న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్లపై ప్రతి నెల రూ.4 మేర పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఓవైపు ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తూ మరోవైపు ధరలు భారీగా పెంచడమన్నది పరస్పర విరుద్ధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు అక్టోబర్ నుంచి ఎల్పీజీ ధరల్ని పెంచలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సిలిండర్లపై సబ్సిడీని ఎత్తివేయడానికి వీలుగా ఒక్కో సిలిండర్ ధరను ప్రతినెల రూ.4 మేర పెంచాలని గతేడాది జూన్‌లో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment