బీజింగ్ : చైనాకు బ్రెజిల్ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రణాళికకు బ్రెజిల్ అడ్డుకట్టవేసింది. చైనా చేపట్టిన బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేరకూడదని నిర్ణయించుకుంది. తద్వారా ఈ భారీ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వని బ్రిక్స్ గ్రూపులోని రెండో దేశంగా బ్రెజిల్ అవతరించింది.
బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్ మీడియాతో మాట్లాడుతూ బ్రెజిల్ బీర్‌ఐలో చేరదని, అయితే ఇందుకు బదులుగా చైనా పెట్టుబడిదారులతో భాగస్వామిగా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. బ్రెజిల్ ఎటువంటి ఒప్పందాలపై సంతకం చేయకుండా, చైనాతో తన సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటోందన్నారు.
హాంకాంగ్‌కు చెందిన వార్తాపత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'లోని వార్తల ప్రకారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించిన చైనా ప్రణాళికకు బ్రెజిల్ మద్దతునివ్వడం లేదు. బ్రెజిల్ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు ఇటీవల చైనా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఇప్పటికే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్‌ఐ ప్రాజక్టు అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలకు విరుద్ధమని భారత్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment