వివాహ కార్డును చూపుతున్న పురుషోత్తం
అంతలోపే కేంద్రం పెద్దనోట్ల రద్దు చేయడంతో డా్ర చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. పెళ్లికి రూ. 2.50 లక్షల వరకు ఇవ్వవచ్చునని కేంద్రం చెప్పినా వారానికి రూ. 20వేలు మించి ఇవ్వమని బ్యాంకు అధికారులు చెబుతున్నారని వాపోతున్నాడు. ఎందుకిలా అని బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నిస్తే తమకు ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటునారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై బ్యాంక్ మేనేజర్ హరీష్ కుమార్ వివరణ కోరితే వారంలో రూ. 24వేలు మాత్రమే ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిందనా్నరు. ఎక్కువ మొత్తంలో నగదు ఇవ్వలేమని, పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లకు అవసరమైతే (షామియానా, వంట మాస్టర్) సంబంధిత వారి ఖాతాలను అందిస్తే అందులోకి బదలాయిస్తామని చెప్పారు.