సీనియర్ సిటిజన్లకు శుభవార్త. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఎస్‌ఈఎస్‌ఎస్) ను విత్ డ్రా చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ ఇకపై పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనౌన్స్ చేసింది.
సాధారణంగా పీపీఎఫ్, ఎస్‌ఈఎస్‌ఎస్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు నిర్వహించని అకౌంట్లు, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో అకౌంట్లను క్లోజ్ చేయాలంటే పోస్టాఫీసులకు రావాల్సి వచ్చేది. దీంతో 60ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు వయస్సు రిత్యా పోస్టాఫీస్‌లకు రావాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ఇండియన్ పోస్ట్ సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చింది.
ఈ రెండు స్కీమ్ లలో నుంచి మనీ విత్ డ్రా, అకౌంట్లను క్లోజ్ చేయడం చేసుకోవాలంటే అకౌంట్ హోల‍్డర్స్ పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని, వారి బదులు కుటుంబ సభ్యులు ఉంటే సరిపోతుందని వెల్లడించింది. అకౌంట్లను క్లోజ్ చేయడంతో పాటు మనీ విత్ డ్రాల్ వారి కుటుంబ సభ్యులు చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబసభ్యులు విత్ డ్రా చేసిన నగదును చెక్కుద్వారా, అకౌంట్ హోల్డర్ భద్రత కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా, బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తున్నట్లు తెలిపింది.
పోస్టాఫీస్‌కు వెళ్లకుండా నగదుని ఎలా డ్రా చేసుకోవాలి
పోస్ట్ ఆఫీస్ నుండి PPF లేదా SCSS నిధుల్ని సేకరించేలా కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చేందుకు ఈ రూల్స్ పాటించాల్సి ఉంది.
►వయస్సు రిత్యా తాము పోస్టాఫీస్‌కు వెళ్లలేకపోతున్నామని, తనకు బదులు మనీ విత్ డ్రాల్ చేసే హక్కు భార్య లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు హక్కు ఉందని నిర్ధారిస్తూ పోస్ట్ ఆఫీస్‌లో ఫారమ్ SB-12 పై సీనియర్ సిటిజన్ సంతకం చేయాల్సి ఉంటుంది.
►వీటితో పాటు అకౌంట్ హోల్డర్ అకౌంట్‌ను క్లోజ్ చేసేందుకు, పాక్షిక నగదు ఉపసంహరణ(partial withdrawal).SB-7ఫారమ్ పై,SB-7B form పై సంతకం చేయాల్సి ఉంటుంది.
►సీనియర్ సిటిజన్ ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు సీనియర్ సిటిజన్ కుటుంబ సభ్యుడి వివరాలను తెలుపుతూ అటాచ్ చేయాల్సి ఉంది.
►నిధులను ఉపసంహరించుకోవడానికి వ్యక్తి పాస్ బుక్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.
►లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ముందు అకౌంట్ హోల్డర్ సంతకాల్ని పోస్టాఫీసులో సంబంధిత అధికారులు చెక్ చేస్తారు. అనంతరం నగదు విత్ డ్రా చేసేందుకు అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment