంలో రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనలపై తీవ్ర ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28న తాను యూరప్ పర్యటనకు వెళ్తున్నట్టు ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి.. ఆయన కొత్త సంవత్సరాన్ని విదేశాల్లో జరుపుకొన్నారు. గత ఏడాది కూడా ఆయన కొత్త సంవత్సర వేడుకల్ని విదేశాల్లోనే జరుపుకొన్నారు. అప్పట్లో ఏఐసీసీ సదస్సుకు కూడా ఆయన హాజరుకాకపోవడంతో బీజేపీ రాహుల్ పై, కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే.