'మా'ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే... | MAA Elections 2021:CVL Narasimha Rao Withdraw His Nomination In Maa Elections | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: నామినేషన్‌ ఉపసంహరించుకున్న సీవీఎల్‌

Oct 2 2021 1:30 PM | Updated on Oct 2 2021 2:20 PM

MAA Elections 2021:CVL Narasimha Rao Withdraw His Nomination In Maa Elections - Sakshi

CVL Narasimha Rao Withdraw His Nomination: కాసేపటి క్రితమే మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్‌ నరసింహారావు పోటీ నుంచి తప్పుకున్నారు..

CVL Narasimha Rao Withdraw His Nomination: మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌ ఎదురైంది. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు సీవీఎల్‌ నరసింహారావు చివరి నిమిషం‍లో పోటీ నుంచి తప్పుకున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీని వెనుక కారణం ఉందని, రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి ఆ వివరాలను వెల్లడిస్తానని సీవీఎల్‌పేర్కొన్నారు.

తనకు అధ్యక్ష పదవి కంటే మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. అయితే  ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తను ప్రకటించిన మేనిఫెస్టో అమలు అయ్యేందుకు చూస్తానని తెలిపారు. ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికీ మద్ధతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కాగా నిన్న బండ్లగణేశ్‌ సైతం 'మా' జనరల్ సెక్రెటరీ పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. 

చదవండి : మా ఎన్నికలు: మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్‌ నరసింహారావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement