న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమీక్రాన్ కేసులు పేరుగతున్న తరుణంలో కేంద్రం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2022తో ముగిసే 2021-22 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కూడా చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం నుంచి స్థిర ఆదాయం పొందే పెట్టుబడిదారులకు ఉపశమనం కలగనుంది.
అంటే ఫిక్సిడ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన వంటి మొదలైన చిన్న పొదుపు పథకాలకు సెప్టెంబర్-డిసెంబర్ 2021 మధ్య కాలంలో వర్తించే వడ్డీరేట్లు 31 మార్చి 2022 వరకు వర్తించనున్నాయి. ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్‌హోల్డర్లకు వార్షిక వడ్డీ 7.1 శాతం లభిస్తుండగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతం ఉంది.
ఇక సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎక్కువ వడ్డీ ఇస్తున్న స్కీమ్ ఇదే. ఇక ఐదేళ్ల మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్‌కు 6.6 శాతం వడ్డీ, 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది టర్మ్ డిపాజిట్‌కు 5.5 శాతం, ఐదేళ్ల డిపాజిట్‌కు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు ఖాతాలకు 4% వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 2020 నుంచి ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సవరిస్తూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment