sess
-
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
సీనియర్ సిటిజన్లకు శుభవార్త. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఎస్ఈఎస్ఎస్) ను విత్ డ్రా చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ ఇకపై పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనౌన్స్ చేసింది. సాధారణంగా పీపీఎఫ్, ఎస్ఈఎస్ఎస్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు నిర్వహించని అకౌంట్లు, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో అకౌంట్లను క్లోజ్ చేయాలంటే పోస్టాఫీసులకు రావాల్సి వచ్చేది. దీంతో 60ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు వయస్సు రిత్యా పోస్టాఫీస్‌లకు రావాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ఇండియన్ పోస్ట్ సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చింది. ఈ రెండు స్కీమ్ లలో నుంచి మనీ విత్ డ్రా, అకౌంట్లను క్లోజ్ చేయడం చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని, వారి బదులు కుటుంబ సభ్యులు ఉంటే సరిపోతుందని వెల్లడించింది. అకౌంట్లను క్లోజ్ చేయడంతో పాటు మనీ విత్ డ్రాల్ వారి కుటుంబ సభ్యులు చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబసభ్యులు విత్ డ్రా చేసిన నగదును చెక్కుద్వారా, అకౌంట్ హోల్డర్ భద్రత కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా, బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నట్లు తెలిపింది. పోస్టాఫీస్‌కు వెళ్లకుండా నగదుని ఎలా డ్రా చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ నుండి PPF లేదా SCSS నిధుల్ని సేకరించేలా కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చేందుకు ఈ రూల్స్ పాటించాల్సి ఉంది. ►వయస్సు రిత్యా తాము పోస్టాఫీస్‌కు వెళ్లలేకపోతున్నామని, తనకు బదులు మనీ విత్ డ్రాల్ చేసే హక్కు భార్య లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు హక్కు ఉందని నిర్ధారిస్తూ పోస్ట్ ఆఫీస్‌లో ఫారమ్ SB-12 పై సీనియర్ సిటిజన్ సంతకం చేయాల్సి ఉంటుంది. ►వీటితో పాటు అకౌంట్ హోల్డర్ అకౌంట్‌ను క్లోజ్ చేసేందుకు, పాక్షిక నగదు ఉపసంహరణ(partial withdrawal).SB-7ఫారమ్ పై,SB-7B form పై సంతకం చేయాల్సి ఉంటుంది. ►సీనియర్ సిటిజన్ ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు సీనియర్ సిటిజన్ కుటుంబ సభ్యుడి వివరాలను తెలుపుతూ అటాచ్ చేయాల్సి ఉంది. ►నిధులను ఉపసంహరించుకోవడానికి వ్యక్తి పాస్ బుక్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ►లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ముందు అకౌంట్ హోల్డర్ సంతకాల్ని పోస్టాఫీసులో సంబంధిత అధికారులు చెక్ చేస్తారు. అనంతరం నగదు విత్ డ్రా చేసేందుకు అనుమతిస్తారు. -
ఆక్సిజన్, టీకాల దిగుమతికి ఊపు
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత 15 పరికరాలపై దిగుమతి సుంకాన్ని మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. వీటిపై హెల్త్ సెస్‌ను కూడా తొలగించింది. ఈ మినహాయింపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్–19 టీకాల దిగుమతిపైనా మూడు నెలలపాటు దిగుమతి సుంకాన్ని మినహాయించింది. దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, టీకాల దిగుమతిపై సుంకం మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆసుపత్రులు, ఇళ్లలో కరోనా చికిత్సకు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాతోపాటు రోగుల సంరక్షణకు అవసరమైన పరికరాల సరఫరాను వెంటనే పెంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి సూచించారు. ఆక్సిజన్, వైద్య సామగ్రి లభ్యతను పెంచడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్లపై.. కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 3 నెలల కాలానికి మినహాయించాలని నిర్ణయించారు. దీనివల్ల ఆక్సిజన్, వైద్య పరికరాల లభ్యత పెరుగుతుందని, చవకగా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయా పరికరాల దిగుమతికి కస్టమ్స్ క్లియరెన్స్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రెవెన్యూ శాఖను ప్రధానమంత్రి ఆదేశించారు. ఆయా పరికరాల కస్టమ్స్ క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కస్టమ్స్ జాయింట్ సెక్రెటరీ గౌరవ్‌ను నోడల్ అధికారిగా ప్రభ్వుత్వం నామినేట్ చేసింది. సాధారణంగా మెడికల్ ఆక్సిజన్‌పై 5 శాతం, వ్యాక్సిన్లపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి నేపథ్యంలో ఈ సుంకాల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆక్సిజన్ సంబంధిత పరికరాలపై 5 నుంచి 15 శాతం కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం హెల్త్ సెస్ వసూలు చేస్తారు. వీటి నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చేసింది. మినహాయింపు లభించేవి ► మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ► ఆక్సిజన్ జనరేటర్లు ► ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్లు, ట్యూబుల సహిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ► వాక్యూమ్ ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్, ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్స్, క్రయోజనిక్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్స్ ► ఆక్సిజన్ కానిస్టర్ ► ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్ ► ఆక్సిజన్ నిల్వ ట్యాంకులు, ఆక్సిజన్ సిలిండర్స్, ట్యాంక్స్, క్రయోజెనిక్ సిలిండర్లు ► ఆక్సిజన్ రవాణా కోసం ఐఎస్వో కంటైనర్లు ► ఆక్సిజన్ రవాణా కోసం క్రయోజెనిక్ రోడ్ రవాణా ట్యాంకులు ► ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ లేదా నిల్వ కోసం పరికరాల తయారీకి విడిభాగాలు ► ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ఇతర పరికరాలు ► వెంటిలేటర్లు, కంప్రెషర్లు, విడిభాగాలు ► హై ఫ్లో నాజల్ కాన్యులా డివైజ్ ► నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్‌లో వాడే హెల్మెట్లు ► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్ ఓరోనాసల్ మాస్క్‌లు ► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్ నాసల్ మాస్క్‌లు -
పన్నుల వ్యవస్థలో విప్లవాత్మకం... జీఎస్టీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ ప్రవేశపెట్టడంతో పన్నుల భారం తగ్గిందని, దీనితో సరళతర పన్ను వ్యవస్థలో పన్నులు చెల్లించే వారి సంఖ్య దాదాపు రెట్టింపై 1.24 కోట్లకు పెరిగిందనీ ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. ఆర్థికశాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మొదటి వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ పలు ట్వీట్స్ చేసింది. దాదాపు 17 రకాల స్థానిక లెవీలు, 13 సెస్‌ల ఉపసంహరణలతో 2017 జూలై 1న జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు బాధ్యతల్లో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్‌జైట్లీ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ తాజా ట్వీట్స్ సారాంశాన్ని పరిశీలిస్తే... ► జీఎస్టీ ప్రవేశపెట్టకముందు అమల్లో ఉన్న బహుళ పరోక్ష పన్నుల వ్యవస్థ– వ్యాల్యూయాడెడ్ ట్యాక్స్ (వీఏటీ), ఎక్సైజ్, అమ్మకపు పన్ను వాటికి సంబంధించిన ఇతర చార్జీల వల్ల దేశ పౌరులపై అధిక పన్ను భారం ఉండేది. 31 శాతం వరకూ ఉన్న అధిక స్థాయి పన్ను రేటు ధరలపై ప్రభావం చూపేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పోయింది. తాజా వస్తు,సేవల పన్ను విధానం అటు వినియోగదారుకు అటు పన్ను చెల్లింపుదారుకూ స్నేహపూర్వకమైంది. ► జీఎస్టీకి ముందు అధిక పన్ను భారం వల్ల ఈ చట్రంలోకి రావడానికి వెనుకడుగు వేసే పరిస్థితి. అయితే సరళతర జీఎస్టీ వ్యవస్థలో పన్ను భారం తగ్గింది. దీనితో పన్ను చెల్లింపుదారు బేస్ కూడా పెరిగింది. ► జీఎస్టీ తొలినాళ్లలో అసెస్సీల సంఖ్య 65 లక్షలయితే, ఇప్పుడు ఈ సంఖ్య 1.24 కోట్లను దాటింది. ► జీఎస్టీ అమల్లో అరుణ్‌జైట్లీ పాత్ర కీలకమైనది. భారత్ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక చరిత్రాత్మక సంస్కరణ. అప్పట్లో వివిధ రాష్ట్రాలు విధించే విభిన్న పన్ను రేట్లు తీవ్ర వ్యయ భరితంగా ఉండేవి. ప్రజలు పన్నులు చెల్లించే స్థాయికి రేట్లను జీఎస్టీ తగ్గించింది. అప్పట్లో రెవెన్యూ న్యూట్రల్ రేటు 15.3 శాతం అయితే, దానితో పోల్చితే ఇప్పుడు జీఎస్టీ రేటు 11.6 శాతానికి తగ్గింది. ► రూ.40 లక్షల వరకూ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలపై ఇప్పుడు జీఎస్టీ మినహాయింపు ఉంది. ప్రారంభంలో ఇది రూ.20 లక్షలుగా ఉండేది. దీనికితోడు రూ.1.5 కోట్ల వరకూ టర్నోవర్ ఉన్న ఒక కంపెనీ కాంపోజిషన్ స్కీమ్ కింద కేవలం ఒక శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. ► జీఎస్టీ అమల్లోకి రావడంతోటే అనేక వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం జరిగింది. 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న దాదాపు 230 వస్తువుల్లో దాదాపు 200 వస్తువులను తక్కువ స్లాబ్స్ రేట్లలోకి మార్చడం జరిగింది. హౌసింగ్ రంగాన్ని 5 శాతం శ్లాబ్‌లో ఉంచగా, చౌక గృహాలకు సంబంధించి జీఎస్టీ రేటును ఒక శాతానికి తగ్గింది. ► జీఎస్టీకి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తిగా ఆటోమేటెడ్ చేయడం మరో విషయం. ప్రస్తుతం 50 కోట్ల రిటర్న్స్‌ను ఆన్లైన్లో దాఖలు చేయడం జరిగింది. 313 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ 2017 జూలై 1వ తేదీ అర్థరాత్రి నుంచీ భారత పన్నుల వ్యవస్థలో చరిత్రాత్మక మార్పు. ఒకే మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. బహుళ పన్ను వ్యవస్థకు తెరపడింది. ప్రస్తుతం 480 వస్తువులు పన్ను రహిత లేదా 5 శాతంలోపు పన్ను రేట్లలో ఉన్నాయి. 221 వస్తువులు 12 శాతం రేటు వద్ద, 607 వస్తువులు 18 శాతం రేటు వద్ద ఉండగా, కేవలం 29 వస్తువులు మాత్రమే 28% రేటు వద్ద ఉన్నాయి. ఆయా సడలింపుల నేపథ్యంలో పన్ను గడచిన మూడేళ్లలో పన్ను బేస్ పెరిగింది. 2017–18 తొమ్మిది నెలల్లో (జూలై–మార్చి) సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు. 2018–19లో నెలకు సగటు రెవెన్యూ 10% పెరిగి మొత్తంగా ఆదాయాలు రూ.97,100 కోట్లకు చేరాయి. 2019–20లో ఈ ఆదాయం ఏకంగా రూ.1,02,000కోట్లకు ఎగసింది. రేట్ల తగ్గింపు, పలు సడలింపులు ఇస్తున్నప్పటికీ, జీఎస్టీ స్థిరంగా పెరుగుతూ వస్తున్న విషయం గమనార్హం. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో, జీఎస్టీ భారం తగ్గడానికి ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ప్రవేశపెట్టింది. – అరుణ్‌జైట్లీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక ఆర్టికల్‌లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ -
లేబర్ సెస్‌ను వాడుకోండి!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నిర్మాణ రంగ కార్మికుల జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. నిర్మాణ సంస్థలు చెల్లించే లేబర్ సెస్‌ను కార్మికుల సంక్షేమానికి వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవలే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక, అనుబంధ ప్రయోజనాలను కల్పించడానికి లేబర్ సెస్‌ను వినియోగించుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖలో 3.5 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారు. ఈ బోర్డులో సుమారు రూ.52 వేల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.2 వేల కోట్ల లేబర్ సెస్.. గతేడాది మార్చి నాటికి తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డులో 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నమోదయ్యారు. ఇందులో 10 శాతం మంది ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కార్మికులుంటారు. ప్రస్తుతం కార్మిక సంక్షేమ బోర్డులో రూ.1,800–2,000 కోట్ల లేబర్ సెస్ నిల్వ ఉందని తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డ్ సభ్యుడు గంధం ఆంజనేయులు తెలిపారు. గుర్తింపు కార్డ్ ఉన్నవాళ్లకు మాత్రమే లేబర్ సెస్ ప్రయోజనం వర్తిస్తుందని.. ఆయా కార్మికుల ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానమై ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయించే ప్రయోజన సొమ్ము నేరుగా ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. కార్మికులందరికీ ప్రయోజనం.. భవన, నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి నియంత్రణ మరియు సేవల చట్టం కింద కార్మిక సంక్షేమ బోర్డులు లేబర్ సెస్‌ను సమీకరిస్తుంటాయి. డెవలప్మెంట్ అథారిటీ, హౌసింగ్ బోర్డు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు ప్రాజెక్ట్ వ్యయంలో 1 శాతం సెస్ రూపంలో డెవలపర్ల నుంచి వసూలు చేస్తుంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంలోని కార్మికుల జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు లేబర్ సెస్‌ను వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రభుత్వాన్ని కోరింది. కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైన వాళ్లకు మాత్రమే కాకుండా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ఈ నిధుల ప్రయోజనం అందేలా చూడాలని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రా రెడ్డి కోరారు. శాశ్వత కార్మికులను మాత్రమే డెవలపర్లు కార్మిక సంక్షేమ బోర్డులో నమోదు చేస్తుంటారు. రోజూ వారీ వేతనం కింద కూలీలు, కాంట్రాక్ట్ వర్కర్లను వినియోగించుకుంటారు. కరోనా ‘కేర్’ నిర్మాణ ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ డెవలపర్లకు పలు సూచనలను జారీ చేసింది. అవేంటంటే.. ► కరోనా వైరస్, దాని ప్రభావ తీవ్రత గురించి కార్మికుల్లో అవగాహన కల్పించాలి. ► సబ్బు, శానిటైజర్‌తో సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు రెండు చేతులను మోచేతి వరకు శుభ్రం చేసుకోవాలి. ► కార్మికులు ఉండే ప్రదేశాలు, చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. టాయిలెట్స్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ► ప్రాజెక్ట్ ప్రాంతాల్లో కార్మికులు గుంపులుగా ఉండకూడదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం 6 ఫీట్ల సామాజిక దూరాన్ని మెయిన్‌టెన్ చేయాలి. ► ప్రాజెక్ట్‌లు, లేబర్ క్యాంప్లలోకి బయటి వ్యక్తులను, అపరిచితులను రానివ్వకూడదు. ► లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కార్మికులకు అవసరమైన బియ్యం, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలన్నింటినీ ఒకేసారి సమకూర్చుకోవాలి. ఆయా నిత్యావసరాల కొనుగోలు కోసం అందరూ వెళ్లకుండా ఒక్కరు మాత్రమే వెళ్లాలి. ► ఎవరైనా కార్మికులు అనారోగ్యంగా ఉంటే అందరితో కలిసి కాకుండా ప్రత్యేకంగా వేరే షెడ్‌ను ఏర్పాటు చేసి.. క్వారంటైన్లో ఉండాలి. ముందుగా సంబంధిత ప్రభుత్వ విభాగానికి సమాచారం అందించాలి. ► నిర్మాణ కార్మికులుండే ప్రాంతాల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేసి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వినియోగ, తాగునీటి అవసరాలకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. -
సిరిసిల్లలో డిజిటల్ మీటర్లు
విద్యుత్ చౌర్యం నివారణకు ‘సెస్’ శ్రీకారం సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో డిజిటల్ విద్యుత్ మీటర్లు అమరుస్తున్నారు. ‘సెస్’ పరిధిలోని తొమ్మిది మండలాల్లో పాత విద్యుత్ మీటర్లు తొలగిస్తూ, కొత్త వాటిని అమర్చేందుకు ‘సెస్’ పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో ఇంటింటికీ డిజిటల్ స్కానింగ్ మీటర్లు బిగిస్తున్నారు. డిజిటల్ మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టనున్నారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు... సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో 1,32,546 ఇంటి మీటర్లు ఉండగా.. వాటిలో తొలి విడతగా పది వేల మీటర్లకు ప్రయోగాత్మకంగా డిజిటల్ మీటర్లు అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సిరిసిల్ల డివిజన్లోని వేములవాడ, సిరిసిల్ల, చందుర్తి, కోనరావుపేట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాల్లోని గృహావసరాలకు పాత మీటర్లు ఉన్నాయి. వీటితో కొందరు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ‘సెస్’ పరిధిలో ఇదివరకు 18 శాతం ఉండే లైన్ లాస్ ఇప్పుడు 35 శాతానికి చేరింది. లైన్లాస్కు విద్యుత్ చౌర్యమే కారణమని భావించిన ‘సెస్’ పాలకవర్గం పాత మీటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో డిజిటల్ మీటర్‌కు రూ.830 ఖర్చవుతుంది. ఆ ఖర్చును సంస్థే భరిస్తుంది. వీటిద్వారా మీటరు రీడింగ్‌ను కూడా స్కానింగ్ ద్వారా నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇంట్లో ఏ విధంగా విద్యుత్ వాడుకుంటున్నా రీడింగ్ నమోదవుతుంది. గతంలో చైనా మీటర్లు గతంలో చైనా మీటర్లను సిరిసిల్ల పట్టణంలో అమర్చారు. వీటిని మరమగ్గాలకు అమర్చడంతో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగించకపోయినా ఎక్కువ రీడింగ్ వస్తుందని పలువురు ఆరోపించారు. దీంతో వాటి బిగింపును నిలిపేశారు. ఇప్పుడు తాజాగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ మీటర్లను సంస్థ అమరుస్తోంది. ‘సెస్’ పరిధిలో బిల్లింగ్ నమోదు చేసే 40 సిబ్బంది సిరిసిల్లలో ఇంటింటికీ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది వినియోగదారులు అభ్యంతరాలు చెబుతున్నా.. రీడింగ్‌లో మార్పులు ఉండవని హామీ ఇస్తున్నారు.