న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు కార్డ్ లేకుండానే కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల్లో నగదును పొందవచ్చు. ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ (ఐఎమ్‌టీ) టెక్నాలజీతో నడిచే ఏటీఎంలలో తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది.
ఆరంభ ఆఫర్‌గా మొదటి రెండు విత్‌డ్రాయల్స్‌కు రూ.25 లావాదేవీ ఫీజును రద్దు చేస్తున్నామని తెలిపింది. ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే 20,000కు పైగా ఏటీఎమ్‌ల్లో ప్రస్తుతం తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని వివరించింది. ఈ ఏడాది చివరినాటికి ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే ఏటీఎమ్‌ల సంఖ్య లక్షకు పెరుగుతుందని పేర్కొంది. ఇలాంటి ఏటీఎమ్‌లను నిర్వహించే ఇమ్‌పేస్ పేమెంట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment