card
-
వన్ స్టేట్.. వన్ కార్డు
సాక్షి,హైదరాబాద్: ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ నగరంలోని 24 నియోజకవర్గాల్లోని ఒక్కో కాలనీలోనూ సర్వే జరుగుతోంది. ఇంతకీ ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డు కోసం జరుపుతున్న సర్వేలో ఏమేం సేకరిస్తారు? దీని వల్ల ప్రయోజనమేమిటి? తదితర అంశాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం వ్యక్తిగత గుర్తింపుగా ఎక్కడైనా ఆధార్‌ను అంగీకరిస్తున్నారు. కానీ ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ఎలాంటి కార్డులు లేవు. ఈ ఫ్యామిలీ కార్డుల ద్వారా కుటుంబాన్ని గుర్తించవచ్చు. అంటే రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ‘వన్ స్టేట్– వన్ కార్డ్’గా ఈ కార్డు ఉపకరిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి కార్డులున్నాయి. రాజస్థాన్‌లో జన్ ఆధార్ స్కీమ్ కింద 10 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీలు, 11 అంకెలతో కూడిన వ్యక్తిగత ఐడీలు ఇచ్చారు. హరియాణాలో పరివార్ పెహచాన్ పాత్ర (పీపీపీ) కింద 8 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీ కార్డులిచ్చారు. కర్ణాటకలో 12 అంకెలతో కూడిన ‘కుటుంబ’ ఐడీలను జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 12 అంకెలతో కూడిన డిజిట్ ఫ్యామిలీ కార్డును వినియోగిస్తున్నారు. అక్కడ రేషన్కార్డుగా దాన్నే వినియోగిస్తున్నారు. వ్యక్తిగత ఐడీలు.. తెలంగాణలో కుటుంబాన్ని ఒక యూనిట్‌గా గుర్తించేందుకు ఫ్యామిలీకార్డు ఉపకరిస్తుంది. కుటుంబంలోని అందరికీ ఒకే ఐడీ నంబర్ ఉండటంతో పాటు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా వేర్వేరు ఐడీలిస్తారు. కుటుంబాల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా దేశంలోని అందరికీ ఆధార్ కార్డులిచ్చినట్లే రాష్ట్రంలోని అందరికీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తారు. కుటుంబంలోని మహిళల్లో పెద్ద వారిని కుటుంబ పెద్ద(హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ)గా గుర్తిస్తారు. వ్యక్తిగత ఐడీలు జారీ అయ్యాక మారవు. శాశ్వతంగా అవే ఉంటాయి. కుటుంబంలోని కుమారుల పెళ్లిళ్లు జరిగి కోడళ్లు వస్తే కుటుంబంలో కొత్త సభ్యులుగా చేర్చేందుకు, మరణించిన వారిని తొలగించేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం చిన్న కుటుంబాలుగా విడిపోతే కొత్త కుటుంబంగా అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుటుంబం మొత్తం కలిసి ఉన్న ఫొటో తీసుకుంటారు. నగరంలో 8వ తేదీ వరకు సర్వే జరిపి, 9న స్రూ్కటినీ చేసి 10వ తేదీన ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఒకే చోట అన్ని వివరాలు.. ప్రస్తుతం ఒక కుటుంబంలోని వారు వివిధ పథకాల కింద వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నప్పటికీ ఆ వివరాలు ఒకే చోట లేవు. ఈ డిజిటల్ కార్డులు వచ్చాక అన్ని వివరాలు ఒక్క మౌజ్ క్లిక్‌తో తెలియనున్నాయి. ప్రభుత్వానికి చెందిన 30 శాఖల సమాచారం సంబంధిత శాఖల ఉంది తప్ప ఒకదానికొకటి అనుసంధానంగా లేవు. కొత్త కార్డుల వల్ల ప్రజలకెదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయని, ఈ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ పనుల ప్రారం¿ోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సీఎం రిలీఫ్‌ఫండ్‌తో సహ ఒక కుటుంబం ఏ పథకాలు వినియోగించుకుంటుందో తెలుస్తుందన్నారు. అంతేకాదు.. హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా గతంలో చేయించుకున్న ఆరోగ్యపరీక్షల వంటి వివరాలు కూడా ఉండటం వల్ల మరోసారి ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. -
ఈ ఎన్నికల్లో బిర్యానీ రూ.150 అంతే.. కాస్ట్లీ అంటే కుదరదు!
లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడానికి వీల్లేదు. వారు ఖర్చు చేసే ప్రతి పైసాకు ఎన్నికల కమిషన్‌కు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ప్రచార సమయంలో తమ మద్దతుదారులకు ఇప్పించే ఛాయ్, సమోసాలకు ఖర్చుపెట్టిన డబ్బుకు కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగించే 200కు పైగా వస్తువుల సవరించిన ధరల జాబితాను ఇటీవలి నోటిఫికేషన్లో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు ఖర్చు పరిమితిని మించకుండా చూసుకోవడానికి వీటిని ఎన్నికల ప్రకటిచింది. ఈసీకి సమర్పించే ఖర్చుల వివరాల్లో ఆయా వస్తువులు, ఆహార పదార్థాలకు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువగా చూపించేందుకు వీలుండదు. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎలక్షన్ కమిషన్ ఈ సారి రూ.95 లక్షలకు పెంచింది. ఇది 2019 ఎన్నికల సమయంలో రూ. 70 లక్షలు ఉండేది. ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వినియోగించే వస్తువులు, సేవల ధరలను కూడా ఈసీ స్వల్పంగా పెంచింది. ధరల జాబితాను ఉపయోగించి అభ్యర్థులు చేసే ఖర్చులను జిల్లా ఎన్నికల అధికారి మూల్యాంకనం చేస్తారు. చెన్నై జిల్లా ఎన్నికల అధికారి జె.రాధాకృష్ణన్ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. టీ ధరను రూ.10 నుంచి రూ.15కి, కాఫీ ధరను రూ.15 నుంచి రూ.20కి పెంచారు. అయితే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ధరను మాత్రం రూ. 2019తో పోలిస్తే రూ.180 నుంచి రూ.150కు తగ్గించారు. మరోవైపు మటన్ బిర్యానీ ప్యాకెట్ ధరలో మార్పు లేదు. అది రూ. 200గా ఉంది. టీషర్టులు, చీరల ధరలు కూడా పెంచలేదు. ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే వారికి అందించే ఆహారం, వాహనాలు, ప్రచార కార్యాలయాలు, సమావేశాల కోసం అద్దెకు తీసుకున్న ఇతర ఫర్నిచర్, వేదిక అలంకరణ ఖర్చులు, కూలీల ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యానర్లు, పోస్టర్లు, కుర్చీలు వంటి వస్తువులతో సహా అనేక అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. జెండాలు, బాణాసంచా, పోస్టర్లు, దండలు, సాంస్కృతిక నృత్యాలతో సహా రాజకీయ నేతలకు స్వాగతం పలికేందుకు అయ్యే ఖర్చులు కూడా అభ్యర్థి ఖర్చుల్లోనే చేరుస్తారు. -
బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి?
భారతదేశంలోని ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో అవసరం. అటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా, ఇటు విద్యా సంబంధిత విషయాలకైనా ఆధార్ తప్పనిసరి. ‘ఆధార్’ అనేది దేశంలోని అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అయ్యే ప్రధాన గుర్తింపు కార్డు అని చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డును దేశంలోని అందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎవరికి జారీ చేస్తారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంటుంది. ఈ ప్రత్యేక కార్డును దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీనిని బ్లూ ఆధార్ కార్డు అని అంటారు. సాధారణ ఆధార్ కార్డుకు ఇది భిన్నంగా ఉంటుంది. పెద్దల మాదిరిగా కాకుండా, పిల్లలకు కార్డులు జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. దీనికి బదులుగా యూఐడీకి లింక్ అయిన ఆ చిన్నారుల తల్లిదండ్రుల సమాచారం, వారి ఫొటోల ఆధారంగా పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు జారీ అవుతుంది. అయితే, పిల్లలకు ఐదేళ్లు దాటాక ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫొటో కూడా అవసరమవుతుంది. పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్‌ను చూపించి నవజాత శిశువుకు సంబంధించిన బాల్ ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
అన్నింటికి ఒకే కార్డు.. ప్రత్యేకతలివే..
మెట్రో, బస్సు, రైలు, ఏటీఎం, టోల్, పార్కింగ్.. ఇలా ప్రతిదానికి ప్రత్యేకించి కార్డులుంటాయి. వీటన్నింటిని వెంటతీసుకుని వెళ్లడం కొంత చికాకుతో కూడిన వ్యవహారం. అయితే అన్ని రకాల చెల్లింపులకు ఒకే కార్డు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ) రూపే రీలోడబుల్ ప్రీపెయిడ్ కార్డ్‌ను తీసుకొచ్చింది. ‘వన్ నేషన్, వన్ కార్డ్’ చొరవతోనే ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఎన్సీఎమ్సీ కార్డుతో మెట్రో, బస్సు, రైలు, క్యాబ్ ప్రయాణాల టికెట్లను కొనుగోలు చేయొచ్చు. టోల్, పార్కింగ్ లాంటి సమయంలోనూ ఈ కాంటాక్ట్‌లెస్ కార్డు ఉపయోగపడుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఏటీఎం విత్‌డ్రాతో పాటూ పాయింట్ ఆఫ్ సేల్, ఈ-కామర్స్ చెల్లింపుల కోసం కూడా ఈ కార్డును ఉపయోగించవచ్చని చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో ఎన్నికలే ఎన్నికలు!,ఎస్బీఐ కీలక నిర్ణయం ఈ ఎన్సీఎమ్సీ కార్డుతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలు చేసుకోవచ్చని బ్యాంకు పేర్కొంది. ఆన్లైన్ వాలెట్ బ్యాలెన్స్ గరిష్ఠంగా రూ.లక్ష వరకు, ఆఫ్‌లైన్ వాలెట్లో అయితే రూ.2వేలుగా పరిమితిని నిర్ణయించింది. బ్యాంక్ ప్రత్యేక పోర్టల్ ద్వారా కార్డు దారులు డబ్బును లోడ్/ రీలోడ్ చేసుకోవచ్చు. -
రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెండింతలు చేసింది. టన్ను బియ్యంపై రూ. 700గా ఉన్న కమీషన్‌ను రూ. 1,400 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఏటా డీలర్ల కమిషన్ రూ. 303 కోట్లకు చేరనుందని, అందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని వెల్లడించారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం డీలర్ల కమీషన్‌ను రెండింతలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కేంద్రం అందించే కమీషన్కన్నా అదనంగా రూ.950 ఒక్కో టన్నుకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్‌ను అదనంగా అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోల బియ్యానికి అదనంగా మరో కిలోని చేర్చి ఎన్ఎఫ్ఎస్సీ కార్డులకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ. 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు?
కెనడాలో ఉంటున్న ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో విదేశాలలో ఇదేరీతిలో తలదాచుకున్న ఇతర ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కోరింది. యుఎస్, యుకె, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులను గుర్తించాలని, వారు భారతదేశానికి తిరిగి రాకుండా వారి విదేశీ పౌరసత్వాన్ని (ఓసిఐ) రద్దు చేయాలని ప్రభుత్వం ఆ ఏజెన్సీలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న దరిమిలా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఫలితంగా భారతదేశానికి చెందిన ఈ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందదని, అప్పుడు వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ, పాకిస్తాన్ తదితర దేశాల్లో పరారీలో ఉన్న 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులను ప్రభుత్వం గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కెనడా, యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్లో నివసిస్తున్న 11 మందిని గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. వీరిలో ఎనిమిది మంది అనుమానితులు కెనడాలోనే ఉన్నట్లు అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ జాబితాలో గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. పాకిస్తాన్లో హర్విందర్ సంధు అలియాస్ రిండా ఉన్నాడని భావిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ అలియాస్ లాండా, సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునాకే (మూడు రోజుల క్రితం హతమయ్యాడు), అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా, రమణదీప్ సింగ్ అలియాస్ రామన్ జడ్జి, చరణ్‌జిత్ సింగ్ అలియాస్ రింకూ బిహాలా, సనావర్ ధిల్లాన్, గుర్పిందర్ సింగ్ అలియాస్ బాబా డల్లా కెనడాలో ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక అమెరికాలో గౌరవ్ పత్యాల్ లక్కీ, అన్మోల్ బిష్ణోయ్‌లు ఉన్నారనే అనుమానాలున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న తాజా చర్యలు ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డులతో విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడానికి సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వారు భారతదేశంలో ఉద్యమాలు చేపట్టి, యువతను తప్పుదారి పట్టించేందుకు అవకాశం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? -
పెళ్లి కార్డులో పేర్ల పక్కన ఐఐటీ.. జీతాలు చెప్పాలంటున్న నెటిజన్లు!
వివాహ సమయంలో డిజైనర్ ఇన్విటేషన్ కార్డ్‌లు చర్చనీయాంశంగా మారుతుంటాయి. కొన్ని పెళ్లి కార్డులలో లగ్జరీ చాక్లెట్లు ఉంటుండగా, మరికొన్ని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకునేలా బయోడిగ్రేడబుల్ కార్డ్‌లు రూపొందుతాయి. ఇటీవల ఒక వివాహ ఆహ్వాన కార్డ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇది వధూవరుల చదువులను హైలెట్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఆహ్వానపత్రంలో వరుడి పేరు పక్కన ఐఐటి బాంబే అని, వధువు పేరు పక్కన ఐఐటి ఢిల్లీ అని ఉంది. ఈ పెళ్లి ఆహ్వాన పత్రికను ఎక్స్‌లో షేర్ చేసిన మహేష్.. ‘పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ప్రేమేనని’ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. దీనిని షేర్ చేసినప్పటి నుండి ఈ కార్డ్‌కు 53 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. 400కి పైగా లైక్స్ లభించాయి. దీనిని చూసిన ఒక యూజర్ ‘కొన్ని దశాబ్దాల క్రితం డిగ్రీ పొందడం కష్టంగా ఉన్నప్పుడు బీఎస్సీ, బీకాం లాంటి డిగ్రీలను గొప్పగా పేర్కొనేవారు. ఈ ఆహ్వాన పత్రంలో ఇంటిపేరు లేకపోయినా వారి విద్యార్హతలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. మరొక యూజర్ ‘ఈ ఆహ్వాన పత్రంలో వధూవరుల జీతం జీతం, లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను పేర్కొనకపోవడం నిరాశ పరుస్తోంది’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘అయ్యో.. ర్యాంక్ రాయలేదే’ అని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది? All you need is love to get married pic.twitter.com/sjd4SZSSJR — Mahesh (@mister_whistler) September 12, 2023 -
టీడీపీ కొత్త డ్రామా.. అర్జంటుగా బీసీ కార్డు గుర్తుకొచ్చిందా?
సాక్షి, విశాఖపట్నం: బీసీ నేత అయ్యన్నను అరెస్టు చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాకు తెరతీసింది. అర్జంటుగా టీడీపీకి బీసీ కార్డు గుర్తుకొచ్చింది. నానా బూతులు తిడుతున్నప్పుడు అయ్యన్నకు గుర్తుకు రాని బీసీ కార్డు.. అయ్యన్నను అదుపు చేయనప్పుడు గుర్తుకు రాని బీసీ కార్డు.. అరెస్ట్ అనగానే టీడీపీకి గుర్తుకువచ్చిందా? అంటూ ఆ పార్టీ వైఖరీపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ -
ఇక డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు
సాక్షి, అమరావతి: ఇక నుంచి పేపర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, పేపర్ ఆర్సీ కార్డులుండవు. పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా రాష్ట్ర రవాణా శాఖ ముందడుగు వేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికింది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ /ఎం–పరివాహన్లోఇవి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా రవాణా శాఖ ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో కార్డుకు రూ.200 ఫీజు, రూ.35 పోస్టల్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ విధానానికి శుక్రవారం నుంచి రవాణా శాఖ ముగింపు పలికింది. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌లో జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే రూ.33.39 కోట్లు కేటాయించింది. ఇక శనివారం నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి దరఖాస్తుతో కార్డు కోసం రూ.200, పోస్టల్ చార్జీలకు రూ.35 వసూలు చేయరు. దరఖాస్తులను పరిశీలించి తగిన ప్రక్రియ అనంతరం డిజిటల్ విధానంలోనే వీటిని జారీ చేస్తారు. ప్రత్యేకంగా ఎం–పరివాహన్, డిజి లాకర్లో అందుబాటులో ఉంచుతారు. వాహనదారులు, దరఖాస్తుదారులు వాటిని డౌన్లోడ్ చేసుకుని తమ మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు అడిగితే ఆ డిజిటల్ ఫార్మాట్లో ఉన్న కార్డులను చూపితే సరిపోతుంది. మొబైల్ ఫోన్లు వాడనివారు ఆ కార్డులను ప్రింట్ తీసుకుని కూడా తమతో ఉంచుకోవచ్చు. వాటిని చూపినా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నుంచి రవాణా శాఖ జారీ చేసే అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతారు. వాహనదారులకు సౌలభ్యం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల జారీ విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుంది. వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయం. అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే చాలు. – ఎంకే సిన్హా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ -
ఇక అన్ని ప్రయాణాలకూ ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే కార్డును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు రెండో వారంలోగా ‘కామన్ మొబిలిటీ కార్డు’లను సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ అంశంపై సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు... తొలుత హైదరాబాద్‌లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి వినియోగించేలా ఈ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదట మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డులను జారీ చేస్తామని, సమీప భవిష్యత్తులో ఇదే కార్డుతో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకొనేలా విస్తరి స్తామని మంత్రులు తెలిపారు. పౌరులు వారి ఇతర కార్డుల మాదిరే దీన్ని కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి కామన్ మొబిలిటీ కార్డు ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ కార్డుగల ప్రయా ణికులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. మరోవైపు కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..
అభిమానులు తమకు నచ్చిన క్రికెటర్ లేదా నటులపై ఉన్న ప్రేమను రకరకాలుగా చూపిస్తుంటారు. అందుకు సంబంధించిన ఘటనలను ఎన్నో చూశాం. ఒక్కోక్కరిది ఒక్కోరకమైన పంథాలో తమ అభిమానాన్ని చాటుకుంటారు. అచ్చం అలానే ఇక్కడో అభిమాని తనకు ఇష్టమైన క్రికెటర్‌పై తన ప్రేమను అదేవిధంగా ప్రేమను చూపించాడు. వివరాల్లోకెళ్తే..ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న ధోని.. ఐదు సార్లు తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. తాజాగా ఐపీఎల్-2023 సీజన్లో కూడా ధోని నాయకత్వంలోని సీఎస్కేనే విజేతగా నిలిచింది కూడా. అలాంటి మిస్టర్ కూల్‌పై చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అభిమాని అందర్నీ ఆశ్చర్యపరిచేలా తన ప్రేమను చాటుకున్నాడు. తన వెడ్డింగ్ కార్డ్‌కి ఇరువైపులా 'తలా'అనే పదం, ధోని ముఖ చిత్రం, జెర్సీ నెంబర్ తోపాటు అతని పేరుని కూడా ముంద్రించాడు. ఆ అభిమాని తన పెళ్లికి ఎంఎస్ ధోనిని ఆహ్వానించడానికి ఈ కార్డుని పంపినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. CSK #yellove 💛 fever isn't over yet⁉️ A fan boy of @msdhoni from #chhattisgarh printed Dhoni face, #Jersey no 7 on his wedding card and invite to the #ChennaiSuperKings captain❤🔥 #MSDhoni𓃵 #thala #Dhoni pic.twitter.com/dZmAqFvI14 — Shivsights (@itsshivvv12) June 3, 2023 (చదవండి: జెలెన్స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు -
ఆధార్ కార్డ్ పోయిందా.. నంబర్ కూడా గుర్తులేదా.. ఎలా మరి?
దేశంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కీలకమైన డాక్యుమెంట్. అనేక ప్రభుత్వ పథకాలకు, ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా అవసరం. మరి ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డ్‌ను పోగొట్టుకుంటే.. ఆధార్ నంబర్ కూడా గుర్తు లేకుంటే ఏం చేయాలి.. డూప్లికేట్ ఆధార్ ఎలా పొందాలి? ఆధార్ కార్డ్ మన రోజువారీ జీవనంలో భాగమైపోయింది. బ్యాంకు వెళ్లినా.. ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైపోయింది. ఒక వేళ మన ఆధార్ కార్డ్ పోగొట్టుకునిపోతే ఆధార్ నంబర్ గుర్తుంటే ఈ ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ నంబర్ కూడా గుర్తు లేనప్పుడు ఆధార్ కార్డ్‌ను పొందడం ఎలాగో తెలియక తికమక పడుతుంటారు. ఇప్పుడు ఆధార్ నంబర్ గుర్తు లేకపోయినా సరే ఆధార్ కార్డ్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఆధార్ కొత్త ఫీచర్: ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా? ఆధార్ నంబర్ ఉంటే.. https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.inని సందర్శించండి ‘ఆర్డర్ ఆధార్ కార్డ్’ను క్లిక్ చేయండి 12 అంకెల ఆధార్ నంబర్, 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ నంబర్ నమోదు చేయండి. స్క్రీన్‌పై ఇతర వివరాలు, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి అనంతరం మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ వస్తుంది. మళ్లీ యూఐడీఏఐ సెల్ఫ్-సర్వీస్ పోర్టల్‌ని సందర్శించి ‘డౌన్లోడ్ ఆధార్’పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ లేకపోతే.. https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uidని సందర్శించండి. ఆధార్ నంబర్ కావాలో లేదా ఎన్రోల్మెంట్ ఐడీ కావాలో ఎంచుకోండి. పేరు, మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ నమోదు చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ వస్తుంది. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ ద్వారా.. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1800 180 1947 లేదా 011 1947కు డయల్ చేయండి మీ ఆధార్ కార్డును తిరిగి పొందడానికి అవసరమైన ఆప్షన్ ఎంచుకోండి. అన్ని వివరాలను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ వస్తుంది. ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి యూఐడీఏఐ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించండి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
సిటీ గ్రూపు నుంచి డిజిటల్ క్రెడిట్ కార్డ్.. లాభాలేంటో తెలుసా?
పెద్ద మొత్తంలో రిటైల్ కొనుగోళ్లు జరిపే కస్టమర్ల కోసం సిటీ గ్రూపు సరికొత్త డిజిటల్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. సిటీ పే క్రెడిట్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ క్రెడిట్ కార్డు కేవలం డిజిటల్ రూపంలోనే ఉంటుందని సిటీ గ్రూపు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డ్ కోసం రిటైల్ భాగస్వాములను ఏర్పాటు చేస్తోన్న సిటీ గ్రూపు వ్యాపారుల కోసం ఇన్స్టాల్మెంట్-లోన్ ఉత్పత్తిని కూడా జోడించాలని యోచిస్తోంది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు సిటీ గ్రూప్ రిటైల్ సర్వీసెస్ యూనిట్ మాసీస్,వేఫైర్ వంటి రిటైలర్ల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ లేబుల్ కోబ్రాండ్ క్రెడిట్ కార్డ్‌లను అందిస్తుంది. సాధారణంగా ప్రైవేట్ లేబుల్ కార్డ్‌లు అనేవి కేవలం సదరు రిటైల్ సంస్థ వద్ద మాత్రమే ప్రత్యేకంగా పని చేస్తాయి. దాని స్టోర్లలో ఖర్చుతో ముడిపడి ఉన్న ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తాయి. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ కొత్త కార్డ్ సైన్ అప్ చేసే ఏ రిటైలర్ వద్దనైనా పని చేస్తుంది. దీని ద్వారా రిటైల్ సంస్థలు తమ కస్టమర్లకు ప్రమోషనల్ ఫైనాన్సింగ్‌ను అందించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కార్డ్ ఇండిపెండెంట్ క్రెడిట్ లైన్ వినియోగదారులకు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయడంలో సహాయపడుతుందని న్యూయార్క్ ఆధారిత సిటీ గ్రూప్ తెలిపింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
ఏ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అయ్యిందో.. ఇప్పుడు మీ మొబైల్ లోనే ఇలా చూసుకోవచ్చు
-
కొత్త రేషన్ కార్డులివ్వరా !
దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఆహార భద్రత కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతున్నా.. ఏడాదిన్నర కాలంగా కొత్త కార్డులను మంజూరు చేయడం లేదు. 2021 జూలైలో పెండింగ్‌లో ఉన్న నూతన కార్డులను జారీ చేశారు. మళ్లీ ఏడాదిన్నర పూర్తయినా నూతన కార్డులు మంజూరు కావడం లేదు. పైగా జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి కార్డుల్లో మార్పులు, చేర్పుల (మ్యూటేషన్ల)కు మోక్షం కలగడం లేదు. ఫలితంగా అర్హులైన పేదలు సంక్షేమ పథకాలకు దూరమవుతుతున్నారు. వేలాది మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు కొత్త రేషనన్ కార్డులు, పాత వాటిల్లో చేర్పులు, మార్పుల కోసం చాలా మంది ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు పరిశీలించి జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి లాగిన్‌న్‌కు పంపించారు. ఇక్కడ వాటిని పరిశీలించిన అధికారులు మంజూరు చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఏడాదిన్నర నుంచి లాగిన్ తెరుచుకోకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడిన వాళ్లు కొత్తగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా పాత కార్డులోంచి వారి పేరును తొలగిస్తేనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా చాలామంది కొత్తకార్డుల కోసం ఉమ్మడి కుటుంబం కార్డుల నుంచి పేర్లను తొలగించుకొని నూతన కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, వారందరికీ కార్డులు మంజూరు కావపోవడంతో వారి పరిస్థితి రెంటింకి చెడ్డ రేవడిలా మారింది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వచ్చిన వారు కూడా కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు కావడం లేదు. 2018 డిసెంబర్ ఎన్నికలు జరిగే వరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం నిరంతరాయంగా సాగించింది. ఆ తరువాత 2021 జూలై మాసంలో హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న నూతన రేషన్ కార్డుల దరఖాస్తులకు మోక్షం కలిగింది. జిల్లాలో సుమారు 12 వేల నూతన కార్డులు మంజూరయ్యాయి. కానీ, పేర్ల మార్పులు– చేర్పులు (మ్యూటేషన్ల)పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన అర్జీలకూ మోక్షం లేదు. దరఖాస్తుల వివరాలు.. కొత్తకార్డుల కోసం అర్జీలు 25,179 మ్యూటేషన్ కోసం 46,354 మొత్తం పెండింగ్ 71,533 ఆరోగ్య సేవలకు దూరం.. రేషన్‌్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందుతుండగా, కార్డులు లేని వారు నిర్ణీతీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏడాదికి సుమారు రూ.2లక్షల విలువైన సేవలు పొందలేక పోతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు నిర్ణీత ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంది. కానీ, కొత్త కార్డులు రాక పోవడంతో అర్హులు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. ఇలా మరెన్నో ప్రభుత్వ, ప్రైవేట్ పథకాలకు పేదలు దూరమవుతున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను నిరంతరం జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని పేదులు కోరుతున్నారు. -
కరోనా తర్వాత ఆన్లైన్ వైపే మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ తర్వాత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపే ధోరణి గణనీయంగా పెరిగిందని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో రామ్మోహన్ రావు అమర తెలిపారు. తమ క్రెడిట్ కార్డుదారుల లావాదేవీల్లో దాదాపు 55 శాతం పైగా ఇవే ఉంటున్నాయని ఆయన వివరించారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కార్డుల వినియోగం, సగటున కార్డుపై చేసే వ్యయాలు భారీగా ఉంటోందని రామ్మోహన రావు తెలిపారు. సాధారణంగా జూన్ త్రైమాసికం కాస్తంత డల్‌గా ఉంటుందని, కానీ ఈసారి కార్డుల ద్వారా ఖర్చు చేసే ధోరణి గణనీయంగా పెరిగిందని చెప్పారు. రాబోయే పండుగ సీజన్లో కూడా ఇదే ధోరణి కనిపించవచ్చని ఆశిస్తున్నట్లు రామ్మోహన్ రావు తెలిపారు. కొత్తగా క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డును ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోకు ఆయన ఈ విషయాలు వివరించారు. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు చెప్పారు. కార్డుల వినియోగ ప్రయోజనాలను తర్వాత ఎప్పుడో అందుకోవడం కాకుండా తక్షణం లభించాలని వినియోగదారులు కోరుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కేవలం ఒక విక్రేతకు మాత్రమే పరిమితం కాకుండా ఆన్లైన్లో చేసే కొనుగోళ్లన్నింటికీ సంబంధించి 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చని పేర్కొన్నారు. తదుపరి బిల్లింగ్ స్టేట్మెంట్లో ఇది ప్రతిఫలిస్తుందని వివరించారు. క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలకు నెలకు రూ. 10,000 మేర గరిష్ట పరిమితి ఉంటుందని రామ్మోహన్ రావు చెప్పారు. అటుపైన కూడా తగు స్థాయిలో ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ తరహా కార్డును ఆవిష్కరించడం దేశీయంగా ఇదే తొలిసారని చెప్పారు ప్రత్యేక ఆఫర్ కింద 2023 మార్చి వరకూ దీన్ని ఎటువంటి చార్జీలు లేకుండా పొందవచ్చు. టోకెనైజేషన్‌కు ఎస్బీఐ కార్డ్ రెడీ వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడం, ఏదైనా డేటా లీకేజీకి వ్యతిరేకంగా భరోసా ఇవ్వడం పరంగా టోకెనైజేషన్ విధానం మెరుగైనదని రామ మోహన్ రావు తెలిపారు. పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ సాంకేతికతను అమలు చేస్తున్నాయని అక్టోబర్ నుండి ఈ విధానం ఎస్బీఐ కార్డ్ అమలు చేస్తుందని వెల్లడించారుకాగా, ఆన్లైన్ లేదా దుకాణాల్లో చెల్లింపుల సమయంలో కస్టమర్ తన కార్డు వివరాలు ఇవ్వవలసిన అవసరం ఉండదు. స్మార్ట్‌ఫోన్ సహకారంతో డిజిటల్ టోకెన్ రూపంలో లావాదేవీ పూర్తి చేయవచ్చు. ప్రతి లావాదేవీకి టోకెన్ మారుతుంది. ఇది పూర్తిగా సురక్షితం. సైబర్ మోసానికి, డేటా చోరీకి ఆస్కారం లేదు. -
నమ్మట్లేదా ? ఆధార్ కార్డు చూపించనా ?: యంగ్ హీరో
Kartik Aaryan Says Aadhar Card Dikha Doon: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లకు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇందులో భాగంగానే కార్తీక్ తాజాగా యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ సరదాగా తిరుగుతూ స్ట్రీట్‌ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న కార్తీక్‌కు వింత సంఘటన ఎదురైంది. యూరప్ వీధుల్లో స్ట్రీట్‌ఫుడ్ తింటూ ఆస్వాదిస్తున్న కార్తీక్ ఆర్యన్‌ను చూసి ఓ అభిమాని సందేహం వ్యక్తం చేశాడు. కార్తీక్ దగ్గరకు వెళ్లి 'మీరు హీరో కార్తీక్ ఆర్యన్ కదా ? మీతో ఒక ఫొటో తీసుకోవచ్చా ? ఎందుకంటే మీరు కార్తీక్ ఆర్యన్ అంటే మా ఫ్రెండ్స్ నమ్మట్లేదు' అందుకే అడుగుతున్నా అని చెప్పాడు. 'దీనికి అవును, నేను కార్తీక్ ఆర్యన్. నమ్మడం లేదా? నా ఆధార్ కార్డ్ చూపించనా ?' అంటూ చమత్కరించాడు. కార్తీక్ మాటలకు ఆనందంతో తన ఫ్రెండ్స్‌ని పిలిచి అతనితో ఫొటోలు దిగాడు ఆ ఫ్యాన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'కార్తీక్ మీరు చాలా సింపుల్, సరదాగా ఉన్నారు', 'కార్తీక్ మీ టైమింగ్ అదిరింది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
SBI Card: ఎస్బీఐ కార్డ్ లాభాలు రెట్టింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో క్రెడిట్ కార్డ్‌ల కంపెనీ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ నికర లాభం రెట్టింపైంది. రూ. 175 కోట్లుగా నమోదైంది. 2019–20నాలుగో క్వార్టర్లో ఇది రూ. 84 కోట్లు. తాజా క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 2,510 కోట్ల నుంచి రూ. రూ. 2,468 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 2,398 కోట్ల నుంచి రూ. 2,234కోట్లకు దిగివచ్చాయి. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం 21 శాతం క్షీణించి రూ. 1,245 కోట్ల నుంచి రూ. 985 కోట్లకు తగ్గింది. స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రెట్టింపై 2.01 శాతం నుంచి 4.99 శాతానికి పెరగ్గా.. నికర ఎన్పీఏలు 0.67 శాతం నుంచి 1.15 శాతానికి చేరాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారీ ఆర్డర్ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్) చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపోజిట్ పాలిమర్ ఇన్సులేటర్ల సరఫరాకై రూ.30 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. వీటిలో ఓ అమెరికన్ కంపెనీ నుంచి రూ.15 కోట్లు, భారత్‌కు చెందిన పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ నుంచి రూ.15 కోట్ల ఆర్డర్ ఉంది. ప్రస్తుతం ఆర్డర్ బుక్ రూ.60 కోట్లుఉందని ఒలెక్ట్రా ఇన్సులేటర్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మహేశ్ బాలయ్య తెలిపారు. మరో రూ.30 కోట్ల ఆర్డర్లు కొన్ని నెలల్లో చేజిక్కించుకోనున్నట్టు చెప్పారు. సాగర్ సిమెంట్స్‌లో ఎస్‌సీఆర్‌ఎల్ విలీనం అనుబంధ కంపెనీ సాగర్ సిమెంట్స్ (ఆర్) లిమిటెడ్‌ను (ఎస్‌సీఆర్‌ఎల్) మాతృ సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనకు బోర్డు సమ్మతి తెలిపిందని సాగర్ సిమెంట్స్ సోమవారం ప్రకటించింది. ఎస్సీ ఆర్ఎల్కు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా గుడిపాడు వద్ద సిమెంటు తయారీతోపాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఎస్సీఆర్ఎల్గా పేరు మారినకర్ణాటకకు చెందిన బీఎంఎం సిమెంట్స్‌లో 100% వాటాలను 2015–16లో సాగర్ సిమెంట్స్ చేజిక్కించుకుంది. -
కార్డు ధరిస్తే కరోనా రాదట!
గుంతకల్లు: ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని కొంత మంది క్యాష్ చేసుకుంటున్నారు. కార్డులు మెడలో ధరిస్తే కరోనా దరి చేరదంటూ నయాదందాకు పాల్పడుతున్నారు పట్టణంలోని ఓ మెడికల్ స్టోర్ నిర్వాహకులు. ఈ కార్డు ట్యాగ్ మెడలో వేసుకుంటే చుట్టూ ఒక మీటరు వరకు వైరస్ సోకదంటూ ప్రచారం చేస్తున్నారు. నెల రోజులపాటు ఇది పని చేస్తుందంటూ ఒక్కోటి రూ. 300లకు విక్రయిస్తున్నారు. మేడ్ ఇన్ జపాన్ ‘‘వైరస్ షట్ అవుట్’’ పేరుతో కార్డులు పట్టణంలో హల్చల్ చేస్తున్నాయి. ఈ కార్డులో సోడియం క్లోరైడ్, న్యాచురల్ జియోలైట్ రసాయన మిశ్రమం ఉంటుందని, ఈ కార్డు శరీరానికి వలయంగా రక్షణ ఇవ్వడంతోపాటు ఒక మీటరు దూరంలోనే వైరస్‌ను ఆపేస్తుందని నమ్మిస్తున్నారు. ఈ కార్డు ధరించామన్న ధైర్యంతో చాలా మంది మాస్క్‌లు వేసుకోవడం లేదు. -
ఎస్బీఐ కార్డు మొబైల్ యాప్‌లో ఐఎల్ఏ
ఎస్బీఐ కార్డ్ సంస్థ తన మొబైల్ యాప్‌లోకి చాట్‌బాట్ ఐఎల్ఏ (ఇంటరాక్టివ్ లైవ్ అసిస్టెంట్) ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని తీసుకురావడమే దీన్ని ఉద్దేశ్యం. 40కు పైగా వినూత్నమైన స్వయం సేవ ఫీచర్లతో ఉన్న ఐఎల్‌ఏను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా ఎస్బీఐ కార్డు నిలుస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ కన్వర్షన్, బ్యాలన్స్ బదిలీ, క్రెడిట్ కార్డుపై రుణం, ఇతర అకౌంట్ నిర్వహణ ఆప్షన్లు అన్నవి పరిశ్రమలోనే మొబైల్ చాట్‌బాట్ ద్వారా ఆఫర్ చేస్తుండడం మొదటిసారి అని పేర్కొంది. చాట్ బాట్‌పై లైవ్ చాట్ ఆప్షన్ కూడా ఉంది. దీని ద్వారా ప్రత్యేకమైన కేసుల్లో పరిష్కారాన్ని నేరుగా కస్టమర్ కేర్ ప్రతినిధి అందించడం జరుగుతుంది. ఎస్బీఐ కార్డ్ వెబ్‌సైట్‌పై ఐఎల్ఏ సేవను గతేడాది ప్రవేశపెట్టగా, తాజాగా దీన్ని మొబైల్ యాప్‌నకూ తీసుకొచ్చినట్టు అయింది. -
వ్యాపారికి కౌలు కార్డు!
యలమంచిలి: చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కలవల వెంకట సురేష్‌కుమార్. ఇతనిది మేడపాడు గ్రామం. సురేష్ గ్రామంలోనే ఫర్నిచర్ వ్యాపారం చేస్తుంటారు. ఇతనికి సెంటు భూమి కూడా లేదు. పైగా కౌలు వ్యవసాయం కూడా చేయడం లేదు. అయితే ఇతని పేరిట రెవెన్యూ అధికారులు మేడపాడు గ్రామంలోని సర్వే నంబరు 57–1లో 3.76 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నట్లు భూమి లైసెన్స్ పొందిన వ్యవసాయదారుల రుణ అర్హత కార్డు మంజూరు చేశారు. ఈ తతంగమంతా సురేష్ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఏతావాత ఈ విషయం బయటపడి ఆ కార్డు సురేష్ చేతికి రావడంతో ఆశ్చర్యపోయాడు. తన ప్రమేయం కానీ, తన సంతకం కానీ లేకుండా రెవెన్యూ అధికారులు ఈ కార్డు ఎలా మంజూరు చేశారని సురేష్ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నరసాపురం విజయా బ్యాంకులో కౌలు కార్డులపై కుంభకోణం జరిగిన నేపథ్యంలో తన పేరిట కూడా ఎక్కడైనా బ్యాంకులో అప్పు వచ్చిందేమోనని సురేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేసి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
కార్డ్ లేకుండానే ఏటీఎమ్‌ల్లో క్యాష్ విత్‌డ్రా
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు కార్డ్ లేకుండానే కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల్లో నగదును పొందవచ్చు. ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ (ఐఎమ్‌టీ) టెక్నాలజీతో నడిచే ఏటీఎంలలో తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది. ఆరంభ ఆఫర్‌గా మొదటి రెండు విత్‌డ్రాయల్స్‌కు రూ.25 లావాదేవీ ఫీజును రద్దు చేస్తున్నామని తెలిపింది. ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే 20,000కు పైగా ఏటీఎమ్‌ల్లో ప్రస్తుతం తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని వివరించింది. ఈ ఏడాది చివరినాటికి ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే ఏటీఎమ్‌ల సంఖ్య లక్షకు పెరుగుతుందని పేర్కొంది. ఇలాంటి ఏటీఎమ్‌లను నిర్వహించే ఇమ్పేస్ పేమెంట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించింది. -
కార్డు లిమిట్ 13 వేలు.. ఖర్చు 9 కోట్లు
న్యూఢిల్లీ: 200 డాలర్ల(రూ.13 వేలు) పరిమితితో ఎస్బీఐ జారీచేసిన విదేశీ ట్రావెల్ కార్డుల్లో మార్పులు చేసి ముంబైకి చెందిన ఒక వ్యక్తి రూ. 9.1 కోట్ల మేర ఖర్చు చేసిన సంఘటన బ్యాంకు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. యలమంచిలి సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ తరఫున ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎన్నారై బ్రాంచ్ 2016లో ఫారిన్ ట్రావెల్ కార్డుల్ని జారీచేసింది. సందీప్ కుమార్ అనే వ్యక్తికి జారీచేసిన మూడు కార్డుల బ్యాలెన్స్‌లో మార్పులు చేసి నాలుగు బ్రిటిష్ ఈ కామర్స్ వెబ్సైట్లలో రూ. 9.1 కోట్ల మేర షాషింగ్ చేసిన విషయాన్ని యలమంచిలి కంపెనీ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లింది. మూడు నెలల వ్యవధిలో మొత్తం 374 లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒరకిల్ డేటాబేస్ ద్వారా బ్యాలెన్స్‌లో మార్పులు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మోసంపై ఎస్బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
ప్రాన్ కార్డుతో.. ప్రయోజనాలెన్నో..
నిడమర్రు : పాన్ కార్డు.. ప్రాన్ కార్డు.. అక్షరమే తేడా ఉన్నా రెండు కార్డులు ఎంతో ఉపయుక్తమైనవి. పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారందరికీ అవసరమైనదైతే, ప్రాన్ కార్డు ఉద్యోగులు, జాతీయ పింఛన్ పథకం ఖాతా దారులకు సంబంధించింది. కేంద్ర ప్రభుత్వమే దీన్ని అందజేస్తుంది. 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయుల, ఉద్యోగులకు ఈ కార్డులు అందజేస్తుంది. చాలామంది పింఛన్‌దారులు వినియోగించక పోవడంతో దీని ప్రయోజనం పొందలేకపోతున్నారు. 2004 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం లేదు. వీరి జీతాల నుంచే నెలనెలా కొంత మొత్తం ప్రభుత్వం వసూలు చేసి ప్రత్యేక ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుంది. దీన్ని కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అంటారు. ఈ సీపీఎస్ విధానంలో ఉన్నవారికి ప్రాన్ కార్డు తప్పనిసరి. చాలామందికి ప్రాన్ కార్డు గురించి అవగాహన ఉన్నా కార్డు గురించి పూర్తిగా తెలియదు. ఈ కార్డు ప్రయోజనం తెలుసుకుందాం. ప్రాన్ అంటే..? పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్).. ఏటీఎం కార్డు వంటిది. సీపీఎస్ విధానంలో జీతాలు పొందుతున్న వారితోపాటు పింఛన్ పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కార్డు. తొలుత పింఛనర్లకే ఇచ్చేవారు. 2004లో కేంద్రం జాతీయ పింఛన్ పథకం బిల్లును ఆమోదించినప్పటి నుంచి ఈ కార్డు అమలులోకి వచ్చింది. ప్రాన్ కార్డు ద్వారా ఉద్యోగులు, పింఛన్‌దారులు ఎప్పటికప్పుడు తమ ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. ఉద్యోగం మారినా కార్డు మార్చుకోనవసరం లేదు. పిన్ నంబర్ ఆధారంగా కార్డును వినియోగించు కోవచ్చు. అయితే ఈ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం మాత్రం లేదు. పొందడం ఇలా.. జీతాలు అందించే శాఖాధిపతుల(డ్రాయింగ్ అధికారులు) సిఫారసులతో జిల్లా కేంద్రాల్లో ఉండే కార్వీ కేంద్రాలకు పదో తరగతి సర్టిఫికెట్ అందించి నేరుగా గాని, గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారాగాని దరఖాస్తు చేసుకోవాలి. సీపీఎస్ ఉద్యోగులైతే జీతాల స్లిప్‌ను జతచేయాలి. వంద రూపాయలు చెల్లిస్తే రిజిస్టర్ పోస్టులో కార్డు అందుతుంది. జీతాల నుంచి పీఎఫ్ కోత ఉన్న ఉద్యోగులు ఈ ప్రాన్ కార్డు పొందే వీలు లేదు. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో వివరాలు వచ్చాక పిన్ ఎంటర్ చేస్తే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వీటిని సవరించుకోవచ్చు. వరుసగా మూడు నెలలపాటు ఒక్కసారి కూడా కార్డు వినియోగించకుంటే బ్లాక్ అవుతుంది. మళ్లీ వేరే పాస్వర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయోజనాలు.. ♦ ఖాతాలో సొమ్ము నిల్వ గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు. ♦ సీపీఎస్ విధానంలో ప్రతినెలా తమ వాటా సొమ్ము ఖాతాకు జమ అవుతోందో లేదో తెలుసుకునే వీలు కలుగుతుంది. ♦ పింఛన్ లావాదేవీలకు పాన్ కార్డుతోపాటు ప్రాన్ కార్డు కూడా ఉపయోగించవచ్చు. ♦ ప్రభుత్వపరంగా రుణాలు తీసుకున్నప్పుడు ఉపయుక్తమవుతుంది. ♦ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో ప్రాన్ కార్డు తప్పనిసరి పిన్ నంబర్ మర్చిపోతే.. ప్రాన్ కార్డు పిన్ నంబర్ మర్చిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త పిన్ నంబర్ తెలుసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం ఉంది. ఠీఠీఠీ.ఛిట్ఛ/nఛీట.ఛిౌఝ లోకి ఎంటర్ కావాలి. ఇందులో ఛిట్చnటఛీ∙పదాన్ని క్లిక్ చేయాలి. సీ యువర్ ప్రాన్ స్టేటస్ అనే పదం వద్ద క్లిక్ చేయాలి. సబ్‌స్క్రైబర్ ఇన్ఫర్మేషన్, నోడల్ అధికారి ఇన్ఫర్మేషన్ అనే రెండు బాక్స్‌లు వస్తాయి. సబ్‌స్క్రైబర్ బాక్స్‌లో ప్రాన్ నంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనే బాక్స్ వద్ద ఫర్ గెట్ పాస్వర్డ్/సీక్రెట్ క్వశ్చన్ రీసెట్ పాస్వర్డ్ అనే పదం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. పాన్ కార్డుపై ప్రింట్ వివరాలు అడుగుతుంది. వాటిని నమోదు చేసి ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మన ఫోన్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. అలా వచ్చిన వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నంబర్ బాక్స్‌లో ఎంటర్ చేయాలి. అప్పడు కొత్త పాస్వర్డ్ వస్తుంది. దీన్ని తర్వాత వినియోగించుకోవచ్చు. -
గ్రీన్‌కార్డుకు ఇంటర్వ్యూ తప్పనిసరి
► భారతీయులకు ట్రంప్ సర్కారు మరో షాక్ ► ఆర్ఎఫ్ఈల పేరిట హెచ్–1బీ దరఖాస్తులపై పెరిగిన నిఘా న్యూయార్క్: గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ సర్కారు మరో షాకిచ్చింది. హెచ్–1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తూ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాసం)పొందాలనుకునే వారికి అక్టోబర్ 1 నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్సీఐఎస్) ఇంటర్వ్యూల్ని తప్పనిసరి చేసింది. ఇప్పటికే లక్షల గ్రీన్‌కార్డుల దరఖాస్తులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉండగా తాజా నిర్ణయంతో మరిన్ని చిక్కులు రావచ్చు. ఇంటర్వ్యూల్ని తప్పనిసరి చేస్తూ గ్రీన్‌కార్డు నిబంధనల్లో మార్పులపై ఆగస్టు 28న యూఎస్సీఐఎస్ ప్రకటన విడుదల చేసింది. హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు రిక్వెస్ట్స్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ఎఫ్ఈ)లు సమర్పించాలని ఇమిగ్రేషన్ అటార్నీలకు లేఖలు పెరుగుతున్నాయి. హెచ్–1బీ వీసాకు లెవల్–1 వేతనాలు అంగీకరించబోమని యూఎస్సీఐఎస్ తేల్చిచెప్పింది. 2017 ఏప్రిల్‌లో చేసిన హెచ్–1బీ వీసా దరఖాస్తులు అక్టోబర్, 1 2017 నుంచి చెల్లుబాటు కానున్న నేపథ్యంలో ఆర్ఎఫ్ఈలు సమర్పించాల్సి ఉంది. గ్రీన్‌కార్డుల కోసం చేసిన మార్పులపై ఎన్పీజెడ్ లా గ్రూప్ మేనేజింగ్ అటార్నీ డేవిడ్ హెచ్ నచ్‌మన్ మాట్లాడుతూ.. ‘కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులు, పౌరసత్వ ప్రక్రియ కోసం ఇంటర్వ్యూలు తప్పనిసరి. నిజానికి ఉద్యోగ వీసా నుంచి గ్రీన్‌కార్డుకు మారాలంటే ఇంటర్వ్యూలు నిర్వహించడం దశాబ్దకాలంగా అమల్లోఉంది. ఇంతవరకూ ఇంటర్వ్యూల్లో చాలామందికి మినహాయింపు ఇచ్చేవారు. కొత్త విధానంలో అలా మినహాయింపు ఉండదు. గ్రీన్‌కార్డుల కోసం మరింత సమయం నిరీక్షించాల్సి రావచ్చు’ అని చెప్పారు. అమెరికాలో తాత్కాలిక వీసాపై పనిచేస్తున్నవారికే అధిక శాతం గ్రీన్‌కార్డులు దక్కుతున్నాయి. 2010 నుంచి 2014 మధ్య హెచ్–1బీ వీసాదారులు 2 లక్షల గ్రీన్‌కార్డులు పొందారని ‘బైపార్టిసన్ పాలసీ సెంటర్’ తెలిపింది. యూఎస్సీఐఎస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015లో దాదాపు 34,843 మంది భారతీయులు తాత్కాలిక వీసా నుంచి గ్రీన్‌కార్డుకు మారారు. ఇందులో 25,179మంది హెచ్–1బీ కేటగిరీలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారే. హెచ్–1బీకి లెవల్ 1 జీతాలకు అంగీకరించం హెచ్–1బీ దరఖాస్తుల్లో వెల్లడించిన వివరాలపై విచారణను యూఎస్సీఐఎస్ వేగవంతం చేసింది. హెచ్–1బీ వీసాదారులకు కంపెనీలు ఆఫర్ చేసిన లెవల్–1 వేతనాలు అంగీకరించమని హెచ్చరికలు వస్తున్నాయని ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఖన్నా తెలిపారు. ‘ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు కంపెనీలు లెవల్–1 వేతనాలు, సాంకేతిక నిపుణులు, ఉన్నతస్థాయి ఉద్యోగులకు లెవల్–4 కేటగిరీ వేతనాలు ఇస్తున్నాయి. శాన్ జోస్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌కు(లెవల్ 1) 88,733 డాలర్ల(రూ. 56 లక్షలు) వేతనం ఉండగా, లెవల్ 4లో 1,55,147 డాలర్ల వేతనం ఆఫర్ చేస్తున్నారు. ఆందోళనలో 8 లక్షల వలసదారులు వలసదారుల్ని స్వదేశానికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్న ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయంపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయంపై దాదాపు లక్షల మంది వలసదారుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికాకు వచ్చి తాత్కాలిక వీసాపై అక్కడ ఉద్యోగం చేస్తున్న వీరంతా ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్నారు. ‘ చిన్నారులుగా ఉన్నప్పుడు దేశంలోకి అక్రమంగా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న లక్షల మంది భవిష్యత్తుపై మంగళవారం ట్రంప్ తన నిర్ణయం ప్రకటిస్తారు’అని వైట్‌హౌస్ పేర్కొంది. కాగా శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ.. ‘వీరిని స్వదేశాలకు పంపాలని ఒబామా హయాంలోనే డిమాండ్ చేయగా 2012లో నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేశారు. డిఫెర్డ్ యాక్షన్ ఫర్ ఛైల్డ్‌హుడ్ అరైవల్స్ పేరిట అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు తాత్కాలిక వర్క్‌పర్మిట్లు జారీ చేశారు.