RBI Will Withdraw Rs.2000 Notes From Circulation But They Will Continue As Legal Tender - Sakshi
Sakshi News home page

రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్‌ చేసుకోవచ్చా?

Published Fri, May 19 2023 9:20 PM | Last Updated on Sat, May 20 2023 9:26 AM

Rs 2000 notes WITHDRAWN from circulation NOT demonetisation do shopping - Sakshi

సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించు కుంటున్నట్టు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 2018 నుంచి రూ. 2 వేల నోట్లను ముద్రణను నిలిపివేసిన నేపథ్యంలో గత కొంతకాలంగా  ఈ నోట్ల రద్దుపై భారీ ఊహాగానాలున్నాయి. అయితే తాజాగా రూ. 2000 నోట్లను చలామణి నుంచి  విత్‌ డ్రా చేస్తున్నట్టు, అయితే సెప్టెంబరు 30 వరకు చట్టబద్ధంగా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. తక్షణమే 2,000 నోట్ల జారీ నిలిపివేయాలని కూడా బ్యాంకులకు ఆదేశించింది. అలాగే డిపాజిట్ /లేదా మార్పిడి సదుపాయాన్ని అందించాలని బ్యాంకులను కోరింది. ('క్లీన్ నోట్ పాలసీ' అంటే? ఆర్బీఐ బ్యాంకులకిచ్చిన కీలక ఆదేశాలు తెలుసుకోండి!)

అయితే దీనిపై ప్రముఖ ఎనలిస్ట్ లతా వెంకటేశ్‌ దీనిపై ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. 2000రూపాయి నోట్లు చలామణి నుండి ఉపసంహరణ తప్ప నోట్ల డీమోనిటైజేషన్ కాదని దయచేసి గమనించాలని ఆమె పేర్కొన్నారు. అవి చట్టపరమైన టెండర్‌గా ఉంటాయి. అంటే మీరు దుకాణానికి వెళ్లి దానితో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ప్రజలు భయాందోళన చెందకముందే దయచేసి ఈ విషయంపై అవగాహన కల్పించాలంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాదుఆర్బీఐ ప్రకటన తరువాత ఏ దుకాణదారుడు ఇప్పటి నుండి అంగీకరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30, 2023 లోపు  బ్యాంకుకు వెళ్లి మార్పిడి లేదా డిపాజిట్ చేయవచ్చు అని ఆమె వివరించారు.

 ఏ షాప్‌ ఓనర్‌ అంగీకరిస్తాడు
అయితే  కొనుగోలు సమయంలో ఏ దుకాణ దారుడు వీటిని అంగీకరిస్తాడు అనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఈనోట్లను సెప్టెంబర్ 30 వరకు మాత్రమే. ఆ తర్వాత అది ఉనికిలో ఉండదు. అంటే రిస్క్‌ అతని చేతిలో ఉంటుంది.  ఎందుకంటే  షాప్‌ ఓనరే  ఆయా నోట్లను డిపాజిట్ చేయాలి. లేదా మార్పిడి చేసుకోవాలి. అయితే డిపాజిట్ల విషయంలో పరిమితి ఏదీ లేనప్పటికీ, మార్పిడి మాత్రం ఒకసారి 20000 (అంటే 10 నోట్లు) మాత్రమే అవకాశం. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు)

వెన్నాడుతున్న  డీమానిటైజేషన్‌ భయాలు
2016 లో డీమానిటైజేషన్‌  దేశవ్యాప్తంగా పెద్ద  ప్రకంపనలు రేపింది. ఇచ్చిన గడువులోగా తమ దగ్గర ఉన్న రూ. 500, 1000 నోట్లమార్పిడి కోసం బ్యాంకుల వద్ద వినియోగదారులు క్యూలైన్లలో బారులు తీరారు. కొంతమంది క్యూలైన్లలోనే ప్రాణాలు విడిచిన ఘటనలు  కూడా చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన అనేక దృశ్యాలు, విషాద ఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement