డిసెంబర్‌ 30 తర్వాతా విత్‌డ్రాపై ఆంక్షలు | Demonetisation: Restrictions on cash withdrawals likely to continue beyond December 30 | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 26 2016 7:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాపై ఆంక్షలు.. పెద్దనోట్ల రద్దు ప్రక్రియకు విధించిన డిసెంబర్‌ 30 గడువు తర్వాత కూడా కొనసాగే అవకాశముంది. కరెన్సీ ప్రెస్సులు, రిజర్వు బ్యాంకు.. డిమాండ్‌కు తగిన మొత్తంలో కొత్త కరెన్సీని అందించలేకపోతుండడమే దీనికి కారణం. ప్రస్తుతం ఏటీఎం, బ్యాంకుల నుంచి వారానికి రూ. 24 వేలు, రోజుకు రూ. 2,500 విత్‌డ్రా చేసుకునే అవకాశమున్నా.. బ్యాంకులు నగదు కొరత వల్ల ఆ మొత్తాన్ని ఖాతాదారులకు అందించలేకపోతున్నాయి. నగదు లభ్యతను బట్టి కొంత మొత్తాన్ని మాత్రమే అందిస్తున్నాయి. నోట్ల రద్దుకు నిర్దేశించిన 50 రోజుల గడువు దగ్గరపడుతు న్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement