
Kartik Aaryan Says Aadhar Card Dikha Doon: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లకు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇందులో భాగంగానే కార్తీక్ తాజాగా యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ సరదాగా తిరుగుతూ స్ట్రీట్‌ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న కార్తీక్‌కు వింత సంఘటన ఎదురైంది.
యూరప్ వీధుల్లో స్ట్రీట్‌ఫుడ్ తింటూ ఆస్వాదిస్తున్న కార్తీక్ ఆర్యన్‌ను చూసి ఓ అభిమాని సందేహం వ్యక్తం చేశాడు. కార్తీక్ దగ్గరకు వెళ్లి 'మీరు హీరో కార్తీక్ ఆర్యన్ కదా ? మీతో ఒక ఫొటో తీసుకోవచ్చా ? ఎందుకంటే మీరు కార్తీక్ ఆర్యన్ అంటే మా ఫ్రెండ్స్ నమ్మట్లేదు' అందుకే అడుగుతున్నా అని చెప్పాడు. 'దీనికి అవును, నేను కార్తీక్ ఆర్యన్. నమ్మడం లేదా? నా ఆధార్ కార్డ్ చూపించనా ?' అంటూ చమత్కరించాడు. కార్తీక్ మాటలకు ఆనందంతో తన ఫ్రెండ్స్‌ని పిలిచి అతనితో ఫొటోలు దిగాడు ఆ ఫ్యాన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'కార్తీక్ మీరు చాలా సింపుల్, సరదాగా ఉన్నారు', 'కార్తీక్ మీ టైమింగ్ అదిరింది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment