సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఖాతాలో డబ్బు లేకున్నా.. రూ. 80,000 వరకు విత్‌డ్రా తీసుకోవచ్చని ఒక బ్యాంక్ వెల్లడించింది. దీంతో వినియోగదారులు ATM సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ (Bank Of Ireland) ఖాతాలో ఉన్న డబ్బుతో సంబంధం లేకుండా సుమారు వెయ్యి డాలర్లను విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఈ బ్యాంక్ ఆన్‌లైన్ సిస్టం కొంత మందకొడిగా ఉండటం వల్ల యాప్స్ పనిచేయడంలేదని.. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ విధమైన ప్రకటన చేసింది.
ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్
ఈ బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి అవసరాల కోసం వెయ్యి డాలర్లను తీసుకున్నట్లయితే.. ఆ తరువాత అతడు జరిపే లావాదేవీల్లో ఈ మొత్తం వసూలు చేస్తుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది డబ్బు కోసం ఏటీఎమ్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరు కనీసం మూడు, నాలుగు గంటలు వెయిట్ చేసి మరీ డబ్బు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ వివరణ..
మొబైల్ యాప్ అండ్ 365ఆన్‌లైన్‌తో సహా మా అనేక సేవలపై ప్రభావం చూపుతున్న సాంకేతిక సమస్యపై పనిచేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ సమస్య వీలైనంత త్వరగా పరిష్కారమవుతుందని స్పష్టం చేసింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని తెలిపింది.
We are working on a technical issue that is impacting a number of our services including our mobile app and 365Online. We are working to fix this as quickly as possible and apologise to customers for any inconvenience caused. https://t.co/yO5ptZ6MfL
— Bank of Ireland (@bankofireland) August 15, 2023
Comments
Please login to add a commentAdd a comment