
రిటైర్‌మెంట్ ప్లానింగ్ అనేది ఆర్థిక ప్రణాళికలో కీలకమైన భాగం. సరైన ప్రణాళిలు ఎంచుకుని వాటిని అనుసరిస్తే రిటైర్‌మెంట్ తర్వాత సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రైవేట్ సంస్థలు విభిన్న రిటైర్‌మెంట్ స్కీమ్‌లతో వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. కానీ ఆయా కంపెనీలు ఇస్తున్న హామీలపై చాలానే ప్రశ్నలొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్స్‌ను ఎంచుకుని పదవీ విరమణ తర్వాత ఆర్థిక, సామాజిక భద్రత కలిగిన జీవితాన్ని సాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఉద్యోగుల భవిష్య నిధి (EPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లను పదవీ విరమణ పథకాల్లో భాగంగా చాలామంది ఎంచుకుంటున్నారు. వీటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే..



