PPF
-
రిటైర్మెంట్కు ఏ పథకాలు మేలు..?
రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఆర్థిక ప్రణాళికలో కీలకమైన భాగం. సరైన ప్రణాళిలు ఎంచుకుని వాటిని అనుసరిస్తే రిటైర్మెంట్ తర్వాత సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేట్ సంస్థలు విభిన్న రిటైర్మెంట్ స్కీమ్‌లతో వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. కానీ ఆయా కంపెనీలు ఇస్తున్న హామీలపై చాలానే ప్రశ్నలొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్స్‌ను ఎంచుకుని పదవీ విరమణ తర్వాత ఆర్థిక, సామాజిక భద్రత కలిగిన జీవితాన్ని సాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఉద్యోగుల భవిష్య నిధి (EPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లను పదవీ విరమణ పథకాల్లో భాగంగా చాలామంది ఎంచుకుంటున్నారు. వీటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే.. -
‘సుకన్య సమృద్ధి’ వడ్డీ పెరిగిందా? పోస్టాఫీసు స్కీములపై అప్డేట్
చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. వీటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ఆయా పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రస్తుత వడ్డీ రేట్లు∇ సుకన్య సమృద్ధి యాజన (SSY): సంవత్సరానికి వడ్డీ రేటు 8.2 శాతం∇ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): వడ్డీ రేటు 8.2 శాతం∇ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): వడ్డీ రేటు 7.1 శాతం∇ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): వడ్డీ రేటు 7.7 శాతం∇ పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS): వడ్డీ రేటు 7.4 శాతం∇ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్: వడ్డీ రేటు 7.5 శాతం∇ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్: వడ్డీ రేటు 6.7 శాతంఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. వడ్డీ రేట్లను చివరిగా 2023 డిసెంబర్ 31న సవరించింది. ఈ చిన్న పొదుపు పథకాలన్నీ పోస్టాఫీసు ద్వారా అందిస్తున్నారు. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, సార్వభౌమాధికార హామీ ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ వంటి కొన్ని పథకాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను-పొదుపు ప్రయోజనాలను అందిస్తాయి. -
రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి
2024 సెప్టెంబర్ నెల ఈ రోజుతో (సోమవారం) ముగుస్తోంది. రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభమవుతుంది. అయితే వచ్చే నెల (అక్టోబర్) నుంచి మ్యూచువల్ ఫండ్స్, ఆధార్ కార్డ్, టీడీఎస్, స్మాల్ సేవింగ్ స్కీమ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలలో చాలా మార్పులు సంభవిస్తాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..👉ఆధార్ నెంబర్‌కు బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని వెల్లడించడానికి సంబంధించిన నిబంధనను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు.. పాన్ కేటాయింపు పత్రాలలో తమ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించాల్సిన అవసరం లేదు.👉సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF ) అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణ కోసం కొత్త నియమాలు 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.👉కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. జీవిత బీమా పాలసీ, లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్, కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ రేట్లు తగ్గుతాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ శుభవార్త!.. డిపాజిటర్ల కోసం కొత్త ప్లాన్స్..👉ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)కి వర్తించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) అక్టోబర్ 1 నుంచి పెరగనుంది. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో కూడా మార్పులు ఏర్పడతాయి. -
ఎక్కువ ఖాతాలున్నా.. ప్రయోజనాలు సున్నా
ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తున్నా కానీ, ఇతర పెట్టుబడి సాధనాల ప్రాధాన్యాన్ని విస్మరించలేం. పెట్టుబడులు అన్నింటినీ ఒక్క చోటే పెట్టేయడం రిస్క్ పరంగా అనుకూలం కాదు. వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గించుకుని, మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. అందుకే ఒకవైపు ఈక్విటీల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నప్పటికీ.. మరోవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇప్పటికీ ఎంతో మందికి ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాలుగా కొనసాగుతున్నాయి. రిస్క్‌లేని హామీతో కూడిన ఈ పథకాలు ముఖ్యమైన జీవిత లక్ష్యాలకు చేదోడుగా నిలుస్తాయనడంలో అతిశయం లేదు. అయితే ఇందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్ఎస్సీ పరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్ కథనం. పీపీఎఫ్ ఒక్కటే ఎక్కువ మంది ఎంపిక చేసుకునే ఆరి్థక సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత మరో ఐదేళ్ల పాటు గడువును పొడిగించుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపే కాకుండా, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంది. ఈ ప్రయోజనమే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇది చూసే కొంత మంది ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లో ఒకటి, బ్యాంక్‌లో ఒకటి తెరుస్తున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఒకరి పేరిట ఒక పీపీఎఫ్ ఖాతానే ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయగలరని కేంద్ర ఆరి్థక శాఖ జూలై 12న ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఒకటికి మించిన ఖాతాలను గుర్తించినట్టయితే అందులో ఒక దానిని ప్రాథమిక ఖాతాగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండో ఖాతాలో జమలపై ఎలాంటి వడ్డీ రాదన్నది తాజా ఉత్తర్వుల సారాంశం. ఒకవేళ రెండు ఖాతాలున్నట్టు తేలితే రెండో ఖాతాలోని జమలను మొదటి ఖాతాకు బదిలీ చేస్తారు. ఒక ఆర్థిక సంత్సరంలో గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలకు మించి జమ చేసినట్టయితే, అదనంగా ఉన్న మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా వెనక్కిచ్చేస్తారు. రెండు కంటే ఎక్కువ ఖాతాలున్నట్టు తేలితే అప్పుడు ప్రారంభించిన తేదీ నుంచి సున్నా వడ్డీయే లభిస్తుంది.పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాలు... కొంత మంది పిల్లల పేరుతోనూ ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరుస్తున్నారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు. ఒక మైనర్ (బాలుడు/బాలిక) పేరిట ఒక పీపీఎఫ్ ఖాతాకే పరిమితం కావాలి. ఇలా ఒక మైనర్ పేరిట ఒకటికి మించి ఉన్న ఖాతాలను ఇరెగ్యులర్ (అక్రమం) అకౌంట్లుగా గుర్తిస్తారు. అప్పుడు మైనర్ పేరిట ఉన్న ఖాతాల్లో ఒకదానిని మెయిన్ అకౌంట్‌గా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఖాతాకు నిబంధనల మేరకు ప్రస్తుత వడ్డీ రేటు అమలవుతుంది. ఒకటికి మించి అదనంగా ఉన్న ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 4 శాతం చొప్పున 18 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తారు. 18 ఏళ్లు నిండగానే మేజర్ అయిన తర్వాత సాధారణ పీపీఎఫ్ ఖాతా కింద దాన్ని పరిగణిస్తారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ ఖాతాపై చర్యలు ఉంటాయి. నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిజానికి ఇద్దరు పిల్లలు ఉంటే విడిగా ఇద్దరి పేరిట రెండు ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. అయినప్పటికీ, తన పేరుతో, తన పిల్లల పేరుతో ఇలా అన్నింటిలోనూ గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేసుకోరాదు. పీపీఎఫ్ ఖాతాను తాత, బామ్మ, అమ్మమ్మలు (గ్రాండ్ పేరెంట్స్) నిర్వహించరాదు. కేవలం తల్లిదండ్రులు మరణించి, పిల్లలకు ఆధారంగా మారిన వారే చట్టబద్ధ సంరక్షకులుగా వ్యవహరించడానికి అనుమతి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన... సుకన్య సమృద్ధి యోజన ఎంతో ప్రాచుర్యం పొందిన పథకం. రోజుల శిశువు నుంచి పదేళ్లలోపు కుమార్తెల పేరిట ఖాతా తెరిచి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు ఇది కొనసాగుతుంది. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఖాతాకు 8.2 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఇందులో చేసే పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ఇందులో రాబడులపైనా పన్ను లేదు. ఒక కుటుంబం తరఫున గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిటే సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడానికి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను (ఎస్ఎస్ఏఎస్) బాలిక తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తెరవడానికి అనుమతి ఉంటుంది. అయితే, కొందరు మనవరాలి పేరిట కూడా ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పిల్లలకు సహజ సంరక్షకులు అయిన తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయిన వారే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఒకవేళ మనవరాలి పేరిట తాత, అమ్మమ్మ, బామ్మలు తెరిచినట్టు గుర్తించినట్టయితే అప్పుడు సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులకు బదిలీ అవుతుంది. ఒక కుటుంబానికి రెండుకు మించి ఖాతాలున్నట్టు తేలితే అదనంగా ఉన్న వాటిని మూసివేస్తారు. వాటిలో జమ చేసే మొత్తాలపై వడ్డీ రాదు.నేషనల్ సేవింగ్స్ స్కీమ్... ఎంతో పాపులర్ అయిన చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది. గతంలో ఏదైనా పోస్టాఫీస్ శాఖలో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ప్రారంభించేందుకు అవకాశం ఉండేది. దీన్ని 2002 నుంచి నిలిపివేశారు. కాకపోతే అప్పటికే తెరిచిన ఖాతాలను కొనసాగించేందుకు అనుమతించారు. 1990 ఏప్రిల్ 2కు ముందు తెరిచిన మొదటి ఖాతాకు ప్రస్తుత పథకం రేటు, రెండో ఖాతాకు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా రేటు (4 శాతం)కు అదనంగా 2 శాతం చెల్లిస్తారు. అక్టోబర్ 1 నుంచి ఈ రెండు ఖాతాలకు ఎలాంటి వడ్డీ రాదు. 1990 ఏప్రిల్ 2 తర్వాత తెరిచిన నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలకు సైతం అక్టోబర్ నుంచి ఎలాంటి వడ్డీ చెల్లించరు. దీంతో ఈ ఖాతాలను మూసివేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎన్ఆర్ఐలు అలా చేయడం కుదరదు..ఎన్ఆర్ఐ హోదాను వెల్లడించకుండా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం చెల్లదు. అలాంటి ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ రేటు 4 శాతమే అమలవుతుంది. అది కూడా 2024 సెపె్టంబర్ 30 వరకే. ఆ తర్వాత నుంచి బ్యాలన్స్‌పై వడ్డీ రాదు. నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అనుమతి లేదు. ‘‘భారత్‌లో పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత విదేశాలకు వెళ్లి ఎన్ఆర్ఐగా మారితే 15 ఏళ్ల గడువు ముగిసేంత వరకు ఆ ఖాతాను కొనసాగించొచ్చు. అందులో చేసే పెట్టుబడులకు ఇతరులకు మాదిరే వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే, నాన్ రీపాట్రియేషన్ నిబంధనల కిందే వీరు పీపీఎఫ్ ఖాతాను కొనసాగించుకోగలరు. అంటే గడువు ముగిసిన తర్వాత వచ్చే మెచ్యూరిటీని ఎన్ఆర్ఐ తన విదేశీ ఖాతాకు బదిలీ చేసుకోవడం కుదరదు. లేదా విదేశీ కరెన్సీలోకి మార్చుకోవడం కుదరదు. తన నివాస హోదాలో మార్పు చోటుచేసుకున్న వెంటనే సంబంధిత వ్యక్తి బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు తెలియజేయడం తప్పనిసరి’’ అని స్టెబుల్ ఇన్వెస్టర్ వ్యవస్థాపకుడు దేవ్ ఆశిష్ తెలిపారు.మార్గం ఉంది.. పీపీఎఫ్‌లో పెట్టుబడులు, రాబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలంటే.. అప్పుడు దంపతులు ఇద్దరూ తమ పేరిట పీపీఎఫ్ ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉంటే భార్య, భర్త చెరొక పీపీఎఫ్ ఖాతా తెరిచి గరిష్ట పరిమితి మేరకు ఒక్కో ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల పేరిట తెరిచిన పీపీఎఫ్ ఖాతాను ఐదేళ్లు నిండిన తర్వాత వైద్య పరమైన అవసరాల కోసం మూసివేసేందుకు అనుమతి ఉంటుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?
చిన్నపిల్లల చదువు, వివాహాలు ఇతర భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారికి ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ అధీనంలో ఉండి స్థిరంగా వడ్డీ సమకూర్చే పీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహించే వారికిసైతం నష్టం కలిగేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరిచిన వారికి ఈ నిబంధనల వల్ల నష్టం కలుగుతుంది. మైనర్ల కోసం తెరిచే పీపీఎఫ్ ఖాతాదారులపై ఈ ప్రభావం పడుతుంది. కొంతమంది ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు) దేశం విడిచి వెళ్లిపోయి, రెన్యూవల్ చేయకపోయినా తమ ఖాతా యాక్టివ్‌లోనే ఉంటుంది. అలాంటి వారి ఖాతాలను ఉపసంహరించుకునేలా విధానాల్లో మార్పులు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.మైనర్ పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరిస్తే గతంలో దాదాపు 7.1 శాతం వడ్డీ చెల్లించేవారు. అయితే ఇకపై పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు అనుగుణంగా వడ్డీ చెల్లిస్తారు. అంటే మైనర్‌కు 18 ఏళ్లు వచ్చేవరకు 4 శాతం వడ్డీ ఇస్తారు. తర్వాత పీపీఎఫ్ నిబంధనల ప్రకారం వడ్డీ పెంచుతారు.పిల్లల చదువులు, వివాహాల కోసం చాలా మంది తల్లిదండ్రులు వారి పేరుమీద పీపీఎఫ్ ఖాతా తెరుస్తున్నారు. అందులో స్థిరంగా వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. అయితే ఇకపై ఈ అవకాశం లేకుండా పోయింది.ఇప్పటికే ఒక పీపీఎఫ్ ఖాతా నిర్వహిస్తున్నవారు సైతం రెండు కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. పీపీఎఫ్ డిపాజిట్ల వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు ఉండడం దీనికి ప్రధాన కారణం. దాంతో ఎక్కువ ఖాతాలు తెరిచి అధిక వడ్డీ సమకూరేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే ఇకపై ఈ వ్యవహారం కొనసాగదు.ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహిస్తున్న ఖాతాదారులు ప్రాథమిక ఖాతా వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఖాతాల్లోని నగదును రూ.1.5 లక్షల పరిమితికి సర్దుబాటు చేస్తారు. అనంతరం ఇతర ఖాతాల్లో మిగిలిన నగదుపై ఎలాంటి వడ్డీ చెల్లించరు.ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్ప్రస్తుత పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం(పన్ను ఉండదు)గా ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల వల్ల ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలున్నవారు ఈక్విటీ మార్కెట్లను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కనీసం పదేళ్లు స్థిరంగా పెట్టుబడి పెట్టేవారు మ్యూచువల్ ఫండ్లు ఎంచుకుంటే పీపీఎఫ్ కంటే అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే రాబడులపై ట్యాక్స్ మిగుల్చుకోవాలంటే ‘ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్’లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. పదిహేనేళ్ల కాలపరిమితితో గరిష్ఠంగా ఏటా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఏదైనా అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైతే ఖాతా తెరిచిన ఐదేళ్ల తర్వాత ఒకసారి నగదు ఉపసంహరణకు అవకాశం ఉంది. -
పీపీఎఫ్ కొత్త రూల్స్.. రెండో అకౌంట్‌పై వడ్డీ వస్తుందా?
పోస్టాఫీసుల ద్వారా తెరిచిన పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాలను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం గత నెలలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం పీపీఎఫ్ నిబంధనలలో మార్పులు అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి.పీపీఎఫ్ ఏంటంటే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తూ పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి రూపొందించిన ఒక ప్రముఖ ఆర్థిక సాధనం. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పొదుపు పథకం.1961 ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం దీంట్లో పెట్టిన అసలు, వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం అన్నిటికీ పన్ను నుండి మినహాయింపు ఉంటుంది.మారిన నిబంధనలు ఇవే..మైనర్లకు పీపీఎఫ్ ఖాతా: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మైనర్ పేరు మీద తెరిచి ఉంటే మైనర్‌కు 18 ఏళ్లు వయస్సు వచ్చే వరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) వచ్చే వడ్డీ మాత్రమే వస్తుంది. అటువంటి ఖాతాల మెచ్యూరిటీ వ్యవధిని మైనర్ పెద్దవాడైన తేదీ నుండి లెక్కిస్తారు.ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు: ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా ఏజెన్సీ బ్యాంక్‌లో ఖాతాదారు తెరిచిన ప్రాథమిక అకౌంట్‌పై స్కీమ్ రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. అదే ఒకటి ఎక్కువ ఖాతాల్లో బ్యాలెన్స్ ఉన్న సందర్భంలో వాటిని ప్రాథమిక ఖాతాతో ఏకీకృతం చేస్తారు. ఇలా చేశాక మొత్తం వార్షిక పరిమితి మొత్తం డిపాజిట్‌కు మాత్రం పథకం రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తారు. దీనికి మించి ఇతర ఖాతాల్లో మిగులు నిధులు ఉంటే ఎలాంటి వడ్డీ లభించదు. -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
కేంద్రం కొత్త నిబంధనలు.. మీకు ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ఉందా?
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీంతో కేంద్రం తెచ్చిన నిర్ణయాలు అమలు కానున్నాయి. ఇప్పటికే ఆధార్ - పాన్ లింక్ గడువును కేంద్రం పెంచింది. అయితే తాజాగా ఆధార్ - పాన్ విషయంలో మరో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాల్లో (small saving schemes) పాన్‌కార్డ్, ఆధార్ కార్డులను తప్పని సరిచేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 31,2023న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో స్మాల్ సేవింగ్స్ స్కీంలో పెట్టుబడులు పెట్టేందుకు కేవైసీ తప్పని సరి చేసింది. దీంతో పాటు నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే ఎక్కువ పెట్టుబడిపై పాన్ కార్డును అందించాలని సూచించింది. చిన్న పొదుపు పథకాల్లో కొత్త నిబంధనలు కేంద్ర ఆర్ధిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. చిన్న పొదుపు పథకాల్లోని చందాదారులు సెప్టెంబర్ 30,2023లోగా ఆధార్ నెంబర్ ను జతచేయాలని తెలిపింది. కొత్తగా పథకాల్లో చేరిన చందాదారులు 6 నెలల్లోగా ఆధార్‌ను లింక్ చేయాలని సూచించింది. ఒక వేళ స్మాల్ సేవింగ్స్ స్కీంలో కొత్తగా చేరిన వారి 6 నెలల్లోగా ఆధార్‌ను అందించాలని లేదంటే అక్టోబర్ 1, 2013 నుంచి సదరు అకౌంట్లు పనిచేయడం ఆగిపోతాయని వెల్లడించింది. పాన్ కార్డ్సైతం చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు తెరిచే సమయంలో పాన్‌కార్డ్‌ని సమర్పించాలి. ఆ సమయంలో సాధ్యం కాకపోతే రెండు నెలల్లో పాన్ కార్డ్‌ను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి. ఇక ఆ అకౌంట్లలో రూ.50 వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఒక ఖాతాలో అన్ని క్రెడిట్స్ రూ.లక్ష దాటినప్పుడు, ఒక నెలలో ఖాతా ట్రాన్సాక్షన్ల లావాదేవీలు రూ.10 వేలు దాటితే.. పాన్‌ను సమర్పించాలి. లేదంటే పాన్ అప్డేట్ చేసే వరకు సదరు ఖాతాలు స్తంభించిపోనున్నాయి. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్ - ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్! -
పన్ను భారం తగ్గించుకోవాలంటే..
వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది. ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు. ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్ఎస్ఎస్ అన్నది సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్పీఎస్– మూడు ప్రయోజనాలు ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్ వరకు లాకిన్లోనే ఉంటాయి. డెట్ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్‌కు అలోకేషన్‌ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్పీఎస్కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్పీఎస్కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కనుక ఎన్పీఎస్ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ (గిల్ట్ ఫండ్స్) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్‌స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ విభాగం కూడా ఉంది. జీవిత బీమా పథకాలు జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్‌లు మెరుగైనవి. లేదంటే ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు ఎన్ఎస్సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్ చేస్తుంటే, యాక్సిస్ బ్యాంక్ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్ఎస్సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్‌లు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎస్సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్ఎస్సీలో పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. యులిప్‌లు యులిప్‌లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్లోనూ ఎన్‌పీఎస్‌లో మాదిరే ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్‌కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్‌లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మాదిరి ఇందులో ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్‌ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పీపీఎఫ్ ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్‌లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్ ఎఫ్‌డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్‌పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సైతం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్ తక్కువ. తక్కువ రిస్క్ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్ ఫండ్స్ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు. -
యువత పెట్టుబడులకు సరైన వేదిక ఏది?
యువత పెట్టుబడులకు సరైన వేదిక ఏది? – హిమ బిందు యుక్త వయసులోనే అంటే ఇరవైలలోనే (ఉదాహరణకు 25 సంవత్సరాలు) సొమ్ములుండి పెట్టుబడులను దీర్ఘకాలంపాటు మరిచిపోగలిగితే స్మాల్ క్యాప్ ఫండ్‌తో మదుపును ప్రారంభించవచ్చు. పెట్టుబడిదారులు ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మరీ దీర్ఘకాలానికైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ అత్యధిక లాభాలను ఆర్జించిపెట్టే ఆస్తుల విభాగంలోకి వస్తాయి. అయితే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు విలువ భారీగా వేగంగా పడిపోతుంటుంది. ఇది బాగా ఆందోళనలు కలిగిస్తుంది. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనూ, ఆపై పలు ఇతర క్లిష్టకాలాల్లోనూ వీటి విలువలు 50 శాతం పతనమయ్యాయి. అతితక్కువ సమయంలోనే విలువలు భారీగా క్షీణించాయి. అంటే రూ.100 పెట్టుబడి రూ.50కు చేరుతుంది. అత్యధిక శాతం మంది ఇన్వెస్టర్లు దీనిని ఆమోదించబోరు. కనుక గరిష్ట రిస్కుకు సిద్ధపడితేనే వీటివైపు దృష్టి పెట్టవచ్చు. ఇరవైలలోనే మీరు సంపాదిస్తూ, పన్నులు చెల్లిస్తూ ఉంటే లెక్కల పద్ధతిలో పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌లో అవసరమైనంత సొమ్మును మదుపు చేయవచ్చు. దేశీ ఇన్వెస్టర్లకు పన్ను పొదుపు ఫండ్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మొత్తాన్ని ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఇరవైలలోనే సంపాదిస్తూ గరిష్ట రిస్కుకు సిద్ధపడుతుంటే.. స్మాల్ క్యాప్ ఫండ్స్‌నూ పరిశీలించవచ్చు. పన్ను ఆదాకు పీపీఎఫ్ సరైనదేనా? – శంకర్ పీపీఎఫ్ పెట్టుబడిదారులకు నా సలహా ఏమంటే.. ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కొనసాగించవచ్చు. అలాకాకుండా ఇప్పుడే పెట్టుబడుల కోసం ఆలోచిస్తుంటే అదంత లాభదాయకం కాబోదు. ఎందుకంటే.. పీపీఎఫ్ అనేది స్థిర ఆదాయ ఆర్జన కోసం 15ఏళ్ల కాలపు క్రమానుగత పెట్టుబడి పథకం(సిప్). 15ఏళకాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే.. పీపీఎఫ్కంటే ఇతర పన్ను ఆదా ఫండ్స్ నుంచి లభించే రిటర్నులే అధికంగా ఉండే వీలుంది. ఇది మొట్టమొదట ఆలోచించవలసిన విషయం. అయితే ఇప్పటికే పీపీఎఫ్‌లో ఉంటే పెట్టుబడులు కొనసాగించవచ్చు. వడ్డీ ఆదాయం పన్నురహితంకావడంతో స్థిర ఆదాయ కేటాయింపులు చేపట్టవచ్చు. సుప్రసిద్ధమైన పథకంకావడంతో ఇప్పటికే పీపీఎఫ్‌లో ఉంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రత్యామ్నాయాల్లో ఇది అత్యుత్తమమైనదిగా భావించవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ లేదా మార్కెట్ ఆధారిత పెట్టుబడుల ఖాతా లేనప్పటికీ చాలా మంది ప్రజలు పీపీఎఫ్ ఖాతాను కలిగి ఉన్నారు. నిజానికి దేశీయంగా ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్యతో పోలిస్తే ఇటీవల పీపీఎఫ్ పెట్టుబడిదారుల సంఖ్య రెట్టింపునకంటే అధికంగా నమోదైంది. ప్రభుత్వ అండతో అత్యంత నమ్మకమైన పెట్టుబడి మార్గంకావడంతో అత్యధికులు పీపీఎఫ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. వడ్డీ ఆదాయం పూర్తిగా పన్నురహితంకావడం ఆకర్షణీయం. వెరసి ఇప్పటికే పీపీఎఫ్‌లో ఉంటే కొనసాగించండి. కొత్తగా ఇన్వెస్ట్ చేయదలిస్తే ఇతర పన్నుఆదా ఫండ్స్‌నూ పరిశీలించవచ్చు. -
Small Savings Schemes: చిన్న పొదుపు ఖాతాదారులకు శుభవార్త..!
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమీక్రాన్ కేసులు పేరుగతున్న తరుణంలో కేంద్రం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2022తో ముగిసే 2021-22 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కూడా చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం నుంచి స్థిర ఆదాయం పొందే పెట్టుబడిదారులకు ఉపశమనం కలగనుంది. అంటే ఫిక్సిడ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన వంటి మొదలైన చిన్న పొదుపు పథకాలకు సెప్టెంబర్-డిసెంబర్ 2021 మధ్య కాలంలో వర్తించే వడ్డీరేట్లు 31 మార్చి 2022 వరకు వర్తించనున్నాయి. ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్హోల్డర్లకు వార్షిక వడ్డీ 7.1 శాతం లభిస్తుండగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతం ఉంది. ఇక సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎక్కువ వడ్డీ ఇస్తున్న స్కీమ్ ఇదే. ఇక ఐదేళ్ల మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్‌కు 6.6 శాతం వడ్డీ, 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది టర్మ్ డిపాజిట్‌కు 5.5 శాతం, ఐదేళ్ల డిపాజిట్‌కు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు ఖాతాలకు 4% వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 2020 నుంచి ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సవరిస్తూ ఉంటుంది. (చదవండి: షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ జరిమానా..?) -
Post Office Schemes: పోస్ట్ ఆఫీస్ టాప్ - 5 డిపాజిట్ స్కీమ్స్
ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. పోస్టాఫీసు పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడి కూడా అందిస్తుంది. పోస్టాఫీసు పథకాలు నమ్మదగినవి. ఈ పథకాలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. గరిష్ట వడ్డీ రేట్లతో ప్రజాదరణ పొందిన తపాలా కార్యాలయ పథకాలు కొన్ని సుకన్య సమృద్ధి పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం, కిసాన్ వికాస్ పాత్రా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. వీటి గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం. (చదవండి: వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్) సుకన్య సమృద్ధి పథకం సుకన్య సమృద్ధి పథకాన్ని సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరిట ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. సంవత్సరానికి 7.6 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రాతిపదికన లెక్కిస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం అనేది రిటైర్డ్ వ్యక్తులు, వృద్ధులకొరకు ప్రజాదరణ పొందిన పథకం. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు రూ.1000తో ఈ స్కీమ్‌లో ఖాతా తెరవొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒకేసారి రూ.10 లక్షలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో మీకు రూ.14 లక్షలకు పైగా వస్తాయి. వడ్డీ రూపంలో రూ.4,28,964 వరకు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)ను ఎవరైనా తెరవవచ్చు. పిపిఎఫ్ కింద పెట్టుబడి పెట్టె నగదుపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1,50,000 నగదు జమ చేయవచ్చు. పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మనిహాయింపు లభిస్తుంది. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్ల తర్వాత చేతికి రూ.40 లక్షలకు పైగా వస్తాయి. కిసాన్ వికాస్ పత్ర కిసాన్ వికాస్ పాత్రా పథకం కింద కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. 124 నెలల్లో (10 సంవత్సరాలు 4 నెలలు) పెట్టుబడి పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది. వార్షికంగా 7.7 వడ్డీ వడ్డీ రేటు లభిస్తుంది మీరు రూ.50,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం తర్వాత రూ.73,126 లభిస్తాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. వార్షికంగా 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే మెచ్యూరిటీ కాలం తర్వాత మాత్రమే వడ్డీ అసలు చెల్లిస్తారు. ఎన్ఎస్సీ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి దాదాపు రూ.21 లక్షలు వస్తాయి. -
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
సీనియర్ సిటిజన్లకు శుభవార్త. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఎస్ఈఎస్ఎస్) ను విత్ డ్రా చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ ఇకపై పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనౌన్స్ చేసింది. సాధారణంగా పీపీఎఫ్, ఎస్ఈఎస్ఎస్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు నిర్వహించని అకౌంట్లు, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో అకౌంట్లను క్లోజ్ చేయాలంటే పోస్టాఫీసులకు రావాల్సి వచ్చేది. దీంతో 60ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు వయస్సు రిత్యా పోస్టాఫీస్‌లకు రావాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ఇండియన్ పోస్ట్ సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చింది. ఈ రెండు స్కీమ్ లలో నుంచి మనీ విత్ డ్రా, అకౌంట్లను క్లోజ్ చేయడం చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని, వారి బదులు కుటుంబ సభ్యులు ఉంటే సరిపోతుందని వెల్లడించింది. అకౌంట్లను క్లోజ్ చేయడంతో పాటు మనీ విత్ డ్రాల్ వారి కుటుంబ సభ్యులు చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబసభ్యులు విత్ డ్రా చేసిన నగదును చెక్కుద్వారా, అకౌంట్ హోల్డర్ భద్రత కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా, బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నట్లు తెలిపింది. పోస్టాఫీస్‌కు వెళ్లకుండా నగదుని ఎలా డ్రా చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ నుండి PPF లేదా SCSS నిధుల్ని సేకరించేలా కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చేందుకు ఈ రూల్స్ పాటించాల్సి ఉంది. ►వయస్సు రిత్యా తాము పోస్టాఫీస్‌కు వెళ్లలేకపోతున్నామని, తనకు బదులు మనీ విత్ డ్రాల్ చేసే హక్కు భార్య లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు హక్కు ఉందని నిర్ధారిస్తూ పోస్ట్ ఆఫీస్‌లో ఫారమ్ SB-12 పై సీనియర్ సిటిజన్ సంతకం చేయాల్సి ఉంటుంది. ►వీటితో పాటు అకౌంట్ హోల్డర్ అకౌంట్‌ను క్లోజ్ చేసేందుకు, పాక్షిక నగదు ఉపసంహరణ(partial withdrawal).SB-7ఫారమ్ పై,SB-7B form పై సంతకం చేయాల్సి ఉంటుంది. ►సీనియర్ సిటిజన్ ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు సీనియర్ సిటిజన్ కుటుంబ సభ్యుడి వివరాలను తెలుపుతూ అటాచ్ చేయాల్సి ఉంది. ►నిధులను ఉపసంహరించుకోవడానికి వ్యక్తి పాస్ బుక్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ►లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ముందు అకౌంట్ హోల్డర్ సంతకాల్ని పోస్టాఫీసులో సంబంధిత అధికారులు చెక్ చేస్తారు. అనంతరం నగదు విత్ డ్రా చేసేందుకు అనుమతిస్తారు. -
చిన్న పొదుపు పథకాల ఆదాయంపై పన్ను ఎంతో తెలుసా?
తక్కువ రిస్క్ తో ఎక్కువ పెట్టుబడి వచ్చే సామాన్య ప్రజానీకం పెట్టుబడులు పెట్టాలని చూస్తుంటారు? అలాంటి వారి కోసం బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) చాలా ఉత్తమమైన పొదుపు పథకాలు. అయితే, ఈ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంపై మీరు చెల్లించే ఆదాయపు పన్ను గురుంచి తెలుసుకోవడం చాలా కీలకం. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుకు అర్హత సాధించిన అన్ని పెట్టుబడి పొదుపు పథకాలు ఆదాయపు పన్ను ఈఈఈ హోదాను పొందలేవు. ఈఈఈ అంటే ఏమిటి? ఈ అంటే మినహాయింపు, మినహాయింపు, మినహాయింపు. ఇక్కడ, మొదటి మినహాయింపు అంటే మీ పెట్టుబడి పెట్టె నగదుపై మినహాయింపుకు లభిస్తుంది. కాబట్టి, పెట్టుబడి పెట్టిన మొత్తానికి సమానమైన జీతంలో కొంత భాగంపై మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, రెండో మినహాయింపు అంటే మధ్యలో వైదొలిగినప్పుడు లభించే ఆదాయంపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అర్ధం. మూడవ మినహాయింపు అంటే మీరు పెట్టుబడి పెట్టిన ఆదాయంపై లభించే వడ్డీ, అసలు మొత్తంపై పన్ను మినహాయింపు పొందడం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులపై సాదరణంగానే ఈఈఈ స్టేటస్ లభిస్తుంది. ఇప్పుడు విభిన్న సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఎఫ్డీ పెట్టుబడుల నుంచే వచ్చే ఆదాయంపై పన్ను ఎంత విధిస్తారో తెలుస్తుంది. బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్డీ) బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ నుంచి వచ్చిన వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎఫ్డీలో చేసిన పెట్టుబడిపై వచ్చే వడ్డీపై బ్యాంకు 10శాతం టీడీఎస్ వసూలు చేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపుకు పీపీఎఫ్ అర్హత కలిగి ఉంది. మెచ్యూరిటీ తర్వాత వచ్చే వడ్డీపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) పీపీఎఫ్ మాదిరిగానే,సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడి పథకం. ఈ పథకం ఈఈఈ హోదాను పొందుతుంది. ఎస్ఎస్వైలో పెట్టుబడి పెట్టిన నగదుపై లభించే వడ్డీపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ రేట్లు ఫిక్సిడ్ డిపాజిట్లు అనేది స్థిరమైన వడ్డీ రేట్లకు గ్యారెంటీ ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. అయితే, దీనిపై పెట్టె పెట్టుబడిపై వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులను బట్టి మారుతంటాయి. భారతదేశంలోని టాప్ బ్యాంకులు సాధారణంగా నిర్ధిష్ట డిపాజిట్‌పై 5.6 - 6.7% వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పీపీఎఫ్ ఎస్ఎస్వై వంటి చిన్న పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేట్లను ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో యదాతధంగా ఉంచింది. అంటే సెప్టెంబర్ 30, 2021 వరకు పాత వడ్డీ రేట్లు ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన ఖాతా - 7.6% పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్- 7.1% చదవండి: కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త! -
కేవలం 1 శాతం వడ్డీకే రుణం.. వారికి మాత్రమే
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మరి వల్ల ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలా మంది ఆర్దికంగా పడుతున్న భాదల నుంచి బయటపడటానికి ఇతరులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పథకంలో చేరిన వారికి కొంచెం ఊరట అని చెప్పుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేరిన వారికి అతి తక్కువ వడ్డీకే లోన్ పొందే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది కేవలం పీపీఎఫ్ పథకంలో చేరిన వారికి మాత్రమే వర్తిస్తుంది. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ ఒకటని చెప్పుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఈ పథకంలో చేరిన వారికి సులభంగానే లోన్ తీసుకునే సదుపాయం ఉంది. మీరు ఖాతా తెరిచిన తర్వాత 3వ ఏడాది నుంచి 6వ ఏడాది వరకు మధ్యలో ఎప్పుడైనా లోన్ తీసుకోవచ్చు. ఏడవ సంవత్సరం నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుల్లో గరిష్టంగా 50 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే మీరు లోన్ తీసుకోవాలని భావిస్తే.. పీపీఎఫ్ అకౌంట్లో జమ చేసిన నగదులో 25 శాతం వరకు డబ్బులు పొందొచ్చు. ఇంతకు మించి తీసుకోవడానికి వీలు లేదు. అయితే ఈ రుణం మీద మీకు 1 శాతం వడ్డీకే లోన్ లభిస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత నుంచి పూర్తిగా చెల్లించే వరకు మీరు జమ చేసిన నగదుపై ఎలాంటి వడ్డీ రాదు. అంటే మీకు లోన్‌పై వడ్డీ రేటు 8.1 శాతంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలతో పోలిస్తే పీపీఎఫ్ ఖాతాపై రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే పీపీఎఫ్‌పై లోన్ తీసుకుంటే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ పొందలేం. అందువల్ల మీరు పీపీఎఫ్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చదవండి: ప్రతి నెల పది వేల పెన్షన్ పొందాలంటే.. -
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత
సాక్షి, న్యూఢిల్లీ : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రా (కెవీపీ) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి) లాంటి ఏడు ప్రజాదరణ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కరోనా వైరస్ ప్రభావంతో ఈ పథకాలపై చెల్లించే వడ్డీరేను 70 నుంచి 140 బేసిస్ పాయింట్లు మేర కోత పెట్టింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మధ్య, పేద తరగతి ప్రజలు కష్టపడి పొదుపు చేసుకునే లక్షల మంది ప్రభావితం కానున్నారు. ఈ సవరించిన రేట్లు నేటి (ఏప్రిల్ 1 ) నుంచి అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 2016 నుండి, అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ దిగుబడులతో అనుసంధానించిన నేపథ్యంలో ప్రతి త్రైమాసికంలో వడ్డీరేట్ల సమీక్ష వుంటుంది. పీపీఎఫ్ పథకంపై ప్రస్తుతం 7.9 శాతం వర్తిస్తుండగా, తాజా నిర్ణయం ప్రకారం ఇది 7.1 శాతానికి దిగి వచ్చింది. ఐదేళ్ల జాతీయ పొదుపు ధృవీకరణ (ఎన్ఎస్సి) పత్రంపై 7.9 శాతానికి బదులు ఇపుడు 6.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే కేవీపీ 6.9 శాతంగా వుంది. ఇప్పటివరకు ఇది 7.6 శాతం. సుకన్య సమృద్ది ఖాతా లకు 8.4 శాతానికి బదులుగా 7.4 శాతంగా వుంటుంది. ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 7.6 శాతంగా వుంది. అంతకు ముందు ఇది8.శాతం. ఐదేళ్ల నెలవారీ ఆదాయ పథకం 6.6శాతం. ఇప్పటివరకు ఇది 7.6 శాతం. అలాగే 1-5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లుపై వడ్డీ 5.5-6.7శాతం. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై 5.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ముందస్తు పాలసీ సమీక్షలొ రెపో రేటు కోతకు మొగ్గు చూపిన అనంతరం, తాజాగా చిన్న పొదుపు పథకాల వడ్డీరేటుపై కోత పడింది. అయితే ఊహించిన దానికంటే ఈ తగ్గింపు ఎక్కువగా వుందని డిపాజిట్ రేట్లను మరింత తగ్గించడానికి ప్రభుత్వం ఇలా చేసి ఉండవచ్చని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పథకాల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రధానంగా ఆధారపడే వారు ఇప్పుడు వారి పోర్ట్‌ఫోలియోను తిరిగి సందర్శించాల్సి ఉంటుందని వైజెన్‌వెస్ట్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమంత్ రుస్తాగి తెలిపారు. తాజా నిర్ణయంతో సాంప్రదాయ పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.నేరుగా ఈక్విటీలో పెట్టుబడులు పెట్టాలని సూచించలేనప్పటికీ, మ్యూచువల్ ఫండ్లలో హైబ్రిడ్ ఫండ్స్ ను పరిశీలించాలని సూచించారు. కాగా కోవిడ్ -19 వ్యాప్తి, ఆర్థికవ్యవస్థపై ప్రభావం నేపథ్యంలో ఆర్బీఐ గత వారం రెపో రేటును 75 బీపీఎస్ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎఫ్డీ: వీటిల్లో మీ చాయిస్?
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను ఆదా చేసుకునేందుకు మరో నెలరోజులే వ్యవధి మిగిలి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను ఆదా కోసం బీమా వైపు చూడకుండా.. ఇతర పెట్టుబడి విధానాలను పరిశీలించినట్టయితే... ఈక్విటీలతో కూడిన ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి. అవగాహన విస్తృతం కావడంతో పన్ను ఆదా చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్) గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. ఇవి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి కావడంతో దీర్ఘకాలంలో సంపద వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈక్విటీలు కావడం వల్ల మార్కెట్ ఆధారిత అస్థిరతలు ఉంటుంటాయి. కానీ, స్థిరాదాయ సాధనమైన ఎఫ్డీ తదితర వాటితో పోలిస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ప్రయోజనాలు... ఇతర పన్ను ఆదా సాధనాల్లో కాకుండా ఈఎల్ఎస్ఎస్లో లాకిన్ పీరియడ్ తక్కువగా మూడేళ్లు మాత్రమే. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక పెట్టుబడులు అధికంగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీలు వార్షికంగా 12-14 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడులు 6.5 శాతమే. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు, పీపీఎఫ్‌లో లాకిన్ పీరియడ్ 15 ఏళ్లు. ఇందులో రాబడులు సుమారు 8 శాతం. పీపీఎఫ్ రేటు ఎప్పటికప్పుడు సవరణకు గురవుతుంది. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో రిస్క్ యావరేజ్ అవుతుంది. దాంతో రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుంది. ఇక పన్ను ఆదా కోసం ఒకే సారి ఇన్వెస్ట్ చేసే ఇబ్బంది కూడా లేకుండా, సిప్ రూపంలో కొన్ని నెలల పాటు లేదా ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో వీలుంటుంది. పెట్టుబడులను ఏప్రిల్‌లో ప్రారంభించడం మంచిది. కనీసం డిసెంబర్లో ఆరంభించినా నాలుగు నెలల సమయం ఉంటుంది. నాలుగు సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్లో రూ.4.8 లక్షల పెట్టుబడి ఐదేళ్లలో 12 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.8.28 లక్షలు అవుతుంది. అదే ఐదేళ్ల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.4.8 లక్షల పెట్టుబడి 7 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.7.12 లక్షలు అవుతుంది. రాబడుల వ్యత్యాసం రూ.లక్షకుపైనే ఉంది. -
పన్ను ఆదా.. రాచమార్గాలు!
పన్ను ఆదాయం ఉన్న వారు కొంత మొత్తంపై పన్ను పడకుండా చూసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇక్కడ పన్ను ఆదాయే కాదు, చేసే పెట్టుబడిపై మెరుగైన రాబడులు కూడా రావాలి. అప్పుడే పన్ను ఆదా, రాబడులు అనే రెండు లక్ష్యాలు సాకారం అవుతాయి. సరైన సాధనాన్ని ఎంపిక చేసుకుంటేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా కోసం ఏదో ఒకటి ఎంచుకుని పొరపాటు చేయవద్దు. ముఖ్యంగా సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలను తీసుకుంటే.. అందులో రాబడులు ఆశించిన మేర ఉండవు. అలాగే, బీమా రక్షణ విషయంలోనూ వీటికి మార్కులు తక్కువే. పన్ను ఆదా, రాబడులు ఈ రెండింటికీ అస్సలు నప్పని సాధనం ఎండోమెంట్ పాలసీలే. కనుక పన్ను ఆదా సాధనాల్లో వేటిల్లో రాబడులు ఏ మేర ఉన్నాయి, రిస్క్ తదితర వివరాలను తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయాన్ని సులభంగా తీసుకోవచ్చు. ఈ వివరాలను తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది. పీపీఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుత త్రైమాసికానికి (జనవరి–మార్చి) 7.9 శాతం. ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ గత ఏడాది కాలంలో గణనీయంగా తగ్గాయి. కానీ, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో పెద్దగా మార్పుల్లేవు. ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగైన రాబడులే ఉన్నాయి. అలాగే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)లో చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపైన కాకుండా, రాబడులపైనా పన్ను లేదు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడిపెట్టేది ఎక్కువగాసామాన్యులే. కనుక ప్రభుత్వం మరీ దూకుడుగా వడ్డీ రేట్లను తగ్గించలేదు. దీన్ని గమనంలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ తర్వాత అధిక రాబడులను ఇచ్చే సాధనం పీపీఎఫ్. బ్యాంకు పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్‌తో పోల్చితే పీపీఎఫ్ మెరుగైన సాధనం. 15 ఏళ్ల కాల వ్యవధి కలిగిన పెట్టుబడి పథకం ఇది. ఐదో ఏట తర్వాత పాక్షికంగా ఉపసంహరణకు వీలుంటుంది. పోస్టాఫీసులతో పోలిస్తే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్‌లో పెట్టుబడులకు అనుమతిస్తున్న బ్యాంకుల్లో ఖాతా తెరవడం సౌలభ్యంగా ఉంటుంది. వార్షికంగా రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎస్సీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) కూడా చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటి. ఇందులో పెట్టుబడులపైనా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. రాబడులు ప్రస్తుత త్రైమాసికానికి పీపీఎఫ్ మాదిరే 7.9%గా ఉన్నాయి. పెట్టుబడి సమయంలో ఉన్న రేటే ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. పెట్టుబడులపై లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. కాకపోతే రాబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. ఇతర ఆదాయం కింద రిటర్నుల్లో చూపించాలి. రాబడులపైనా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అదెలా అంటే.. ఉదాహరణకు 2020 జనవరిలో ఎన్ఎస్సీలో రూ.50 వేలు ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా పొందారనుకుందాం. ఏడాది తర్వాత రూ.3,950 రాబడి లభిస్తుంది. ఇది ఆటోమేటిగ్గా తిరిగి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక మరుసటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తంపైనా పన్ను ఆదా పొందొచ్చు. కాకపోతే కేవలం పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉంది. పెన్షన్ ప్లాన్లు బీమా సంస్థలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా పన్ను ఆదా జాబితాలో ఉన్నాయి. కాకపోతే ఎన్పీఎస్ వచ్చిన తర్వాత ఇవి ఆదరణ కోల్పోయాయి. ఎన్‌పీఎస్‌లో మాదిరే బీమా ఆధారిత పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులపై అదనంగా రూ.50,000పై పన్ను మినహాయింపు ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. కానీ, ఎన్‌పీఎస్‌తో పోల్చి చూస్తే బీమా ఆధారిత పెన్షన్ ప్లాన్లలో చార్జీలు అధికంగా ఉంటాయి. పారదర్శకత కూడా తక్కువే. కనుక రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవాలనుకునే వారు, దానిపై పన్ను ఆదా కోరుకునే వారు ఎన్పీఎస్ను ఆశ్రయించడమే మంచిది. ఇక, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కూడా రిటైర్మెంట్ ఫండ్స్ పేరుతో పథకాలను తీసుకొస్తున్నాయి. ఎన్పీఎస్ మాదిరే వీటిల్లోనూ అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్న రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్స్‌పై ప్రస్తుతానికి ఎటువంటి పన్ను ప్రయోజనాలను కేంద్రం ఇవ్వడం లేదు. బీమా పాలసీలు మనలో ఎక్కువ మంది బీమా పాలసీలు తీసుకోవడం చూడొచ్చు. ముఖ్యంగా పన్ను ఆదా కోసమని, పెట్టుబడుల దృష్ట్యా బీమా పాలసీలు తీసుకునే వారు చాలా మందే ఉంటారు. కానీ, తాము అనుసరిస్తున్న మార్గం సరైంది కాదన్నది తర్వాతే తెలుస్తుంది. ఒక వ్యక్తి మరణానికి గురైతే ఆ వ్యక్తి కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకునేది బీమా రక్షణ. కానీ, దీన్నొక పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా సాధనంగా చూడడం సరైనది కాదు. అలాగే, ఇందులో పెట్టుబడులపై దీర్ఘకాలంలో రాబడులు 20 ఏళ్ల ప్లాన్లలో 4.5–5 శాతంగానే ఉంటాయి. అంటే చాలా తక్కువ రాబడులు. ద్రవ్యోల్బణం స్థాయిలోనే రాబడి రేటు ఉంటే, నికర రాబడి సున్నాయే అవుతుంది. బీమా కవరేజీ కూడా వీటిల్లో చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఒక వ్యక్తి కనీసం తన వార్షిక ఆదాయానికి 10 రెట్ల మొత్తానికి అయినా బీమా తీసుకోవాలి. అంటే వార్షికంగా రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారు రూ.50 లక్షల పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇంత కవరేజీ ఎండోమెంట్ ప్లాన్‌లో తీసుకోవాలంటే వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.4–5 లక్షలు ఉంటుంది. అదే టర్మ్ ప్లాన్‌లో కేవలం రూ.7,000–8,000 చెల్లించడం ద్వారా రూ.50 లక్షల కవరేజీ పొందొచ్చు. టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపుల మొత్తం కూడా సెక్షన్ 80సీ కింద పన్ను ఆదాకు అర్హమైనదే. సుకన్య సమృద్ధి యోజన కేవలం పన్ను ఆదా కోసం అని కాకుండా, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులు వారి భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకోతగినది సుకన్య సమృద్ధి యోజన పథకం (ఎస్ఎస్వై). ఇది సంప్రదాయ పెట్టుబడి సాధనం. ఇందులో రూ.1.5 లక్షల పెట్టుబడిపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా చేసుకోవచ్చు. పదేళ్లలోపు బాలికల పేరిట తల్లిదండ్రులు (గరిష్టంగా ఇద్దరు పేరిటే) ఎస్ఎస్వై ఖాతా తెరుచుకోవచ్చు. ఖాతాలు రెండు అయినా కానీ, గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలుగా అమలవుతుంది. ఈ పథకంలో పెట్టుబడులపై వడ్డీ రేటు కూడా ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్‌తో అనుసంధానమై ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు మారిపోవచ్చు. ప్రస్తుతానికి (జనవరి–మార్చి త్రైమాసికం) 8.4 శాతం రేటు అమలవుతోంది. పీపీఎఫ్తో పోలిస్తే అధిక వడ్డీ రేటు ఈ పథకంలో కొనసాగుతోంది. పీపీఎఫ్ మాదిరే ఎస్ఎస్వై పథకంలోనూ రాబడులు పూర్తిగా పన్ను రహితమే. పోస్టాఫీసులు, ఎంపిక చేసిన జాతీయ బ్యాంకుల్లో ఎస్ఎస్వై ఖాతా తెరవచ్చు. ఇందులో పెట్టుబడులు, రాబడులను కుమార్తెల ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా డెట్ పథకం. దీనికి బదులు భవిష్యత్తు అవసరాల కోసం అధిక రాబడులను ఇచ్చే మంచి ఈక్విటీ సాధనాల్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. కనుక ఈ పథకంతో పోలిస్తే కొంత రిస్క్ తీసుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వైపు మొగ్గు చూపొచ్చు. యులిప్‌లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌లు) కూడా సెక్షన్ 80సీ సాధనాల్లో ఒకటి. ఈ విభాగంలో గత మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 8.09 శాతంగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ పథకాల్లో చార్జీలు భారీగా ఉండేవి. ఐఆర్డీఏఐ సంస్కరణలతో చార్జీలు కొంత మేర దిగొచ్చాయి. అయినా ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో చార్జీలు ఎక్కువ. ఎందుకంటే ఒకవైపు బీమా రక్షణనిస్తూనే, మరోవైపు పెట్టుబడులపై రాబడులను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ రెండింటి కోసం వసూలు చేసుకునే చార్జీలు ఎక్కువగానే ఉంటున్నాయి. కనుక దీర్ఘకాలానికి చూసుకుంటే ఇందులో పెట్టుబడులపై రాబడులు మోస్తరుగానే ఉంటున్నాయి. పోనీ బీమా రక్షణ అయినా తగినంతగా ఉంటుందా..? అనుకుంటే అదీ లేదు. వార్షికంగా రూ.24,000 ప్రీమియంపై 10 రెట్ల బీమా అంటే రూ.2.4 లక్షల బీమా వర్తిస్తుంది. దీర్ఘకాల రాబడులు ఆకర్షణీయంగా లేవు. తగినంత బీమా రక్షణకైతే కేవలం టర్మ్ పాలసీలను నమ్ముకోవడం మంచిది. అయితే యులిప్‌లలో ప్రయోజనాలూ ఉన్నాయి. యులిప్‌లో చెల్లించే ప్రీమియానికి బీమా రక్షణ 10 రెట్ల వరకే ఉంటే.. వచ్చే రాబడులపై సెక్షన్ 10(10డి) పూర్తిగా పన్ను ఉండదు. పన్ను ఆదా ఎఫ్డీ సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోసం ఉద్దేశించిన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అనే పేరుతో ఈ సాధనంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా చేసుకోవచ్చు. కాకపోతే ఐదేళ్ల పాటు మళ్లీ విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించరు. పైగా ఇందులో రాబడులు పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తాయి. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై రాబడి రేటు 6.5–7.6 మధ్య ఉంది. ఒక్కో బ్యాంకు ఒక్కో రేటు ఆఫర్ చేస్తోంది. అయితే, 5 శాతం పన్ను పరిధిలో ఉన్నవారు, అలాగే 10 శాతం, 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి రాబడులు మోస్తరుగా ఉన్నాయి కానీ, 30 శాతం శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను అనంతరం రాబడులు 5 శాతమే అని గమనించాలి. ముందస్తు ప్రణాళిక లేని వారు.. చివరి నిమిషంలో పన్ను ఆదా కోసం చూసే వారు.. తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని పరిశీలించొచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ చేసుకునేందుకు కొన్ని బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) పథకాలు గత మూడేళ్ల కాలంలో ఇచ్చిన సగటు వార్షిక రాబడులు 13%. అంతేకాదు సెక్షన్ 80సీ పన్ను ఆదా సాధనాల్లో అత్యధిక రాబడులు, తక్కువ లాకిన్ పీరియడ్ (మూడేళ్లు) ఉన్నది కూడా వీటిల్లోనే. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం వీటిల్లో మంచి పథకాలను ఎంచుకుని సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఈ పథకాలు నాణ్యమైన కంపెనీల ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఒకే విభాగానికి పరిమితం కాకుండా మల్టీక్యాప్ (భిన్న మార్కెట్ విలువలతో కూడిన కంపెనీలు) విధానాన్ని అనుసరిస్తుంటాయి. రూ.1.5 లక్షలను వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను ఆదా చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభం రూ.లక్ష (విక్రయించినప్పుడు) వరకు ఉంటే పన్ను ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించిన లాభం వస్తే ఆ మొత్తంపైనే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధిక రిస్క్‌తో కూడిన సాధనాల కిందకు ఇవి వస్తాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఎన్‌పీఎస్‌లో గత ఐదేళ్ల కాలంలో రాబడులు.. అగ్రెసివ్ విభాగం(ఈక్విటీల్లో పెట్టుబడులు 50%)లో వార్షిక రాబడులు 9.11%. బ్యాలన్స్డ్ విభాగంలో (ఈక్విటీల్లో పెట్టుబడులు 33%) వార్షిక రాబడులు సగటున 9.26%. కన్జర్వేటివ్ విభాగంలో (ఈక్విటీ పెట్టుబడులు 20%) వార్షిక సగటు రాబడులు 9.39%. అలాగే, అల్ట్రా సేఫ్ విభాగంలో (పూర్తిగా డెట్ పెట్టుబడులు) ఐదేళ్ల వార్షిక సగటు రాబడులు 9.57%. అంటే మొత్తం మీద రాబడులు 9.11–9.57% మధ్య ఉన్నాయి. ఈక్విటీ, డెట్ రెండింటి రాబడుల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడానికి ప్రధాన కారణం... ఇటీవలి సంవత్సరాల్లో ఈ రెండు విభాగాలు ర్యాలీ చేయడమే. దీర్ఘకాలంలో 20–30 ఏళ్ల కాలానికి ఈక్విటీ ఎక్స్‌పోజర్‌తో కూడిన విభాగాల్లోనే (అగ్రెసివ్, బ్యాలన్స్డ్, కన్జర్వేటివ్) అధిక రాబడులకు చాన్స్ ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలకు అదనంగా మరో రూ.50వేలను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సీసీడీ (2) కింద పన్ను లేకుండా ప్రయోజనం పొందే అవకాశం ఇందులోనే ఉంది. -
ఎన్పీఎస్కు పూర్తిగా పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వ చందాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే, ఎన్పీఎస్ నుంచి రిటైర్మెంట్ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను ఉండదని తెలిపారు. దీంతో పీపీఎఫ్, ఈపీఎఫ్ పథకాల మాదిరే ఎన్పీఎస్కు కూడా ఈఈఈ హోదా (మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు) లభించనుంది. కార్యదర్శుల కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వ చందాను 14 శాతానికి పెంచాలని గత వారమే కేబినెట్ నిర్ణయం తీసుకుందని జైట్లీ వెల్లడించారు. ఆర్థిక బిల్లులో మార్పులు చేసిన తర్వాత ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రయోజనాలు అమల్లోకి రానున్నాయని అధికార వర్గాల సమాచారం. ప్రభుత్వ నిర్ణయం 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించనుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించి కేంద్రం నమూనాను అనుసరించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని జైట్లీ అభిప్రాయపడ్డారు. మీడియాకు మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం... ఇకపై ఈ ప్రయోజనాలు ప్రస్తుత నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ నాటికి సమకూరిన నిధి నుంచి 40 శాతం మొత్తంతో తక్షణం పెన్షన్ వచ్చే యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై పన్ను లేదు. మిగిలిన 60 శాతాన్ని ఎన్పీఎస్ చందాదారులు తీసేసుకోవచ్చు. ఇందులో 40 శాతాన్ని పన్ను మినహాయింపు ఇస్తూ మిగిలిన 20 శాతంపై పన్ను అమలు చేస్తున్నారు. ఇకపై ఉపసంహరించుకునే మొత్తం 60 శాతంపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ వెసులుబాటు ఎన్పీఎస్ చందాదారులు అందరికీ వర్తిస్తుంది. ఇప్పటి వరకు టైర్–1 కింద జమ చేసే వాటికే పన్ను మినహాయింపు ఉండగా, కొత్తగా టైర్–2కింద జమచేసే మొత్తంలో రూ.1.5 లక్షలకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును కేంద్రం కల్పించింది. ఇందుకు గాను టైర్–2 ఖాతా కింద జమలపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. ఎన్‌పీఎస్‌లో టైర్–1 అకౌంట్లో జమలను 60 ఏళ్లు వచ్చే వరకు ఉపసంహరించుకోవడానికి లేదు. కొన్ని ప్రత్యేక కారణాల్లోనే ఇందుకు అనుమతిస్తారు. టైర్–2 అకౌంట్ అన్నది స్వచ్చందంగా పొదుపునకు ఉద్దేశించిన అకౌంట్. టైర్–1 అకౌంట్‌కు అనుబంధంగా ప్రారంభించుకోవచ్చు. ఎప్పుడు అవసరమైనా ఇందులో మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇకపై మూడేళ్ల పాటు టైర్–2 అకౌంట్ డిపాజిట్లను వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి బేసిక్ వేతనంపై 14 శాతం ప్రభుత్వ చందాగా లభిస్తుంది. ఇది ప్రస్తుతం 10 శాతంగా ఉంది. ఇక ఉద్యోగుల వాటా 10 శాతంలో ఎటువంటి మార్పు లేదు. ఈ నిర్ణయం 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2,840 కోట్లను అదనంగా భరించాల్సి వస్తుంది. 2004 జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ పథకంగా ఎన్పీఎస్ అమలవుతున్న విషయం గమనార్హం. ఎన్‌పీఎస్‌లో డెట్, ఈక్విటీల్లోనూ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించనుంది. అలాగే, తమకు నచ్చిన ఫండ్ మేనేజర్ సంస్థలను కూడా ఎంచుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుత మూడు ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలకే అవకాశం ఉండగా, ఇకపై 8 ఫండ్ మేనేజ్మెంట్ సంస్థల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. -
పిల్లల ప్రగతికి పెట్టుబడి ఎలా?
పిల్లల భవిష్యత్తు లక్ష్యాలు సఫలం కావాలంటే వారు చిన్నగా ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఇందుకోసం తగిన పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్య, వివాహం అన్నవి పిల్లలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన, పెద్దవైన లక్ష్యాలు. విద్యా వ్యయం విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో వీటికి ఏ విధంగా సన్నద్ధులు కావాలి, ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలన్నది తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి. వేటిల్లో ఇన్వెస్ట్ చేస్తే, మీ పిల్లల లక్ష్యాలను సాకారం చేసేందుకు సరిపడా నిధులు సమకూరతాయి అన్నవి గమనించాలి. యులిప్‌లు తీసుకోవాలా లేక సుకన్య సమృద్ధి యోజన, లేక రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి... ఇవేవీ కాకుండా అంతా ఎఫ్‌డీల్లో పెట్టేయడం... ఎలా అడుగులు వేస్తే అది మీరు ఆశించిన లక్ష్యాలను నెరవేరుస్తుందో తెలుసుకోవాలి. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మీ పిల్లల విద్య, వివాహాల వంటి లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలంటే దానికంటే ముందు లక్ష్యాల్లో స్పష్టత తెచ్చుకోవాలి. అలాగే, కొన్నేళ్ల తర్వాత విద్య కోసం ఎంత ఖర్చవుతుంది, అందుకు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే అదనంగా ఎంత మేర సమకూర్చుకోవాలన్నవి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు ఈ లక్ష్యాలకు కాల వ్యవధులను నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత వీటి కోసం తగిన పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవడం కీలకం అవుతుంది. అంటే ఈక్విటీ, డెట్, రియల్ ఎస్టేట్, బంగారం వంటి వాటిల్లో రాబడుల వృద్ధితో పాటు పెట్టుబడికి భద్రత ఉండేలా పెట్టుబడుల కేటాయింపు ఉండాలి. కొన్ని ఈక్విటీ సాధనాలు, డెట్ సాధనాలను వేర్వేరుగా ఎంచుకోవచ్చు. లేదా రెండింటితో కూడిన బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను అయినా ఎంపిక చేసుకోవచ్చు. వీటి పట్ల ఓ స్పష్టత వస్తే అప్పుడు మీ ప్రయాణం సులువుగా సాగిపోతుంది. చిన్నారుల లక్ష్యాలకు ఏ ఫండ్స్? చాలా మంది పెట్టుబడి ప్రారంభంలో చూపించినంత శ్రద్ధ, కట్టుబాటు ఆ తర్వాత కొనసాగించలేరు. ‘‘తమ లక్ష్యానికి అనుగుణంగా ఈక్విటీ, డెట్ మిశ్రమంగా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడం మంచిది. దీర్ఘకాలానికి అయితే ఈక్విటీలు అనుకూలం. స్వల్పకాల లక్ష్యాలు అయితే డెట్ నయం’’ అని అర్థయంత్ర సీఈవో నితిన్ వ్యాకరణం తెలిపారు. 8–10 ఏళ్ల కాలం కోసం ఈక్విటీ ఫండ్స్ లేదా ఈక్విటీల్లో 80 శాతం వరకు ఇన్వెస్ట్ చేసే డైవర్సిఫైడ్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఇవి 12 శాతం వరకు రాబడులను ఇస్తాయి. ఇక పదేళ్ల కాలంలో రిస్క్ దాదాపుగా తక్కువే. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని 5నాన్స్ సహ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా తెలిపారు. మధ్యకాల లక్ష్యాల కోసం బ్యాలెన్స్డ్ లేదా హైబ్రిడ్ ఫండ్స్ ఎంచుకోవచ్చని సూచించారు. ఇవి ఈక్విటీ, డెట్‌లో 60:40 శాతం మేర ఇన్వెస్ట్ చేస్తాయి. 2–3 ఏళ్ల కాలం కోసం షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ తగినవి. ఇవి బ్యాంకు ఖాతా కంటే అధిక రాబడులను ఇస్తాయి. వీటిల్లో భద్రత కూడా ఎక్కువే. విద్యారుణం పిల్లల ఉన్నత విద్యావసరాలను అధిగమించడం అన్నది చాలా మంది తల్లిదండ్రులకు నిజంగా ఆందో ళన కలిగించే విషయమే. అయితే ఎక్కువ మంది చేసే పొరపాటు ఏమిటంటే సరైన సమయంలో పెట్టుబడి ఆరంభించకపోవడమే. దీంతో అవసరం ఎదురయ్యే నాటికి తగినంత నిధి ఉండదు. దీంతో తల్లిదండ్రులు ఇతర అవసరాల కోసం సమకూర్చుకున్నవాటిని ఖర్చు చేసే పరిస్థితి ఎదురవుతుంది. తమ పేరిట ఉన్న ఇళ్లను తనఖా పెట్టడం, చివరికి పదవీ విరమణ అనంతరం జీవన అవసరాల కోసం సమకూర్చుకునే వాటినీ ఖర్చే చేసేవారు ఉన్నారు. ‘‘ఒకవేళ పిల్లలు స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులకు మద్దతుగా నిలవలేకపోతే ఏంటి పరిస్థితి? రిటైర్మెంట్ కోసం ఇచ్చే రుణం అంటూ ఏదీ లేదు. కనుక వీటికి బదులు విద్యారుణం తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. దీనివల్ల రిటైర్మెంట్ కోసం ఏర్పా టు చేసుకున్న నిధి సురక్షితంగా ఉంటుంది. విద్యా రుణం తీసుకోవడం వల్ల పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి’’ అని దినేష్ రోహిరా తెలిపారు. రియల్ ఎస్టేట్ సరైనదేనా? చాలా కారణాల రీత్యా చిన్నారుల భవిష్యత్తు లక్ష్యాల కోసం రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదని పీక్ ఆల్ఫా ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రియా సుందర్ పేర్కొన్నారు. ‘‘గత దశాబ్ద కాలం లో తక్కువ రాబడుల రేటు ఉన్న దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధంగా పెరుగుతుందన్నది తెలియదు. దీంతో డబ్బులు అవసరం పడినప్పుడు ధరలు సహేతుకంగా లేకుంటే అమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్, మెయింటెనెన్స్ చార్జీలు, లావాదేవీ రుసుములు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వంటివి ఉం టాయి’’ అని సుందర్ వివరించారు. రియల్ ఎస్టేట్ కంటే బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు అందుకోవచ్చని సూచించారు. యులిప్ లేక ఎండోమెంట్ ప్లాన్ వాస్తవం మాట్లాడుకోవాలంటే చిన్నారికి సంబంధించిన భవిష్యత్తు లక్ష్యాల విషయంలో ఈ రెండూ కూడా ఉపయోగమైనవి కావు. ‘‘తల్లిదండ్రులు బీమాను పెట్టుబడిగా చూస్తున్నట్టయితే ఈ రెండూ సూచనీయం కాదు. ఈ రెండింటినీ కలగలపకూడదు’’ అని నితిన్ వ్యాకరణం తెలిపారు. ‘‘ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలు ఈ రెండింటికీ దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి 4–6 శాతం రాబడులను మించి ఇవ్వలేవు. కనుక తల్లిదండ్రులు పిల్లల ఆధారిత బీమా ఉత్పత్తులు, ప్లాన్ల ఆకర్షణలో పడొద్దు’’అని హ్యాపీనెస్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడు అమర్ పండిట్ తెలిపారు. చిన్నారులకు బీమా అవసరం ఉండదు. ఇది కావాల్సింది వారిని సంరక్షించే తల్లిదండ్రులకేనన్న విషయాన్ని తెలుసుకోవాలి. టర్మ్‌ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఎంచుకోవడం మంచి ఆప్షన్ అని దాదాపు అందరు ఫైనాన్షియల్ అడ్వైజర్లు సూచించేదే. పిల్లల ప్లాన్లతో పోలిస్తే... మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పారదర్శకత ఎక్కువ. ఏ పథకంలో రాబడులు ఏ మేరకు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. మరింత పరిశోధన సమాచారం అందుబాటులో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌కు అదనంగా పిల్లల దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే అప్పుడు యులిప్‌ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోయినా, వారి పేరిట పెట్టుబడి ఈ ప్లాన్లలో కొనసాగుతుంది. సుకన్య సమృద్ధి/ పీపీఎఫ్/ ఎఫ్డీ సుకన్య సమృద్ధి లేదా పీపీఎఫ్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ కూడా డెట్ సాధనాలు. ఇవి పెట్టుబడుల పరంగా రిస్క్‌ను తగ్గిస్తాయి. ముఖ్యంగా వీటిల్లో సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ అన్నవి మంచి సాధనాలు అవుతాయి. మీ లక్ష్యానికి అనువైనది ఎంచుకోవడమే మీరు చేయాల్సింది. 10 ఏళ్లలోపు కుమార్తెలు ఉన్నట్టయితే వారి వివాహానికి 21 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ‘‘ఇందులో పెట్టుబడి, దానిపై వడ్డీ, గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తం కూడా సుకన్య నమృద్ధి యోజన పథకంలో పన్ను మినహాయింపు ఉంది. దీంతో గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణంతో చూస్తే భారీ రాబడులు ఏమీ కాదు. పైగా ఆర్థిక వృద్ధి మరింత పెరిగి, వడ్డీ రేట్లు పడిపోతే ఇప్పుడున్న 8.5 శాతం వడ్డీ రేటు స్థిరంగా ఉండదు’’అని సుందర్ తెలిపారు. ఇక, చిన్నారి 9 ఏళ్ల వయసులో ఇందులో పెట్టుబడి ఆరంభిస్తే, ఆమెకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత పెట్టుబడిలో కేవలం 50 శాతమే వెనక్కు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కనుక పెద్దగా సమకూరకపోవచ్చు. పీపీఎఫ్ పథకం 15 ఏళ్ల కాల వ్యవధితో ఉంటే, ఏడేళ్ల తర్వాత కొద్దిమేరే ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నవి స్వల్ప కాల లక్ష్యాల కోసమే ఎంచుకోవాలి. ఎందుకంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. పైగా వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఆభరణాల్లో పెట్టుబడి? భౌతిక బంగారంలో పెట్టుబడికి ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయి. అందుకే నిపుణులు ఎవరూ పెట్టుబడి కోసం ఆభరణాలను సూచించరు. ‘‘మీ పిల్లల వివాహానికి బంగారు ఆభరణాలను కానుకలుగా ఇవ్వదలిస్తే అది మంచిదే. కానీ, బంగారంలో ఇన్వెస్ట్ చేయ డాన్ని నేను సిఫారసు చేయను. ప్రాక్టికల్‌గా చూస్తే సార్వభౌమ బంగారం బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమైన ఆప్షన్ అవుతుంది’’ అని యూనోవెస్ట్ వ్యవస్థాపకుడు విపిన్ ఖండేల్వాల్ తెలిపారు. బాండ్లను విక్రయించే సమయంలో నాటి బంగారం మార్కెట్ ధర పొందడమే కాకుండా, అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ కూడా సార్వభౌమ బంగారం బాండ్లలో లభిస్తుంది. ఇక భౌతిక బంగారాన్ని భద్రంగా ఉంచుకునేందుకు వెచ్చించాల్సిన ఖర్చులు కూ డా తప్పుతాయి. బాండ్లను కాల వ్యవధి తీరే వరకు ఉంచుకుంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. -
పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
మన దేశంలో సామాన్యుల దగ్గరి నుంచి ధనవంతుల వరకు బాగా పరిచయమైన పెట్టుబడి సాధనం ప్రభుత్వ భవిష్య నిధి (పీపీఎఫ్). ఇందులో చేసే పెట్టుబడులు, దానిపై వచ్చే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపులు ఉండటమే దీనికి కారణం. అయితే, పీపీఎఫ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందామా మరి!! కాలవ్యవధి 15 ఏళ్ల పైనే.. పీపీఎఫ్ 15 ఏళ్ల లాకిన్ పీరియడ్‌తో ఉంటుంది. దీని ప్రకారం మెచ్యూరిటీ 15 ఏళ్లకు పూర్తి కావాలి. అయితే, కాల వ్యవధిని లెక్కించేది ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి కాదు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల వ్యవధిని పరిగణిస్తారు. ఏ తేదీ, ఏ నెలలో మొదలుపెట్టారన్నది ముఖ్యంకాదు. ఉదాహరణకు 2017 జూలై 1న ఖాతా ప్రారంభించారనుకోండి. దాన్ని 2018 మార్చి 31గా లెక్కిస్తారు. అప్పటి నుంచి 15 ఏళ్ల వ్యవధికి పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో కాల వ్యవధి 2032 ఏప్రిల్ 1తో ముగుస్తుంది. పొడిగించుకోవచ్చు... పీపీఎఫ్ ఖాతా కాలవ్యవధి 15 ఏళ్లే అయినప్పటికీ, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు పొడిగించుకోవచ్చు. ఖాతాలో పెట్టుబడులపై అప్పటి వడ్డీ రేటు అమలవుతుంది. పొడిగించుకోవాలని అనుకుంటే 15 ఏళ్లు ముగిసిన తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పొడిగించిన కాలానికి జమలు చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు అవసరమైతే ఏడాదికోసారి బ్యాలెన్స్‌లో 60 శాతం మించకుండా వెనక్కి తీసుకోవచ్చు. బదిలీ చేసుకోవచ్చు కూడా... పీపీఎఫ్ ఖాతాను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు. ఒక తపాలా కార్యాలయం నుంచి మరో తపాలా కార్యాలయానికి లేదా తపాలా కార్యాలయం నుంచి బ్యాంకుకు మార్చుకునేందుకు అవకాశం ఉంది. అలాగే, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు కూడా బదిలీ చేసుకోవచ్చు. నామినేషన్ ఖాతాకు నామినేషన్ సదుపాయం ఉంది. ఓ వ్యక్తి తన ఖాతాకు అవసరమైతే మైనర్‌ను కూడా నామినీగా అపాయింట్ చేసుకోవచ్చు. అయితే, మైనర్ తరఫున తెరిచిన ఖాతాకు నామినేషన్ సౌకర్యం లేదు. ఖాతా తెరవటానికి అర్హులెవరు? దేశంలో నివసిస్తున్న వారే పీపీఎఫ్ ఖాతాను తెరిచేందుకు అవకాశం ఉంది. జాయింట్ పీపీఎఫ్ ఖాతాకు అవకాశం లేదు. అయితే, సంరక్షకుడితో కలసి మైనర్లు ఖాతాను ప్రారంభించొచ్చు. సంరక్షకులనే వారు తల్లి లేదా తండ్రి లేదా కోర్టు నియమించిన వేరొకరైనా కావచ్చు. తల్లిదండ్రులు మరణించిన సందర్భాల్లో తప్పిస్తే తాత, బామ్మలు మనవడు లేదా మనవరాలి పేరిట పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అవకాశం లేదు. ఒకరు తన పేరిట ఒక ఖాతాను మించి ప్రారంభించేందుకు నిబంధనలు అనుమతించవు. అయితే మైనర్ పేరిట తెరిచిన ఖాతాను వేరేగా పరిగణిస్తారు. ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), హిందూ ఉమ్మడి కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) లేదా వ్యక్తులకు సంబంధించిన సంస్థ (బీఓఐ)లు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం లేదు. ఇటీవలే కేంద్రం పీపీఎఫ్‌కు సంబంధించి ఎన్ఆర్ఐల విషయంలో ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తులు ఎవరైనా పీపీఎఫ్ ఖాతా తెరిచి, ఆ తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడితే (ఎన్ఆర్ఐగా మారితే) వారి పీపీఎఫ్ ఖాతా మూసివేతకు గురవుతుంది. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌పై కేవలం సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు మాత్రమే చెల్లిస్తారు. అంటే 7.8 శాతం వడ్డీ రేటు వర్తించదు. నగదు అవసరమైతే... పెట్టుబడి ప్రారంభించిన తర్వాత 15 ఏళ్ల వ్యవధి తీరకుండానే డబ్బుతో పని పడిందనుకోండి. పెట్టుబడుల్లో కొంత వెనక్కి తీసుకోవచ్చు. లేదా రుణం కూడా తీసుకోవచ్చు. రుణంపై పీపీఎఫ్ వడ్డీ రేటు కంటే 2% అదనంగా వసూలు చేస్తారు. పీపీఎఫ్ ఖాతా జమలపై రుణం తీసుకుంటే దాన్ని తీర్చిన తర్వాతే మరోసారి రుణం పొందేం దుకు వీలుంటుంది. మూడో ఏట చివరి నుంచి ఏడవ సంవత్సరంలోపే రుణానికి అవకాశం. ఆ తర్వాత నుంచి పెట్టుబడిలో కొంత వెనక్కి తీసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఏడాదికి ఒక్కసారే ఈ అవకాశం. ఒకవేళ చందాలు జమలేక ఖాతా ఇనాక్టివ్‌గా మారిపోతే రుణాలు పొందడానికి, ఖాతా లో ఉన్న బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. కనీస చందాలతోపాటు జరిమానాలు చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకున్న తర్వాతే ఆ అవకాశం లభిస్తుంది. వడ్డీ లెక్కించేది ఇలా... పీపీఎఫ్‌లో పెట్టుబడులపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి 7.8 శాతం వడ్డీరేటు అమలవుతోంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసేవారు 5వ తేదీలోపు ఇన్వెస్ట్ చేస్తేనే ఆ చందాకు ఆ నెలకు సంబంధించిన వడ్డీ లభిస్తుంది. చెక్కు ఇచ్చినా గానీ 5వ తేదీలోపు డ్రా అయి వెళ్లేలా చూసుకోవాలి. పీపీఎఫ్ ఖాతాలోని నగదు బ్యాలెన్స్ ప్రతి నెలా 5వ తేదీన ఎంతయితే ఉంటుందో... దాన్నే వడ్డీకి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వార్షికంగా ఒక్కసారే ఇన్వెస్ట్ చేస్తుంటే ఏప్రిల్ 5వ తేదీలోపు డిపాజిట్ చేయడం ప్రయోజనం. ఏటా మార్చి 31నే వడ్డీ ఖాతాలో జమ చేసినప్పటికీ ప్రతీ నెలా 5వ తేదీ నాటికి ఉన్న బ్యాలెన్స్‌ను పరిగణనలోకి తీసుకుని లెక్కించడం జరుగుతుంది. వార్షికంగా గరిష్ట పరిమితి దాటి ఎంత మొత్తం జమ చేసినా దానిపై వడ్డీ రాదు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల జమలపైనే వడ్డీ లభిస్తుంది. వార్షికంగా కనీసం రూ.500 జమ చేయకపోతే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు పీపీఎఫ్ ఖాతా ఇనాక్టివ్‌గా మారిపోతుంది. తిరిగి ఆ ఖాతాను యాక్టివ్‌గా మార్చుకోవాలంటే అప్పటి వరకు బకాయి పడిన ప్రతి సంవత్సరానికి కనీస చందా రూ.500తోపాటు పెనాల్టీ రూ.50 (ఏటా) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కనీసం రూ.500;గరిష్ఠం రూ.1.5 లక్షలు పీపీఎఫ్‌లో ఎంత పడితే అంత డిపాజిట్ చేయటానికి వీల్లేదు. దీనికంటూ నిబంధనలున్నాయి. పీపీఎఫ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేయొచ్చు. తన పేరిట గానీ, తన పిల్లల పేరిట గానీ పీపీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకు మించడానికి వీల్లేదు. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో 12 సార్లే డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏక మొత్తంలోనూ డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే 12 సార్లకు మించి చేయడానికి మాత్రం వీలుండదు. లాకిన్ పీరియడ్ డిపాజిట్ ప్రారంభించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి ప్రారంభమవుతుంది కనుక వార్షిక చందాలైతే 16 సార్లు చేయాల్సి ఉంటుంది. నెలవారీ చందాలైతే గరిష్ఠంగా 192 సార్లు డిపాజిట్ చేయవచ్చు. ముందస్తుగాచఖాతా ముగిస్తే..! కొన్ని ప్రత్యేక కేసుల్లో పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా క్లోజ్ చేసేందుకు అనుమతి ఉంటుంది. దీనికి సైతం కనీసం ఐదేళ్ల కాల వ్యవధి ముగిసి ఉండాలి. నిజానికి పీపీఎఫ్ ఖాతాలో చేసే పెట్టుబడులు, దానిపై రాబడులకు పన్ను మినహాయింపు ఉందని చెప్పుకున్నాం కదా. అయితే, 15 ఏళ్ల కాల వ్యవధి తీరకుండానే వెనక్కి తీసుకుంటే ఆ మొత్తంపై పన్ను పడుతుంది. వార్షిక ఆదాయ రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ నిధిపై సంపద పన్ను వర్తించదు. ఏ కోర్టూయ జప్తు చేయలేదు పీపీఎఫ్ ఖాతాదారుడు ఎవరికైనా, ఏ సంస్థకైనా బకాయి పడితే అతడి ఖాతాను జప్తు చేసేందుకు చట్టం అనుమతించదు. దీంతో పీపీఎఫ్ ఖాతాలో ప్రతి రూపాయి ఆ వ్యక్తికే చెందుతుంది. లేదంటే అతడి కుటుంబ సభ్యులకు దానిపై హక్కు లభిస్తుంది. -
పోస్టు ఆఫీసు డిపాజిట్లకూ ఆధార్
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ను మరింత విస్తృతిలోకి తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అన్నింటికీ దీన్ని ఆధారం చేస్తూ వెళ్తోంది. ప్రస్తుతం 12 అంకెల ఈ ఆధార్‌ను అన్ని పోస్టు ఆఫీసు డిపాజిట్లకు, పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్, కిషాన్ వికాస్ పాత్రలకు తప్పనిసరి చేసింది. ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను సమర్పించడానికి 2017 డిసెంబర్ 31ను తుది గడువుగా విధించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన నాలుగు గెజిట్ నోటిఫికేషన్లలో ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పోస్టు ఆఫీసుల్లో డిపాజిట్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్‌ను సమర్పించని వారు, ప్రస్తుతం ఆధార్ నెంబర్‌ను సంబంధిత పోస్టు ఆఫీసు సేవింగ్స్ బ్యాంకు లేదా డిపాజిట్ ఆఫీసు వద్ద సమర్పించాలని ఓ నోటిఫికేషన్లో తెలిపింది. అన్ని బ్యాంకు డిపాజిట్లకు, మొబైల్ ఫోన్ సిమ్‌లకు, పలు ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలకు ఆధార్‌ను సమర్పించే గడువును సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఆధార్ అన్నింటికీ తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆధార్ నెంబర్ లేని వాళ్ల కోసం ప్రభుత్వం ఎన్రోల్మెంట్ సెంటర్లను కూడా తెరచింది. 2017 డిసెంబర్ 31 వరకు వారు ఆధార్‌ను ఎన్రోల్ చేసుకుని, ఈ నెంబర్‌ను పొందాల్సి ఉంటుంది. -
పొదుపు మొత్తాలపై తగ్గిన వడ్డీ
జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి 0.1 శాతం కోత న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రాలు, సుకన్య సమృద్ధి తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లను కేంద్రం 0.1 శాతం మేర తగ్గించింది. అయితే, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా వార్షికంగా 4 శాతం స్థాయిలోనే ఉంచింది. తాజా పరిణామంతో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మూడు నెలలకోసారి సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం... ఇకపై పీపీఎఫ్ పథకంలో ఇన్వెస్ట్ చేసే మొత్తాలపై వార్షిక ప్రాతిపదికన 7.8 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ♦ కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం వడ్డీ రేటు, మెచ్యూరిటీ గడువు 115 నెలలుగా ఉంటుంది. ♦ బాలికల భవిష్యత్‌కు ఉపయోగపడే సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీముపై ఇప్పటిదాకా 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా ఇకపై 8.3 శాతం మాత్రమే లభించనుంది. ♦ 5 ఏళ్ల సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీముపైనా 8.3 శాతం మాత్రమే దక్కుతుంది. -
పీపీఎఫ్, కేవీపీ వడ్డీ రేట్ల కోత
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్ స్కీం, కిసాన్ వికాస పత్ర (కేవీపీ) వడ్డీరేట్లను మరోసారి ప్రభుత్వం కోత పెట్టింది. పీపీఎఫ్, కేవీపీ, సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం- సుకన్యా సమృద్ధి యోజనసహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లపై10 బేసిస్ పాయింట్లను తగ్గించినట్టు కేంద్రం ప్రకటించింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకం, సుకన్యా సమృద్ధి యోజన సహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడా వడ్డీరేట్లు తగ్గుతున్నాయి తాజా నిర్ణయం ప్రకారం పీపీఎఫ్ , ఎన్ఎస్సీ పథకాలపై 7.8శాతం, కేవీపీపై 7.5శాతంగా ఉండనుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకం, సుకన్యా సమృద్ధి పథకాలపై 8.3 శాతం వడ్డీరేటు వర్తించనుంది. ఇప్పటివరకూ ఇది 8.4శాతంగా ఉంది. మూడు నెలలకోసారి మార్కెట్ రేటుకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో ఆయా పొదుపు పథకాలపై వడ్డీరేటు10 బేసిస్ పాయింట్ల కోతపెట్టింది. ఈ వడ్డీ రేట్లకు ప్రాతిపదికగా అంతకు ముదు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి దోహద పడేలా వ్యవస్థను తక్కువ స్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్న కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా నిర్ణయం. గత మార్చి నెల సమీక్షలో కూడా 10 బేసిస్ పాయింట్లను తగ్గించింది. -
రిస్క్ వద్దా..? పీపీఎఫ్ బెటర్!
ప్రస్తుత వడ్డీ రేటు 7.9 శాతం ♦ పన్ను ఉండదు కనక ఇది మంచి రాబడే ♦ మిగతా పథకాల్లో దేని లోటుపాట్లు దానికున్నాయ్ ♦ సుకన్య సమృద్ధి... ఆడపిల్లలున్న వారికి మాత్రమే ♦ బ్యాంకు ఎఫ్డీలలో వడ్డీ రేటు చాలా తక్కువ ♦ డెట్, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో రాబడికి గ్యారంటీ లేదు ♦ చాలా వాటికి పన్ను కోత కూడా ఉంటుంది ♦ ప్రస్తుత పెట్టుబడి పథకాలపై నిపుణుల సూచనలివీ... ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) వడ్డీ రేటు క్రమంగా తగ్గిపోతోంది. తాజా త్రైమాసికానికి గాను 7.9 శాతం వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. ఈ పథకంలో గడిచిన 40 ఏళ్ల కాలంలోనే అత్యంత తక్కువ వడ్డీ రేటు ఇది. భవిష్యత్తులో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు మరికొంత తగ్గే అవకాశాలున్నాయన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో చాలామంది పీపీఎఫ్ వద్దనుకుని, ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తున్నారు కూడా? కొందరైతే పీపీఎఫ్‌లో పెట్టుబడుల నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. కాకపోతే నిపుణులు మాత్రం వడ్డీ రేటు తగ్గినా ఇతర సంప్రదాయ డిపాజిట్ పథకాలతో పోలిస్తే ఇప్పటికీ పీపీఎఫ్ ఆకర్షణీయమేనంటున్నారు. అదెలాగో చూద్దాం. పీపీఎఫ్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణీయత దానిపై పెట్టే పెట్టుబడులకు, దానిద్వారా వచ్చే రాబడులకూ ఆదాయపన్ను మినహాయింపు ఉండడం. ఒకవైపు పన్ను మినహాయింపులు, మరోవైపు చెప్పుకోతగ్గ వడ్డీ రేటును అందించే సంపద్రాయ హామీతో కూడిన పథకాలు పీపీఎఫ్ తప్ప మరొకటి లేదు. పైగా ద్రవ్యోల్బణం రేటు 3.65 శాతం మినహాయించి చూసుకున్నా పీపీఎఫ్‌పై వచ్చే రాబడి రేటు 4.25 శాతంగా ఉంది. హామీతో కూడిన రాబడి, పన్ను మినహాయింపులు, ద్రవ్యోల్బణ తరుగుదల అన్నీ పోను ఈ మాత్రం రాబడులు అన్నవి చక్కనివేనన్నది నిపుణుల మాట. బాండ్లను చూసుకుంటే పదేళ్ల బాండ్ల రాబడి బెంచ్ మార్క్ ప్రకారం ప్రస్తుతం 6.8 శాతంగా ఉంది. కానీ, పీపీఎఫ్‌పై రాబడి 7.9 శాతం. కనుక రిస్క్ వద్దనుకునేవారికి దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది చక్కని సాధనమన్నది నిపుణుల సూచన. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా రిస్కు లేకుండా కచ్చితమైన రాబడులు వస్తాయి. కానీ వడ్డీ రేటు మాత్రం 6.5–7.5 శాతంగానే ఉంది. పైగా ఈ వడ్డీ రా>బడిపై ఆదాయపన్ను పడుతుంది. ఉదాహరణకు 30 శాతం పన్ను చెల్లించే వారికి పన్ను పోను మిగిలే రాబడి 4.55–5.25 శాతంగానే ఉంటుంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో ముడిపెట్టి చూస్తే మిగిలేది ఏముంది గనక!!. ఇక ప్రభుత్వ రంగ కంపెనీలు జారీ చేసే పన్ను రహిత బాండ్లు కూడా పీపీఎఫ్తో పోటీ పడలేవు. ఎందుకంటే వీటిపై రాబడులు 6.25 శాతంగానే ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన ఈ పథకంలో వడ్డీ రేటు 2017–18 సంవత్సరానికి 8.4 శాతంగా ఉంది. కుమార్తె కలిగిన వారు వారి పేరిట పెట్టుబడులకు ఉద్దేశించిన పథకం ఇది. కాకపోతే దీన్లో పదేళ్ల వయసులోపు కుమార్తెలు ఉన్నవారు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. అలాంటి వారు తమ పిల్లలకోసం దీర్ఘకాలిక నిధి సమకూర్చుకోవాలనుకుంటే ఇది అనువైనదే. ప్రస్తుత రేటు ప్రకారం పీపీఎఫ్‌కు మించి రాబడులను ఇచ్చే పథకమిది. పైగా పీపీఎఫ్ మాదిరిగానే ఈ పథకంలో కూడా రాబడులకు పన్ను వర్తించదు. కాకపోతే ఇందులో పెట్టుబడులను ప్రారంబిస్తే కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు వాటిని వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. పైగా ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకం పరిధిలో ఉన్న వేతన జీవులకు అందుబాటులో ఉన్న పథకం ఇది. ఉద్యోగుల మూల వేతనం నుంచి నిర్ణీత శాతం నెలనెలా ఈపీఎఫ్‌కు జమ చేయడం జరుగుతుంది. దీనికి అదనంగా స్వచ్ఛందంగా పెట్టుబడులు పెట్టుకునేందుకు వీపీఎఫ్ వీలు కల్పిస్తుంది. దీనిపైనా ఈపీఎఫ్‌కు అమలవుతున్న 8.65 శాతం వడ్డీ రేటే వర్తిస్తుంది. కనుక పీపీఎఫ్ కంటే ఇదే ప్రయోజనం. వేతన జీవులు నిస్సందేహంగా పీపీఎఫ్ కంటే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేటు ఇకముందూ తగ్గుతుందని, ఉద్యోగులకిచ్చే ఈపీఎఫ్ రేటు ఆ స్థాయిలో తగ్గే అవకా>శం లేదన్నది నిపుణుల అభిప్రాయం. కాకపోతే ఈపీఎఫ్ లేదా వీపీఎఫ్ నిధుల్లో 10 శాతం మేర స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నందున మార్కెట్లు పతనం చెందితే రాబడులు తగ్గే అవకాశం లేకపోలేదు. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ గత ఏడాదిగా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో రాబడులు సగటున 8.8%గా ఉన్నాయి. కాకపోతే రాబడులపై 20% పన్ను రేటు అమలవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే రాబడి పీపీఎఫ్ కంటే తక్కువేనని అర్థమవుతోంది. మూడేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగిస్తే రాబడిలో ద్రవ్యోల్బణ ప్రభావం మినహాయించుకునేందుకు అవకాశం ఉంది. అంటే ఆ మేరకు పన్ను పోటు తగ్గుతుంది. వార్షికంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. వీటిలో రాబడులకు పీపీఎఫ్ మాదిరిగా హామీ ఉండదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఈ ఫండ్స్ ఈక్విటీలు, డెరివేటివ్‌లలో పెట్టుబడులు పెడతాయి. గత ఏడాది కాలంలో సగటు రాబడులు 7.7%గా ఉన్నాయి. ఏడాది పాటు పెట్టుబడులను కొనసాగిస్తే రాబడిపై పన్ను ఉండ దు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించే వారికి ఇది అనువైన సాధనంగానే కనిపిస్తోంది. కానీ, రాబడుల్లో హెచ్చు, తగ్గులు ఉండొచ్చు. మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ (ఎంఐపీ) ఫండ్స్ నిర్వహించే ప్లాన్లు ఇవి. కొంచెం రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు ఇవి చక్కని రాబడులను ఇస్తాయి. గత మూడేళ్ల సగటు రాబడులు 11%పైనే ఉన్నాయి. ఈ పథకం కింద మొత్తం నిధుల్లో 15 నుంచి 20 % నిధులను ఈక్విటీల్లో, మిగిలిన నిధులను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు అంటే ఆటుపోట్లు ఉంటాయి. కనుక ఎంఐపీ వార్షిక రాబడులు గత 15 ఏళ్ల కాలంలో 10% నుంచి 20% మధ్య ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశించేవారు, స్వల్ప రిస్క్ భరించే వారు వీటిలో పెట్టుబడుల ద్వారా మంచి రాబడులను అందుకోవచ్చన్నది నిపుణుల మాట. కాకపోతే ఈ రాబడులకు ఎటువంటి హామీ ఉండదనేది గుర్తుంచుకోవాలి.