పోస్టాఫీసుల ద్వారా తెరిచిన పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాలను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం గత నెలలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం పీపీఎఫ్ నిబంధనలలో మార్పులు అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి.
పీపీఎఫ్ ఏంటంటే..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తూ పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి రూపొందించిన ఒక ప్రముఖ ఆర్థిక సాధనం. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పొదుపు పథకం.1961 ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం దీంట్లో పెట్టిన అసలు, వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం అన్నిటికీ పన్ను నుండి మినహాయింపు ఉంటుంది.
మారిన నిబంధనలు ఇవే..
మైనర్లకు పీపీఎఫ్ ఖాతా: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మైనర్ పేరు మీద తెరిచి ఉంటే మైనర్‌కు 18 ఏళ్లు వయస్సు వచ్చే వరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) వచ్చే వడ్డీ మాత్రమే వస్తుంది. అటువంటి ఖాతాల మెచ్యూరిటీ వ్యవధిని మైనర్ పెద్దవాడైన తేదీ నుండి లెక్కిస్తారు.
ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు: ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా ఏజెన్సీ బ్యాంక్‌లో ఖాతాదారు తెరిచిన ప్రాథమిక అకౌంట్‌పై స్కీమ్ రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. అదే ఒకటి ఎక్కువ ఖాతాల్లో బ్యాలెన్స్ ఉన్న సందర్భంలో వాటిని ప్రాథమిక ఖాతాతో ఏకీకృతం చేస్తారు. ఇలా చేశాక మొత్తం వార్షిక పరిమితి మొత్తం డిపాజిట్‌కు మాత్రం పథకం రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తారు. దీనికి మించి ఇతర ఖాతాల్లో మిగులు నిధులు ఉంటే ఎలాంటి వడ్డీ లభించదు.
Comments
Please login to add a commentAdd a comment