బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఏం చేస్తారు.. ‘సింపుల్..ఏటీఎం ద్వారా కావాల్సిన నగదును డ్రా చేస్తాం’ అంటారు కదూ. ఒకవేళ మీ ఖాతాలో రూ.5 లక్షలు ఉన్నాయనుకోండి దాన్ని విత్‌డ్రా చేయాలన్నా ఏటీఎం ద్వారానే చేస్తారా..? ఏటీఎం, చెక్‌బుక్, డీడీ ఇలా ప్రతిదానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఏటీఎం విత్‌డ్రా
ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేయాలంటే మీ కార్డును అనుసరించి రోజుకు రూ.40,000 నుంచి గరిష్ఠంగా రూ.ఒక లక్ష వరకు మాత్రమే సాధ్యం అవుతుంది. కొన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులకు సంబంధించి విత్‌డ్రా పరిమితులు కింది విధంగా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు: రోజుకు రూ.40,000.
గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000.
ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ఇంటర్నేషనల్, ఉమెన్స్ అడ్వాంటేజ్, ఎన్ఆర్వో డెబిట్ కార్డులు: రోజుకు రూ.25,000
టైటానియం రాయల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.75,000
ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డులు: రోజుకు రూ.1,00,000.
ఐసీఐసీఐ బ్యాంక్
క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000
గోల్డ్ డెబిట్ కార్డు: రోజుకు రూ.50,000
ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000
యాక్సిస్ బ్యాంక్
క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000
ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000
ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..
చెక్‌బుక్
చెక్ లేదా పాస్‌బుక్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకుకు ముందుగా సమాచారం అందించాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ వంటి డాక్యుమెంటేషన్ అవసరం కావచ్చు. రూ.2 లక్షలకు మించి నగదు విత్‌డ్రా చేస్తే పాన్ కార్డ్ కాపీ తప్పనిసరి.
డిమాండ్ డ్రాఫ్ట్
పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్‌లు ఉపయోగించవచ్చు. ఇలా చేసే లావేదేవీలను బ్యాంకులు ట్రాక్ చేసేందుకు కొన్ని నియామాలు పాటించాయి.
Comments
Please login to add a commentAdd a comment