withdraw
-
పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే..?
బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఏం చేస్తారు.. ‘సింపుల్..ఏటీఎం ద్వారా కావాల్సిన నగదును డ్రా చేస్తాం’ అంటారు కదూ. ఒకవేళ మీ ఖాతాలో రూ.5 లక్షలు ఉన్నాయనుకోండి దాన్ని విత్‌డ్రా చేయాలన్నా ఏటీఎం ద్వారానే చేస్తారా..? ఏటీఎం, చెక్‌బుక్, డీడీ ఇలా ప్రతిదానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయో తెలుసుకుందాం.ఏటీఎం విత్డ్రాఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేయాలంటే మీ కార్డును అనుసరించి రోజుకు రూ.40,000 నుంచి గరిష్ఠంగా రూ.ఒక లక్ష వరకు మాత్రమే సాధ్యం అవుతుంది. కొన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులకు సంబంధించి విత్‌డ్రా పరిమితులు కింది విధంగా ఉన్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాక్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు: రోజుకు రూ.40,000.గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000.ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ఇంటర్నేషనల్, ఉమెన్స్ అడ్వాంటేజ్, ఎన్ఆర్వో డెబిట్ కార్డులు: రోజుకు రూ.25,000టైటానియం రాయల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.75,000ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డులు: రోజుకు రూ.1,00,000.ఐసీఐసీఐ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000గోల్డ్ డెబిట్ కార్డు: రోజుకు రూ.50,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000యాక్సిస్ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..చెక్బుక్చెక్ లేదా పాస్‌బుక్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకుకు ముందుగా సమాచారం అందించాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ వంటి డాక్యుమెంటేషన్ అవసరం కావచ్చు. రూ.2 లక్షలకు మించి నగదు విత్‌డ్రా చేస్తే పాన్ కార్డ్ కాపీ తప్పనిసరి.డిమాండ్ డ్రాఫ్ట్పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్‌లు ఉపయోగించవచ్చు. ఇలా చేసే లావేదేవీలను బ్యాంకులు ట్రాక్ చేసేందుకు కొన్ని నియామాలు పాటించాయి. -
బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్
బీజింగ్ : చైనాకు బ్రెజిల్ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రణాళికకు బ్రెజిల్ అడ్డుకట్టవేసింది. చైనా చేపట్టిన బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేరకూడదని నిర్ణయించుకుంది. తద్వారా ఈ భారీ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వని బ్రిక్స్ గ్రూపులోని రెండో దేశంగా బ్రెజిల్ అవతరించింది.బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్ మీడియాతో మాట్లాడుతూ బ్రెజిల్ బీర్ఐలో చేరదని, అయితే ఇందుకు బదులుగా చైనా పెట్టుబడిదారులతో భాగస్వామిగా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. బ్రెజిల్ ఎటువంటి ఒప్పందాలపై సంతకం చేయకుండా, చైనాతో తన సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటోందన్నారు.హాంకాంగ్‌కు చెందిన వార్తాపత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'లోని వార్తల ప్రకారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించిన చైనా ప్రణాళికకు బ్రెజిల్ మద్దతునివ్వడం లేదు. బ్రెజిల్ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు ఇటీవల చైనా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఇప్పటికే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్ఐ ప్రాజక్టు అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలకు విరుద్ధమని భారత్ పేర్కొంది.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
జూడాల సమ్మె విరమణ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ జూని యర్ డాక్టర్లు తమ సమ్మె ను విరమించారు. ము ఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం చర్చల అనంతరం 16 రోజులు గా చేస్తున్న దీక్షను విరమించుకున్నారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం బెంగాల్ జూనియర్ డాక్టర్లు గత 16 రోజులు గా నిరాహారదీక్ష చేస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సంపూర్ణ విధుల బహిష్కరణను కూడా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు సీఎంతో భేటీలో కొన్ని హామీలు లభించాయి. అయితే ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు. ప్రజలు, మా దివంగత సోదరి కుటుంబీకులు దీక్షను విరమించుకోవాలని కోరారు. విషమిస్తు న్న మా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టు కొని నిరాహారదీక్ష ముగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే దీక్షను ముగిస్తున్నాం అని జూనియర్ డాక్టర్ దెవాశిష్ హల్దర్ వెల్లడించారు. -
కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల సంస్థ హీరో మోటార్స్ కంపెనీ(హెచ్ఎంసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజాగా ఉపసంహరించుకుంది. ఐపీవో ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత భావించింది. ఇందుకు అనుగుణంగా సెబీకి ఆగస్ట్‌లో ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేసేందుకు ప్రమోటర్లు ఆసక్తి చూపారు. అయితే కారణం వెల్లడించకుండానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ఐపీవోలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్లు, హీరో సైకిల్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.75 కోట్లు చొప్పున షేర్లను ఆఫర్ చేయాలని భావించాయి. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ దిగ్గజాలకు హైఇంజినీర్డ్ పవర్‌ట్రయిన్ సొల్యూషన్ల తయారీ, సరఫరాలో ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుసురక్షా డయాగ్నోస్టిక్ రెడీసమీకృత డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు వీలుగా జులైలోనే ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ జులైలో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. వెరసి కంపెనీకి ఐపీవో నిధులు లభించవు. కంపెనీ పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తోంది. -
అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నానని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి (భారత కాలమాన ప్రకారం) ‘ఎక్స్’ ఖాతాలో ఒక లేఖను పోస్టు చేశారు. దేశ ప్రయోజనాల కోసం, తమ పార్టీ ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేల్చిచెప్పారు. గత మూడున్నరేళ్లలో ఒక దేశంగా మనం గొప్ప ముందడుగు వేశామని అమెరికా ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. ఎన్నో ఘనతలు సాధించామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రజలకు ఇప్పటిదాకా సేవలందించడం అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మరోసారి పోటీ చేయాలన్న ఆలోచన లేదని, అధ్యక్షుడిగా మిగిలిన పదవీ కాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యతలపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. వచ్చే వారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని, తన నిర్ణయాన్ని పూర్తిగా తెలియజేస్తానని వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణమైన భాగస్వామి అని ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బైడెన్ బలపరిచారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించటానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో గత నెలలో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వయసు కారణంగా మతిమరుపు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలంటూ బైడెన్‌పై సొంత పార్టీ నాయకులు ఒత్తిడి పెంచారు. అందుకే ఆయ న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంచిన డిబేట్ సీఎన్ఎన్ ఛానల్ వేదికగా జూన్ 27న డొనాల్డ్ ట్రంప్– జో బైడెన్ల మధ్య తొలి అధ్యక్ష చర్చ జరిగింది. ఈ చర్చలో బైడెన్ పదేపదే తడబడటం, మాటల కోసం తడుముకోవడం, మతిమరుపుతో పేలవ ప్రదర్శన కనబరిచారు. దాంతో 81 ఏళ్ల బైడెన్ మానసిక ఆరోగ్యంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సొంత డెమొక్రాటిక్ పార్టీలోనూ ఆయన సామర్థ్యంపై సందేహాలు తీవ్రమయ్యాయి. ట్రంప్‌ను బైడెన్ ఓడించలేడనే బలమైన అభిప్రాయం పారీ్టలో నెలకొంది. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ... బైడెన్‌తో మాట్లాడుతూ డెమొక్రాటిక్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడమే మేలని కుండబద్ధలు కొట్టారు. ప్రతినిధుల సభ, సెనేట్లలోనూ డెమొక్రాట్లకు అపజయాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం పలువురు డెమొక్రాటిక్ కీలక నాయకులతో ప్రైవేటు సంభాషణల్లో బైడెన్ వైదొలిగితేనే ట్రంప్‌ను ఓడించే అవకాశాలుంటాయని చెప్పారు. ఐదుగురు చట్టసభ సభ్యులు బైడెన్ వైదొలగాలని బాహటంగానే డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా డెమొక్రాటిక్ పారీ్టకి విరాళాలు ఇస్తున్న దాతలు.. బైడెన్ తప్పుకోవాలని షరతు పెడుతూ విరాళాలను నిలిపివేశారు. దాంతో నాన్సీ పెలోసీ రంగంలోకి దిగి తెరవెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. బైడెన్ శిబిరానికి వాస్తవాన్ని తెలియజెప్పారు. అన్నివైపులా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో కోవిడ్‌తో డెలావెర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న బైడెన్ ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడేంటి? ఓపెన్ కన్వెన్షన్.. కమలకు ఛాన్స్ బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతో నవంబరు 5 జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మొగ్గు కనపడుతున్నా.. పార్టీ నిబంధనావళి ప్రకారం ఓపెన్ కన్వెన్షన్ (ఎవరైనా పోటీపడవచ్చు) జరుగుతుంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించిన ప్రైమరీల్లో బైడెన్ తిరుగులేని మెజారిటీని కూడగట్టుకున్నారు. 4,000 పైచిలుకు డెలిగేట్లలో 3,900 మంది డెలిగేట్లను బైడెన్ గెల్చుకున్నారు. నిబంధనల ప్రకారం ఆగస్టులో అధ్యక్ష అభ్యరి్థని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కన్వెన్షన్‌లో వీరిందరూ బైడెన్‌కు బద్ధులై ఉండాలి. ఇప్పుడాయనే స్వయంగా రేసు నుంచి వైదొలిగారు కాబట్టి.. డెమొక్రాటిక్ టికెట్ కోసం పార్టీ సభ్యులెవరైనా పోటీపడొచ్చు. దీన్నే ఓపెన్ కన్వెన్షన్ అంటారు. కమలా హారిస్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. డెమొక్రాటిక్ పార్టీలోని ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు ఆమెకు ప్రధాన పోటీదారులుగా ఉంటారని భావిస్తున్నారు. నామినేషన్ జాబితాలో పేరు లేనప్పటికీ డెలిగేట్లు తమకు నచి్చన అభ్యరి్థకి ఓటు వేసే వీలు కూడా ఉంది. నాలుగు వేల పైచిలుకు డెలిగేట్లు ఆగస్టులో తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలిరౌండ్లో ఫలితం తేలకపోతే 700 మంది సూపర్ డెలిగేట్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. డెమొక్రాటిక్ నామినీ ఎన్నికయ్యేదాకా ఓటింగ్ కొనసాగుతుంది. ముమ్మర లాబీయింగ్, తెరవెనుక మంత్రాంగాలు జరగడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: బైడెన్‌ను.. మార్చొచ్చా?
డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి చర్చలో జో బైడెన్ ఆద్యంతం తడబడటం, మాటల కోసం వెతుక్కోవడంతో డెమొక్రాట్లలో భయాందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 81 ఏళ్ల వయసులో బైడెన్ సమర్థుడైన అభ్యర్థి కాగలరా? మరో నాలుగేళ్లు అగ్రరాజ్యం అధినేతగా భారం మోయగలరా? అనే సందేహాలు ముప్పిరిగొన్నాయి. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తుండటంతో వయోభారం రీత్యా అధ్యక్షుడి మానసిక సంతులతపై డెమొక్రాట్లలో అనుమానాలు తలెత్తుతున్నాయి. టెక్సాస్ నుంచి డెమొక్రాట్ ఎంపీ ఒకరు బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా జో బైడెన్‌ను మార్చే అవకాశంఉందా? స్వయంగా ఆయన రేసు నుంచి తప్పుకోవచ్చా? అప్పుడు ఎవరు అధ్యక్ష అభ్యర్థి అవుతారు? అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. బైడెన్‌పై తీవ్ర ఒత్తిడిఅవును.. తప్పుకోవచ్చు. కాకపోతే అందుకు ఆయన సిద్ధంగా లేరు. తానే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థనని, వైదొలగాలని తననెవరూ ఒత్తిడి చేయడం లేదని బైడెన్ బుధవారం స్పష్టం చేశారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యరి్థని ఆగస్టు 19–22 వరకు షికాగోలో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్సీ)లో అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఓహియో రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్‌పై పేరుండటానికి వీలుగా జూలై 21 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు జరిగే వర్చువల్ కన్వెన్షన్‌లో తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వివిధ రాష్ట్రాల ప్రైమరీల్లో వచి్చన ఫలితాల ఆధారంగా.. ఆ నిష్పత్తిలో అభ్యర్థులకు డెలిగేట్లను కేటాయిస్తారు. దాదాపు 4,000 డెలిగేట్లలో 99 శాతం బైడెన్ గెల్చుకున్నారు. డీఎన్సీ నిబంధనల ప్రకారం వీరందరూ బైడెన్‌కు మద్దతు పలకాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఒత్తిడి మరీ పెరిగిపోయి.. రేసు నుంచి వైదొలగాలని బైడెన్ నిర్ణయించుకుంటే.. అప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో పాటు ఇతరులెవరైనా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీపడవచ్చు. అప్పుడు డెలిగేట్లు జాతీయ కన్వెన్షన్‌లో (ఓపెన్ కన్వెన్షన్ అంటారు) తమకు నచ్చిన అభ్యర్థులను సూచించి ఒకరికి మెజారిటీ వచ్చేదాకా రౌండ్ల వారీగా ఓటింగ్ చేయొచ్చు. 1968లో అప్పటి అధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ మళ్లీ పోటీచేయకూడదని నిర్ణయించడంతో ఓపెన్ కన్వెన్షన్ నిర్వహించారు. బలవంతంగా తప్పించొచ్చా? పారీ్టలో మెజారిటీ మార్పును కోరుకొని బైడెన్ ససేమిరా అంటే ఆయన్ను బలవంతంగా తప్పించడానికి ఆస్కారం ఉంది. డీఎన్సీ నియమావళిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ’జాతీయ కన్వెన్షన్‌లో డెలిగేట్లు తమను ఎన్నుకున్న వారి అభిప్రాయాన్ని/ మనోగతాన్ని ప్రతిబింబించాలి’ అని నిబంధనలు చెబుతున్నాయి. అంటే డెమొక్రాటిక్ పార్టీ డెలిగేట్లు ఇతరుల వైపు కూడా మొగ్గు చూపవచ్చు (అదే రిపబ్లికన్ పారీ్టలో అయితే డెలిగేట్లు ఎవరి తరఫున అయితే ఎన్నికయ్యారో వారికే బద్ధులై ఉండాలని స్పష్టంగా ఉంది). బైడెన్ తరఫున ఎన్నికైన 3,894 డెలిగేట్లలో 1,976 మంది పైచిలుకు డెలిగేట్లు వర్చువల్ కన్వెన్షన్‌లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలి. అప్పుడు స్పష్టమైన తీర్పు రాక అదనపు రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. డెలిగేట్లు ఇంత పెద్ద సంఖ్యలో తిరుగుబాటు చేస్తారా? అని అమెరికా రాజకీయ పండితులు సందేహిస్తున్నారు. అయితే అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకొనే నిబంధనలను డీఎన్సీ రూల్స్ కమిటీ ఏ సమయంలోనైనా మార్చవచ్చు. కమలా హారిస్‌కు ఛాన్స్ ఉందా? నాలుగేళ్ల పదవీకాలంలో అధ్యక్షుడు ఎప్పుడైనా తప్పుకొంటే.. ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ ఆటోమెటిగ్గా పగ్గాలు చేపడతారు. కానీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇలాంటి ఆస్కారం లేదు. ఓపెన్ కన్వెన్షన్‌లో అందరి అభ్యర్థుల్లాగే భారతీయ–అమెరికన్ హారిస్ కూడా పోటీపడాల్సి వస్తుంది. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సంపాదించాల్సి ఉంటుంది. అధ్యక్ష డిబేట్ తర్వాత సీఎన్ఎన్ నిర్వహించిన పోల్‌లో ట్రంప్‌కు 47 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకగా, కమలా హారిస్‌కు 45 శాతం మంది మద్దతు లభించడం విశేషం. హారిస్‌కు అనుకూలించే మరో అంశం ఏమిటంటే.. డెమొక్రాటిక్ పార్టీ ప్రచార ఫండ్‌ను బైడెన్ కాకుండా ఆమె మాత్రమే నేరుగా పొందగలరు. బైడెన్ స్వయంగా వైదొలిగితే తప్పితే ఆయన్ను అధ్యక్ష అభ్యరి్థగా తప్పించడం అంత సులభం కాదు. సాంకేతికంగా అవకాశాలు ఉన్నప్పటికీ ఆచరణలో కష్ట సాధ్యమే. – సాక్షి నేషనల్ డెస్క్ -
ఎన్పీఎస్ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడమెలా?
నేను 2019లో పన్ను ఆదా కోసం ఎన్పీఎస్ సాధనంలో రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకుందామని అనుకుంటున్నాను. ఎలా ఉపసంహరించుకోవాలి? – కల్పేష్ వర్మ ఎన్పీఎస్ టైర్–1 పెట్టుబడులకు 60 ఏళ్లు వచ్చే వరకు లాకిన్ ఉంటుంది. ఈ లోపే ఎన్పీఎస్ నుంచి బ్యాలన్స్‌ను ఉపసంహరించుకోవాలంటే, అందుకు కొన్ని షరతులు వరిస్తాయి. ఉన్నత విద్య, వివాహం, ఇంటి కొనుగోలు వంటి అవసరాలకు ఎన్పీఎస్ నిధి నుంచి కేవలం 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అది కూడా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావాలి. మీరు 2019లో ఇన్వెస్ట్ చేశారంటున్నారు. మూడేళ్ల కాలం పూర్తయింది. కనుక సమకూరిన నిధి నుంచి 25 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ ఖాతాను శాశ్వతంగా మూసివేయదలిస్తే, ఆరంభించి పదేళ్లు ముగిసిన తర్వాతే అది సాధ్యపడుతుంది. పదేళ్లలో ఏర్పడిన నిధి నుంచి 20 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో నెలవారీ పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎన్పీఎస్ ఖాతాలో పదేళ్ల తర్వాత కూడా మొత్తం నిధి రూ.5 లక్షల్లోపే ఉంటే, అప్పుడు నూరు శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగేందుకు సీఆర్ఏ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఉపసంహరణకు కారణాన్ని పేర్కొనాలి. బ్యాంక్ అకౌంట్, కాంటాక్ట్ వివరాలను ధ్రువీకరించాలి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. అప్పటి నుంచి ఐదు పనిదినాల్లో మీ ఉపసంహరణ దరఖాస్తు ప్రాసెస్ అవుతుంది. ఇతర మార్గాలు లేకపోతే తప్ప, ముందస్తు ఉపసంహరణను ఎంపిక చేసుకోవద్దన్నదే మా సలహా. విశ్రాంత జీవనం కోసం ఉద్దేశించిన నిధిని ఉపసంహరించుకోకుండా నిరాశ పరచడమే ఈ పథకంలోని షరతుల ఉద్దేశ్యం. ఎన్పీఎస్ పెట్టుబడుల్లో గరిష్టంగా 75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రిటైర్మెంట్ కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు సహేతుకమేనని చెప్పుకోవాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
కర్ణాటక: హిజాబ్ నిషేధం ఎత్తివేత
మైసూర్: హిజాబ్ ధరించిండంపై కర్ణాటక ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని.. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మైసూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. హిజాబ్‌పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యా శుక్రవారం ప్రకటించారు. మహిళలు వారికి ఏది నచ్చితే వాటిని ధరించవచ్చని తెలిపారు. హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లవచ్చని, హిజాబ్‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు.. ఏం తింటారు.. అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు. ‘నేను ఎందుకు అడ్డుకోవాలి? మీ ఇష్టం మేరకు నచ్చినట్లు హిజాబ్ ధరించవచ్చు’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హిజాబ్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ ధరించడం విషయంలో ఇస్లాం మతపరంగా తప్పనిసరి ధరించాలన్న నియమం ఏం లేదని పేర్కొంది. విద్యా సంస్థల్లో ఏక రూప దుస్తులు ధరించాలని హైకోర్టు వెల్లడించింది. చదవండి: ఆరు నెలల పాపకు కరోనా! అప్రమత్తమైన అధికారులు -
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. భారత్ ఆమోదం
న్యూయార్క్: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 91 దేశాలు ఓటు వేశాయి. ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం నాడు ఓటింగ్ జరిగింది. "ఆక్రమిత సిరియన్ గోలన్ ప్రాంతం నుండి జూన్ 4,1967 నాటి రేఖ వరకు వైదొలగాలని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి తీర్మానిస్తోంది' అని పేర్కొంటూ ఐరాస అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. 1967 యుద్ధంలో సిరియా నుంచి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా సహా 91 దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మాణానికి 8 దేశాలు-- ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, మైక్రోనేషియా, ఇజ్రాయెల్, కెనడా, మార్షల్ దీవులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇదీ చదవండి: జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం -
తెలంగాణలో భారీగా నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం.. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. భారీ సంఖ్యలోనే అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు తెలియజేశారు. బుజ్జగింపుల పర్వం, చర్చల నడుమ ప్రధాన పార్టీల రెబల్స్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కాగా.. సగానికి సగం అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల స్క్రూటినీ(పరిశీలన) తర్వాత 114 మంది బరిలో ఉండగా.. బుధవారం 70 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరకు.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత గజ్వేల్ బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. గజ్వేల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో రెబల్స్‌తో అధిష్టానం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. చాలా స్థానాల్లో రెబల్స్ తమ నామినేషన్స్ వెనక్కి తీసుకున్నారు. సూర్యాపేటలో పటేల్ రమేష్‌రెడ్డి, జుక్కల్‌లో గంగారాం, బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రూనాయక్, వరంగల్ ఈస్ట్‌లో రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరోవైపు బీజేపీ రెబల్స్ సైతం భారీ సంఖ్యలోనే నామినేషన్లు వెనక్కి తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన తర్వాత.. 2,898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఈసీ ఆమోదం పొందాయి. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు. సూర్యాపేటలో 12 మంది ఉపసంహరణ.. బరిలో 20 మంది సిద్ధిపేట జిల్లా.. హుస్నాబాద్‌లో 15 నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో 19 మంది హుజూరాబాద్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. ఎన్నికల బరిలో 22 మంది రాజన్న సిరిసిల్ల జిల్లా.. సిరిసిల్లలో ఇద్దరి నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో 21 మంది వేములవాడలో నలుగురి ఉపసంహరణ.. బరిలో 16 మంది పెద్దపల్లి జిల్లాలో.. మంథనిలో ముగ్గురు ఇండిపెండెంట్ల ఉపసంహరణ.. బరిలో 21 మంది అభ్యర్థులు నల్లగొండ జిల్లా.. మిర్యాలగూడలో 10 మంది విత్‌డ్రా.. బరిలో 23 మంది నల్లగొండ నాగార్జున సాగార్‌లో ఆరుగురు సభ్యుల విత్‌డ్రా.. బరిలో 15 మంది నిజామాబాద్ జిల్లాలో.. ఆర్మూర్‌లో 21 మంది బాన్సువాడలో 17 మంది బోధన్ బరిలో 15 మంది నిజామాబాద్ అర్బన్‌లో 23 మంది నిజామాబాద్ రూరల్‌లో 17 మంది బాల్కొండ బరిలో 9 మంది కామారెడ్డి జిల్లాలో.. కామారెడ్డి సెగ్మెంట్లో 58 నామినేషన్లలో 19 విత్‌డ్రా.. బరిలో 39 మంది గజ్వేల్‌తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డి నామినేషన్ల స్క్రూటినీ తర్వాత ఈ నియోజకవర్గంలో 58 మంది పోటీలో ఉండగా.. ఇవాళ 19 మంది నామినేషన్ల ఉపసంహరణ కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి కె.వెంకట రమణారెడ్డి పోటీలో జుక్కల్‌లో 7 విత్‌డ్రా.. బరిలో 16 మంది ►ఉమ్మడి వరంగల్.. 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 216 మంది పోటీ వరంగల్ తూర్పు సెగ్మెంట్లో పోటీలో నిలిచిన 29 మంది అభ్యర్థులు. పరకాల బరిలో 28 మంది అభ్యర్థులు. వర్ధన్నపేట బరిలో 14 మంది అభ్యర్థులు నర్సంపేట బరిలో 19 మంది అభ్యర్థులు. జనగామ బరిలో 19 మంది అభ్యర్థులు. పాలకుర్తి బరిలో 15 మంది అభ్యర్థులు. స్టేషన్ ఘనపూర్ బరిలో 19 మంది అభ్యర్థులు. ములుగు బరిలో 9మంది అభ్యర్థులు. భూపాలపల్లి సెగ్మెంట్ బరిలో 23 మంది అభ్యర్థులు. మహబూబాబాద్ సెగ్మెంట్ బరిలో 12మంది అభ్యర్థులు డోర్నకల్ సెగ్మెంట్ బరిలో 14మంది అభ్యర్థులు వరంగల్ పశ్చిమ బరిలో 15మంది అభ్యర్థులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. పినపాకలో నలుగురు ఉపసంహరణ.. బరిలో 18 మంది ఇల్లందులో 10 మంది ఉపసంహరణ.. పోటీలో 20 మంది కొత్తగూడెంలో నలుగురు ఉపసంహరణ.. పోటీలో 30 మంది అశ్వారావుపేటలో ఏడుగురి ఉపసంహరణ.. 14 మంది పోటీలో భద్రాచలంలో ఎవరూ విత్‌డ్రా చేసుకోలేదు. దీంతో 13 మంది పోటీ లో ఉన్నారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో.. 15 స్థానాలకు 20 మంది అభ్యర్థుల ఉపసంహరించుకోగా.. 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో.. 6 నియోజకవర్గాల పరిధిలో 173 మంది అభ్యర్థులు బరిలో ఇబ్రహీంపట్నంలో 28 మంది, ఎల్బీనగర్లో 38 మంది, మహేశ్వరంలో 27, రాజేంద్రనగర్‌లో 25, శేరిలింగంపల్లిలో 33, చేవెళ్లలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. -
కెనడాకు భారత్ మరోసారి హెచ్చరికలు..!
ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 10 నాటికి గడువును కూడా విధించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల్లో సమాన దౌత్య అధికారులు ఉండాలనే నియమంపై భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాను కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో 62 మంది కెనడా దౌత్య అధికారులు ఉంటుండగా.. ఆ సంఖ్యను 41కి తగ్గించుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10 తర్వాత ఇంకా ఎక్కువ మంది దౌత్య అధికారులు ఉంటే.. వారికి రక్షణను రద్దు చేస్తామని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. ఈ వార్తలపై అటు.. కేంద్రంగానీ, విదేశాంగ శాఖ గానీ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదానికి కారణమైంది. ఈ కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కెనడా డిమాండ్ చేసింది. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. ఆ తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు -
అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు
సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఖాతాలో డబ్బు లేకున్నా.. రూ. 80,000 వరకు విత్‌డ్రా తీసుకోవచ్చని ఒక బ్యాంక్ వెల్లడించింది. దీంతో వినియోగదారులు ATM సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ (Bank Of Ireland) ఖాతాలో ఉన్న డబ్బుతో సంబంధం లేకుండా సుమారు వెయ్యి డాలర్లను విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఈ బ్యాంక్ ఆన్లైన్ సిస్టం కొంత మందకొడిగా ఉండటం వల్ల యాప్స్ పనిచేయడంలేదని.. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ విధమైన ప్రకటన చేసింది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ ఈ బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి అవసరాల కోసం వెయ్యి డాలర్లను తీసుకున్నట్లయితే.. ఆ తరువాత అతడు జరిపే లావాదేవీల్లో ఈ మొత్తం వసూలు చేస్తుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది డబ్బు కోసం ఏటీఎమ్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరు కనీసం మూడు, నాలుగు గంటలు వెయిట్ చేసి మరీ డబ్బు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ వివరణ.. మొబైల్ యాప్ అండ్ 365ఆన్‌లైన్‌తో సహా మా అనేక సేవలపై ప్రభావం చూపుతున్న సాంకేతిక సమస్యపై పనిచేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ సమస్య వీలైనంత త్వరగా పరిష్కారమవుతుందని స్పష్టం చేసింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని తెలిపింది. We are working on a technical issue that is impacting a number of our services including our mobile app and 365Online. We are working to fix this as quickly as possible and apologise to customers for any inconvenience caused. https://t.co/yO5ptZ6MfL — Bank of Ireland (@bankofireland) August 15, 2023 -
'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం
ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న టోర్నీ కామన్వెల్త్ గేమ్స్. కాగా నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్‌ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్(Victoria State) వేదిక కానుంది. కానీ తాజాగా తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. అనుకున్నదాని కంటే బడ్జెట్ ఎక్కువైతుందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్‌తో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం తమకు సాధ్యం కాదని పేర్కొంది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారమిచ్చామని.. మా కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వడం మంచిదని కోరినట్లు విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రీమియర్ డానియెల్ ఆండ్రూస్ మెల్బోర్న్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ''మొదట కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బడ్జెట్లో రెండు ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్స్($2Aus Billion Dollars) కేటాయించాం. కానీ ఇప్పుడు చూస్తే అది ఏడు ఆస్ట్రేలియ బిలియన్ డాలర్లు($7Aus Billion Dollars) అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో మాకు ఇది కష్టంగా అనిపిస్తోంది. అసలే లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న మాకు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది. ఒక ఆసుపత్రి లేదా స్కూల్స్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన దానిని ఇలా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు వినియోగించలేం.. ఇది మాకు మూడింతల బడ్జెట్'' అని తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రతినిధి డానియెల్ ఆండ్రూస్ ► ఇక 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్ పట్టణం ఆతిథ్యమిచ్చింది. ఈ గేమ్స్‌లో ఆస్ట్రేలియా 179 పతకాలతో టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో ఇంగ్లండ్ 176 పతకాలతో ఉంది. ఇక భారత్ ఈ గేమ్స్‌లో 61 పతకాలు(22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో) నాలుగో స్థానంలో నిలిచింది. When the Commonwealth Games needed a host city to step in at the last minute, we were willing to help – but not at any price. And not without a big lasting benefit for regional Victoria. — Dan Andrews (@DanielAndrewsMP) July 17, 2023 చదవండి: Asian Games 2023: ఇదేం క్రికెట్ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ -
ఇంకా రూ. లక్ష కోట్లు రావాలి! రూ.2 వేల నోట్లపై కీలక సమాచారం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మే నెలలో రూ.2 వేల నోట్లను ఉపసంహరించింది. 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లేదా ఏదైనా బ్యాంకు శాఖలో ఇతర డినామినేషన్ నోట్లతో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఇప్పటివరకు రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించిన రూ. 2,000 కరెన్సీ నోట్లను సెప్టెంబర్ చివరి నాటికి మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని కోరిన ఆర్బీఐ ఇందు కోసం అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది. కాగా ఇప్పటివరకు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కివచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. మొత్తంగా రూ.3.6 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉండగా మూడింట రెండు వంతులకు పైగా నోట్లు తిరిగి వచ్చాయి. అంటే ఇంకా దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా రూ.2,000 నోట్లను వెంటనే డిపాజిట్ చేయాలని ఆర్బీఐ అధికారులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే! -
Bihar: నితీష్ కుమార్ సర్కార్‌కు ఎదురుదెబ్బ ..
బిహార్: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవాం మోర్చా(హెచ్ఏఎమ్) ప్రభుత్వానికి తన మద్దుతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంతోష్ సుమన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉపసంహరణ పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు. కేబినెట్‌కు గత వారమే రాజీనామా చేసిన మాంఝీ తనయుడు సంతోష్ సుమన్.. నితీష్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తన పార్టీని విలీనం చేయాలని సీఎం బలవంతం చేస్తున్నట్లు ఆరోపించారు. పార్టీ భవిష్యత్తును ఢిల్లీకి వెళ్లి చర్చించనున్నట్లు చెప్పారు. మూడో కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా నితీష్ కుమార్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించిన జితన్ రాం మాంఝీ పార్టీ ఎన్డీయేకు చేరువయ్యేందుకు సంకేతాలు పంపింది. తాను మంగళవారం ఢిల్లీ వెళుతున్నానని, ఎన్డీయే నుంచి ఆహ్వానం అందితే కాషాయ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదననూ కూడా పరిశీలిస్తున్నామని సుమన్ తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశానికి సంబంధించిన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న హిందుస్థాన్ స్వామ్ మోర్చా పార్టీ.. గతేడాది బీజేపీని వీడిన నితీష్ కుమార్‌కు మద్దతుగా మహాకూటమిలో చేరింది. ప్రస్తుతం బిహార్‌లో 243 సీట్లకు గాను ప్రభుత్వానికి చెందిన కూటమికి 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో పాటు మరో మూడు చిన్న పార్టీలు ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఇదీ చదవండి:గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. కాంగ్రెస్ ఫైర్.. రూ కోటి నిరాకరణ -
Rs 2000 notes withdraw: బ్యాంకులు ఈ నోట్లను తిరస్కరిస్తే ఏం చేయాలో తెలుసా?
సాక్షి,ముంబై: 2 వేల రూపాయల నోటును రీకాల్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోటును అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకోవచ్చని, డిపాజిట్ చేసుకోవచ్చని కూడా ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 2 వేల రూపాయల నోటు 2023 అక్టోబరు ఒకటి నుంచి చెల్లుబాటులో ఉండవు. మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో ఈ రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక రోజులో ఒకవ్యక్తి గరిష్టంగా రూ. 20 వేల విలువైన నోట్ల వరకు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. అయితే డిపాజిట్ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు బ్యాంకులకు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: జేబులోనే పేలిన మొబైల్: షాకింగ్ వీడియో వైరల్ రూ. 2000 నోటు మార్పిడికి డిపాజిట్లకు బ్యాంకులు నిరాకరిస్తే? ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారంరూ. 2 వేల నోట్లను గడుపు లోపల తీసుకునేందుకు నిరాకరించవు. ఒక వేళ బ్యాంకులు నిరాకరిస్తే ఏంచేయాలనేది వినియోగదారులకుపెద్ద ప్రశ్న. రూ. 2వేల నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి బ్యాంకు నిరాకరించినట్లయితే, సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయవచ్చు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) అలాంటి అనుభవం ఎదురైతే కొత్త వన్ నేషన్, వన్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద నాలుగు మార్గాల్లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 14448కి ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:15 గంటల మధ్య కాల్ చేయవచ్చు. అలాగే ఆర్బీఐకి ఈ ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే సెంట్రలైజ్డ్ రసీదు అండ్ ప్రాసెసింగ్ సెంటర్', రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్ - 160017 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా భౌతిక ఫిర్యాదును పంపవచ్చు. -
Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు
సాక్షి, ముంబై: కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో అతిపెద్ద 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే, ఈనోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కండిషన్స్ అప్లయ్ ♦ మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. ♦ ఏ విత్ డ్రా అయినా, ఎంత డబ్బు ఇవ్వాలన్నా అందులో రూ. 2 వేల నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించిన ఆర్బీఐ ♦ సెప్టెంబరు 30 లోగా ప్రజలు తమ దగ్గరున్న 2 వేల నోట్లను ఏ బ్యాంకులోనయినా డిపాజిట్ చేయొచ్చు ♦ ఒక వ్యక్తి ఒక విడతలో గరిష్టంగా పది రూ. 2 వేల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. ♦ ఈ నెల 23 నుంచి రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉంది ♦ మార్చుకోడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 ♦ 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయిన రూ.2 వేల నోటు ముద్రణ “క్లీన్ నోట్ పాలసీ” లో భాగంగానే ఈ నిర్ణయం : ఆర్బీఐ రూ.2000 డినామినేషన్ నోట్లలో దాదాపు 89శాతం మార్చి 2017కి ముందు జారీ చేసినవి. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. మార్చి 31, 2018 నాటికి (చెలామణిలో ఉన్న నోట్లలో 37.3శాతం) గరిష్టంగా ఉన్న రూ.6.73 లక్షల కోట్ల నుండి చెలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది, మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8శాతం మాత్రమే ఉన్నాయి. ఈ విలువ సాధారణ లావాదేవీలకు ఉపయోగించడం లేదని గమనించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అలాగే ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా 2016లో నవంబరులో చలామణిలో ఉన్న రూ.1,000 రూ.500 నోట్ల రద్దు చేసిన తరువాత రూ.2వేల కరెన్సీ నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. RBI to withdraw Rs 2000 currency note from circulation but it will continue to be legal tender. pic.twitter.com/p7xCcpuV9G — ANI (@ANI) May 19, 2023 -
111 జీవో ఎత్తివేత.. 84 గ్రామాల్లో సంబరాలు
జీవో 111 అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఎందుకు జీవో ఎత్తివేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది? 111 జీవో రద్దుకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడటంతో ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం ? అసెంబ్లీ వేదికగా గతంలో 111 జీవోపై కీలక నిర్ణయం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా 111 జీవో రద్దు చేస్తూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 111 జీవో పరిధిలో పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉంది. గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవోను తెచ్చారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదుని అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అని కేసీఆర్ భావించారు. ఈ మేరకు అప్పట్లో ఒక నిపుణులు కమిటీ వేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం అంటూ గతంలో సీఎం ప్రకటించారు. తాజాగా క్యాబినెట్ లో 111 రద్దుకు ఆమోద ముద్ర పడింది రియల్ ఎస్టేట్ రికార్డులు.. 111 వన్ జీవో.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల వ్యధ గుర్తుకు వస్తుంది. లక్ష 32 వేల ఎకరాల భూమి కథ ఇది... ఈ త్రిపుల్ వన్ జీవో. చాలా మంది పెద్దమనుషులు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. ఒక్కసారి జీవో ఎత్తేస్తే… అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ రికార్డులు సృష్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది GO.111. ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పట్టణానికి నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ GO ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. చాలా ఏళ్లుగా పోరాటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా 111 జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. 111 జీవో ఎత్తివేయాలంటూ టీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కోర్టులో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఎత్తివేయాలని ఉద్దేశంతోనే ఉంది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ 111 జీవోపై సమీక్ష జరిపారు. రిపోర్టు కోర్టుకు అందించేందుకు కొంత సమయం కావాలని అడగాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా జీవో పరిధిలో మరింత ఉండేలా, జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. సంబరాలు మొత్తానికి 111జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి. జీవో రద్దుతో 84 గ్రామాల్లోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అజీజ్ నగర్ గ్రామస్థులు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: 111 పూర్తిగా రద్దు.. వీఆర్ఏల క్రమబద్ధీకరణ.. కేబినెట్ కీలక నిర్ణయాలివే.. -
ఎన్సీపీలో కీలక పరిణామం.. రాజీనామా వెనక్కి తీసుకున్న శరద్ పవార్..
ముంబై: ఎన్సీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం అధ్యక్ష పదివికి రాజీనామా చేసిన శరద్‌పవార్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ప్రేమ, అభిమానం, నమ్మకం తనను కదిలించాయని తెలిపారు. అందుకే వాళ్ల ఇష్టం మేరకు రాజీనామా ఉససంహరించుకుంటున్నట్లు చెప్పారు. తాను ఎప్పుడైనా కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు తనతో ఉంటున్నారని చెప్పారు. వాళ్ల సెంటిమెంట్‌ను కాదనలేనన్నారు. మంగళవారం తన ఆత్మకథ రెండో భాగం పుస్తకం విడుదల చేస్తూ రాజీనామా విషయాన్ని ప్రకటించారు శరద్‌పవార్. ఆ వెంటనే ఎన్సీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దీంతో మూడు రోజుల తర్వాత పవార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కాగా.. మంగళవారం రాజీనామా అనంతరం పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో శరద్‌పవార్ రాజీనామా నిర్ణయాన్ని ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్ శరద్‌ను కోరింది. దేశమంతా శరద్ పవార్ ప్రభావం ఉందని ఆ పార్టీ సినియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తానంటే మేం ఊరుకోమని అన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు పవార్ ప్రకటించడంతో ఎన్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్యం చేశాయి. చదవండి: వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి మద్దతు తెలిపిన మోదీ -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!
నేను పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ వరుసగా రెండేళ్లపాటు చెత్త పనితీరు చూపించినట్టయితే, నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనదేనా? – ఖలీద్ మునావర్ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి వైదొలగేందుకు, ఆ పథకం తక్కువ పనితీరు చూపించడం అన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. తక్కువ పనితీరు అంటే ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ రాబడులు ఇవ్వడం. వైదొలిగే నిర్ణయానికి ముందు.. మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ పథకం విభాగంలోని ఇతర పథకాల పనితీరు కూడా విశ్లేషించాలి. వాటి పనితీరు కూడా తగ్గిందా..? లేక మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం పనితీరు మాత్రమే తగ్గిందా? చూడాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ఏవీ క్షీణించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ పడిపోయినా రాబడులు తగ్గుతాయి. అన్ని పథకాలు కొన్ని ప్రతికూల సమయాలను ఎదుర్కొంటూ ఉంటాయి. అది చూసి ఒక పథకం నుంచి మరో పథకంలోకి మారిపోవడం సరైన నిర్ణయం కాబోదు. ఈ ప్రతికూల, తక్కువ పనితీరు అనేది ఒక పథకంలో కనీసం నిరంతరాయంగా రెండేళ్లపాటు కొనసాగాలి. అప్పుడు ఆ పథకం పనితీరు గురించి మీరు ఆలోచన చేయవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు) మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం తక్కువ పనితీరు చూపించడం వెనుక కారణాన్ని గుర్తించాలి. ఫండ్ మేనేజర్లో మార్పు జరిగిందా? అందుకే పనితీరు మందగించిందా? అని చూడాలి. అదే నిజమైతే ఆ పథకం నుంచి మీ పెట్టుబడులను తీసుకుని బయటకు రావచ్చు. ఒకవేళ ఫండ్ మేనేజర్లో మార్పు లేకపోతే.. రాబడులు మందగించడానికి గల కారణాన్ని సాధారణంగా వారు మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే ఆయా ఫండ్ సంస్థ నెలవారీ న్యూస్ లెటర్లోనూ సమాచారాన్ని వెల్లడిస్తుంటారు. పథకం పెట్టుబడుల విధానం వల్ల కూడా తాత్కాలికంగా రాబడులు మెరుగ్గా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పథకం పనితీరును తప్పుబట్టడం సరైనది కాకపోవచ్చు. ఉదాహరణకు గ్రోత్ ఆధారిత విధానంతో పోలిస్తే వ్యాల్యూ ఆధారిత పెట్టుబడుల విధానం కాస్త ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది. అటువంటప్పుడు మీరు పెట్టుబడులను కొనసాగించొచ్చు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తాను ఎంపిక చేసుకున్న పథకం అన్ని కాలాల్లోనూ అద్భుత పనితీరు చూపించాలని ఆశిస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది సాధ్యం కాదు. అన్ని పథకాలు సానుకూల, ప్రతికూల సందర్భాలను ఎదుర్కొంటూ వెళుతుంటాయి. కనుక పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ చూడాలి. నా వయసు 32 సంవత్సరాలు. నేను ఐదేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టుబడులు పెట్టే కాలంలో అస్సెట్ అలోకేషన్‌ను ఎలా నిర్వహించాలి? -వినయ్ శేఖర్ చిన్న వయసు నుంచే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో అస్సెట్ అలోకేషన్ ఎంతో కీలకమైనది. మీ పెట్టుబడులను ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు (డెట్) కేటాయించడం, అలాగే, మీ పెట్టుబడుల కాల వ్యవధి, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాల ఆధారంగా కేటాయింపులు చేసుకోవడమే అస్సెట్ అలోకేషన్. ఈక్విటీలు ఇతర సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మంచి రాబడులను ఇవ్వగలవు. మీ పెట్టుబడుల కాల వ్యవధి ముగింపునకు వస్తున్నప్పుడు, పెట్టుబడులతో అవసరం ఏర్పడడానికి కొంత ముందు నుంచే క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను డెట్‌లోకి మళ్లించు కోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలు మూడేళ్ల లోపు ఉంటే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. మూడేళ్లకు మించి ఉన్నప్పుడు మొత్తం పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మూడు నుంచి ఐదేళ్ల కోసం అయితే 25-30 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. ఐదు, ఏడేళ్ల కోసం అయితే ఈక్విటీ కేటాయింపులు 50 శాతం వరకు, లేదా మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఏడేళ్లకు మించిన లక్ష్యాల కోసం ఈక్విటీలకు 70-80 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడంతోపాటు, సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ముఖ్యమైనది. దీనివల్ల అస్థిరతలను అధిగమించొచ్చు. -ధీరజ్ కుమార్, సీఈవో వాల్యూ రీసెర్చ్ -
ఇంటర్‌పోల్ నిర్ణయం: చోక్సీకి విముక్తి లభించినట్టేనా?
సాక్షి,ముంబై: పీఎన్బీలో రూ. 13,000 కోట్ల మోసానికి పాల్పడి భారతదేశంనుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు నుంచి మెహుల్ చోక్సీని ఎందుకు తొలగించారనేది చర్చనీయాంశంగా మారింది. చోక్సీ లాయర్ ఏమన్నారంటే? తన క్లయింట్ (మెహుల్ చోక్సీ) వ్యతిరేకంగా జారీ అయిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు విత్ డ్రా చేసిందని, ఇది సంతోషించ దగ్గ పరిణామమని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ ప్రకటించారు. లీగల్ టీమ్ ఇంటర్‌పోల్‌తో విచారణ జరుపుతోంది. తాజా నిర్ణయంతో ఇపుడు అతను భారతదేశం మినహా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చని, ఇది ఇండియాలో అతనిపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ వ్యాజ్యాన్ని ప్రభావితం చేయదని కూడా ప్రకటించారు. (పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం) The legal team is taking up the matter with Interpol. Interpool has removed RCN on my client (Mehul Choksi) and now he is free to travel anywhere except India. This is not going to affect his criminal litigation pending in India. This RCN was an effort that he can be caught and… https://t.co/hN9zGXOnYP pic.twitter.com/BY5m4oRQV5 — ANI (@ANI) March 21, 2023 ఇంటర్‌పోల్ నిర్ణయం ప్రభావితం చేయదు మరోవైపు మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సిఎన్) రద్దు కేసును ప్రభావితం చేయదని కేంద్రం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.ఈ కేసు ఇప్పటికే అధునాతన దశలో ఉందని చోక్సీ అరెస్టు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది. అసలు ఏం జరిగింది? సంచలన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడిగా విదేశాలకు చెక్కేసిన మెహుల్చోక్సీని ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుంచి ఉపసంహరించుకుందనేది ఇపుడు హాట్ టాపిక్. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని వాదించి చోక్సీ, సీబీఐ చార్జ్‌షీటు, రెడ్ కార్నర్ నోటీసులపై సీబీఐ అభ్యర్థనను సవాల్ చేస్తూ లియోన్ హెడ్‌క్వార్టర్స్ ఏజెన్సీకి అప్పీల్ చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఇంటర్‌పోల్ ఐదుగురు సభ్యుల కమిటీ ఈ కేసును పరిశీలించింది. ముఖ్యంగా డొమినికాలో చోక్సీని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన తర్వాత భారతదేశంలో న్యాయమైన విచారణ జరగక పోవచ్చని కమిటీ తెలిపింది. ఈ కేసు రాజకీయ కుట్ర ఫలితమని పేర్కొంది. హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఇంటర్‌పోల్ ఇలా ప్రకటించింది. చోక్సీని ఆంటిగ్వా నుండి డొమినికాకు కిడ్నాప్ చేయడంలో అంతిమ ఉద్దేశ్యం ఇండియాకు రప్పించడమేనని వ్యాఖ్యానించింది. అలాగే చోక్సిని ఇండియాకు తరలిస్తే.. ఈ కేసులో న్యాయమైన విచారణ లేదా అనారోగ్యంతో ఉన్న చోక్సి సరియైన చికిత్స పొందే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొంది. -
EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు..
భారతదేశంలో చట్టబద్దమైన 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO) సంస్థ ఉద్యోగుల భవిష్య నిధిని నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇది ఉద్యోగి పదవి విరమణ పొందిన తరువాత ఎంతగానో ఉపయోగపడే ఒక రకమైన పొదుపు. అయితే కొన్ని సందర్భాల్లో కొంత ప్రావిడెంట్ ఫండ్ తీసుకునే వెసులుబాటు ఉంది. ఉద్యోగి పదవి విరమణ పొందకముందే ఎలాంటి సందర్భాల్లో ఫండ్ తీసుకోవచ్చు, ఎంత శాతం తీసుకోవచ్చనే మరిన్ని వివరాలు మీ కోసం.. నిరుద్యోగం విషయంలో.. పిఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఏదైనా సందర్భంలో తన ఉద్యోగం కోల్పోతే, లేదా ఉద్యోగం లభించకుండా ఎక్కువ కాలం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పటికే పొదుపు చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ నుంచి 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళా నిరుద్యోగ సమయం రెండు నెలలకంటే ఎక్కువ ఉంటె మిగిలిన 25 శాతం కూడా తీసుకోవచ్చు. ఉన్నత చదువుల కోసం.. పిఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఉన్నత చదువులు చదవటానికి, లేదా 10వ తరువాత పిల్లల విద్యా ఖర్చులను భరించడానికి 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. వివాహం కోసం.. ఈ ఆధునిక కాలంలో పెళ్లి ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి, కావున ఉద్యోగులు తమ పెళ్లి ఖర్చుల కోసం కూడా తమ పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును 50 శాతం తీసుకోవచ్చు. దీని కోసం ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. వికలాంగుల కోసం.. పిఎఫ్ ఖాతా కలిగిన వికలాంగులు 6 నెలల విలువైన బేసిక్ పే & డియర్నెస్ అలవెన్స్ లేదా వడ్డీతో కూడిన ఉద్యోగుల వాటాను 2023 నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రత్యేకంగా వారి ఆర్ధిక ఇబ్బందులను తగ్గించడానికి ఉద్దేశించబడింది. (ఇదీ చదవండి: తక్కువ రేటుకే భారత్‌కు చమురు సరఫరా.. రష్యా కీలక నిర్ణయం) వైద్య అవసరాల కోసం.. పిఎఫ్ అకౌంట్ కలిగిన ఉద్యోగి అనుకోని పరిస్థితుల్లో రోగాల భారిన పాడినప్పుడు వైద్యం చేయించుకోవడానికి డబ్బుని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది సొంత వైద్య ఖర్చుల కోసం లేదా కుటుంబ సభ్యుల చికిత్స కోసం ఉపయోగించుకోవచ్చు. ఆరు నెలల బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ లేదా ఉద్యోగి వాటాతో పాటు వడ్డీని తీసుకోవచ్చు. ఇల్లు లేదా భూమిని కొనుగోలు కోసం.. ఖాతాదారుడు భూమిని కొనుగోలు చేయడానికి లేదా నివాస గృహాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కూడా పిఎఫ్ బ్యాలెన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే దీనిని విత్‌డ్రా చేసుకోవడం సాధ్యమవుతుంది. (ఇదీ చదవండి: భారత్‌లో 2023 టయోట ఇన్నోవా క్రిస్టా లాంచ్ - ధర ఎంతో తెలుసా?) ఇంటి మరమ్మత్తుల (Home Renovation) కోసం.. వివాహం, వైద్య ఖర్చులు మొదలైన వాటికి మాత్రమే కాకుండా కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ప్రకారం.. హోమ్ రెనోవేషన్ కోసం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో 12 నెలల బేసిక్ పే & డియర్నెస్ అలవెన్స్‌తో పాటు ఉద్యోగి వాటాలో తక్కువ మొత్తం తీసుకోవచ్చు. -
పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఉపఎన్నిక నుంచి బీజేపీ ఔట్!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. వచ్చే నెలలో జరగనున్న అంధేరీ(తూర్పు) నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాక్రే, షిండే నేతృత్వంలోని బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే.. కీలక ఉప ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు.. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావటం గమనార్హం. పోటీ నుంచి తప్పుకోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనా(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే కోరిన మరుసటి రోజునే ఈ మేరకు ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కులే. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం బీజేపీని తప్పుకోవాలని సూచించారు. అలాగే.. ఉద్ధవ్ థాక్రే వర్గం అభ్యర్థికి మద్దతు తెలపాలని ఎన్ఎన్ఎస్ చీఫ్ కోరారు. నాగ్‌పూర్‌లో చంద్రశేఖర్ బవన్కులే అంధేరీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణించినప్పుడు ఆ స్థానంలో వారి బంధువులపై ఎవరూ పోటీ చేయకూడదనే రాష్ట్ర సంప్రదాయం ప్రకారం తమ అభ్యర్థి ముర్జి పటేల్ తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఉద్ధవ్ థాక్రే వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు మార్గం సుగమమైంది. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించటంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరీ తూర్పు నియోజకవర్గంలో ఆయన భార్య రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Shiv Sena Symbol: గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు -
బ్యాంకుకు బొమ్మ తుపాకీతో వెళ్లి.. 10 లక్షలు తీసుకెళ్లిన మహిళ
ఓ మహిళ గుంపుతో కలిసి బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ చేసింది. మేనేజర్‌కు ఆ తుపాకీ ఎక్కుపెట్టి 13,000 డాలర్లు(రూ.10లక్షలు) విత్‌డ్రా చేసింది. ఆ డబ్బునంతా పాస్టిక్ బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి క్షణాల్లో వెళ్లిపోయింది. లెబనాన్ రాజధని బెయరూత్లో ఈ ఘటన బుధవారం జరిగింది. సదరు మహిళ చేసిన పనిని ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటనకు పాల్పడిన మహిళ పేరు సలీ హఫేజ్. ఆమె తీసుకెళ్లిన డబ్బంతా తన సొంత సేవింగ్స్ ఖాతాలోదే కావడం గమనార్హం. తన ఖాతా నుంచి ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో పక్కా ప్లాన్‌తో ఆమె ఈ పని చేసింది. కొంతమంది ఆందోళనకారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆర్థిక ఆంక్షలు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్‌లో 2019 నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రజలు నెలకు 200 డాలర్లకు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదు. దీంతో సేవింగ్స్ ఖాతాల్లో డబ్బు ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేక లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద కారణం.. అయితే సలీ హఫేజ్ బొమ్మ తుపాకీతో బెదిరించి మరీ డబ్బు తీసుకెళ్లడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆమె 23ఏళ్ల సోదరి చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. చికిత్సకు ప్రతినెలా చాలా డబ్బు అవసరం అవుతోంది. సేవింగ్స్ ఖాతాలో 20వేల డాలర్లు ఉన్నా వాటిని విత్ డ్రా చేసుకోలేక హఫేజ్ అవస్థలు పడింది. తన చెల్లికి క్యాన్సర్ అని చెప్పినా బ్యాంకు అధికారులు అసలు పట్టించుకోలేదు. ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించలేదు. దీంతో కొంతమంది నిరసనకారులతో కలిసి హఫేజ్ బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకుంది. ఇంటర్వ్యూలో వివరణ తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో స్థానిక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీ హఫేజ్ వివరించింది. తన చెల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బు కావాలని, విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని బ్యాంకు అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యమైతే తన చెల్లి ప్రాణాలకే ప్రమాదమని చెప్పినా వినలేదని వాపోయింది. ఇక తాను కోల్పోవడానికి ఏమీ లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఇలా చేసినట్లు వివరించింది. ప్రత్యక్ష సాక్షి భయం.. అయితే ఈ ఘటనను చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి మాత్రం భయాందోళన వ్యక్తం చేసింది. మొదట ఓ గుంపు బ్యాంకు లోపలికి వచ్చి నేలపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరించిందని, ఓ మహిళ బ్యాంకు మేనేజర్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి నగదు ఇవ్వకపోతే కాల్చిపడేస్తానని బెదిరించిందని చెప్పింది. అయితే తాను ఎవరికీ హాని చేయాలనుకోలేదని హఫేజ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. తన హక్కుల కోసమే గత్యంతరం లేక ఇలా చేసినట్లు స్పష్టం చేసింది. హఫేజ్కు లెబనాన్ ప్రజలంతా మద్దతుగా నిలిచారు. ఆమెను హీరోగా అభివర్ణించారు. ఆమె చేసినదాంట్లో తప్పేంలేదన్నారు. మరోవైపు డబ్బు అవసరమైనవాళ్లు తనలాగే చేయాలని హఫేజ్ పిలుపునిచ్చింది. చదవండి: నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్ -
భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యాలు తొలగించాయి. దీంతో 2020 మే తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గోగ్రా హాట్‌స్ప్రింగ్స్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 12న పూర్తవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతవారమే చెప్పింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం వెల్లడించారు. శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన తూర్పు లద్దాక్‌లో పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2020 మే 5న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినప్పటినుంచి తూర్పు లద్దాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సరిహద్దులోని ఇతర ప్రాంతాలకు ఈ వివాదం విస్తరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఎట్టకేలకు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు. చదవండి: అందరూ దొంగలే.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. -
కొత్త సిరీస్ లాంచ్ తరువాత పాత సిరీస్‌కు ఆపిల్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందిట. సెప్టెంబరు 7న నిర్వహించనున్న గ్లోబల్ ఈవెంట్ ఆపిల్ కొత్త మోడల్ సిరీస్ వాచెస్ లాంచ్ కాగానే పాత సిరీస్‌ను నిలిపివేయనుందని తెలుస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్‌లు త్వరలో నిలిపియనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా మార్కెట్లో వీటి విక్రయాలను నిలిపివేయనుందట.రాబోయే watchOS 9 Apple Watch Series 3కి సపోర్ట్ చేయని కారణంగా ఆన్లైన్ స్టోర్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతున్న ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్స్‌ను త్వరలో ఆపివేస్తుందని తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే అమెరికా,వాచ్ సిరీస్ 3 కాన్ఫిగరేషన్లలో మూడు ప్రస్తుతం యూకే ఆస్ట్రేలియాలో స్టాక్‌లో లేవనీ, అమెరికా స్టోర్‌లో సిరీస్ 3 మోడల్ అందుబాటులో లేవని MacRumors రిపోర్ట్ చేసింది. 2017లో ఆపిల్ వాచ్ సిరీస్ 3ను లాంచ్ చేసింది. కాగా కరోనా మహమ్మారి రెండేళ్ల తరువాత యుఎస్‌లోని ఆపిల్ కుపెర్టినో క్యాంపస్‌లో మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో నాలుగు ఐఫోన్ 14 మోడల్స్‌తోపాటు, వాచెస్, ఇతర ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తోందని అంచనా. ముఖ్యంగా వాచెస్ సిరీస్ 8, వాచ్ ప్రో, హై-ఎండ్ సిరీస్ 8 మోడల్, సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ ఎస్ఈని లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. -
భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్..
భారత్, పాక్‌ల మధ్య సత్సబంధాల్లేవ్. గరువారం భారత్‌లోని చెన్నై వేదికగా 44వ చెస్ ఒలింపియాడ్ ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ టోర్నీ కావడంతో ‘ఫిడే’ పాకిస్తాన్‌కు ఆహ్వానం పంపింది. కానీ పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తూ మరోసారి భారత్‌పై విషం చిమ్మింది. ఈ నెల జూలై 21 జమ్మూ కశ్మీర్లో ఒలింపియాడ్‌కు సంబంధించిన ‘టార్చ్ రిలే’ మొదలైంది. అయితే దీనిపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఆఖరి నిమిషంలో టోర్నీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి అరిందమ్ బాగ్చి అసహనం వ్యక్తం చేశారు. ‘జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. పక్కదేశానికి అభ్యంతరమేంటి? అయినా ప్రతిష్టాత్మక క్రీడల్లో ఆడేందుకువచ్చి రాజకీయ రగడ చేయడం విచారకరం’ అని అన్నారు. ఇక ప్రధాని చేతుల మీదుగా 44వ చెస్ ఒలంపియాడ్ ప్రపంచ స్థాయి పోటీల ప్రారంభోత్సవ వేడుకలు గురువారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ర్యాలీగా సాగారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్ వాళ్తు గీతాలను ఆలపించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. చెస్ ఒలంపియాడ్ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వేదికపైకి తీసుకురాగా ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ అందుకున్నారు. తమిళనాడు క్రీడలశాఖ మంత్రి శివ వీ మెయ్యనాథన్ స్వాగతనోపన్యాసం చేయగా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మరో మంత్రి ఎల్. మురుగన్ ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర మంత్రులు, సూపర్‌స్టార్ రజినీకాంత్ తదితర ప్రముఖులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చదవండి: చెస్ ఒలంపియాడ్‌ను ప్రారంభించిన మోదీ.. తమిళ తంబిలా పంచకట్టులో..! Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా? -
SBI: దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు
ఉమెన్ కమిషన్ నోటీసుల దెబ్బకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది. ప్రెగ్నెంట్ ఉమెన్ క్యాండిడేట్స్‌ల విషయంలో.. మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఇండియా సర్క్యులర్ జారీ చేయడం, ఆపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. పైగా బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్ 31న రిలీజ్ చేసిన ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ విషయమై లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. SBI మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులు. దానిని మారుస్తూ బ్యాంక్ సర్క్యులర్ తేవడడమే తాజా విమర్శలకు కారణమైంది. ఇక సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ.. బ్యాంక్ చైర్మన్ ఉమెన్ కమిషన్ ముందు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. -
'మా'ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే...
CVL Narasimha Rao Withdraw His Nomination: మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ ఎదురైంది. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు సీవీఎల్ నరసింహారావు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీని వెనుక కారణం ఉందని, రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి ఆ వివరాలను వెల్లడిస్తానని సీవీఎల్పేర్కొన్నారు. తనకు అధ్యక్ష పదవి కంటే మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తను ప్రకటించిన మేనిఫెస్టో అమలు అయ్యేందుకు చూస్తానని తెలిపారు. ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికీ మద్ధతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కాగా నిన్న బండ్లగణేశ్ సైతం 'మా' జనరల్ సెక్రెటరీ పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. చదవండి : మా ఎన్నికలు: మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు -
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
సీనియర్ సిటిజన్లకు శుభవార్త. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఎస్ఈఎస్ఎస్) ను విత్ డ్రా చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ ఇకపై పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనౌన్స్ చేసింది. సాధారణంగా పీపీఎఫ్, ఎస్ఈఎస్ఎస్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు నిర్వహించని అకౌంట్లు, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో అకౌంట్లను క్లోజ్ చేయాలంటే పోస్టాఫీసులకు రావాల్సి వచ్చేది. దీంతో 60ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు వయస్సు రిత్యా పోస్టాఫీస్‌లకు రావాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ఇండియన్ పోస్ట్ సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చింది. ఈ రెండు స్కీమ్ లలో నుంచి మనీ విత్ డ్రా, అకౌంట్లను క్లోజ్ చేయడం చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని, వారి బదులు కుటుంబ సభ్యులు ఉంటే సరిపోతుందని వెల్లడించింది. అకౌంట్లను క్లోజ్ చేయడంతో పాటు మనీ విత్ డ్రాల్ వారి కుటుంబ సభ్యులు చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబసభ్యులు విత్ డ్రా చేసిన నగదును చెక్కుద్వారా, అకౌంట్ హోల్డర్ భద్రత కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా, బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నట్లు తెలిపింది. పోస్టాఫీస్‌కు వెళ్లకుండా నగదుని ఎలా డ్రా చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ నుండి PPF లేదా SCSS నిధుల్ని సేకరించేలా కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చేందుకు ఈ రూల్స్ పాటించాల్సి ఉంది. ►వయస్సు రిత్యా తాము పోస్టాఫీస్‌కు వెళ్లలేకపోతున్నామని, తనకు బదులు మనీ విత్ డ్రాల్ చేసే హక్కు భార్య లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు హక్కు ఉందని నిర్ధారిస్తూ పోస్ట్ ఆఫీస్‌లో ఫారమ్ SB-12 పై సీనియర్ సిటిజన్ సంతకం చేయాల్సి ఉంటుంది. ►వీటితో పాటు అకౌంట్ హోల్డర్ అకౌంట్‌ను క్లోజ్ చేసేందుకు, పాక్షిక నగదు ఉపసంహరణ(partial withdrawal).SB-7ఫారమ్ పై,SB-7B form పై సంతకం చేయాల్సి ఉంటుంది. ►సీనియర్ సిటిజన్ ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు సీనియర్ సిటిజన్ కుటుంబ సభ్యుడి వివరాలను తెలుపుతూ అటాచ్ చేయాల్సి ఉంది. ►నిధులను ఉపసంహరించుకోవడానికి వ్యక్తి పాస్ బుక్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ►లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ముందు అకౌంట్ హోల్డర్ సంతకాల్ని పోస్టాఫీసులో సంబంధిత అధికారులు చెక్ చేస్తారు. అనంతరం నగదు విత్ డ్రా చేసేందుకు అనుమతిస్తారు. -
అమెరికాకు డెడ్‌లైన్ విధించిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అమెరికాకు తాజా హెచ్చరికలు జారీ చేశారు. అగస్టు 31లోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ డెడ్‌లైన్ విధించారు. ఈ మేరకు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 లోపు కాబూల్ విమానాశ్రయం నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్లు అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైనిక బలగాల ఉపసంహరణ గడువును మరింత పెంచే యోచనలో ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు. మిత్రదేశాలకూ వార్నింగ్ అలాగే అమెరికాతోపాటు మిత్ర దేశాలకు కూడా ఇదే తరహా హెచ్చరిక జారీ చేశారు. వారంలోగా అన్ని దేశాల సైనికులు అఫ్గాన్ విడిచి వెళ్లాలని స్పష్టం చేశారుర. లేదంటే వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అన్ని దేశాల సైనికులు వెళ్లాకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు దేశం విడిచివెళ్లేందుకు వేలాదిగా ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నారు. ఈ సందర్బంగా తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు తలెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరూ దేశం విడిచి వెళ్లవద్దని తాలిబన్లు ప్రజలకు విజప్తి చేస్తున్నారు. చదవండి : Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది! Afghanistan: ఆమె భయపడినంతా అయింది! అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ రాజ్యం.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు: నటి -
చదువుకుంటారని ఫోన్ ఇస్తే.. పిల్లలు చేసిన పనికి తల్లి షాక్!
తిరువనంతపురం: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన పిల్లలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఆటల మోజులో పడి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు శారీరక, మానసిక వ్యాధులతో ఆస్పత్రులపాలైతే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు తల్లిదండ్రుల కళ్లుగప్పి డబ్బులను లూటీ చేస్తున్నారు. ఆటల మోజులో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలు మూతపడి కేవలం ఆన్లైన్ విద్యా బోధన జరుగుతుండటంతో ఈ వైపరీత్యం మరింత ఎక్కువైంది. తాజాగా కేరళలోని ఓ ఘటన ఆన్లైన్ గేమ్స్ వల్ల తలెత్తే అనర్థాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. కోజికోడ్‌లోని ఇద్దరు పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినేందుకు ప్రతీరోజూ తన తల్లి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకునేవారు. అయితే ఆన్లైన్ క్లాసులు సాకుతో పబ్జీకి గేమ్ అడిక్ట్ అయ్యారు. ఎంతలా అంటే.. తమ తల్లికి తెలియకుండా బ్యాంకు ఖాతా నుంచి పబ్జీ మొబైల్ అకౌంట్ అప్‌గ్రేడ్, ఇన్-యాప్ కొనుగోళ్ల కోసం ఏకంగా రూ.లక్ష ఖర్చు చేశారు. అయితే ఈ విషయం తెలియని తల్లి తన ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయని.. కోజికోడ్ సైబర్ క్రైమ్ పోలీసులును ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఇంటిదొంగల పని బయటపడింది. ఆమె పిల్లలే ఆ డబ్బులు విత్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. పబ్జి కోసం వారు ఈ డబ్బును పే చేసినట్లు కనుగొన్నారు. అసలు విషయం తెలిసి ఆ మహిళ ఖంగుతిన్నది. -
టోక్యో ఒలింపిక్స్‌కు రోజర్ ఫెడరర్ దూరం
బాసెల్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత రోజర్ ఫెడరర్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 39 ఏళ్ల ఫెడరర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం... 2012 లండన్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో రజతం సాధించాడు. -
French Open: వైదొలిగిన ఫెడరర్
వింబుల్డన్ టోర్నమెంట్‌కు ముందు పూర్తి ఫిట్నెస్తో ఉండాలనే ఉద్దేశంతో... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 3 గంటల 35 నిమిషాల్లో 7–6 (7/5), 6–7 (3/7), 7–6 (7/4), 7–5తో ప్రపంచ 59వ ర్యాంకర్ డొమినిక్ కోప్ఫెర్ (జర్మనీ)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.‘నా సహాయక సిబ్బందితో చర్చించాక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. గతేడాది మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. పూర్తి ఫిట్నెస్ సంతరించుకునే క్రమం లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచి ఫిట్నెస్ పరంగా నేను సరైన దారిలో వెళ్తున్నట్లునిపిస్తోంది’ అని 39 ఏళ్ల ఫెడరర్ అన్నాడు. గ్రాస్‌కోర్టు సీజన్లో భాగంగా ఈనెల 14న మొదలయ్యే హాలే ఓపెన్‌లో ఫెడరర్ ఆడతాడు. అనంతరం ఈనెల 28న ప్రారంభమయ్యే వింబుల్డన్ టోర్నీలో తొమ్మిదో టైటిలే లక్ష్యంగా ఫెడరర్ బరిలోకి దిగుతాడు. -
Banjara Hills: కస్టమర్‌కు తెలియకుండా రూ. 11.65 లక్షలు మాయం
సాక్షి, బంజారాహిల్స్: తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 11.65 లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు విత్‌డ్రా చేశారని ఖాతాదారు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని ఇండస్ఇండ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పినిసెప్తి గణపతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకంటే ముందు 2017లో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేసిన విక్రమ్ జయరాజ్ కొలగాని ఈ మోసానికి పాల్పడ్డట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతర్గత విచారణ చేపట్టగా గతంలో పని చేసిన బ్యాంక్‌మేనేజర్ దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా తేలిందన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విక్రమ్ జయరాజ్ కొలగానిపై గురువారం క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలా.. లక్షల్లో మోసపోయారు సాక్షి, సిటీబ్యూరో/బాలానగర్: ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.సైబర్ నేరగాళ్లు సిటీవాసులను టార్గెట్ చేసుకొని రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. తీరామోసపోయిన తరువాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్లో క్యాప్చ ఎంట్రీ ఉద్యోగం పేరుతో వడోదరకు చెందిన వ్యక్తి నిషిద్ధ మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) దందా నిర్వహించి 18 మందినుంచి 22 రూ.లక్షలు స్వాహా చేశాడు. దీంతో బాధితులు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వడోదర ప్రాంతానికి చెందిన విపుల్ సిమ్హ్ చాట్వా డైమండ్ అసోసియేట్స్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో క్యాప్చాలు ఎంట్రీ చేసే జాబ్స్ ఇస్తానంటూ ఆన్లైన్లో పరిచయం చేసుకున్నాడు. రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే రోజూ రూ. 3 వేల క్యాప్చాలు పంపుతానన్నాడు. సూచించిన సైట్లో పొందుపరిస్తే ఒక్కో దానికి రూ.1 చొప్పున చెల్లిస్తానని చెప్పాడు.కొద్దిరోజుల పాటు డబ్బులిచ్చి నమ్మించాడు.ఆ తరువాత ఎక్కువ డబ్బు ఆశచూపి ఎరవేసేవాడు. రూ.లక్ష చెల్లించిన వ్యక్తి తనకు రావాల్సిన డబ్బు పొందాలంటే మరికొంత మందిని చేర్పించాల్సి ఉంటుంది. ఇలా పరోక్షంగా నిషిద్ధ మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం నిర్వహించాడు. ఇలామోసపోయిన 17 మందిలో 16 మంది ఆ ఒక్కడి ద్వారా ఇందులో చేరిన వారే. మోసపోయామని గుర్తించిన బాధితులు గురువారం సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆశకు వెళ్లి రూ.12 లక్షలు పోగొట్టుకుంది తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశకు పోయిన ఓ మహిళ ఏకంగా రూ.12.91 లక్షలు మోసపోయింది.బాలనగర్ సీఐ వాహిద్ తెలిపిన మేరకు.. రాజు కాలనీకి చెందిన సౌభాగ్య లక్ష్మి బ్యూటీషియన్‌గా పనిచేస్తుంది. ఈనెల 26న ఆమెకు తెలిసిన మహిళ ద్వారా లైటింగ్ పవర్ బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పింది. దాంతో లక్ష్మి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మొదట కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. తరువాత డబ్బు వచ్చాయి. అనంతరం యాప్ నిర్వాహకులు ఫోన్‌చేసి ఎక్కువ డబ్బు వస్తుందని ఆశచూపాడు. నమ్మిన ఆమె పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఆతరువాత మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: లైంగికదాడి వీడియో: దొరికిన కామ పిశాచాలు శభాష్ డాక్టర్.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ప్రశంస -
ఎల్జీ సంచలన నిర్ణయం : యూజర్లకు షాక్
సాక్షి,న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ సంచలనం నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ వ్యాపారానికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్టు సోమవారం ధృవీకరించింది. భారీ నష్టాలకారణంగా స్మార్ట్‌ఫోన్ డివిజన్ ఉత్పత్తి అమ్మకాలను ముగించనున్నట్లు తెలిపింది. దాదాపు అరేళ్లుగా తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్జీ తన ఫోన్ వ్యాపారాన్ని జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్సీ సహా రెండు బడా కంపెనీలకు విక్రయించాలన్న ప్లాన్లు విఫలం కావడంతో ఈ దిశగా కంపెనీ అడుగులు వేసింది. తద్వారా మార్కెట్ నుండి పూర్తిగా వైదొలిగిన మొట్టమొదటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎల్జీ నిలిచింది. ఎల్జీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో సహా అనేక సెల్ ఫోన్ ఆవిష్కరణలతో మార్కెట్లోకి దూసుకొచ్చింది. 2013లో ఆపిల్, శాంసంగ్ తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. కానీ ఆ తరువాత తీవ్రపోటీకి తోడు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ప్రమాదాల వివాదంలో పడింది. మరోవైపు చైనా ప్రత్యర్థులతో పోల్చితే కంపెనీకి మార్కెటింగ్ నైపుణ్యం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. (ఈ స్మార్ట్‌ఫోన్ అభిమానులకు షాకింగ్ న్యూస్) కాగా గత ఆరేళ్లలో ఎల్జీ దాదాపు 4.5 బిలియన్ డాలర్లు (రూ.32,856 కోట్లు) మేర నష్టాలను చవిచూసింది. ఈ కారణంగానే మొబైల్ బిజినెస్నుంచి వైదొలగాలని కంపెనీ నిర్ణయించుకుంది. నష్టాల నుంచి గట్టేందుకు అన్నిరకాల అవకాశాలను పరిశీలిస్తున్నామంటూఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవో ప్రకటించినప్పటికీ, మొబైల్ బిజినెస్‌కు గుడ్‌బై చెప్ప నుందంటూ ఇటీవల పలు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. -
విత్ డ్రా చేస్కో లేదంటే చంపేస్తాం: ట్రాన్స్‌జెండర్‌కు వేధింపులు
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉందని ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిపై కొందరు దుండగులు బరి తెగించారు. ఆమెను వేధింపులకు గురి చేసి చివరకు ఎన్నికల పోటీ నుంచి విరమించుకునేటట్టు చేశారు. దీంతో ఎన్నికల నుంచి ఆమె విరమించుకుంది. ఆమె నామినేషన్ ఉపసంహరించకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఈ పరిణామం కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగింది. ఆమెను వేధింపులకు గురి చేసింది సొంత పార్టీ నాయకులు కావడం గమనార్హం. తొలిసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా అనన్య కుమారి అలెక్స్ పోటీలో నిలిచింది. దీంతో ఆమె ప్రత్యేక ఆకర్షణగా మారారు. మలప్పురం జిల్లాలోని వెంగర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. డెమోక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ (డీఎస్‌జేపీ) తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని తీవ్రమైన హెచ్చరికలు వచ్చాయి. దీంతో చివరకు ఆ వేధింపులు భరించలేక ఆమె నామినేషన్ ఉపసంహరించుకుని పోటీ నుంచి విరమించుకుంది. అయితే ఆ వేధింపులకు పాల్పడిన వారు ఎవరో కాదు సొంత పార్టీ నాయకులే. డీఎస్‌జేపీ నాయకులు యూడీఎఫ్ అభ్యర్థికి పీకే కున్హాల్ కుట్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనన్య కుమారి అలెక్స్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని వేధింపులకు పాల్పడ్డారు. వేధించడంతో పాటు అవమానించారని అనన్య బాధపడింది. అనన్య కుమారి మొదటి రేడియో జాకీగా గుర్తింపు పొందారు. న్యూస్ యాంకర్‌గా, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పేరు పొందారు. -
దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారిక నియామకంపై రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. దీనిపై తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హారిక ఎవరో తెలియదు అని చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు హారిక ప్రకటించింది. యూట్యూబ్ స్టార్‌గా ఉన్న హారిక బిగ్‌బాస్ సీజన్ 4లో టాప్ -5లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్‌గా మహిళా దినోత్సవం రోజు ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం ఏర్పడింది. అయితే తాజాగా హారిక ఆ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. ‘‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. లవ్యూ ఆల్’’ అంటూ హారిక చెప్పుకొచ్చింది. హారిక బ్రాండ్అంబాసిడర్ అంశం తెలంగాణతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మూడు రోజులుగా ఆమె చుట్టూనే వార్తలు నడిచిన విషయం తెలిసిందే. అయితే హారిక నియామకం వెనకాల ఏం జరిగిందో అనే విషయం సస్పెన్స్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. Here is the update .As you all know, Was appointed for Promoting and Marketing the Tourism dept hotels and properties earlier,but then will not be continuing it further due to several other reasons .And thanks to all my well-wishers,and sorry for all the disappointment,love u all pic.twitter.com/SzLAaIPxwR — Alekhya Harika (@harika_alekhya) March 10, 2021 -
రైతు ఉద్యమంలో చీలికలు
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సుమారు గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమంలో చీలికలు ప్రారంభమయ్యాయి. రైతు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఘటనలకు నిరసనగా రైతు ఆందోళనల నుంచి విరమించుకుంటున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(భాను), రాష్ట్రీయ కిసాన్ ఆందోళన్ సంఘటన్ బుధవారం ప్రకటించాయి. మరోవైపు, బడ్జెట్‌ను ప్రకటించే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు తలపెట్టిన పాదయాత్రను రద్దు చేస్తున్నట్లు 41 రైతు సంఘాల వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)’ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం రోజు రైతులు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి సుమారు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేధాపాట్కర్, యోగేంద్ర యాదవ్‌లతో పాటు మొత్తం 37 మంది రైతు నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. మంగళవారంనాటి ఢిల్లీ నిరసనల్లో 394 మంది పోలీసులు గాయపడ్డారు. రైతు నేతలపై సమయపూర్ బద్లి పోలీసు స్టేషన్లో ఐపీసీ 147(అల్లర్లు, విధ్వంసం), 148(అల్లర్లు, విధ్వంసం), 307(హత్యాయత్నం), 120బీ(నేరపూరిత కుట్ర) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం హింసాత్మక ఘటనలు జరిగిన ఎర్రకోటను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ సందర్శించారు. విద్రోహ శక్తుల కుట్ర రైతు ఉద్యమంలో లేని కొందరు సంఘ విద్రోహ శక్తులే ఢిల్లీలో మంగళవారం జరిగిన అల్లర్లకు, ఎర్రకోట ఘటనకు కారణమని రైతు నేతలు ఆరోపించారు. నటుడు దీప్ సిద్ధు వంటి విద్రోహ శక్తులు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని నాశనం చేసే ఉద్దేశంతో ఈ కుట్ర చేశాయన్నారు. ప్రభుత్వం, ఇతర రైతు ఉద్యమ వ్యతిరేక శక్తులు చేస్తున్న ఈ ప్రయత్నాలను సాగనివ్వబోమని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ‘శాంతియుతంగా సాగుతున్న మా ఉద్యమాన్ని ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. అందుకే కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, ఇతర విద్రోహ శక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసింది. మా ఉద్యమం ప్రారంభమైన 15 రోజులకు ఈ సంస్థలు వేరేగా నిరసన వేదికను ఏర్పాటు చేసుకున్నాయి. మా ఐక్య ఉద్యమంతో వారికి సంబంధం లేదు’అని సంయుక్త కిసాన్ మోర్చా బుధవారం ఒక ప్రకటనలో వివరించింది. జనవరి 30న దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు, బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించింది. ‘దీప్ సిద్ధూ ఆరెస్సెస్ మనిషి. ఎర్రకోటలో మత జెండాను ఎగరేసిన తరువాత అక్కడినుంచి వెళ్లిపోయేందుకు ఆయనను పోలీసులు అనుమతించారు’అని రైతు నేత దర్శన్ పాల్ ఆరోపించారు. ‘ 99.9% రైతులు అనుమతించిన మార్గంలోనే శాంతియుతంగా పరేడ్‌లో పాల్గొన్నారు’అని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఘటనలపై తీవ్రంగా ఆవేదన చెందుతున్నామని, అందువల్ల రైతు ఉద్యమం నుంచి వైదొలగుతున్నామని చిల్లా బోర్డర్ వద్ద నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్ యూనియన్(భాను) అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ ప్రకటించారు. ఇకపై రైతు ఉద్యమంలో తాము భాగం కాదని ఘాజీపూర్ సరిహద్దులో రైతు ఉద్యమంలో పాల్గొన్న రాష్ట్రీయ కిసాన్ ఆందోళన్ సంఘటన్ నేత వీఎం సింగ్ స్పష్టం చేశారు. ► ట్రాక్టర్ పరేడ్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో దేశ రాజధానిలో శాంతి, భద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సమీక్షించారు. హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా, ఢిల్లీ పోలీస్ విభాగం ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ► రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో, మరో ఇద్దరు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా త్రి సభ్య విచారణ కమిషన్‌ను వేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధానిలో జరిగిన హింసకు, జాతీయ పతాకానికి జరిగిన అవమానానికి కారణమైన వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కూడా న్యాయవాది విశాల్ తివారీ ఆ పిటిషన్లో కోరారు. ► ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత అభయ్‌సింగ్ చౌతాలా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హరియాణా అసెంబ్లీలో ఐఎన్ఎల్డీకి ఉన్న ఏకైక సభ్యుడు చౌతాలానే. కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను సమర్ధిస్తూ హరియాణా అసెంబ్లీలో అధికార బీజేపీ తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుచరులతో కలిసి అసెంబ్లీకి ట్రాక్టర్‌పై వెళ్లి ఆయన రాజీనామా సమర్పించారు. ► ఢిల్లీ ఆందోళనల నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో చర్చలు ముగిశాయని ఎన్నడూ ప్రభుత్వం చెప్పలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. తదుపరి విడత చర్చలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని, ఆ నిర్ణయం తీసుకోగానే తెలియజేస్తామని బుధవారం మీడియాకు వెల్లడించారు. చిల్లా సరహద్దులో టెంట్లను తొలగిస్తున్న రైతులు -
రైతు ఆందోళనలో చీలిక కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల సుదీర్ఘ పోరాటంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆందోళన నుంచి తక్షణమే తాము తప్పుకుంటున్నామని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్‌సీసీ) వీఎం సింగ్ బుధవారం ప్రకటించడం కలకలం రేపుతోంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం మరోలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ ఆందోళనను ఇకపై తాము కొనసాగించలేమని పేర్కొన్నారు. రిపబ్లిక్ డే రోజున జరిగిన హింస, ఘర్షణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. (హింసను ఖండించిన రైతు సంఘాలు) ఎర్రకోట మీద జెండా ఎగరేసి సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. జాతీయ జెండా కోసం మన తాతలు తండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఎర్రకోటపై ఎగిరే జాతీయజెండా మన తాతల తండ్రుల త్యాగఫలం..ఆ ప్రదేశంలో నిషాద్ సాహెబ్ జెండా ఎగురవేసి దేశ గౌరవాన్ని మంట కలిపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన సమయం కంటే ముందుగానే ఎందుకు బయలుదేరడంతోపాటు, అనుమతించిన మార్గాన్ని ఎందుకు ఉల్లంఘించారని మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాము ఈ ఆందోళననుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీనిపై రాకేష్ తికాయత్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే రైతుల హక్కులు, కనీస మద్దతు ధర, గిట్టు బాటు ధర కోసం తమ ఉద్యమం కొనసాగుతుంది. కానీ ఈ ఫార్మాట్లో కాదని స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతు ట్రాక్టర్ మార్చ్ సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి తనకు, తన సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు. (ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా) కాగా 72వ గణతంత్ర దినోత్సవంగా సందర్భంగా రైతు ఉద్యమకారులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ర్యాలీగా వచ్చిన కొంతమంది ఎర్రకోటవైపు దూసుకురావడం, అక్కడ జెండా ఎగురవేయడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు 200మంది ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ముఖ్యంగా స్వరాజ్ అభియాన్‌నేత యోగేంద్ర యాదవ్‌తో పాటు దర్శన్ పాల్, రజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటా సింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ సహా మరికొందరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జరిగిన హింసాకాండలో 300 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. -
రూ.100 నోటు షాకింగ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ: అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలకు షాకిచ్చిన కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని తీసుకోనుం దా? తాజా వార్తలు, సాక్షాత్తు ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. 2021 ఏడాదిలో మరో షాకింగ్ నిర్ణయం దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని పాత కరెన్సీ నోట్లను విత్‌డ్రా చేసుకునే ఆలోచనలో ఉంది. ఈ మేరకు కేంద్ర బ్యాంకు యోచిస్తున్నట్లు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీ మహేష్ శుక్రవారం వెల్లడించారు. జిల్లా పంచాయతీలోని మంగళూరు, నేత్రావతి హాల్లో జిల్లా లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి భద్రతా కమిటీ (డిఎల్ఎస్సి), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ (డిఎల్ఎంసి) సమావేశంలో బీ మహేష్ మాట్లాడుతూ రూ.100, రూ .10, రూ .5 పాత కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకోనుందనే హింట్ ఇచ్చారు. అలాగే 10 రూపాయల నాణెం ప్రవేశపెట్టి 15 సంవత్సరాల తరువాత కూడా వ్యాపారులు, వ్యాపారవేత్తలు సహా చాలామంది వాటిని అంగీకరించడానికి ఇష్టపడ్డంలేదన్నారు. నకిలీవని వారు అనుమానిస్తుండటంతో బ్యాంకులు, ఆర్బీఐకి సమస్యగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణెంపై ప్రజల్లో అవగాహన కల్సించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే మరి పాత నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఇస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు. దీనికి సంబంధించి ఆర్బీఐ అమలుచేయనున్న సమగ్ర ప్రణాళిక, విధివిధానాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కాగా నవంబర్ 8, 2016లో రూ.500,1000 రూపాయల నోట్ల డీమోనిటైజేషన్ తర్వాత రూ .2,000 విలువైన కరెన్సీ నోట్‌తో పాటు రూ .200 నోటును ప్రవేశపెట్టింది. 2019లో 100 రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. 2019 లో, సెంట్రల్ బ్యాంక్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఇచ్చిన ఆర్టిఐ సమాధానంలో ఆర్బీఐ వెల్లడించింది. దీంతో త్వరలోనే 2వేల నోటును కూడా రద్దు చేయనుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్రం, ఆర్బీఐ అప్పట్లోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
80 వేల మంది ఖాతాల్లో.. రూ.258.44 కోట్లు జమ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు తమ భవిష్యనిధి (పీఎఫ్) ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించగా... ఇప్పటివరకు రాష్ట్రంలో 80వేల మంది సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో అధికంగా ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాల జీ) ఇంజనీర్లే ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందు కు దేశవ్యాప్తంగా మార్చి 24వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు వారి పీఎఫ్ ఖాతా నుంచి మూడు నెలల వేతనం మేర విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80,647 మంది ఉద్యోగులు పీఎఫ్ నుంచి నగదు ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు.వీటిని మూడు రోజుల్లో పరిష్కరించిన భవిష్యనిధి కార్యాలయ అధికారులు...దాదాపు 98% మేర దరఖాస్తులను పరిష్కరించారు. వారి ఖాతాల్లో రూ.258.44 కోట్లు జమ చేసినట్లు ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్లు విపిన్ కుమార్, చంద్రశేఖర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కోవిడ్–19తో సంబంధం లేకుండా వచ్చిన మరో 49,755 దరఖాస్తులను సైతం పరిష్కరించినట్లు చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద రాష్ట్రంలో 4,805 ఎస్టాబ్లిష్మెంట్లు అర్హత సాధించాయన్నారు.వీటికి కంపెనీ చందా కింద కట్టాల్సిన రూ.9.24 కోట్లు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. -
రూ.2 వేల నోటు : ఆర్థికమంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: 2 వేల రూపాయల నోటు కనుమరుగు కానుందన్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 2 వేల రూపాయల నోట్ల జారీని నిలిపి వేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. బుధవారం వివిధ ప్రభుత్వ బ్యాంకుల ముఖ్య అధికారులతో జరిగిన ఒక సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ వివరణ ఇచ్చారు. తనకు తెలిసినంతవరకు బ్యాంకులకు అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదంటూ 2 వేల నోట్లకు సంబంధించి జరుగుతున్న పుకార్లను కొట్టి పారేశారు. 2 వేల రూపాయల విలువైన నోట్లు చట్ట బద్ధంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని నిర్మలా సీతారామన్ సూచించారు. దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను కేంద్రం గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో 2 వేల రూపాయల నోట్లను కూడా ఉపసంహరిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా బ్యాంకులు ఏటీఎంలలో 2 వేలు రూపాయల నోట్లను ఉంచకపోవడం కూడా ప్రచారానికి బలం చేకూర్చింది. 2 వేల రూపాయల నోట్లకు బదులు 500 రూపాయల నోట్లనే ఎటీఎంలలో ఉంచుతుండటంతో ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
డబ్బులు పోయినా పట్టించుకోరా..?
సాక్షి, నిజామాబాద్(మద్నూర్) : పది రోజుల క్రితం బ్యాంకు ఖాతా నుంచి రూ. 1.50 లక్షలు విత్‌డ్రా అయినా బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదంటూ మద్నూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఎదుట శుక్రవారం బాధితుడు నారాయణ ధర్నాకు దిగాడు. బ్యాంకులో ఉంచిన డబ్బులు నా అనుమతి లేకుండా ఎలా ఇతరుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. నా అకౌంట్ నంబర్ గాని, ఏటీఎం కార్డు నంబర్ కాని ఎవ్వరికి చెప్పలేదని, ఫోన్ చేసి వివరాలు ఎవ్వరు కూడా వివరాలు అడగలేదని తెలిపాడు. అయితే తన అకౌంటు నుంచి రూ.1.50 లక్షలు విత్‌డ్రా అయ్యాయని బాధితుడు వాపోయాడు. ఈ విషయమై నిజామాబాద్‌లోని జిల్లా ఎస్బీఐ కార్యాలయానికి వెళ్లినా పట్టించుకోకనే బ్యాంకు ఎదుట ధర్నా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. పైసా పైసా కష్టపడి డబ్బు కూడబెట్టుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ వెంకట్రావ్ సిబ్బందితో కలిసి బ్యాంకు వద్దకు చేరుకుని బాధితుడిని సముదాయించి బ్యాంకు మేనేజర్‌తో చర్చించారు. నారాయణకు చెందిన ఏటీఎం కార్డు, పిన్ నెంబరు ఇతరులకు తెలియడంతోనే డబ్బు విత్‌డ్రా జరిగిందని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. పంజాబ్‌లోని పాటియాల జిల్లాలో డబ్బు విత్‌డ్రా జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ విషయమై బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారని సైబర్ క్రైం బ్యాంచ్ పోలీసులు కేసును చేదించి న్యాయం చేస్తారని ఏఎస్సై తెలపడంతో బాధితుడు వెళ్లిపోయాడు. హైదరాబాద్‌లోని సైబర్ బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని బాధితుడు అన్నాడు. -
మార్కెట్ ర్యాలీ..?
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారాంతాన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత.. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను మంత్రి ప్రకటించారు. తాజా ప్రభుత్వ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌కు జోష్ వచ్చే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో ప్రతిపాదించిన సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం సానుకూల అంశంగా ఉందని చెబుతున్నాయి. సర్‌చార్జ్ అంశం ఇటీవల దేశ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా నష్టపరచగా.. ఈ కీలక అంశంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టంచేయడంతో మళ్లీ ఎఫ్‌పీఐల పెట్టుబడి భారత క్యాపిటల్ మార్కెట్‌కు వచ్చి చేరే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ మార్కెట్ ఫండమెంటల్స్ రీసెర్చ్ హెడ్ రస్మిక్ ఓజా విశ్లేషించారు. డాలరుతో రూపాయి మారక విలువ బలపడేందుకు కూడా ప్రభుత్వ తాజా నిర్ణయం దోహదపడనుందని అభిప్రాయపడ్డారు. ‘ఎఫ్‌పీఐల అమ్మకాల ప్రవాహం ఆగిపోయి.. కొనుగోళ్లు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. అయితే, ఈ ర్యాలీ కొనసాగాలంటే.. కంపెనీల ఆదాయ వృద్ధి పుంజుకుని, ఆర్థిక వ్యవస్థలో మందగమనం తొలగిపోవాలి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ్ కుమార్ అన్నారు. భారత జీడీపీలో వృద్ధి వేగంగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి భరోసా, ఎఫ్‌పీఐ సర్‌చార్జ్ ఉపసంహరణ వంటి కీలక అంశాల నేపథ్యంలో సోమవారం మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్‌కు చాన్స్ ఉందని ట్రేడింగ్ బెల్స్ కో–ఫౌండర్, సీఈఓ అమిత్ గుప్తా చెప్పారు. పీఎస్‌యూ బ్యాంక్ షేర్లకు మద్దతు..! ఆర్థిక వ్యవస్థలో రుణ మంజూరీని పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మరోవైపు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు)కు అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. ఈ తాజా అంశాల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లకు కొనుగోలు మద్దతు లభించే అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్ విశ్లేషకులు గరిమా కపూర్ అన్నారు. ఇక ఆటో రంగానికి ఊతమిస్తూ.. ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు సవరణను 2020 జూన్ వరకు వాయిదా వేయడం వంటి పలు ప్రోత్సాహక నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ అంశానికి తోడుగా.. వస్తు, సేవల పన్ను ఊరట లభిస్తే ఆటో రంగ షేర్లలో పతనం ఆగుతుందనేది దలాల్ స్ట్రీట్ వర్గాల అంచనా. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) జీడీపీ అంచనాల గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించనుంది. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ధీటుగా చైనా సవాలు విసురుతోంది. ఇటీవల చైనా దిగుమతులపై 10% సుంకం విధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా.. మొత్తం 75 బిలియన్ డాలర్ల విలువగల యూఎస్ వస్తువులపై అదనంగా 10% టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. దీంతో ట్రంప్ అదేరోజున మరోసారి తీవ్రంగా స్పందించారు. చైనా దిగుమతులపై అదనపు సుంకాలను విధించడంతో పాటు ఆదేశం నుంచి అమెరికన్ కంపెనీలు బయటకు వచ్చేయాలని కోరారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఆరోజున భారీ నష్టాలను చవిచూశాయి. నాస్డాక్ ఏకంగా 3% నష్టపోయింది. ఆగస్టులో రూ.3,014 కోట్లు ఉపసంహరణ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1–23 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.12,105 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్లో రూ.9,091 కోట్లను పెట్టుబడి పెట్టారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.3,014 కోట్లకు పరిమితమైంది. ఎఫ్‌పీఐ లపై కేంద్ర ప్రభుత్వం సర్‌చార్జ్ ఉపసంహరణతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. ఆర్థిక మంత్రి ఇచ్చిన భరోసాతో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్ విశ్లేషించారు. -
దిగొచ్చిన పెప్సీకో.. కేసులు వాపస్
గాంధీనగర్ : శీతల పానీయాల దిగ్గజం పెప్సీకో ఇండియా దిగొచ్చింది. గుజరాత్ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. తమ కంపెనీ పేరుతో భారత్‌లో రిజస్టర్ అయిన బంగాళాదుంపను తన అనుమతి లేకుండా పండిచారనే నేపంతో పెప్సీకో కంపెనీ 9 మంది గుజరాత్ రైతుల మీద కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దాంతో ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో కంపెనీ దిగొచ్చింది. రైతుల మీద పెట్టిన కేసులను వాపస్ తీసుకుంటున్నట్లు కంపెని అధికార ప్రతినిధి ప్రకటించారు. ‘ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మా కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది’ అని సదరు అధికారి తెలిపారు. ఈ వివాదం ఈ ఏడాది ఏప్రిల్‌లో తెరమీదకొచ్చింది. తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ పెప్సీకో రైతుల మీద కేసులు పెట్టడమే కాక.. వారి మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ అహ్మదాబాద్ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై కోర్టు కూడా… సానుకూలంగా స్పందించింది. రైతులు ఆ పంటను పండించడంపై స్టే విధించింది. అంతేకాక తమ అనుమతి లేకుండా ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపలను పండించినందుకు గాను రూ. కోటి జరిమానా చెల్లించాలంటూ పెప్సీకో.. రైతులను డిమాండ్ చేసింది. -
వేర్పాటు నేతలకు భద్రత ఉపసంహరణ
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని ఐదుగురు వేర్పాటువాద నేతలకు భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. వేర్పాటువాద నేతలు మిర్వాజ్ ఉమర్ ఫరూఖ్, అబ్ధుల్ ఘనీ భట్, బిలాల్ లోన్, హషీం ఖురేషీ, షబీర్ షాలకు భద్రతను ఉపసంహరించినట్టు ప్రభుత్వం పేర్కొంది కాగా ఈ జాబితాలో పాక్ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్ అలి షా గిలానీ పేరు లేకపోవడం గమనార్హం. వేర్పాటువాద నేతలకు కల్పించిన అన్ని భద్రతా వాహనాలు, సిబ్బందిని సాయంత్రానికి వెనక్కితీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వీరికి ప్రభుత్వం సమకూర్చిన ఇతర సౌకర్యాలనూ తక్షణం ఉపసంహరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఇతర వేర్పాటువాద నేతలకూ భద్రత ఉపసంహరణపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
విడాకులపై వెనక్కు తగ్గిన తేజ్ ప్రతాప్
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తన విడాకుల నిర్ణయానికి ఆమోదం తెలిపితేనే ఇంటికి వస్తానంటూ కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోయి షాక్ ఇచ్చిన తేజ్ ప్రతాప్.. తాజాగా తన విడాకుల పిటిషన్‌ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి తేజ్ ప్రతాప్ నుంచి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రటన వెలువడలేదు. విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తేజ్ ప్రతాప్ యాదవ్ తన మనసులోని బాధను తెలియజేసేలా .. ఓ కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా 16వ శతాబ్దానికి చెందిన ఓ ప్రముఖ కవి రాసిన పంక్తులను ఆయన ప్రస్తావించారు. ‘ఒకసారి ప్రేమ ముక్కలైతే అది అతుక్కోదు. దాన్ని మళ్లీ కలపాలని ప్రయత్నించడం వృధా’ అనే భావం వచ్చేలా ఉన్న కవితను పోస్ట్ చేశారు. విడాకుల నిర్ణయం పట్ల ఎవరి మాటా విననంటూ తేల్చి చెప్పిన తేజ్ ప్రతాప్ ఇంత సడెన్‌గా తన నిర్ణయాన్ని మార్చుకోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే 2019 ఎన్నికల నేపథ్యంలోనే తేజ్ ప్రతాప్ తన విడాకుల విషయంలో వెనక్కు తగ్గినట్లు సమాచారం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోడం కోసం ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో తేజ్ ప్రతాప్ విడాకులు తీసుకుంటే సీట్ల సర్దుబాటు అంశంలో విబేధాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు సన్నిహితులు. కాగా ఈ ఏడాది మే 12న తేజ్ ప్రతాప్, ఐశ్వర్యా రాయ్‌ల వివాహం అత్యంత ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే. -
బన్సల్‌పై లైంగిక ఆరోపణలు : న్యూ ట్విస్ట్
సాక్షి, బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ కో-ఫౌండర్ బిన్నీ బన్సల్ రాజీనామా అనంతరం మరో ఆసక్తికరమైన ట్విస్ట్. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవికి రాజీనామా చేసిన బిన్సీ ప్రతీకార చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. తనపై ఆరోపణలు చేసిన మహిళపై కేసును దాఖలు చేశారు. తప్పుడు ఆరోపణలు, బ్లాక్మెయిల్ ఆరోపణలతో కోరమంగళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సదరు మహిళ క్షమాపణ చెప్పడంతో కేసును వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తను కావాలనుకున్నపుడు కేసును రీ ఓపెన్ చేసే హక్కును రిజర్వ్ చేసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కొన్నాళ్లు ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన మహిళ బిన్సీపై లైంగిక ఆరోపణలు చేశారు. 2016లో వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగాయని, అయితే కొన్ని నెలల తరువాత విభేదాలు రావడంతో విడిపోయారు. అలాగే ఈ సందర్భంగా ఆమె కొంత డబ్బు చెల్లించాలని కూడా డిమాండ్ చేసినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె సొంతంగా ఓ వెంచర్‌ను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 2018లో వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో మేజర్ వాటాను కొనుగోలు చేసిన అనంతరం ఆమె డబ్బుల కోసం మళ్లీ బిన్నీని డిమాండ్ చేశారు. ఈ సారి కూడా బిన్నీ బన్సల్ ససేమిరా అనడంతో, 2018 జూలైలో ఆమె నేరుగా వాల్‌మార్ట్ సీఈవోకే లైంగిక ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ సంయుక్తంగా అంతర్గత విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీఈవో బిన్నీ బన్సల్ రాజీనామా చేశారనీ ఈ విచారణలో ఆరోపణలు రుజువు కానప్పటికీ, బిన్నీ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు నవంబరు 13న వాల్‌మార్ట్ ప్రకటించింది. అయితే బన్సల్‌పై వచ్చిన తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణల విషయమై పూర్తి వివరాలను వాల్‌మార్ట్ వెల్లడి చేయని సంగతి విదితమే. మరోవైపు బిన్నీ కంపెనీని వీడిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ బోర్డు లండన్‌లో సమావేశం కానుంది. వచ్చే వారమే ఈ భేటీ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సమావేశానికి బోర్డులో కొనసాగుతానని ప్రకటించిన బిన్నీ హాజరవుతారా లేదా అనేది స్పష్టత లేదు. -
ఇక అప్లికేషన్ విత్‌డ్రా చేసుకోవచ్చు!
న్యూఢిల్లీ: ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అనంతరం, పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు తమ దరఖాస్తును ముందు గానే ఉపసంహరించుకునే వెసులుబాటును మొదటిసారిగా యూపీఎస్సీ కల్పించనుంది. వచ్చే ఏడాది జరిగే ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష నుంచి ఈ విధానాన్ని ప్రారంభించి మెల్లగా అన్ని పరీక్షల్లోనూ అమలు చేస్తామని యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా సోమవారం వెల్లడించారు. యూపీఎస్సీ 92వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సివిల్స్ ప్రాథమిక పరీక్షలకు ప్రతి ఏటా పది లక్షల మంది దరఖాస్తు చేస్తే ఐదు లక్షల మందే పరీక్షకు హాజరవుతున్నారు. కానీ యూపీఎస్సీకి మాత్రం గైర్హాజరవుతున్న ఐదు లక్షల మందికి కూడా ప్రశ్నపత్రాలు ముద్రించి, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇన్విజిలేటర్లను నియమించడం ద్వారా చాలా డబ్బు వృథా అవుతోంది. అందుకే దరఖాస్తు చేసినప్పటికీ పరీక్ష రాయలేని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు తమ దరఖాస్తును ఉపసంహరించుకునే అవకాశం కల్పించనున్నాం’ అని చెప్పారు. -
కార్డ్ లేకుండానే ఏటీఎమ్‌ల్లో క్యాష్ విత్‌డ్రా
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు కార్డ్ లేకుండానే కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల్లో నగదును పొందవచ్చు. ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ (ఐఎమ్‌టీ) టెక్నాలజీతో నడిచే ఏటీఎంలలో తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది. ఆరంభ ఆఫర్‌గా మొదటి రెండు విత్‌డ్రాయల్స్‌కు రూ.25 లావాదేవీ ఫీజును రద్దు చేస్తున్నామని తెలిపింది. ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే 20,000కు పైగా ఏటీఎమ్‌ల్లో ప్రస్తుతం తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని వివరించింది. ఈ ఏడాది చివరినాటికి ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే ఏటీఎమ్‌ల సంఖ్య లక్షకు పెరుగుతుందని పేర్కొంది. ఇలాంటి ఏటీఎమ్‌లను నిర్వహించే ఇమ్పేస్ పేమెంట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించింది. -
ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా ?
-
లాభాలు వచ్చాయి, ఫండ్ నుంచి వైదొలగవచ్చా?
నేను గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇన్వెస్ట్ చేసిన కొన్ని ఫండ్స్ ఏడాదిలో 30 శాతానికి పైగా రాబడులనిచ్చాయి. మంచి రాబడులు వచ్చాయి. కాబట్టి ఈ ఫండ్స్ నుంచి నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చా? – సరళ, హైదరాబాద్ ఈ డబ్బులతో వేరే ముఖ్యమైన పనులు నిర్వహించాలనుకున్న పక్షంలో.. ఏడాదిలో 30 శాతానికి పైగా రాబడులనిచ్చిన ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. ప్రయోజనకరమైన పనులకు మాత్రమే ఇలాంటి లాభాలను వినియోగించాలి. అంతేకానీ, లాభాలు భారీగా వచ్చాయి కదాని మిత్రులకు, బంధువులకు భారీగా పార్టీ ఇవ్వడానికే, ఇతరత్రా వృథా ఖర్చులకు వినియోగించకూడదు. 30 శాతానికి పైగా లాభాలు వచ్చాయి కదాని ముఖ్యమైన అవసరాలు లేకపోయినా, మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నారనుకుందాం. తర్వాతి ఏడాది వచ్చే లాభాలను మీరు కోల్పోతారు కదా ! చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమే మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఆ ఆర్థిక లక్ష్యాలు సాకారమయ్యేంత వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తేనే మేలు. మరోవైపు ఇన్వెస్టర్లు రీ బ్యాలెన్సింగ్ ప్లాన్‌ను తప్పనిసరిగా అనుసరించాలి. రీ బ్యాలెన్సింగ్ ప్లాన్ అంటే..ఈక్విటీ, డెట్ సాధనాల్లో నిర్దిష్టమైన నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈక్విటీ సాధనాల్లో పెట్టుబడులను పెంచాలి. మార్కెట్ పడిపోతున్నప్పుడు డెట్ సాధనాల్లో పెట్టుబడులను పెంచాలి. ఇలా మార్కెట్ స్థితిగతులను అనుసరించి ఇన్వెస్ట్మెంట్స్ వ్యూహాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ఉండాలి. నేను డీఎస్పీ బ్లాక్‌రాక్ ట్యాక్స్ సేవర్, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీల్లో గత ఏడాది కాలం నుంచి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. డీఎస్పీ ట్యాక్స్ సేవర్ పనితీరు సంతృప్తికరంగా లేదు. దీని నుంచి వైదొలగమంటారా ?లేక సిప్‌లను కొనసాగించమంటారా? అంతేకాకుండా నేను మరికొంత మొత్తాన్ని రెండు మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్ చేయడానికి రెండు మల్టీక్యాప్ ఫండ్స్‌ను సూచించండి. -నిరంజన్, విశాఖపట్టణం పన్ను ఆదా చేసే చాలా ఫండ్స్ సాధారణంగా మల్టీక్యాప్ ఫండ్స్ అయి ఉంటాయి. కేవలం ఏడాది స్వల్ప కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఫండ్ పనితీరును అంచనా వేసి సరైన రాబడులనివ్వడం లేదంటూ ఆ ఫండ్ నుంచి వైదొలగడం సరైన నిర్ణయం కాదు. మూడు నెలలకో, ఆర్నెల్లకో, ఏడాది కాలాన్నో పరిగణనలోకి తీసుకొని పెట్టుబడుల వ్యూహాన్ని, నిర్ణయాలను మార్చుకోవడం సరైన విధానం కాదు. పనితీరు బాగా లేని ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకొని, పనితీరు బాగా ఉన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం.. సరైన పెట్టుబడి వ్యూహం కాదు. నిరంతరం మంచి రాబడులనివ్వడమనేది ఏ ఫండ్‌కు సాధ్యం కాదు. మీరు ఇన్వెస్ట్ చేసిన రెండు ఫండ్స్ విషయానికొస్తే, పన్ను ఆదా ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు ఫండ్స్ మంచివే. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో అధిక లాభాలు ఆర్జించే కంపెనీల షేర్లు ఉన్నాయి. పన్ను ఆదా ఫండ్‌కు సాధారణంగా లాక్–ఇన్–పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. అంటే మీ డీఎస్పీ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్ల దాకా వెనక్కి తీసుకునే వీలు లేదు. మీరు సిప్‌లు ప్రారంభించి ఏడాది దాటింది. కాబట్టి మరో రెండేళ్ల దాకా మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోలేరు. సమీప కాలంలోనే డీఎస్పీ ట్యాక్స్ సేవర్ కోలుకొని మంచి రాబడులనే ఇస్తుందని నేను భావిస్తున్నాను. అందుకని మీరు నిరభ్యంతరంగా ఈ ఫండ్‌లో సిప్‌లను కొనసాగించవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెండు మల్టీ క్యాప్‌లు–మిరా అసెట్ ఇండియా ఈక్విటీ, మోతీలాల్ ఓస్వాల్ మల్టీక్యాప్ 35 ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. గత కొన్ని నెలలుగా మోతీలాల్ ఓస్వాల్ మల్టీక్యాప్ 35 ఫండ్ పనితీరు బలహీనంగా ఉన్నా, భవిష్యత్తులో ఇది మంచి రాబడులనే ఇవ్వగలదని అంచనాలున్నాయి. ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్‌ను కూడా పరిశీలించవచ్చు. కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీ క్యాప్ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. షేర్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచి పనితీరు ఉన్న కంపెనీ షేర్లను ఎంచుకోమని చెబుతారు కదా ! ఒక కంపెనీ నిర్వహణ బాగా ఉందని ఎలా తెలుసుకోవాలి? – రియాజ్, విజయవాడ ఒక సామాన్య ఇన్వెస్టర్‌గా మీరు కంపెనీ యాజమాన్యాన్ని కలిసి, వారితో మాట్లాడే అవకాశం ఉండదు. ఒక కంపెనీ నిర్వహణ బాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చక్కని మార్గం... ఆ యాజమాన్యం చరిత్రను తెలుసుకోవడమే. ఇంటర్నెట్ విస్తృతంగా అమల్లోకి వచ్చాక, మీరు గూగుల్, వికీ పీడియా ద్వారా కంపెనీ యాజమాన్యంలోని కీలక వ్యక్తుల సమాచారం తెలుసుకోవచ్చు. కంపెనీ యాజమాన్యంలోని కీలక వ్యక్తులు గతంలో ఏవైనా వివాదాల్లో చిక్కుకున్నా, లేదా వారి చుట్టూ ఏవైనా వివాదాలు ముసురుకున్నా, కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు జరిగినా, కంపెనీ ఆడిటర్లు తరచుగా మారుతున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. వెంటనే మంచో, చెడో అన్న నిర్ణయానికి రావద్దు. కొంత కాలం ఎదురు చూసి, మరింత సమాచారం సేకరించి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
స్వాతికి జామీను ఉపసంహరణ
సాక్షి, నాగర్ కర్నూల్: ప్రియుడితో కలసి భర్తను హత్య చే సిన స్వాతి ఉదంతం మరో మలుపు తిరిగింది. స్వాతికి జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు దానిని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. గతేడాది నవంబర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సుధాకర్‌రెడ్డిని ఆయన భార్య స్వాతి, తన ప్రియుడు రాజేశ్‌తో కలసి హత్య చేయగా డిసెంబర్లో ఈ విషయం బయటపడింది. అప్పటి నుంచి స్వాతి మహబూబ్‌నగర్, రాజేశ్ నాగర్‌కర్నూల్ జైల్లో ఉంటున్నారు. గత నెల 16న స్వాతికి మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో బెయిల్ లభించగా పూచీకత్తు ఇచ్చే వారెవరూ లేకపోవడంతో ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది. నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీలో పనిచేసే ఓ వ్యక్తితోపాటు మరొకరు ఆమెకు జామీను ఇవ్వగా గత నెల 27న జైలు నుంచి విడుదలైంది. స్వాతిని తీసుకువెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో అధికారులు మహబూబ్‌నగర్‌లోని రాష్ట్ర సదనానికి తరలించారు. పోలీసులు శుక్రవారం ఆమెను నాగర్‌కర్నూల్ కోర్టులో హాజరుపర్చారు. స్వాతికి జామీను ఇచ్చిన ఇద్ద రు న్యాయస్థానం ముందుకు వచ్చి తమ పూచీకత్తును ఉపసంహరించుకుంటున్నామని న్యాయమూర్తికి విన్నవించారు. ఈ అంశంపై కోర్టు 7వ తేదీ వరకు గడువు పెట్టింది. -
పెళ్లికి పీఎఫ్ మనీ తీసుకోవచ్చు
న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇటీవలే నిరుద్యోగిగా మారిన నెల అనంతరం 75 శాతం ఈపీఎఫ్ కార్పస్‌ను, 2 నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే మిగతా ఆ 25 శాతం కూడా విత్‌డ్రా చేసుకునేలా అవకాశం కల్పించిన ఈపీఎఫ్ఓ మరో అద్భుత అవకాశాన్ని కూడా కల్పించబోతుంది. పెళ్లికి, ఇంటి కొనుగోలుకు, పిల్లల చదువుకు వంటి ఖర్చులకు సగం ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేలా ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఫార్మ్ 31ను నింపాల్సి ఉంటుంది. పోస్టు మెట్రిక్యూలేషన్ స్టడీస్ కోసం 50 శాతం మొత్తాన్ని వడ్డీతో తీసుకునేలా ఈపీఎఫ్ఓ తన నిబంధనలను మార్చుతోంది. అలాగే ఇళ్లు కొనుకునేందుకు లేదా కట్టించుకునేందుకు కూడా 24 నెలల బేసిక్ వేతనాలను, డీఏను విత్‌డ్రా చేసుకోవచ్చని రిటైర్మెంట్ ఫండ్ బాడీ చెప్పింది. 24 బేసిక్, డీఏ లేదా 36 నెలల బేసిక్ వేతనాలను విత్‌డ్రా చేసుకునేలా ఈపీఎఫ్ఓ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అయితే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే కనీసం ఐదేళ్లు సభ్యుడిగా ఉండాలి. దీని కోసం ఉద్యోగి నుంచి డిక్లరేషన్ అవసరం. మిగతా ఏ డాక్యుమెంట్లను ఉద్యోగులు సమర్పించాల్సినవసరం లేదు. -
అనర్హత వేటు కేసు.. అనూహ్య పరిణామం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో అనూహ్య పరిణామం నెలకొంది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దినకరన్ వర్గ ఎమ్మెల్యే ఒకరు.. ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. రెబల్ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ...‘న్యాయస్థానంపై నమ్మకం పోయింది. న్యాయం చేకూరుతుందన్న ఆశలు ఆవిరయ్యాయి. అందుకే పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. దీంతో దినకరన్ వర్గంలో చీలిక మొదలైందన్న కథనాలు మీడియాలో ప్రారంభం అయ్యాయి. అన్నాడీఎంకే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్‌ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్ ధన్పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వారిలో అండిపట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ కూడా ఒకరు. ఉప ఎన్నికలకు వెళ్లినా గెలుపు తనదే అన్న ధీమాలో ఆయన ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. అయితే గ్రూప్‌లో చీలిక ప్రచారాన్ని దినకరన్ మాత్రం కొట్టిపారేశారు. ‘పిటిషన్ విషయంలో తంగతమిళ్‌సెల్వన్ అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. అయినా ఆయన మా వెంటే ఉన్నారు. మా వర్గం అంతా ఐక్యంగానే ఉంది. అంతా ఓకే’ ఆయన కాసేపటి క్రితం ప్రకటించారు. ఒకవేళ కేసులో హైకోర్టు తీర్పు అనుకూలంగా లేకపోతే మాత్రం.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని దినకరన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తమిళనాడులో దినకనర్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం... గురువారం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తీర్పుపై అనిశ్చితి నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించింది. -
ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యం లో బుధవారం ఆందోళన చేపట్టారు. స్థానిక బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సం దర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఓ వైపు కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామంటూనే మరో వైపు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందన్నా రు. యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చిలవిడిగా అనుమతులిస్తోందని విమర్శించారు. ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడే పరిస్థి తి ఏర్పడుతోందన్నారు. కార్యక్రమంలో టీఏవీఎస్ జిల్లా అధ్యక్షుడు కోట్నాక రాహుల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆత్రం నగేశ్, కన్వీనర్ సుప్రియ, టీవీవీ జిల్లా అధ్యక్షుడు బి.రాహుల్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పి.కళావతి, టీఏవీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అన్నమెల్ల కిరణ్, టీవీవీ, పీడీఎస్‌యూ నాయకులు శివ, అజయ్, తదితరులు పాల్గొన్నారు. -
బోఫోర్స్ బెంచ్ నుంచి తప్పుకున్నారు
న్యూఢిల్లీ: బోఫోర్స్ కేసును విచారిస్తోన్న సుప్రీం కోర్టు బెంచ్ నుంచి జడ్జి జస్టిస్ ఖన్వీల్కర్ తప్పుకున్నారు. సీజేఐ జస్టిస్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనంలో భాగంగా ఉన్న ఆయన తన నిర్ణయానికి సంబంధించి ఎలాంటి కారణాల్ని పేర్కొనలేదు. రూ. 64 కోట్ల బోఫోర్స్ కుంభకోణం కేసులో అన్ని ఆరోపణల్ని కొట్టివేస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వగా దానిని సవాలు చేస్తూ బీజేపీ నేత అగర్వాల్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న సీబీఐ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసేందుకున్న అర్హతేంటో చెప్పాలని అగర్వాల్‌ను కోర్టు ఆదేశించింది. ఆ అంశంపై ధర్మాసనం మంగళవారం విచారించాల్సి ఉంది. -
మళ్ళీ నో క్యాష్..
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ పటమటకు చెందిన రాజారావు కుమార్తెకు ఫిబ్రవరిలో వివాహం. ఏటీఎంలలో విత్‌డ్రాల మీద రోజుకు గరిష్ట పరిమితి ఉంది కదా. పెళ్లి పనులకు పెద్ద మొత్తం చేతిలో ఉండాలి. అందుకే నగదు విత్‌డ్రాకు బ్యాంకుకు వెళ్లారు. కానీ రోజుకు రూ.49 వేలుకు మించి విత్‌డ్రా ఇవ్వబోమని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆయనకు నోటమాట రాలేదు. ఇదీ ఆ ఒక్క బ్యాంకులోనే కాదు... అమరావతి పరిధిలో దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ నెలకొన్న పరిస్థితి. బ్యాంకుల అనధికార పరిమితులు.... అమరావతి పరిధిలో బ్యాంకులు ఖాతాదారులకు విత్‌డ్రాల మీద అనధికారికంగా ఆంక్షలు విధించాయి. ఒక ఖాతాదారునికి రోజుకు రూ.49 వేలుకు మించి నగదు విత్‌డ్రా ఇవ్వడం లేదు. కృష్ణా జిల్లాలో 48 బ్యాంకులచెందిన 789 శాఖలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 42 బ్యాంకులకు చెందిన 795 శాఖలు ఉన్నాయి. గతంలో సగటున ఒక్కో బ్యాంకు రోజుకు రూ.3 కోట్ల వరకు నగదు విత్‌డ్రాలు ఇచ్చేవి. కానీ ప్రస్తుతం రూ.కోటికి మించి నగదు విత్‌డ్రాలు ఇవ్వలేకపోతున్నాయి. ఇక ఏటీఎంలలో కూడా తగినంత నగదు అందుబాటులో ఉంచడం లేదు. కృష్ణా జిల్లాలో 928 ఏటీఎంలు ఉండగా గుంటూరు జిల్లాలో 850 ఏటీఎంలున్నాయి. వాటిలో దాదాపు 40 శాతం ఏటీఎంలు నగదు అందుబాటులో ఉంచలేకపోతున్నారు. ప్రధాన బ్యాంకులే దాదాపు 30 శాతం ఏటీఎంలకు నగదు సరఫరా నిలిపివేశాయి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఆ ఏటీఎంల వద్ద నియమించిన గార్డులను కూడా తొలగించాయి. ఆ ఏటీఎంలను త్వరలో మూసివేయాలని భావిస్తున్నారు. ఉన్న ఏటీఎంలలో కూడా ఒక బ్యాంకు ఖాతా మీద రోజుకు విత్‌డ్రా గరిష్ట పరిమితి రూ.20 వేలే ఉంది. ఖాతాదారుల ఇక్కట్లు.... విత్‌డ్రాల మీద పరిమితులతో ఖాతాదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. అమరావతి పరిధిలో దాదాపు 3 వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. పెళ్లి ఏర్పాట్ల కోసం చేతిలో నగదు ఉండాల్సిందే. సంప్రదాయ ఖర్చులు అన్నింటికీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వినియోగించలేరన్నది అందరూ అంగీకరించే వాస్తవం. ఇక నగదు కొరత వ్యాపార కార్యకలాపాల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. వాణిజ్య రాజధాని విజయవాడలో 100 హోల్‌సేల్ అసోషియేషన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు రూ.500 కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాలు సాగుతాయి. వ్యవసాయోత్పత్తుల ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న గుంటూరులో రోజుకు రూ.250 కోట్లకుపైగా వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయి. అందులో కనీసం 50 శాతం నగదు లావాదేవీలే ఉంటాయి. గత ఏడాది పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార కార్యకలాపాలు దాదాపు ఆరునెలలపాటు పడకేశాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి గాడిలో పడుతోందని అనుకుంటుంటే నగదు కొరత మళ్లీ దెబ్బతీస్తోంది. చేతిలో తగినంత నగదు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వ్యాపార కార్యకలాపాల జోరు తగ్గుతోందని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. నగదు ఇక్కట్లకు ఎప్పటిలోగా తెరపడుతుందో తాము చెప్పలేమని లీడ్‌బ్యాంకు అధికారులు అంటున్నారు. రిజర్వుబ్యాంకు తగినంత నగదు సరఫరా చేస్తే తప్పా తాము చేయగలిగేందీ లేదని తేల్చి చెబుతున్నారు. అంతవరకు నగదు ఇక్కట్లు కొనసాగాల్సిందేనా...! పరిస్థితి అలానే ఉంది మరి. బ్యాంకుల్లో నగదు కటకట.... నగదు కటకట మళ్లీ తలెత్తింది. బ్యాంకు ఖాతాదారులు మరోసారి నగదు కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జనవరి మొదటి వారం నుంచి మొదలైన ఈ పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. లీడ్ బ్యాంకు వర్గాలు అనధికారికంగా చెబుతున్న వివరాల ప్రకారం ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకులకు నగదు సరఫరాను బాగా తగ్గించి వేసింది. కొత్త రూ.500, రూ.200, రూ.2వేల నోట్లు ఆశించిన స్థాయిలో ముద్రించలేకపోతున్నారు. బ్యాంకులకు సరఫరా చేసే నగదుపై ఆర్బీఐ పరిమితులు విధించడంతో అమరావతిలోని బ్యాంకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
ఎల్పీజీ బాదుడుకు కేంద్రం బ్రేక్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్లపై ప్రతి నెల రూ.4 మేర పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఓవైపు ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తూ మరోవైపు ధరలు భారీగా పెంచడమన్నది పరస్పర విరుద్ధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లు అక్టోబర్ నుంచి ఎల్పీజీ ధరల్ని పెంచలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సిలిండర్లపై సబ్సిడీని ఎత్తివేయడానికి వీలుగా ఒక్కో సిలిండర్ ధరను ప్రతినెల రూ.4 మేర పెంచాలని గతేడాది జూన్‌లో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించడం తెల్సిందే. -
లాలు జడ్‌ప్లస్ వెనక్కి
న్యూఢిల్లీ/పట్నా: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్‌కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కల్పిస్తున్న జడ్‌ప్లస్ భద్రతను కేంద్రం ఉపసంహరించింది. ఇకపై ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. కేంద్రం తీరుపై లాలు, ఆయన ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఆపేసేలా కేంద్రం బెదిరించడానికి కుట్ర పన్నుతోందని లాలు ఆరోపించారు. తనకేమైనా అయితే నితీశ్ కుమార్, మోదీ ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని అన్నారు. దిగజారుడుతనమే: తేజస్వి తన తండ్రిని హతమార్చడానికి కుట్ర జరుగుతోందని, ఆయనకు ఏమైనా అయితే మోదీ తోలు వలుస్తామని లాలు కొడుకు తేజ్ ప్రతాప్ హెచ్చరించారు. కావాలంటే తాను మాట్లాడింది వెళ్లి మోదీకి చెప్పుకోవచ్చని మీడియాతో అన్నారు. తన తండ్రికి భద్రతను కుదించడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతోందని లాలు చిన్న కొడుకు తేజస్వి యాదవ్ అన్నారు. ఆర్జేడీ చేస్తున్న ఆరోపణలపై బిహార్ ఉపముఖ్య మంత్రి సుశీల్ మోదీ స్పందిస్తూ...ప్రజలు లాలుకు భయపడుతుంటే ఆయన దేనికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. -
‘డొల్ల’తనం బట్టబయలు!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తరువాత సుమారు 35 వేల కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, ఆ తరువాత విత్‌డ్రా చేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. అక్రమ నగదు ప్రవాహాలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించిన తరువాత కార్యకలాపాలకు దూరంగా ఉన్న సుమారు 2.24 లక్షల కంపెనీల పేర్లను అధికారిక రికార్డుల నుంచి తొలగించి, 3.09 లక్షల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు వేసినట్లు పేర్కొంది. నకిలీ డైరెక్టర్లు కార్పొరేట్ కంపెనీల్లో చేరకుండా నిరోధించేందుకు కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపింది. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు గత నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బట్టబయలైన డొల్ల కంపెనీలు, వాటి డైరెక్టర్ల వివరాలు, నగదు జమ, ఉపసంహరణలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్రం ఆదివారం విడుదల చేసింది. ఆర్థిక నేరాలు, అకౌంటింగ్ అవకతవకల కట్టడికి పలు చర్యలను ప్రకటించింది. ముఖ్యాంశాలు.... ► 56 బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం నోట్ల రద్దు తరువాత 35 వేల కంపెనీలు, 58 వేల ఖాతాల ద్వారా రూ.17 వేల కోట్లను డిపాజిట్ చేసి విత్‌డ్రా చేశాయి. ► వాటిలో నవంబర్ 8న నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్న ఓ కంపెనీ ఆ తరువాత రూ. 2,484 కోట్లు డిపాజిట్ చేసి ఉపసంహరించుకుంది. ► ఒక కంపెనీకి ఏకంగా సుమారు 2,134 ఖాతాలున్నాయి. ► ఇలాంటి కంపెనీలకు సంబంధించిన సమాచారం దర్యాప్తు సంస్థలకు అందజేత ► రిజిస్ట్రేషన్ రద్దయిన కంపెనీల ఆస్తులను తిరిగి రిజిస్ట్రేషన్ చేయొద్దని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ ► కనీసం రెండేళ్లు అంతకన్నా ఎక్కువ కాలం క్రియాశీలకంగా లేని సుమారు 2.24 లక్షల కంపెనీల రద్దు. వాటి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల అమ్మకాలపై ఆంక్షల విధింపు ► వేటు పడిన వారిలో 3 వేలకు మందికి పైగా డైరెక్టర్లు ఒక్కొక్కరు నిబంధనలకు విరుద్ధంగా 20కి పైగా కంపెనీల్లో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ► నకిలీ డైరెక్టర్లను నియంత్రించడానికి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(డిన్)ని వారి ఆధార్, పాన్‌తో అనుసంధానించేందుకు యత్నాలు ప్రారంభం ► 2013–14 నుంచి 2015–16 మధ్య కాలంలో వార్షిక రిటర్నులు దాఖలు చేయని కంపెనీల డైరెక్టర్లపై అనర్హత వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం ► చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్ల నియంత్రణ వ్యవస్థలో మార్పులు సూచించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు ► ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు పరిశీలిస్తూ అకౌంటింగ్ ప్రమాణాలు నిర్ధారించేందుకు, తప్పులకు పాల్పడే నిపుణులపై చర్యలు తీసుకునేందుకు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ(ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటుకు చర్యలు ముమ్మరం ► తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం(ఎస్ఎఫ్ఐఓ) ఆధ్వర్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. -
బడ్డీలో డబ్బుల్ని ఏటీఎంలో తీసుకోవచ్చు!!
► ఒక్కొక్క లావాదేవీకి రూ.25 చార్జ్ ► కొత్త సేవలకు ఎస్బీఐ శ్రీకారం ► రెగ్యులర్ ఏటీఎం ట్రాన్సాక్షన్ల చార్జీలు పెంచలేదని స్పష్టీకరణ ముంబై: దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఎస్బీఐ’ త్వరలో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా బ్యాంక్ కస్టమర్లు వారి ఎస్బీఐ మొబైల్ వాలెట్ (బడ్డీ)లోని డబ్బుల్ని ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యాంక్ ప్రతి విత్‌డ్రాయల్‌కి రూ.25లను చార్జ్ చేస్తుంది. ‘కస్టమర్ తన ఎస్బీఐ బడ్డీలో డబ్బుల్ని కలిగి ఉంటే.. అతను వాటిని ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే వినియోగదారులు బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా వాలెట్లో క్యాష్‌ను డిపాజిట్ చేయవచ్చు. అదే సమయంలో విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు’ అని ఎస్బీఐ ఎండీ (నేషనల్ బ్యాంకింగ్) రజనీష్ కుమార్ వివరించారు. అయితే ఈ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కి బ్యాంక్ కొంత చార్జీలను వసూలు చేస్తోంది. అవి ఎలా ఉన్నాయంటే... ► బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా వాలెట్‌లోకి రూ.1,000 వరకు క్యాష్ డిపాజిట్‌కు బ్యాంక్.. 0.25 శాతం సర్వీస్ చార్జ్‌ను (దీనికి సర్వీస్ ట్యాక్స్ అదనం) వసూలు చేస్తుంది. ► ఎస్బీఐ బడ్డీ నుంచి బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా రూ.2,000 వరకు క్యాష్ విత్‌డ్రాయల్‌కి 2.50 శాతం సర్వీస్ చార్జ్‌ను (దీనికి సర్వీస్ ట్యాక్స్ అదనం) వసూలు చేస్తుంది. ► ఈ సర్వీస్ చార్జ్‌లు 2017 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ► కాగా ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లు వారి బడ్డీ నుంచి బ్యాంక్ అకౌంట్లకు డబ్బుల్ని ఐఎంపీఎస్ విధానంలో ట్రాన్స్ఫర్ చేయడానికి సర్వీస్ ట్యాక్స్‌తోపాటు 3 శాతం సర్వీస్ చార్జ్‌ను వసూలు చేస్తోంది. ఏటీఎం ట్రాన్సాక్షన్ల చార్జీల్లో మార్పు లేదు.. ఎస్బీఐ రెగ్యులర్ ఏటీఎం ట్రాన్సాక్షన్లపై సర్వీస్ చార్జ్‌లను పెంచి రూ.25కు చేయబోతోందని సోషల్ మీడియాలో వార్తలు తెగచక్కర్లు కొట్టాయి. దీంతో తేరుకున్న బ్యాంక్ మీడియాలో వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. సాధారణ సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబంధించి ఏటీఎం క్యాష్ విత్డ్రాయల్స్పై సర్వీస్ చార్జ్‌ను ఏమాత్రం పెంచడంలేదని ఎస్బీఐ ఎండీ (నేషనల్ బ్యాంకింగ్) రజనీష్ కుమార్ తెలిపారు. తొలిగా వచ్చిన సర్క్యులర్‌లో కొన్ని తప్పులు దొర్లాయని, సరిచేసిన కొత్త సర్క్యులర్ త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
ఏ సర్టిఫికేట్స్ లేకుండానే పీఎఫ్ విత్ డ్రా
న్యూఢిల్లీ : నాలుగు కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అనారోగ్యం పాలైనప్పుడు చికిత్సకు అవసరమయ్యే నగదు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఫండ్స్ విత్ డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది. దివ్యాంగులు కూడా పరికరాలు కొనుక్కోవడానికి ఎలాంటి మెడికిల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినవసరం లేదని, నగదు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952ను సవరించినట్టు ప్రకటించింది. ఇన్నిరోజులు అనారోగ్యం పాలైనప్పుడు చికిత్స కోసం, అంగవైకల్యం వారు పరికరాలు కొనుకునేందుకు ఈపీఎఫ్ ఫండ్ విత్ డ్రాకు పలు సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉండేది. ప్రస్తుతం కాంపొజిట్ ఫామ్ తో సెల్ఫీ డిక్లరేషన్ ఇచ్చి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952లోని క్లాస్ 68-జే, 68-ఎన్ లకు కార్మిక మంత్రిత్వ శాఖ సవరణ చేసిందని, నాన్-రిఫండబుల్ అడ్వాన్సులను వైద్య చికిత్స కోసం తీసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. ప్రస్తుతం పేరా 68-జే కింద వైద్య చికిత్స కోసం ఈపీఎఫ్ సభ్యులు అడ్వాన్స్ ను కోరవచ్చు. అదేవిధంగా పేరా 68-ఎన్ కింద అంగవైకల్యం కలవారు పరికరాలు కొనుక్కునేందుకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. 2017 ఏప్రిల్ 25న చేపట్టిన సవరణతో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ జారీచేసిందని అధికారి పేర్కొన్నారు. -
రూ. పది నాణేలు చెల్లుతాయ్
అమరావతి: ‘సార్... రూ.10 నాణేలు ఎవ్వరూ తీసుకోవడం లేదు సార్... నా దగ్గర రూ.3,000 విలువైన రూ.10 నాణేలు ఉన్నాయి. రూ. 2,500 ఇచ్చి ఈ మొత్తం తీసుకోండి సార్’... ఇదీ విజయవాడలోని పాన్ షాపు యజమాని ఆందోళన. కాకినాడకు చెందిన ఈశ్వర్ రూ.5,000 విత్‌డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళితే మొత్తం రూ.10 నాణేలే ఇచ్చారు. ‘సార్ ఇవి బయట చెల్లడం లేదు నోట్లు ఇవ్వమని అడిగితే.. రూ.10 నాణేలు ఇచ్చినట్లు బుక్‌లో రాసేశాము.. మార్చడం కుదరదు’ అన్నారు. తీరా బయట ఇస్తే ఎవ్వరూ తీసుకోవడం లేదు. ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ ఈశ్వర్ వాపోయారు. పది రూపాయల నాణేలు చెల్లడం లేదంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వదంతులు షికార్లు చేస్తున్నాయి. దీంతో కిరాణా, పాన్ షాపుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. తాము ఇస్తే నాణేలు ఎవ్వరూ తీసుకో వడం లేదని, కానీ సిగరెట్లు వెలిగించుకున్న తర్వాత ఆనాణేలు అంటగట్టి వెళ్లిపోతున్నా రంటూ పాన్‌షాపు వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ వదంతులే, వీటిని నమ్మవద్దని ఆర్బీఐ పేర్కొంది. రూ.10 నాణేలు చెల్లుతాయని, వీటిని చెలామణీలోంచి ఉపసంహరించే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మధ్యనే జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్బీఐ రీజనల్ డైరక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రూ.10 నాణేలు చెల్లవన్న వదంతులను ఖండించారు. అసలు ఈ ప్రచారం ఎక్కడ మొదలయ్యిందో, ఎవరు ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అన్ని రకాల పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై వారం రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు రాష్ట్రానికి ఆర్బీఐ నుంచి ఒక్క నయాపైసా కూడా రాలేదు. దీంతో రాష్ట్రంలో నగదుకొరత అంతకంతకు తీవ్రమవుతోంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. చిన్న బ్యాంకులు రొటేషన్ విధానంలో తమ దగ్గర ఉన్న నగదుతో నెట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో నగదు కొరత గురించి ఆర్బీఐ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్నామని, మార్చి 31న తక్షణ అవసరాలకు రూ. 800 కోట్లు పంపుతున్నట్లు ఆర్బీఐ హామీ ఇచ్చిందని, కానీ ఆ మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రానికి చేరలేదని ఆ అధికారి స్పష్టం చేశారు. నగదు కొరతతో ఏటీఎంలు సగానికిపైగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మళ్లీ నగదు కష్టాలు
⇒బ్యాంకుల్లో నగదు కొరత ⇒విత్‌డ్రాలపై పరిమితి ⇒ఆర్బీఐ నుంచి వచ్చే నిధుల్లో కోత ⇒ మందగించిన లావాదేవీలు ⇒మూతపడిన ఏటీఎం కేంద్రాలు జిల్లాలో మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. గతేడాది చివరిలో పెద్ద నోట్ల రద్దు తర్వాత జనం చాలా యాతన పడ్డారు. జనవరి తర్వాత క్రమేపీ నగదు నిల్వలు పెంచడంతో అవస్థలు తప్పాయి. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. కానీ మార్చి చివరి వారంలో తిరిగి నోట్ల కొరత ఎదురయింది. ఏ ఏటీఎంకు వెళ్లినా నగదు ఉండటం లేదు. బ్యాంకులకు వెళ్లి క్యూలో నిల్చుంటే విత్‌డ్రాపై పరిమితి విధించడం నిరాశకు గురిచేస్తోంది. జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్బీఐ నుంచి నిధులు రాకపోవడమే దీనికి కారణమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. తిరుపతి (అలిపిరి) : బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది. తాజాగా విత్‌డ్రాలపై పరిమితి విధిస్తున్నాయి. జిల్లా అవసరాలకు వారానికి రూ.300 కోట్లు అవసరం. కానీ రిజర్వుబ్యాంకు నుంచి రూ.75 కోట్ల నుంచి రూ.125 కోట్లు మాత్రమే వస్తోందని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలలుగా జాతీయ బ్యాంకు శాఖల లావాదేవీలు మందగించాయి. జిల్లా వ్యాప్తంగా 40 జాతీయ బ్యాంకులకు చెందిన 595 బ్యాంకు శాఖలు వున్నాయి. నగదు రహిత లావాదేవీలంటూ ఆర్బీఐ కోత విధించడంతో ఎస్బీఐ కూడా విత్‌డ్రాలపై పరిమితి విధించింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకర్లు లావాదేవీలు కొనసాగించలేక తల పట్టుకుంటున్నారు. డిపాజిట్లపై ఆధారపడి బ్యాంకు శాఖలు ఏరోజుకారోజు లావాదేవీలు కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నగదు లేక కొద్ది రోజులుగా ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. ఒకటో తారీఖు మొదటి వారంలో.. ప్రతి నెల ఒకటో తారీఖు, మొదటి వారంలో బ్యాంకులకు భారీగా నగదు అవసరమవుతుంది. 38వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రూ.400 కోట్లు, 26వేల మంది విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.250 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 3,90,720 మందికి రూ.47 కోట్లు అవసరం. సామాన్య ఖాతాదారుల లావాదేవీల కోసం మరో రూ.300 కోట్లు అవసరం. అంటే జిల్లా అవసరాలకు వెయ్యి కోట్ల మేర నగదు అవసరం. గడచిన నెలలో ఆర్బీఐ నుంచి రూ.125 కోట్లు మాత్రమే చేరింది. ఈనెల మొదటి వారం ముగుస్తున్నా ఇంత వరకు జిల్లాకు చిల్లిగవ్వకూడా రాలేదు. దీంతో జాతీయ బ్యాంకుల లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. గురువారం ఎస్బీఐ పలు శాఖల్లో నగదు విత్‌డ్రా పరిమితిని రూ.5వేలకు కుదించారు. ఏటీఎంలలో నో క్యాష్ జిల్లాలోని 709 ఏటీఎం కేంద్రాల్లో 10 శాతం కూడా పనిచేయడం లేదు. జిల్లాకు చేరుతున్న అరకొర నగదు బ్యాంకు లావాదేవీలకే సరిపోవడం లేదు. బ్యాంకర్లు ఏటీఎంల నిర్వహణ జోలికి వెళ్లడం లేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ఏటీఎం కేంద్రాలు మూతబడి ఉన్నాయి. అత్యవసరాలకూ చేతికి సొమ్ము రాకపోవడంతో జనం ఆందోళనచెందుతున్నారు. డబ్బులు ఎకౌంటులో ఉన్నా అప్పు తెచ్చానని పద్మావతీపురానికి చెందిన రామారావు వాపోయాడు. ఆర్బీఐ నుంచి అధిక మొత్తంలో నగదు అందే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. -
ట్రంప్ ‘హెల్త్‌కేర్’ గోవింద
⇒ మద్దతు కూడగట్టడంలో విఫలం, బిల్లు ఉపసంహరణ ⇒ ప్రతినిధుల సభలో సొంత పార్టీ సభ్యులే తిరుగుబాటు.. ⇒ ఇక దుష్పరిణామాలు తప్పవంటూ ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ హెల్త్‌కేర్ బిల్లుకు ఎదురుదెబ్బ తగిలింది. బిల్లు ఆమోదానికి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన బిల్లును ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని మరోసారి స్పష్టమైంది. గురువారమే బిల్లును సభలో ప్రవేశపెట్టినా తగినంత మంది సభ్యులు లేకపోవడంతో వాయిదా వేశారు. ప్రతినిధుల సభలో హెల్త్‌కేర్ బిల్లుకు కావల్సినన్ని ఓట్లు రాబట్టేందుకు శుక్రవారం ట్రంప్ తరఫున స్పీకర్ పాల్ ర్యాన్ ప్రయత్నించి విఫలమయ్యారు. రిపబ్లికన్ పార్టీలోని కొందరు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లు ఆమోదానికి అవసరమైన 215 ఓట్లు రావడం కష్టమని తేలిపోయింది. దీంతో బిల్లు ఓడిపోతే పరాభవం తప్పదని భావించి స్పీకర్ ర్యాన్ ఓటింగ్‌ను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఫ్రీడమ్ కౌకస్ పేరుతో ప్రత్యేక బృందంగా ఏర్పడ్డ రిపబ్లికన్ పార్టీ చట్టసభ్యులు బిల్లుకు మద్దతు ప్రకటించేందుకు నిరాకరించారు. మొదటి నుంచి ‘ఒబామాకేర్’ వైద్య పాలసీని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒబామాకేర్ అమెరికాకు మంచి కాదని, అధిక వ్యయం– తక్కువ లాభాలు అనేది ఆయన వాదన. అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కొత్త హెల్త్‌కేర్ పాలసీని అమలుకు ట్రంప్ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ ఉండడంతో బిల్లు సులువుగా ఆమోదం పొందుతుందని ట్రంప్ భావించారు. అయితే ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. భారత్ లోక్‌సభ తరహాలోనే అమెరికాలో కీలకమైన ప్రతినిధుల సభలో మొత్తం 435 మంది సభ్యులున్నారు. ఇందులో రిపబ్లికన్ల సంఖ్య 235. బిల్లు ఆమోదానికి అవసరమైన 215 ఓట్లు సులువుగా పడతాయని ట్రంప్ సర్కారు అంచనా వేసింది. సొంత పార్టీలోనే చాలామంది తిరుగుబాటు చేయడంతో బిల్లు వెనక్కి తీసుకోక తప్పలేదు. భారత్‌లా కాకుండా పార్టీలకతీతంగా బిల్లుపై స్వేచ్ఛగా ఓటు వేసే వెసులుబాటు ప్రతినిధుల సభలోని చట్ట సభ్యులకుంది. హెల్త్‌కేర్ విధానంపై ట్రంప్ సర్కారు ఓటమి వార్త తెలిసి షికాగోలోని ట్రంప్ టవర్ వద్ద సంబరాలు చేసుకుంటున్న అమెరికన్లు ట్రంప్ అసహనం... హెల్త్‌కేర్ బిల్లుకు మద్దతు లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష డెమోక్రటన్లే దీనికి కారణమన్నారు. ఒబామాకేర్ ఇకపై కూడా కొనసాగబోతోందని, ఒక్కసారిగా ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుదలను ప్రజలు చూడబోతున్నారని హెచ్చరించారు. ‘ఇందులో చేయగలిగిందేమీ లేదు. చెడు పరిణామాలు సంభవించనున్నాయి. ఏడాదిన్నరగా చెబుతూనే ఉన్నా... ఒబామాకేర్ కొనసాగితే పరిస్థితి దిగజారుతుంది. ఈ పాలసీ ప్రీమియంలు భారీగా పెరిగి ఎవరూ దీన్ని ఉపయోగించుకోలేని దుస్థితి వస్తుంది’అని బిల్లు ఉపసంహరించాక మీడియా సమావేశంలో ట్రంప్ చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే మంచి హెల్త్‌కేర్ బిల్లును తేవడంలో రిపబ్లికన్లతో డెమోక్రటన్లు కూడా కలిసివస్తారని భావిస్తున్నానన్నారు. కేవలం పది–పదిహేను ఓట్లే తగ్గాయని, తమ బిల్లు ఎంత అద్భుతమైనదో ఇంకా చాలా మంది తెలుసుకోలేకపోతున్నారని ట్రంప్ అన్నారు. ఇక పన్ను సంస్కరణలపై దృష్టి పెడతానన్నారు. -
రూ.2 వేల నోటుపై వివరణ ఇచ్చిన జైట్లీ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం చలామణిలోకి తీసుకొచ్చిన కొత్త రూ.2వేల నోటుపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీవివరణ ఇచ్చారు. రూ.2 వేల నోటును రద్దు చేసే ఆలోచన లేదని శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పష్టం చేశారు. డీమానిటైజేషన్ తరువాత తీసుకొచ్చిన రూ .2 వేల నోటును ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదన లేదని లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో జైట్లీ తెలిపారు. అలాగే రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత రూ 12.44 లక్షల కోట్ల (డిసెంబర్ 10, 2016 నాటికి) మొత్తం పాతనోట్లు బ్యాంకులకు చేరినట్టు లోక్‌సభలో చెప్పారు. మార్చి 3, 2017 నాటికి మొత్తం చలామణీలో వున్న కరెన్సీ విలువ రూ.12 లక్షలకోట్లుగా ఉండగా, జనవరి 27 నాటికి రూ.9.921 లక్షల కోట్లుగా ఉందని వివరించారు. అయితే ఈ వివరాలను ఇంకా పరిశీలించాల్సి ఉందని, అకౌంటింగ్ లో తప్పులు, డబుల్ కౌంటింగ్ తదితర కారణాల రీత్యా పూర్తివివరాలు ఇంకా అందాల్సి ఉందన్నారు. అనినీతిని, నల్లధనం, నకీలి కరెన్సీ, టెర్రరిజాన్ని నిరోధించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును చేపట్టిందని ఆర్థిక మంత్రి సభలో ప్రకటించారు. డీమానిటైజేషన్ కాలంలో నగదు విత్ డ్రా లపై కొన్ని నిబంధనలు విధించినా, ఆ తర్వాత క్రమంగా వాటిని తొలగించామని జైట్లీ చెప్పారు. -
పన్నీర్ సెల్వం రాజీనామా వెనక్కి తీసుకోవచ్చా?
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం గతవారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠ పోరాటం నుంచి శశికళ ఔట్ అయ్యారు. ఇక ఆ పోస్టుకు పన్నీర్ సెల్వం ఒక్కరే మిగిలారు. కానీ పన్నీర్‌పై పట్టువదలని శశికళ తాను జైలుకు వెళ్తూ కూడా తన వర్గం నుంచి కొత్తవ్యక్తి పళనిస్వామిని రంగంలోకి దింపారు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని సంకేతాలు ఇస్తున్నారు. అయితే పన్నీర్ సెల్వం లీగల్‌గా తన రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని పరిస్థితుల్లో రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. మొత్తం మూడు రకాల పరిస్థితుల్లో గవర్నర్, ముఖ్యమంత్రి రాజీనామా విత్‌డ్రాను ఆమోదించవచ్చని కొందరు మాజీ జడ్జిలు పేర్కొంటున్నారు. మోసం, బలవంతం లేదా అనుచిత ప్రభావంతో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తే, దాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదురుతుందని తెలుస్తోంది. అయితే సంబంధిత వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో నిరూపించుకోవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు తెలుపుతున్నారు. పన్నీర్ సెల్వం కూడా తనను బలవంతం మీద ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని నిరూపించుకోవాలని మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి ఒకరు చెప్పారు. అయితే శశికళ వర్గంలోని ఓ వ్యక్తిని అధికార పార్టీకి కొత్త నేతగా ఎన్నుకుంటే, ఆ సమయంలో మెజార్టిని ఇరు వర్గాలు నిరూపించుకునేందుకు గవర్నర్ పిలుపునిచ్చే అవకాశముంటుందని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే పరిస్థితి నెలకొంది. శశికళ వర్గం పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ విషయంపై గవర్నర్ ఏం చెబుతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇదే పరిస్థితి 1984 ఎన్ టీ రామారావును ముఖ్యమంత్రిగా తొలిగిస్తూ నాదెళ్ల భాస్కర్ రావును సీఎంగా నియమించిన సందర్భంలో ఎదురైంది. సీఎం పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు చేసిన రోజు తనని బలవంతంగా రాజీనామా చేపించినట్టు పేర్కొన్నారు. -
భారతీయులకు వీసా-ఫ్రీ సౌకర్యం రద్దు
బీజింగ్ : భారత ప్రయాణికులు ఎక్కువగా సందర్శించే ప్రాంతం హాంకాంగ్. చైనా ప్రత్యేక పాలనలో ఉన్న ఈ హాంకాంగ్ ప్రస్తుతం భారత ప్రయాణికులకు షాకిచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న వీసా ఫ్రీ సౌకర్యాన్ని సోమవారం నుంచి ఉపసంహరిస్తున్నట్టు పేర్కొంది. సోమవారం నుంచి భారతీయులు తమ రాకను ముందస్తుగా ఆన్లైన్లో నమోదుచేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. హాంకాంగ్‌కు రావడానికి భారతీయులకు జనవరి నుంచి ప్రీ-అరైవల్ రిజిస్ట్రేషన్‌ను అమల్లోకి తెస్తామని, ఈ ఆన్లైన్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు హాంకాంగ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. భారత దేశానికి చెందిన వారు కచ్చితంగా దీన్ని అప్లయ్ చేసుకోవాలని, హాంకాంగ్ సందర్శించే ముందు ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్‌ను ఆన్లైన్లో దాఖలు చేసుకోవాలని తెలిపింది. ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఆరు నెలల వరకు వాలిడ్‌లో ఉంటుంది. ఈ కాలంలో అప్లికెంట్ ఎన్నిసార్లైనా హాంకాంగ్‌ను సందర్శించుకోవచ్చు. ఈ ప్రభావం వేలకొద్దీ భారతీయులపై ప్రభావం చూపనుంది. భారత వ్యాపారవేత్తలు, పర్యాటకులు హాంకాంగ్‌ను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇన్నిరోజులు వీరందరికీ వీసా అవసరం లేకుండానే కేవలం వాలిడ్ పాస్పోర్టుతో 14 రోజుల పాటు హాంకాంగ్‌లో పర్యటించే అవకాశం ఆ దేశం కల్పించింది. భారత్ నుంచి వచ్చే సందర్శకుల తాకిడి పెరగడంతో హాంకాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే చైనా ఒత్తిడితోనే హాంకాంగ్ దీన్ని ఉపసంహరించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
డిసెంబర్ 30 తర్వాతా విత్‌డ్రాపై ఆంక్షలు
-
30 తర్వాతా విత్‌డ్రాపై ఆంక్షలు
• డిమాండ్‌కు తగ్గ నగదు లేకపోవడమే కారణం! • నగదు లభ్యత మెరుగుపడితేనే ఆంక్షల సడలింపు న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాపై ఆంక్షలు.. పెద్దనోట్ల రద్దు ప్రక్రియకు విధించిన డిసెంబర్ 30 గడువు తర్వాత కూడా కొనసాగే అవకాశముంది. కరెన్సీ ప్రెస్సులు, రిజర్వు బ్యాంకు.. డిమాండ్‌కు తగిన మొత్తంలో కొత్త కరెన్సీని అందించలేకపోతుండడమే దీనికి కారణం. ప్రస్తుతం ఏటీఎం, బ్యాంకుల నుంచి వారానికి రూ. 24 వేలు, రోజుకు రూ. 2,500 విత్‌డ్రా చేసుకునే అవకాశమున్నా.. బ్యాంకులు నగదు కొరత వల్ల ఆ మొత్తాన్ని ఖాతాదారులకు అందించలేకపోతున్నాయి. నగదు లభ్యతను బట్టి కొంత మొత్తాన్ని మాత్రమే అందిస్తున్నాయి. నోట్ల రద్దుకు నిర్దేశించిన 50 రోజుల గడువు దగ్గరపడుతు న్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలోనూ విత్‌డ్రాపై ఆంక్షలు కొనసాగొచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. ‘విత్‌డ్రా పరిమితిని పూర్తిగా ఎత్తేస్తారని మాలో చాలామంది అనుకోవడం లేదు. నగదు లభ్యత మెరుగుపడితే మాత్రం ఆంక్షలను సడలించే అవకాశం ఉంది’ అని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి చెప్పారు. ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేయకపోవచ్చని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా పేర్కొంటున్నాయి. బ్యాంకులకు మరింత నగదు అందనంత వరకు ఆంక్షలు ఉంటాయని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా సూచన ప్రాయంగా చెప్పారు. విత్‌డ్రాపై ఆంక్షలు ఎప్పుడు తొలగిస్తారో ఆర్బీఐ, ప్రభుత్వం కూడా చెప్పకపోవడం గమనార్హం. డిసెంబర్ 30 తర్వాత విత్‌డ్రా పరిమితిపై సమీక్ష ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా చెప్పారు. చలామణిలో ఉండిన రూ. 15.4 లక్షల కోట్ల రూ. 500, రూ.1,000 నోట్లకు గాను నవంబర్ 8– డిసెంబర్ 19 మధ్య కాలంలో రిజర్వు బ్యాంకు రూ. 5.92 లక్షల కోట్ల కరెన్సీని విడుదల చేసింది. డిసెంబర్ 10 వరకు రూ. 12.4 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరాయి. -
రాజ్యాంగ బెంచ్‌కు నోట్ల రద్దు
► 9 అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరపుతుందన్న సుప్రీం ► పాత నోట్ల వినియోగాన్ని పొడిగించాలన్న పిటిషన్ల తిరస్కరణ న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్లను ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెట్లు, వినియోగ బిల్లుల చెల్లింపులకు అనుమతించాలన్న విజ్ఞప్తులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ వినతులతో దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. అలాగే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను తేల్చే బాధ్యతను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ బెంచ్ మొత్తం 9 అంశాలపై విచారణ జరుపుతుందని తెలి పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 8న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వచ్చిన ఫిర్యాదులకు ఉన్న ప్రజా ప్రాముఖ్యత దృష్ట్యా ఈ అంశాన్ని విస్తృత బెంచ్‌కు అప్పగించడం సముచితమని భావిస్తున్నట్టు పేర్కొంది. ‘రద్దు చేసిన నోట్ల వినియోగాన్ని పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రమే సరైనది’ అని పేర్కొంది. ‘24 వేల విత్‌డ్రా’ను నెరవేర్చండి బ్యాంకుల్లో వారానికి విత్‌డ్రా పరిమితిని రూ. 24 వేలుగా నిర్ణయించినా.. బ్యాంకులు ఆ మొత్తాన్ని అందజేయడం లేదని, ఆ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని వచ్చిన పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. ప్రభుత్వం కోరిన 50 రోజుల గడువు ఇంకా ముగియలేదని, ఆ సమయానికల్లా నగదు చలామణి పెరుగుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పిన మాటలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటి వరకూ 40 శాతం పాతనోట్లను కొత్త రూ.2,000, రూ.500 నోట్లతో భర్తీ చేసినట్టుగా కేంద్రం చెప్పింది. వారానికి రూ. 24 వేల విత్‌డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం ఆ హామీని నెరవేర్చాలని సూచించింది. హైకోర్టుల్లో నోట్ల రద్దు విచారణపై స్టే నోట్ల రద్దును సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీం స్టే విధించింది. వీటన్నింటిని తామే విచారిస్తామంది. ఇకపై దీనికి సంబంధించిన రిట్ పిటిషన్లను ఇతర కోర్టు స్వీకరించరాదని పేర్కొంది. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అవసరమనుకుంటే తమను ఆశ్రయించవచ్చంది. అలాగే నవంబర్ 11 నుంచి 14 వరకూ దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లు స్వీకరించిన రూ.8,000 కోట్లను కొత్త కరెన్సీతో నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అటార్నీ జనరల్ హామీకి సుప్రీంకోర్టు అంగీకరించింది. -
నేటి నుంచి గరీబ్ కల్యాణ్
నల్ల కుబేరులకు మరో అవకాశం ► అప్రకటిత నగదులో 50 శాతం పన్నుగా చెల్లించి బయటపడొచ్చన్న కేంద్రం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ క్యలాణ్ యోజన(పీఎంజీకేవై)లో భాగంగా 50 శాతం పన్ను చెల్లించి బయటపడే పథకాన్ని శనివారం నుంచి అమల్లోకి తెస్తున్నామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ఈ పథకం ద్వారా అప్రకటిత నగదు ప్రకటించేందుకు నల్ల కుబేరులకు మరో అవకాశమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, పన్ను చట్టాల కింద ఎలాంటి విచారణ ఉండబోదని, మార్చి 31 వరకూ డిక్లరేషన్లు సమర్పించవచ్చని తెలిపారు. పీఎంజీకేవైలో నల్లధనాన్ని ప్రకటించకుండా... ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపితే మొత్తం 77.25 శాతం మేర పన్నులు, జరిమానా కట్టాల్సి ఉంటుందన్నారు. పీఎంజీకేవైలో, లేదా ఆదాయపు పన్ను దాఖలులో చూపకపోతే అదనంగా మరో 10 శాతం పన్ను చెల్లించాలని అధియా పేర్కొన్నారు. గరీబ్ కల్యాణ్ అమలు కోసం పన్ను చట్టాలు(రెండో సవరణ)2016 బిల్లును గత నెల్లో లోక్‌సభ ఆమోదించింది. శనివారం నుంచి బ్యాంకుల వద్ద దొరికే చలాన్లు నింపి డిక్లరేషన్లు సమర్పించాలని అధియా వెల్లడించారు. ముందుగా పన్నులు చెల్లించి రసీదు చూపితేనే పథకం వర్తిస్తుందని తెలిపారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రతీ బ్యాంకు ఖాతా వివరాల్ని రాబడుతోందని, ఐటీ, ఈడీ ఇతర విచారణ సంస్థలు ఖాతాల సమాచారంపై నిఘా పెట్టాయని చెప్పారు. డిసెంబర్ 30 తర్వాత విత్‌డ్రాపై సమీక్షిస్తాం డిసెంబర్ 30 అనంతరం ఖాతాల నుంచి విత్‌డ్రా పరిమితిని సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి వారానికి రూ. 24 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ. 2.5 వేల పరిమితి కొనసాగుతోంది. -
నో పెన్షన్.. నో రేషన్ .. నో క్యాష్
జీతాల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరినా ఉద్యోగులకు నిరాశే మిగిలింది. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రా పది వేలకే పరిమితం చేయడం, మరికొన్ని బ్రాంచ్‌ల్లో సొమ్ముల్లేవని చేతులేత్తేయడంతో చేసేది లేక రిక్తహస్తాలతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి డబ్బులు దక్కినా అవి రూ. 2 వేలు నోట్లు కావడంతో ఇంట్లో చిల్లర ఖర్చులకు ఏ విధంగా నెట్టుకురావాలో తెలియక మల్లగుల్లాలు పడ్డారు. పింఛన్ కోసం వృద్ధులు, వితంతువులు వార్డు కార్యాలయాలు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడితే ఇక్కడ కాదు.. బ్యాంకులకు పొమ్మన్నారు. అక్కడకు వెళితే ఖాతాలో ఇంకా పింఛన్ సొమ్ము జమకాలేదని చెప్పడంతో వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులు మాత్రం ఖాతాలున్న ప్రతి ఒక్కరికి తొలిరోజే పింఛన్ వేసినట్టుగా ప్రకటనలు చేశారు. కానీ జిల్లాలో ఏ ఒక్కరికి తొలిరోజు పింఛన్ సొమ్ములు చేతికొచ్చిన దాఖలాలు కన్పించలేదు. సకాలంలో సరుకులందక కొన్ని, ఈపాస్ మిషన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ కాక మరికొన్ని రేషన్ షాపులు తెరుచుకోలేదు. రేషన్ డిపోల్లో స్వైపింగ్ మిషన్లు అనుసంధానం కాకపోవడంతో రేషన్ కోసం వచ్చిన కార్డుదారులు వెనక్కి వెళ్లిపోయారు. మరికొంతమంది డీలర్లు సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ అరుు నా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదనే సాకుతో సరుకులు పంపిణీ చేయలేదు. విశాఖపట్నం : నడవలేని వారు..కంటిచూపు లేనివారు.. ఎటువంటి ఆసరా లేని నిర్భాగ్యులు.. వితం తువులు, వృద్ధులు తొలిరోజే నిరాశకు గురయ్యారు. పంచాయతీ కార్యాలయాలు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడితే ఇక్కడ కాదు..బ్యాంకులకు పొమ్మన్నారు. కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుల వద్దకు వెళ్తే మీకు ఖాతాలో ఇంకా పింఛన్ సొమ్ము జమకాలేదని కొందర్ని.. మీకు ఖాతాలే లేవు కదా.. సొమ్ములెలా పడతాయంటూ మరికొందరికి చెప్పడంతో రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఖాతాలో పింఛన్ సొమ్ములు పడిన వారు సైతం తీసుకునే పరిస్థితి లేక అలో లక్ష్మణా అంటూ వెనుదిరగడం కన్పించింది. అధికారులు మాత్రం ఖాతాలున్న ప్రతి ఒక్కరికి తొలిరోజే పింఛన్ వేసినట్టుగా ప్రకటనలు చేశారు. కానీ జిల్లాలో ఏ ఒక్కరికి తొలిరోజు పింఛన్ సొమ్ములు చేతికొచ్చిన దాఖలాలు కన్పించలేదు. జిల్లాలో 3,24,947 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో ఖాతాలున్న 2,06,335 మందికి పింఛన్ సొమ్ము జమైనట్టుగా డీఆర్డీఏ పీడీ సత్యసారుు శ్రీనివాస్ ప్రకటించారు. కానీ వీరిలో ఏ ఒక్కరికి బ్యాంకుల్లో సొమ్ములివ్వలేదు. రూపేకార్డుల కోసం పాట్లు ఖాతాలున్న వారిలో 11,087 మందికి మాత్రమే రూపే కార్డులు అందజేశారు. కార్డులున్న వారికి సైతం వీటిని ఏ విధంగా వినియోగించాలో కనీస అవగాహన లేదు. దీంతో ఏ ఒక్కరూ రూపే కార్డు ద్వారా సొమ్ములు తీసుకున్న దాఖలాలు కన్పించలేదు. ఇక రూపేకార్డుల కోసం వేలాది మంది వృద్ధులు బ్యాంకుల పద్ద పడిగాపులు పడడం కన్పించింది. మోకాళ్లలో పట్టు తగ్గి, నడుం వంగిపోరుున పలువురు పండుటాకులు బ్యాంకు ఖాతాల కోసం బ్యాంకుల పడిగాపులు పడుతున్నారు. శీతాకాలమైనప్పటికీ వేసవికాలాన్ని తలపించే రీతిలో కన్నేర్ర చేస్తున్న సూర్య తాపానికి తట్టుకోలేక చెంతాండంత క్యూలైన్లలో నిల్చొలేక నరకం చూశారు. తెరుచుకోని రేషన్‌షాపులు సకాలంలో సరుకులందక కొన్ని, ఈపాస్ మిషన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో మరికొన్ని రేషన్ షాపులు తెరుచుకోలేదు. ఈపాస్ మిషన్లు వర్తింప చేసిన 1,624 షాపుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పోస్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరపాలని నిర్ణరుుంచారు. అరుుతే 873 మంది డీలర్లు మాత్రమే కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయగలిగారు. అరుుతే పారుుంట్ ఆఫ్ సేల్ మిషన్లతో సంబంధం లేకుండా ఈపాస్ మిషన్లలోనే ఆ మేరకు సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పినప్పటికీ ఎక్కువ అమలుకాలేదు. దీంతో ఈపాస్ వర్తింపచేసిన షాపుల్లో సైతం నగదు రహిత లావాదేవీలు తొలిరోజు ఎక్కడా ప్రారంభం కాలేదు. రేషన్ డిపోల్లో స్వైపింగ్ మిషన్లు అనుసంధానం కాకపోవడంతో రేషన్ కోసం వచ్చిన కార్డుదారులు వెనక్కి వెళ్లి పోయారు. మరికొంతమంది డీలర్లు సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ అరుునప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదనే సాకుతో సరుకుల పంపిణీని ప్రారంభించ లేదు. నగదు తీసుకోకుండా సరుకులు డీలర్లకు, కార్డుదారులకు సగానికిపైగా ఖాతాలు, రూపె కార్డులు లేక పోవడంతో నగదు తీసుకోకుండా ఈ నెల సరుకులు పంపిణీ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ అయ్యారుు. సరుకులను ఉచితంగా ఇచ్చేస్తే ఆ సొమ్ము తమకు తిరిగిలా చెల్లిస్తారో లేదో అనే ఆందోళనతో చాలా మంది డీలర్లు సొమ్ములిస్తేనే సరుకులంటూ మెలికపెట్టడంతో డబ్బుల్లేక చాలా మంది వెనుదిరగడం కన్పించింది. ఇప్పుడు డబ్బులు వసూలు చేసుకోకపోతే వచ్చే నెల సరుకులకు డీడీలు ఎలా తీయాలనే ఆందోళనతో డీలర్లు ఉన్నారు. -
అసలు జీతాలు తీసుకుంటామా లేదా..!
అహ్మదాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత తొలి ఒకటో తారీఖు మరో మూడు రోజుల్లో రానుంది. ఈ తేదీ కోసం సాధారణంగా ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ రోజు తమ మరుసటి నెలకు సరిపోను వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని, పాల బిల్లు, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత. కానీ, ఈసారి మాత్రం డిసెంబర్ 1వ తారీఖు వస్తుందంటే మాత్రం జనాలకు ఒకటే భయం పట్టుకుంది. ఎందుకంటే బ్యాంకులు, ఏటీఎంల నిండుకున్న పరిస్థితి చూసి.. అసలు ఈ నెల జీతాన్ని చేతుల్లోకి తీసుకోగలమా లేదా అనే భయం వారిని ఇప్పటికే వెంటాడుతోంది. సాధారణ రోజుల్లోనే చిల్లర ఖర్చులకు కూడా సరిపోయేంత డబ్బును అటు ఏటీఎంల ద్వారాగానీ, బ్యాంకుల ద్వారా గానీ అందించలేనిది.. ఇక ఒకటో తారీఖు లక్షల్లో.. వేలల్లో జీతభత్యాలు తీసుకునే వారికి అందించగలుగుతారా.. ఆ రోజు పరిస్థితి ఊహించుకుంటేనే కంగారుపుట్టుకొస్తుందంటున్నారు. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో ప్రజలైతే తెగ ఆందోళనలకు కూరుకుపోయారు. ఆదివారం ఏటీఎంల వద్ద ఇక్కడ పెద్ద మొత్తంలో ఏటీఎంల వద్ద బారులు తీరారు. కానీ, ఏ ఒక్కరి చేతినిండా కూడా డబ్బు లేదు. పైగా నిరాశతో ఏటీఎంలు ఖాళీ అయిపోయానని వెనుదిరుగుతున్నారు. తమకు అత్యవసరంగా చెల్లించాల్సిన చిట్ ఫండ్స్, లోన్లు చాలానే ఉన్నాయని, బయట తీర్చాల్సిన రుణాలు ఉన్నాయని, జీతాలు రాకముందే ఏటీఎంల వద్ద ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక వచ్చాక ఎలా ఉంటుందా అని ఆలోచిస్తే తమకు తెగ భయమేస్తోందని కేవల్ మెహతా అనే ఓ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ తెలిపాడు. -
విత్‌డ్రాలతో సరి
- -ఏమాత్రమూ తగ్గని కరెన్సీ కష్టాలు – నగదు మార్పిడి నిలిపేసిన బ్యాంకర్లు – వేధిస్తున్న నగదు కొరత - తక్షణం సరఫరా కాకుంటే మరిన్ని ఇబ్బందులు – నేడు రూ.500 నోట్లు వస్తాయంటున్న అధికారులు అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల కష్టాలు ఏమాత్రమూ తీరడం లేదు. పైగా రోజురోజుకూ పెరుగుతుండడంలో ఆందోళన రెట్టింపవుతోంది. బ్యాంకుల్లోనే నగదు ఖాళీ అవుతోంది. అరకొరగా వస్తున్న నోట్ల కట్టలను ప్రజలకు సర్దుబాటు చేస్తున్నారు. నగదు సరఫరా మందకొడిగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. తక్షణం తగినంత నగదు సరఫరా కాకపోతే సమస్య తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ రూ.2 వేల నగదు మార్పిడిని పూర్తిగా నిలిపేశారు. అనంతపురం సాయినగర్ ఎస్బీఐ ప్రధాన శాఖలో మాత్రం ఒక కౌంటర్ ద్వారా మధ్యాహ్నం వరకు నగదు మార్పిడి చేశారు. సిండికేట్, ఆంధ్రా, ఏపీజీబీ, కెనరా, ఎస్బీహెచ్ లాంటి ప్రధాన బ్యాంకుల్లో నగదు మార్పిడికి ఫుల్స్టాప్ పెట్టేశారు. విత్‌డ్రాలు కూడా మరీ అత్యవసరమని వేడుకుంటే తప్ప.. ఒకేసారి రూ.24 వేలు ఎక్కడా ఇవ్వడంలేదు. రూ.4 వేల నుంచి మొదలు పెట్టి గరిష్టంగా రూ.10 వేలు ఇస్తున్నారు. రూ.100 నోట్ల కొరత తీవ్రంగా వేధిస్తుండగా, ఇప్పుడు రూ.2 వేల నోట్ల నిల్వలు కూడా చాలా బ్యాంకుల్లో అయిపోయాయి. జిల్లాలో 556 ఏటీఎంలకు గానూ 140 -150 మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలోనూ ఒక్కో ఖాతాదారునికి గరిష్టంగా ఒక రూ.2 వేల నోటు మాత్రమే వస్తోంది. వందలు పెట్టకపోవడంతో చిల్లర సమస్యతో సతమతమవుతున్నారు. రూ.2 వేల నోట్లు కూడా అయిపోవడంతో కొన్ని ఏటీఎంలు పాక్షికంగా సేవలందించాయి. జిల్లాలో మొదటిసారి రూ.2 వేల నోట్లు చెలామణిలోకి తెచ్చిన ఆంధ్రాబ్యాంకు అధికారులు.. ఇప్పుడు కొత్త రూ.500 నోట్లు కూడా ఇవ్వాలని తాపత్రయపడుతున్నారు. బహుశా శుక్రవారం ఇవి రావచ్చని చెబుతున్నారు. అయితే వీటిని ఏటీఎంలకే పరిమితం చేయాలని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బ్యాంకుల ద్వారా ఇచ్చే పరిస్థితి లేదు. అవి కూడా పరిమితంగా రావచ్చంటున్నారు. సోమవారం నుంచి ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయనున్నట్లు సీనియర్ మేనేజర్ ఒకరు తెలిపారు. ఇప్పటివరకు నగదు మార్పిడి, విత్‌డ్రాల ద్వారా రూ.700 కోట్ల వరకు పంపిణీ జరిగిందని, అందులోనూ కొత్త రూ.100 నోట్లు పెద్దఎత్తున ఇచ్చినా అవి బయట ప్రజల మధ్య పరస్పరం మార్పిడి జరగడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. స్వైప్ మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. వాటి గురించి కనీసం 10 శాతం మందికి కూడా సరైన అవగాహన లేకపోవడంతో నగదు రహిత లావాదేవీలకు కష్టంగానే ఉంటుందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. -
పెళ్లి పత్రిక చూపినా డబ్బు ఇవ్వరాయే
ఆందోళనలో పెళ్లి కుమార్తె తండ్రి నూనెపల్(కర్నూలు)లె: వివాహానికి డిపాజిట్ చేసిన సొమ్ములో నుంచి రూ. 2.50 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చుననే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. దీంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. చిత్రంలో కనిపిస్తున్న ఈయన పురుషోత్తం. నంద్యాల పట్టణంలో రైల్వేశాఖలోని ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నారు. ఈయన తన కుమార్తె దివ్యకు ఈనెల 24వ తేదీన వివాహం చేయనున్నాడు. అందుకు నూనెపల్లెలోని ఆంధ్రాబ్యాంక్‌లోని తన ఖాతాలో దాచుకున్న సొమ్ము రూ. లక్షతో పాటు బ్యాంక్‌లో తీసుకున్న రుణం మొత్తంకలిపి రూ. 6 లక్షలు ఉంది. ఈ డబ్బుతో బిడ్డ పెళ్లి చేయాలనుకున్నాడు. అంతలోపే కేంద్రం పెద్దనోట్ల రద్దు చేయడంతో డా్ర చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. పెళ్లికి రూ. 2.50 లక్షల వరకు ఇవ్వవచ్చునని కేంద్రం చెప్పినా వారానికి రూ. 20వేలు మించి ఇవ్వమని బ్యాంకు అధికారులు చెబుతున్నారని వాపోతున్నాడు. ఎందుకిలా అని బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నిస్తే తమకు ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటునారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై బ్యాంక్ మేనేజర్ హరీష్ కుమార్ వివరణ కోరితే వారంలో రూ. 24వేలు మాత్రమే ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిందనా్నరు. ఎక్కువ మొత్తంలో నగదు ఇవ్వలేమని, పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లకు అవసరమైతే (షామియానా, వంట మాస్టర్) సంబంధిత వారి ఖాతాలను అందిస్తే అందులోకి బదలాయిస్తామని చెప్పారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
– కొత్తపేట ఎంపీటీసీ ఏకగ్రీవం – మూడు సర్పంచ్‌లు, 9వార్డు సభ్యులకు ఎన్నికలు – ప్రచారంలోకి అభ్యర్థులు జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : జిల్లాలో మూడు సర్పంచ్, 47వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పోటీలో ఉండే అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మంగళవారం పరిశీలించారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. బాలనగర్ మండలం నేరెళ్లపల్లి సర్పంచ్ స్థానానికి 6 నామినేషన్లు రాగా ఒక్కరు తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా మిగిలిన ఐదుగురు బరిలో నిలిచారు. కోయిలకొండ మండలలోని బూర్గుపల్లి సర్పంచ్ స్థానానికి మూడు నామినేషన్లు రాగా ఒక్కరు ఉపసంహరించుకున్నారు. ఇద్దరు బరిలో ఉన్నారు. మద్దూర్ మండలంలోని పల్లెర్ల గ్రామానికి ఐదు నామినేషన్లు రాగా ఇద్దరు ఉపసంహరించుకున్నారు. ముగ్గురు బరిలో నిలిచారు. మొత్తం 47వార్డు సభ్యులకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. 37 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో హన్వాడ మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 9స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో సీకేపల్లి, వటవర్లపల్లి, చిన్నతాండ్రపాడు, కుమార్లింగంపల్లి, పెద్దనందిగామ, నాచారం, బాలానగర్, శ్రీరంగాపూర్, బొక్కలోనిపల్లి గ్రామాల్లో వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. కాగా కేశంపేట మండలంలోని కొత్తపేట ఎంపీటీసీ ఎన్నిక ఏకగ్రీవమయింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో 8వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు. -
రూ.2 లక్షలు మాయం
భీమవరం టౌన్ : బ్యాంకు నుంచి తీసుకున్న రూ.2లక్షలు మాయం కావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. టూటౌన్‌కు చెందిన పి.రామరాజు గురువారం బ్యాంకుకు వెళ్లి రూ.రెండులక్షలు విత్‌డ్రా చేసి ఆ మొత్తాన్ని సంచిలో పెట్టుకుని మోటార్‌సైకిల్‌కు తగిలించాడు. ఇంటికి వెళ్లి చూడగా, నగదు ఉన్న సంచి కనిపించ లేదు. దీంతో అతను అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టూటౌన్ సీఐ ఎం.రమేష్‌బాబు శుక్రవారం తెలిపారు. బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించగా, కొందరు వ్యక్తులు అనుమానంగా సంచరించినట్టు గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.