అసలు భద్రం... వడ్డీ అధికం! | With the higher return than bank interest FMP's | Sakshi
Sakshi News home page

అసలు భద్రం... వడ్డీ అధికం!

Published Mon, Sep 7 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

అసలు భద్రం... వడ్డీ అధికం!

అసలు భద్రం... వడ్డీ అధికం!

- ఎఫ్‌ఎంపీలతో బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ రాబడి!
- భద్రమైన ఫండ్‌హౌస్‌ను ఎంచుకోవటం ముఖ్యం
- కాలపరిమితిలోపు విత్‌డ్రాకు అవకాశమే ఉండదు


మీరు ఆరు నెలల్లో కారు కొనాలని అనుకున్నారు. దానికి కావాల్సిన రీతిలో డబ్బు పొదుపు చేస్తున్నారు. కానీ అనుకోని అవసరం వచ్చింది. పొదుపు చేసిన ఆ డబ్బుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వచ్చింది. మనసులో కారు కొందామనుకున్న ఆలోచన అలాగే ఉండిపోయింది!!. చాలామందికి ఇలా స్వల్పకాలానికి ఎన్నో ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటిని సాకారం చేసుకోలేకపోతుండటం జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్‌లో(ఎఫ్‌ఎంపీ) ఇన్వెస్ట్ చేయటం ద్వారా అధిగమించవచ్చు. అంతేకాకుండా వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే మంచి రాబడినీ అందుకోవచ్చు.
 
ఎఫ్‌ఎంపీ అంటే?
ఒక రకంగా ఇవి కూడా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటివే. వీటిని మ్యూచువల్ ఫండ్స్ అందిస్తుంటాయి. ఇవి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్. అంటే ఎన్‌ఎఫ్‌ఓ ఒకసారి మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోనే ఈ ఫండ్‌లో చేరాలి. వీటి మెచ్యూరిటీ సమయం ఒక నెల, 3 నెలలు, 6 నెల లు, 13 నెలలు, మూడేళ్లు, ఐదేళ్లుగా ఉంటుంది. వీటిలో మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుల్ని ఫండ్ మేనేజర్లు ఫిక్స్‌డ్ సెక్యూరిటీ బాండ్లలో, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్‌లో, వాణిజ్య పత్రాల్లో, ఏఏఏ రేటింగ్ కార్పొరేట్ బాండ్లలో, ట్రెజరీ బిల్లుల్లో పెట్టుబడిగా పెడతారు.

కొన్ని సమయాల్లో బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీరు ఏడాది మెచ్యూరిటీ సమయమున్న ఎఫ్‌ఎంపీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే.. మీ మొతా ్తన్ని మ్యూచువల్ ఫండ్ ఏడాది కాలపరిమితి ఉన్న బాండ్లలో పెట్టుబడిగా పెడుతుంది. ఎప్‌ఎంపీల్లో సాధారణ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కనీసం రూ.5,000గా ఉంటుంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకా రం... మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఎఫ్‌ఎంపీల్లో ఇన్వెస్ట్ చేసేవారికి రాబ డిపై ఎలాంటి హామీ ఇవ్వకూడదు.
 
రెండు ఆప్షన్లుంటాయి..
గ్రోత్ ఆప్షన్: ఈ ఆప్షన్ ఎంచుకుంటే మెచ్యూరిటీ పీరియడ్ ముగిసేదాకా ఎలాంటి లాభాలూ అందవు. అన్నీ కూడా మెచ్యూరిటీ సమయం తర్వాతే వస్తాయి. ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీని మూలధనానికి కలుపుతారు. అంటే వచ్చే రాబడిని క్యాపిటల్ గెయిన్స్ కింద లెక్కిస్తారు. వచ్చే వడ్డీ మీ ఆదాయానికి కలుస్తుంది కాబట్టి ఇక్కడ మీ ఎఫ్‌ఎంపీ మెచ్యూరిటీ మూడేళ్ల కాలపరిమితి లోపు ఉంటే... మెచ్యూరిటీ తర్వాత తీసుకునే మొత్తంపై మీ ట్యాక్స్ శ్లాబ్ పరిధిలో కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడేళ్లు దాటినట్లయితే పన్ను తగ్గుతుంది.
 
డివిడెండ్ ఆప్షన్: గ్రోత్ ఆప్షన్‌లోలా కాకుండా ఇందులో వచ్చే రాబడిని ఫండ్ హౌస్ ఇన్వెస్టర్లకు డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. ఈ డివిడెండ్ ఆప్షన్‌లో ఇన్వెస్టర్లు డివిడె ంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ భరించాల్సి ఉంటుంది.
 
ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు వీటిని గమనించండి!

మిగులు ధనం ఉంటే తప్ప ఇందులో ఇన్వెస్ట్ చేయవద్దు. ఎందుకంటే ఎఫ్‌ఎంపీలు క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్. మెచ్యూరిటీ సమయానికి ముందే డబ్బులు కావాల న్నా, పథకం నుంచి బయటకు రావాలన్నా కష్టం. అంటే లిక్విడిటీ సౌకర్యం తక్కువగా ఉంటుంది. మంచి పేరున్న ఫండ్ హౌస్‌లను మాత్రమే ఎంచుకోండి. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఉన్నట్లుగా ఎఫ్‌ఎంపీలకు రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు.
 
ప్రయోజనాలు


- స్థిర ఆదాయాన్ని అందిస్తాయి.
- ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే.. ఎఫ్‌ఎంపీల్లో క్యాపిటల్ లాస్ రిస్క్ చాలా తక్కువ
- ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే మంచి రాబడిని అందిస్తాయి.
- వడ్డీ రేట్ల ఒడిదుడుకుల తో వీటికి ఎలాంటి భయం ఉండదు.
- దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌పై ఇండెక్సెషన్ బెనిఫిట్స్, పన్ను మినహాయింపులు ఉంటాయి.
 
ఎవరికి ఉత్తమం

- స్వల్పకాలానికి స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఇవి ఒక చక్కటి మార్గం.
- పలు రకాల బాండ్లు, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల వచ్చే రాబడికి సంతృప్తి చెందని వారు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు.
- ఒక పరిమిత కాలం వ రకు ఇన్వెస్ట్ చేసి, నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలని భావించే వారికి ఉత్తమం.
- తక్కువ రిస్క్‌ను భరించే వారికి ఇవి మంచి ఆప్షన్.
- పదవీ విరమణ చేసిన వ్యక్తులకు ఉపయుక్తంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement