వింబుల్డన్ టోర్నమెంట్‌కు ముందు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలనే ఉద్దేశంతో... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 3 గంటల 35 నిమిషాల్లో 7–6 (7/5), 6–7 (3/7), 7–6 (7/4), 7–5తో ప్రపంచ 59వ ర్యాంకర్ డొమినిక్ కోప్‌ఫెర్ (జర్మనీ)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.‘నా సహాయక సిబ్బందితో చర్చించాక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. గతేడాది మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి.
పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకునే క్రమం లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచి ఫిట్‌నెస్ పరంగా నేను సరైన దారిలో వెళ్తున్నట్లునిపిస్తోంది’ అని 39 ఏళ్ల ఫెడరర్ అన్నాడు. గ్రాస్‌కోర్టు సీజన్‌లో భాగంగా ఈనెల 14న మొదలయ్యే హాలే ఓపెన్‌లో ఫెడరర్ ఆడతాడు. అనంతరం ఈనెల 28న ప్రారంభమయ్యే వింబుల్డన్ టోర్నీలో తొమ్మిదో టైటిలే లక్ష్యంగా ఫెడరర్ బరిలోకి దిగుతాడు.
Comments
Please login to add a commentAdd a comment