సాక్షి,ముంబై: 2 వేల రూపాయల నోటును రీకాల్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోటును అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకోవచ్చని, డిపాజిట్ చేసుకోవచ్చని కూడా ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 2 వేల రూపాయల నోటు 2023 అక్టోబరు ఒకటి నుంచి చెల్లుబాటులో ఉండవు.
మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో ఈ రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక రోజులో ఒకవ్యక్తి గరిష్టంగా రూ. 20 వేల విలువైన నోట్ల వరకు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. అయితే డిపాజిట్ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు బ్యాంకులకు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: జేబులోనే పేలిన మొబైల్: షాకింగ్ వీడియో వైరల్
రూ. 2000 నోటు మార్పిడికి డిపాజిట్లకు బ్యాంకులు నిరాకరిస్తే?
ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారంరూ. 2 వేల నోట్లను గడుపు లోపల తీసుకునేందుకు నిరాకరించవు. ఒక వేళ బ్యాంకులు నిరాకరిస్తే ఏంచేయాలనేది వినియోగదారులకుపెద్ద ప్రశ్న. రూ. 2వేల నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి బ్యాంకు నిరాకరించినట్లయితే, సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయవచ్చు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?)
అలాంటి అనుభవం ఎదురైతే కొత్త వన్ నేషన్, వన్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద నాలుగు మార్గాల్లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 14448కి ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:15 గంటల మధ్య కాల్ చేయవచ్చు. అలాగే ఆర్బీఐకి ఈ ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే సెంట్రలైజ్డ్ రసీదు అండ్ ప్రాసెసింగ్ సెంటర్', రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్ - 160017 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా భౌతిక ఫిర్యాదును పంపవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment