
సుకన్య సమృద్ధి డిపాజిట్ వడ్డీ 9.2 శాతానికి పెంపు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమ్మాయిలకు మాత్రమే సంబంధించిన ప్రత్యేక డిపాజిట్ పథకం సుకన్య సమృద్ధి అకౌంట్‌లో డిపాజిట్లకు అత్యధికంగా 9.2 శాతం వడ్డీని, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మీద 8.7 శాతం వడ్డీని ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ పథకం డిపాజిట్లపై ఇస్తున్న 9.2 శాతం వడ్డీని 9.3 శాతానికి పెంచినట్లు పేర్కొంది. గత ఆర్థిక ఏడాదిలో సుకన్య సమృద్ధి అకౌంట్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ 9.1 శాతంగా ఉండేది. అమ్మాయి పేరుపై ఈ అకౌంట్లను బ్యాంకులలో గానీ, పోస్టాఫీసులలో గానీ తెరవవచ్చును.