బిహార్: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవాం మోర్చా(హెచ్ఏఎమ్) ప్రభుత్వానికి తన మద్దుతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంతోష్ సుమన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉపసంహరణ పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు.
కేబినెట్‌కు గత వారమే రాజీనామా చేసిన మాంఝీ తనయుడు సంతోష్ సుమన్.. నితీష్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తన పార్టీని విలీనం చేయాలని సీఎం బలవంతం చేస్తున్నట్లు ఆరోపించారు. పార్టీ భవిష్యత్తును ఢిల్లీకి వెళ్లి చర్చించనున్నట్లు చెప్పారు. మూడో కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
కాగా నితీష్ కుమార్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించిన జితన్ రాం మాంఝీ పార్టీ ఎన్డీయేకు చేరువయ్యేందుకు సంకేతాలు పంపింది. తాను మంగళవారం ఢిల్లీ వెళుతున్నానని, ఎన్డీయే నుంచి ఆహ్వానం అందితే కాషాయ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదననూ కూడా పరిశీలిస్తున్నామని సుమన్ తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశానికి సంబంధించిన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు.
నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న హిందుస్థాన్ స్వామ్ మోర్చా పార్టీ.. గతేడాది బీజేపీని వీడిన నితీష్ కుమార్‌కు మద్దతుగా మహాకూటమిలో చేరింది. ప్రస్తుతం బిహార్‌లో 243 సీట్లకు గాను ప్రభుత్వానికి చెందిన కూటమికి 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో పాటు మరో మూడు చిన్న పార్టీలు ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి.
ఇదీ చదవండి:గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. కాంగ్రెస్ ఫైర్.. రూ కోటి నిరాకరణ
Comments
Please login to add a commentAdd a comment