Savings Accounts
-
పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే..?
బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఏం చేస్తారు.. ‘సింపుల్..ఏటీఎం ద్వారా కావాల్సిన నగదును డ్రా చేస్తాం’ అంటారు కదూ. ఒకవేళ మీ ఖాతాలో రూ.5 లక్షలు ఉన్నాయనుకోండి దాన్ని విత్‌డ్రా చేయాలన్నా ఏటీఎం ద్వారానే చేస్తారా..? ఏటీఎం, చెక్‌బుక్, డీడీ ఇలా ప్రతిదానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయో తెలుసుకుందాం.ఏటీఎం విత్డ్రాఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేయాలంటే మీ కార్డును అనుసరించి రోజుకు రూ.40,000 నుంచి గరిష్ఠంగా రూ.ఒక లక్ష వరకు మాత్రమే సాధ్యం అవుతుంది. కొన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులకు సంబంధించి విత్‌డ్రా పరిమితులు కింది విధంగా ఉన్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాక్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు: రోజుకు రూ.40,000.గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000.ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ఇంటర్నేషనల్, ఉమెన్స్ అడ్వాంటేజ్, ఎన్ఆర్వో డెబిట్ కార్డులు: రోజుకు రూ.25,000టైటానియం రాయల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.75,000ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డులు: రోజుకు రూ.1,00,000.ఐసీఐసీఐ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000గోల్డ్ డెబిట్ కార్డు: రోజుకు రూ.50,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000యాక్సిస్ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..చెక్బుక్చెక్ లేదా పాస్‌బుక్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకుకు ముందుగా సమాచారం అందించాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ వంటి డాక్యుమెంటేషన్ అవసరం కావచ్చు. రూ.2 లక్షలకు మించి నగదు విత్‌డ్రా చేస్తే పాన్ కార్డ్ కాపీ తప్పనిసరి.డిమాండ్ డ్రాఫ్ట్పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్‌లు ఉపయోగించవచ్చు. ఇలా చేసే లావేదేవీలను బ్యాంకులు ట్రాక్ చేసేందుకు కొన్ని నియామాలు పాటించాయి. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్: జులై 1 నుంచి ఆ ఖాతాలు క్లోజ్!
PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కోట్లాది మంది ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి గత కొన్నేళ్లుగా ఉపయోగించకపోతే జూలై 1 తర్వాత అలాంటి ఖాతాలు రద్దు కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విషయాన్ని చెబుతోంది. సేవింగ్స్ అకౌంట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ముందుగా దాని స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ నెలాఖరు కల్లా వాడుకలో లేని ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను, అలాగే గత మూడేళ్లుగా అకౌంట్ బ్యాలెన్స్ సున్నా ఉన్న అకౌంట్లను క్లోజ్ చేయబోతున్నట్లు బ్యాంకు తన నోటిఫికేషన్లో పేర్కొంది. అలాంటి కస్టమర్లకు ఇప్పటికే నోటీసులు సైతం పంపించింది.వాడుకలో లేని ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలని పీఎన్బీ కొన్ని రోజుల క్రితమే ఖాతాదారులకు తెలియజేసింది. అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఈ ఖాతాలు క్లోజ్ అవుతాయి. చాలా కాలంగా కస్టమర్లు ఉపయోగించని ఇలాంటి ఖాతాలను చాలా మంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఖాతా లెక్కింపు 2024 ఏప్రిల్ 30 ఆధారంగా జరుగుతుంది.తిరిగి యాక్టివేట్ చేసుకోండిలా..బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయి, ఖాతాదారు అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. కేవైసీ ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించవచ్చు. -
ఖాతాదారులకు అలర్ట్: పోస్టాఫీసుల్లో కొత్త మార్పులు
Post Office Account New Rules: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పోస్టాఫీసులకు దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ ఉంది. మారుమూల గ్రామాల్లోనూ శాఖలు ఉన్నాయి. కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పోస్టాఫీసుల ద్వారానే అమలవుతున్నాయి. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులు కూడా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది సేవింగ్స్ అకౌంట్. ఈ అకౌంట్ల ఓపెనింగ్, విత్‌డ్రాయల్, వడ్డీ లెక్కింపు, చెల్లింపులకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితి పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితిని పెంచారు. ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులు మాత్రమే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుండేది. ఇప్పుడు మార్చిన నిబంధనల ప్రకారం, జాయింట్ అకౌంట్‌ను ముగ్గురు వ్యక్తులు కలిసి తెరవవచ్చు. నగదు విత్‌డ్రా సేవింగ్స్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రాకు సంబంధించి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కోసం కస్టమర్లు ఫారం-2, అకౌంట్ పాస్‌బుక్ సమర్పించేవారు. ఇక నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే ఫారం-3ని నింపి, పాస్‌బుక్‌తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు, చెల్లింపు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ లెక్కింపు, చెల్లింపులోనూ కీలక మార్పులు వచ్చాయి. దీని ప్రకారం ప్రతి నెలా 10వ తేదీ నుంచి ఆ నెలలో చివరి రోజు వరకు ఉన్న అతి తక్కువ డిపాజిట్ మొత్తం మీద 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని ఏడాదికి ఒకసారి, ఆ సంవత్సరం చివరిలో సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ, సంవత్సరం పూర్తి కాకముందే ఖాతాదారు మరణిస్తే, సేవింగ్స్ అకౌంట్ మూసివేసిన నెలకు ముందు నెలాఖరులో ఆ వ్యక్తి ఖాతాలోకి వడ్డీ డబ్బును జమ చేస్తారు. -
ఖాతాదారులకు గట్టిషాకిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు గట్టి షాక్‌ను ఇచ్చింది. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 4, 2022 నుంచి అమలులోకి రానుంది. ఖాతాదారులకు నిరాశపరుస్తూ వడ్డీరేట్లను పీఎన్బీ తగ్గించింది. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి గాను 2.70 శాతానికి తగ్గించినట్లు పీఎన్బీ ప్రకటించింది. అంతేకాకుండా రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును ఏడాదికి 2.75 శాతానికి తగ్గిస్తూ పీఎన్బీ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఖాతాదారులకు వర్తించనుంది. పీఎన్బీ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది డిపాజిటర్లను ప్రభావితం చేయనుంది. వీరిలో చాలా మందికి రూ.10 లక్షల కంటే తక్కువ ఖాతా నిల్వలు ఉన్నాయి. రెండు నెలల సమయంలో రెండోసారి డిపాజిట్‌దారుల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును పీఎన్బీ మరింత తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొదుపు ఖాతాపై రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగే నేపథ్యంలో పీఎన్బీ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో భాగంగా స్వల్పకాలిక డిపాజిట్లపై 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. మధ్యస్థ, దీర్ఘకాలిక డిపాజిట్లపై సంవత్సరానికి 2.25 శాతం, 2.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. చదవండి: స్టాక్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నది తెలుగువారే.. -
మినిమం బ్యాలెన్స్ నిబంధన తొలగింపు
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. ఇకపై మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ఎస్బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను (నెలవారీ) పాటించాల్సిన అవసరం లేదు. దీంతో ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. అలాగే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. దేశంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రోత్సాహ చర్యల్లో భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్బీఐ ఖాతాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్టున్నట్టు తెలిపింది. అలాగే ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. కాగా ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ వినియోగదారుల మెట్రో, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా రూ. 3వేలు, రూ. 2 వేలు, వెయ్యి రూపాయల నెలవారీ కనీస నిల్వను ఉంచాలి. లేదంటే పన్నులతో పాటు 5 నుంచి 15 రూపాయల వరకు జరిమానా వసూలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎస్బీఐ బుధవారం ఎంసీఎల్ఆర్ రేట్లను, డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లను తగ్గించింది. -
సేవింగ్స్ ఖాతాలు రెండు చాలు!!
మనలో చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలుండటం ఇపుడు సహజమైపోయింది. అయితే, ఇలా ఎక్కువ ఖాతాలుండటం లాభదాయకమేనా? ఇది ప్రతి ఒక్కరూ ఓ సారి ఆలోచించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి ఖాతాలో కనీస నగదు నిల్వలుచడం తప్పనిసరి. దీనికి తోడు ఏటీఎం, డెబిట్‌కార్డు వార్షిక చార్జీలు, ఎస్ఎంఎస్ అలర్ట్స్ చార్జీల రూపంలో రకరకాల ఛార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. కనుక ఒకటికి మించి ఖాతాలుండే వారు ఓసారి పునః పరిశీలన చేసుకోవాలనేది నిపుణుల సూచన. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి తమ సంస్థ తరఫున వేతన ఖాతాలుంటాయి. అయితే, ఒకే సంస్థలో శాశ్వతంగా ఉద్యోగం చేసే వారు తక్కువ మందే. ఎక్కువ మంది తరచూ సంస్థలు మారుతుంటారు. దీంతో వీరికి ఆయా సంస్థల తరఫున వేతన ఖాతాల సంఖ్య పెరిగిపోతుంటుంది. ఇక ఉద్యోగ జీవితానికి ముందే తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రారంభించిన ఖాతాలు సైతం ఉండొచ్చు. కనుక నిజంగా వీటిల్లో ఎన్నింటి అవసరం ఉందన్న దానిపై ఒక్కసారి దృష్టి సారించాల్సి ఉంది. జీరో బ్యాలన్స్ ఆఫర్ కనిపించిందనో, మరేదో కారణంతోనో సేవింగ్స్ ఖాతా ప్రారంభించే ముందు ఎంత ఉపయోగం ఉందో ఓ సారి గుర్తించండి. ఒక్కో అవసరానికి ఒక్కో బ్యాంకు ఖాతాను కేటాయించుకోవడం వల్ల సులభంగా ఉంటుందేమో కానీ, ఖాతాల సంఖ్య పెరిగితే గందరగోళానికీ కారణమవుతుంది. నిజానికి గరిష్టంగా ఒక్కొక్కరికి మూడు ఖాతాలకు మించి అవసరం లేదన్నది నిపుణుల సూచన. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం... వేతనం కోసం ఒకటి, ఖర్చుల కోసం మరొకటి, పెట్టుబడుల కోసం మరో ఖాతా ఉంటే సరిపోతుంది. వేతనంతో పాటు డివిడెండ్ సైతం ఒకే ఖాతాలో ఉండాలనేది వారి సూచన. ఇంటి అవసరాల కోసం చేసే అన్ని ఖర్చులకూ ఒక ఖాతాను ఉపయోగించుకోవాలి. బిల్లుల చెల్లింపులు, గ్రోసరీ కొనుగోళ్లు, ఔషధ కొనుగోళ్లు అన్నీ ఈ ఖాతా నుంచే చేయాలి. ఇక పూర్తిగా పెట్టుబడులు, పొదుపు నిధుల కోసం మూడో ఖాతాను ఉపయోగించుకోవాలి. క్రమశిక్షణకు కట్టుబడే వారు అయితే రెండు బ్యాంకు ఖాతాలు సరిపోతాయన్నది నిపుణుల సూచన. ఒకటి ఆదాయం, పెట్టుబడుల కోసం, రెండో ఖాతా ఖర్చుల కోసం. ఖాతాలు ఎక్కువైతే... సేవింగ్స్ ఖాతాలు ఉచితంగా ఏమీ రావు. ప్రతీ ఖాతాకు సంబంధించి కొన్ని చార్జీలుంటాయి. ప్రతీ ఖాతాలోనూ నెలవారీ కనీస సగటు బ్యాలన్స్ నిర్వహించాలి. లేదంటే పెనాల్జీ చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. అలాగే ఖాతాలతోపాటు వచ్చే డెబిట్ కార్డుకు వార్షిక నిర్వహణ చార్జీలు, నెలవారీ ఉంచాల్సిన కనీస బ్యాలన్స్‌పై రాబడులు తక్కువేనని పైసాబజార్ డాట్ కామ పేమెంట్ ప్రొడక్ట్స్ హెడ్ సహిల్ అరోరా పేర్కొన్నారు. ‘‘ఎక్కువ ఖాతాలు మీరు కలిగి ఉంటే, కనీస బ్యాలన్స్ రూపంలో ఎక్కువ మొత్తాన్ని ఉంచాల్సి వస్తుంది. కనీస బ్యాలన్స్ రూ.5,000–10,000 వరకు ఉన్నాయి. ఐదు ఖాతాలు ఉంటే కనీసం రూ.25,000. ఇవి 3–4 శాతం రాబడులనే ఇస్తాయి. ఇలా ఎక్కువ ఖాతాల్లో ఉంచే బ్యాలన్స్‌ను అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్ చీఫ్ డెవలప్మెంట్ అధికారి నవీన్ చందాని తెలిపారు. జాయింట్ ఖాతా మంచిదే... ఉమ్మడిగా మరొకరితో కలసి ఖాతా తెరిచే వారూ ఉన్నారు. ‘‘అందరికీ ఆర్థిక విషయాల పట్ల అవగాహన ఉండి, ఉమ్మడి లక్ష్యాలతో ఉంటే జాయింట్ అకౌంట్ మంచి నిర్ణయం అవుతుంది. ఇద్దరూ కలిసి లేదా ఎవరో ఒకరు ఆపరేట్ చేసే ఆప్షన్ ఎంచుకోవడం మంచిది’’ అని సృజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకులు దీపాలిసేన్ తెలిపారు. ముఖ్యంగా జీవిత భాగస్వాములు ఉమ్మడి ఖాతాను నిర్వహించడం వల్ల ఎన్నో సౌలభ్యాలు ఉంటాయి. అలాగే ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏర్పడే సంఘాల సభ్యుల మధ్య ఆర్థిక పారదర్శకతకూ ఉమ్మడి అకౌంట్ దోహదపడుతుంది. నామినీ తప్పనిసరి... ఇక 10–15 ఏళ్ల క్రితం ఖాతాలు తెరిచి మరిచిపోయే వారూ ఉంటారు. అందులో కొంత నగదు ఉండి మర్చిపోతే దాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే ఏటా వివిధ చార్జీలను బ్యాంకులు ఆ బ్యాలన్స్ నుంచి మినహాయించుకుంటూ ఉంటాయి. ఇక ఖాతాదారుడు మరణిస్తే వారి పేరిట ఐదారు ఖాతాలుంటే, అన్నింటికీ నామినీ రిజిస్టర్ చేసి లేకపోతే కుటుంబ సభ్యులకు ఎన్నో సమస్యలు కలిగించిన వారవుతారు. అందుకని అవసరానికి మించి ఉండే ఖాతాలు మూసేయడంతోపాటు ముఖ్యమైన ఖాతాలకు నామినీగా జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరును రిజిస్టర్ చేయించుకోవడం మర్చిపోవద్దు. -
బ్యాంకు చార్జీలకే 10వేల కోట్లు
పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకపోవడం, పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీలు నిర్వహించడం వల్ల బ్యాంకులు ఖాతాదారుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తం అక్షరాలా రూ.పది వేల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడున్నరేళ్లలో ఖాతాదారుల నుంచి ఈ సొమ్ము వసూలు చేశాయని, అయితే, ప్రైవేటు బ్యాంకులు ఇంకా భారీగానే రాబట్టి ఉంటాయని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటించింది. కనీస నిల్వ నిబంధనను ఎస్బీఐ 2012వ సంవత్సరంలో ఆపివేసింది. 2017 ఏప్రిల్ నుంచి మళ్లీ వసూలు చేయడం మొదలు పెట్టింది. మిగతా బ్యాంకులు కూడా అదేబాటను అనుసరిస్తున్నాయి. ఈ పదివేల కోట్లలో ఖాతాదారు అకౌంట్లో కనీస నిల్వ లేనందుకు రూ.6,246 కోట్లు, పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు జరిపినందుకు రూ.4,145 కోట్లు వసూలు చేశాయి. ఇందులో ఎస్బీఐ వాటా.. కనీస నిల్వకు సంబంధించి రూ.2,894 కోట్లు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రూ.1,554 కోట్లు. జన్‌థన్ ఖాతాలకు, బేసిక్ పొదుపు ఖాతాలకు కనీస నిల్వ పరిమితి లేదు. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి మెట్రో నగరాల్లో నెలకు మూడు లావాదేవీలు(ఇతర బ్యాంకు ఏటీఎంలలో), మిగతా చోట్ల ఐదు లావాదేవీలు ఉచితం. ఈ పరిమితి దాటితే కనీసం రూ.20 చొప్పున ప్రతి లావాదేవీకి వసూలు చేస్తున్నాయి. ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలలో ఉచిత లావాదేవీలు ఐదు వరకు చేసుకోవచ్చు. -
మినిమమ్ బ్యాలెన్స్‌లపై ఎస్బీఐ ప్రకటన
న్యూఢిల్లీ : ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారుల నుంచి బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల మేర జరిమానాను వసూలు చేశాయని వస్తున్న వార్తలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. నెలవారీ నిర్వహించే కనీసం బ్యాలెన్స్‌లను ఏప్రిల్ నుంచి తాము 40 శాతం తగ్గించామని పేర్కొంది. అంతేకాక 40 శాతం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను ఈ నిబంధనల నుంచి మినహాయించామని వెల్లడించింది. కనీస బ్యాలెన్స్ నిర్వహించలేకపోవడంపై విధించే ఛార్జీలు, ఇండస్ట్రీలోనే తమవే అత్యంత తక్కువగా ఉన్నాయని చెప్పింది. ఎస్బీఐ భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వస్తున్న రిపోర్టులపై బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఎస్బీఐ ఆ నిబంధనల కింద నాలుగు కేటగిరీల్లో బ్రాంచులను క్లాసిఫై చేసింది. రూరల్, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో. బ్రాంచు ఉండే ప్రాంతం బట్టి సగటు నెలవారీ నిల్వలు బ్యాంక్ అకౌంట్లో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ కస్టమర్ కనుక ఈ నిల్వలను నిర్వహించలేని పక్షంలో, జరిమానాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎస్బీఐ బ్రాంచ్ టైప్ సగటు నెలవారీ నిల్వలు మెట్రో రూ.3000 అర్బన్ రూ.3000 సెమీ-అర్బన్ రూ.2000 రూరల్ రూ.1000 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు వినియోగదారుల నుంచి రూ.5 వేల కోట్లను జరిమానా పేరిట వసూలు చేశాయని బ్యాంకింగ్ డేటాలో వెల్లడైంది. వీటిలో ఎస్బీఐ జరిమానాల పేరిట అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎస్బీఐ కొన్ని సేవింగ్స్ అకౌంట్లను ఈ సగటు నెలవారీ మొత్తాల నిబంధల నుంచి మినహాయించింది. వాటిలో ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజన్ స్కీన్ జన్ ధన్ యోజన, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్, పీఎంజేడీఐ/బీఎస్‌బీడీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యురిటీ బెనిఫిట్ హోల్డర్స్ అకౌంట్లు ఈ నిబంధన నుంచి మినహాయింపు పొందుతున్నాయి. ఈ అకౌంట్ల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని ఎస్బీఐ ప్రకటించింది. మొత్తం 42.5 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో సుమారు 40 శాతం అకౌంట్లను కనీస బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాక కస్టమర్లు ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి బీఎస్‌బీడీ అకౌంట్లలోకి మారడానికి ఎలాంటి ఛార్జీలను వేయడం లేదని తెలిపింది. -
సేవకు సేవింగ్స్ అకౌంట్
ఈ అకౌంట్‌ను ఎవరైనా ప్రారంభించవచ్చు. అయితే వారు ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. ప్రేమగా సేవలు అందించగలవారై ఉండాలి. రోజుకు ఎన్ని గంటలపాటు సేవలు అందిస్తారో, అన్ని గంటల్నీ ౖటñ మ్ బ్యాంకులోని తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకోవచ్చు. వృద్ధాప్యంతో తీసి వాడుకోవచ్చు! ఏ దేశపు కుర్రాడో తెలియదు. చదువుకోడానికి స్విట్జర్లాండ్ వచ్చాడు. కాలేజ్ దగ్గరే ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇల్లు గల ఆవిడ పేరు క్రిస్టీనా. 67 సంవత్సరాలు. ఇంట్లో ఆవిడొక్కరే ఉంటారు. ఈ కుర్రాడు చేరాడు కదా. ఇప్పుడు ఇద్దరు. సెకండరీ స్కూల్లో టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు క్రిస్టీనా. పింఛను వస్తోంది. స్విట్జర్లాండ్‌లో పింఛను మామూలుగా ఉండదు. మూట నిండుగా ఉంటుంది. తినడానికి, తాగడానికి.. దేనికీ తడుముకోనక్కర్లేదు. ఈ నెల పింఛను ఖర్చయిపోకుండానే మరుసటి నెల పింఛను వచ్చి చేరుతుంది. అయినా గానీ క్రిస్టీనా.. ఆ దగ్గర్లోనే పనికి వెళ్లొస్తుంటారు! ఆమె చేసే పని ఓ 87 ఏళ్ల వృద్ధుడికి సేవలు అందించడం. అది చూసి, ఈ కుర్రాడు అడిగాడు ఒక రోజు : ‘‘డబ్బు కోసమేనా పెద్దమ్మా.. పనికి వెళ్లొస్తున్నారు..’’అని. క్రిస్టీనా నవ్వారు. ‘‘డబ్బు కోసం కాదు. నా టైమ్‌ని ‘టైమ్ బ్యాంక్’లో జమ చేసుకోడానికి పనికి వెళ్తున్నాను. నేను పెద్దదాన్ని అయ్యాక, మరీ కదల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైమ్‌ని తీసి వాడుకుంటాను’’ అని చెప్పారు. కుర్రాడు ఆసక్తిగా చూశాడు. టైమ్ బ్యాంక్ అనే మాటను తొలిసారి అతడు వింటున్నాడు. ‘టైమ్‌ని సేవ్ చేసుకోవడం, టైమ్‌ని వాడుకోవడం ఏంటి పెద్దమ్మా’ అని అడిగాడు. దగ్గరుండి చూసుకోవాలి ‘టైమ్ బ్యాంక్’ అనేది స్విట్జర్లాండ్‌లో కొన్నేళ్లుగా ఉన్న వృద్ధాప్యపు పింఛను పథకం. స్విస్ సామాజిక భద్రత సమాఖ్య మంత్రిత్వశాఖ ఈ పథకానికి రూపకల్పన చేసింది. యవ్వనంలో ఉన్నవారు పెద్దవాళ్లకు సేవలు చేస్తే, వీళ్లు పెద్దవాళ్లయ్యాక సేవలు పొందడానికి వీలు కల్పించే పథకం అది! ఈ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. ప్రేమగా సేవలు అందించగలవారై ఉండాలి. కాలకృత్యాలకు చెయ్యి పట్టుకుని తీసుకెళ్లడం, వేళకు మందులు అందివ్వడం, ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం.. ఇలాంటివే ఆ సేవలన్నీ. జబ్బున పడ్డవారికైతే ఇంకొంచెం సేవ, ఇంకొంచెం ప్రేమ అవసరం. ఇలా రోజుకు ఎన్ని గంటలపాటు సేవలు అందిస్తారో, అన్ని గంటల్నీ టైమ్ బ్యాంకులోని తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకోవచ్చు. గంటల్ని సేవ్ చేసుకోవాలి క్రిస్టీనా వారానికి రెండుసార్లు సేవకు వెళ్లేవారు. వెళ్లిన ప్రతిసారీ రెండు గంటలు సేవలు అందించేవారు. ఇల్లు సర్దేవారు, షాపింగ్ చేయించేవారు. సన్‌బాత్‌కి తీసుకెళ్లేవారు. పక్కన కూర్చొని కబుర్లు చెప్పేవారు. దరఖాస్తులో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాది కాలపరిమితి తర్వాత ఈ పని గంటలన్నిటినీ కలిపి క్రిస్టీనాకు ఒక ‘టైమ్ బ్యాంకు కార్డు’ ఇస్తుంది టైమ్ బ్యాంక్. కూడబెట్టుకున్న టైమ్‌కి వడ్డీ కూడా ఇస్తుంది. ఆ కార్డును ఉపయోగించి, తనకు ఎప్పుడు సేవలు అవసరమైతే అప్పుడు ఇంకొకరి దగ్గర్నుంచి పొందవచ్చు. క్రిస్టీనా అకౌంట్‌ను పరిశీలించి, బ్యాంకు వాళ్లే అమె దగ్గరికి వలంటీర్లను పంపుతారు. ఆ సేవలు చేయడానికి వచ్చేవారికి క్రిస్టీనా డబ్బులు చెల్లించనక్కర్లేదు. వాళ్లకూ ఒక అకౌంట్ ఉంటుంది కదా.. ఆ అకౌంట్లో వాళ్ల టైమ్ జమ అవుతుంది. తమ వృద్ధాప్యంలో వాళ్లు ఆ టైమ్‌ని ‘విత్‌డ్రా’ చేసుకోవచ్చు. ఇదీ టైమ్ బ్యాంక్ కాన్సెప్ట్. ఓపికున్నన్నాళ్లూ.. చేయొచ్చు! ఓ రోజు కాలేజ్‌లో ఉండగా క్రిస్టీనా ఇంట్లో అద్దెకు ఉన్న కుర్రాడికి ఫోన్ వచ్చింది. స్టూలెక్కి కిటికీ అద్దాలు తుడుస్తుండగా ఆమె స్టూలు మీద నుంచి పడిపోయారు. వెంటనే ఆ కుర్రాడు ఇంటికి చేరుకుని క్రిస్టీనాను ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె కాలి మడమ దగ్గరి ఎముక చిట్లిపోయింది. కొంతకాలం కదలకూడదు. మంచం మీదే ఉండాలి. ఆ కుర్రాడు దీర్ఘకాలిక సెలవు తీసుకుని ఆమెకు సేవలు చేయడానికి సిద్ధమైపోయాడు. క్రిస్టీనా అతడిని వారించారు. అప్పటికే ఆమె తన టైమ్‌ని విత్‌డ్రా చేసుకుంటానని టైమ్ బ్యాంక్‌కి అభ్యర్థన పంపుకున్నారు! రెండు గంటల్లోపే టైమ్ బ్యాంక్ నుంచి ఒక నర్సు వచ్చారు. ఆ నర్సు క్రిస్టీనా దగ్గర ఉన్నన్ని రోజులూ ఆమెను ప్రేమగా చూసుకున్నారు. ఆత్మీయంగా సేవలు అందించారు. రుచికరమైన భోజనం వండి పెట్టారు. మనసుకు ఉల్లాసం కలిగించే కబుర్లు చెప్పారు. చాలా త్వరగా కోలుకుని, తిరిగి తన పనికి వెళ్లిపోయారు క్రిస్టీనా! ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్లూ పనికి వెళ్తానని, మరీ కదల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైమ్‌ని వాడుకుంటానని.. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న ఆ కుర్రాడితో చెప్పారు క్రిస్టీనా. వృద్ధాప్యానికి సేవల పింఛన్ టైమ్ బ్యాంక్ స్కీమ్ గురించి అతడు ఫేస్బుక్లో ఇంకా చాలా విషయాలు చెప్పాడు. వృద్ధాప్యం కోసం టైమ్‌ని ఇలా కూడబెట్టుకోవడం స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. టైమ్‌బ్యాంక్ వల్ల ప్రభుత్వానికి పింఛను భారం కూడా గణనీయంగా తగ్గిపోయింది. అలాగే కొన్ని సామాజిక సమస్యలకు కూడా టైమ్ బ్యాంక్ చక్కటి పరిష్కారం అయింది. స్విస్ పెన్షన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం స్విట్జర్లాండ్‌లోని యువతీయువకుల్లో సగం మందికి పైగా వృద్ధాప్య సేవల్లో పాల్పంచుకోడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టైమ్ బ్యాంక్‌ని మరింత ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలను స్విస్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తోందట!(ఇది ఎంత వరకు నిజమో తెలీదు. నిజమైతే సంతోషం. నిజం కాకపోతే.. నిజం చేసుకోవలసినంత సంతోషం. స్విట్జర్లాండ్‌లో చదువుతున్నట్లుగా ఓ కుర్రాడు తన పేరు లేకుండా పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అవుతోంది. బ్లాగుల్లో కనిపిస్తోంది. ఫేస్బుక్లో షేర్ అవుతోంది). -
ఎస్బీఐ కస్టమర్లకు లేటెస్ట్ ఆఫర్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2018 ఆగస్టు వరకు ఎలాంటి కనీస మొత్తం(మినిమమ్ బ్యాలెన్స్) అవసరం లేకుండా అకౌంట్ ప్రారంభించుకునే సౌకర్యాన్ని అందిస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. సేవింగ్స్ అకౌంట్లలో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదనుకునే వినియోగదారులకు ఈ తాజా ఆఫర్ గొప్ప అవకాశమని పేర్కొంది. ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్ పేరుతో ఈ అకౌంట్‌ను తెరుచుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌ను ప్రారంభించడానికి బ్యాంకుకు కూడా వెళ్లాల్సినసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్.... ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చు ఎలాంటి డాక్యుమెంట్లను కస్టమర్లు సమర్పించాల్సివసరం లేదు. ‘పేపర్‌లెస్ అకౌంట్ ఓపెనింగ్’ ను ఇది ఆఫర్ చేస్తోంది. వెంటనే ఈ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోచవ్చు. కస్టమర్లు ఎవరైతే ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభిస్తారో ఆ వినియోగదారులు రూపే డెబిట్ కార్డు పొందుతారు. లక్ష రూపాయల వరకు ఈ అకౌంట్లో మెయిన్‌టైన్స్ చేసుకోవచ్చు. ఏడాది లోపు ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌ను రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లోకి మార్చుకోవచ్చు. 2018 ఆగస్టు వరకు ఈ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాల్సినవసరం లేదు. 18 ఏళ్ల పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చు యోనో మొబైల్ యాప్‌లో ఈ సేవింగ్స్ అకౌంట్‌ను దరఖాస్తు చేసేటప్పుడు యూజర్లు, ఆధార్, పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. -
తగ్గించిన ఛార్జీలు రేపటి నుంచే అమలు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల సగటు నెలవారీ మొత్తాలను నిర్వహించని సేవింగ్స్ అకౌంట్లపై విధిస్తున్న ఛార్జీలను 75 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందబోతున్నారు. అమల్లోకి రాబోతున్న తగ్గింపు ఛార్జీలివే! అంతకముందు మెట్రో, అర్బన్ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న ఛార్జీ 50 రూపాయల(+జీఎస్టీ) నుంచి 15 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గబోతోంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల సేవింగ్స్ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ 3వేల రూపాయలు. అదేవిధంగా సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల నెలవారీ ఛార్జీలను కూడా 40 రూపాయల(+జీఎస్టీ) నుంచి 12 రూపాయల(+జీఎస్టీ)కు, 10 రూపాయలకు తగ్గించింది. ఈ ఛార్జీల తగ్గింపుతో పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌ను బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌గా మార్చుకోవడానికి సదుపాయం కల్పిస్తోంది. దీంతో కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఉపశమనం పొందుతారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్‌లను ఛార్జీలను విధించడం లేదని తెలిసిందే. -
మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై ఎస్బీఐ గుడ్‌న్యూస్
ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. సగటు నెలవారీ మొత్తాలను నిర్వహించని సేవింగ్స్ అకౌంట్లపై విధిస్తున్న ఛార్జీలకు ఎస్బీఐ భారీగా కోత పెట్టింది. ఈ ఛార్జీల కోత 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందనున్నట్టు తెలిపింది. అంతకముందు మెట్రో, అర్బన్ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న ఛార్జీ 50 రూపాయల(+జీఎస్టీ) నుంచి 15 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటన విడుదల చేసింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల సేవింగ్స్ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ 3వేల రూపాయలు. అదేవిధంగా సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల నెలవారీ ఛార్జీలను కూడా 40 రూపాయల(+జీఎస్టీ) నుంచి 10 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఛార్జీల తగ్గింపుతో పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌ను బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌గా మార్చుకోవడానికి సదుపాయం కల్పిస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. దీంతో కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఉపశమనం పొందుతారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు ఈ మినిమమ్ బ్యాలెన్స్‌లను ఛార్జీలను విధించడం లేదు. తగ్గించిన ఎస్బీఐ ఛార్జీల వివరాలు: తమ కస్టమర్ల సెంటిమెంట్లు, ఫీడ్బ్యాక్ల అనంతరం ఛార్జీలకు కోత పెట్టినట్టు ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పీకే గుప్తా తెలిపారు. కస్టమర్ల ప్రయోజనాలకే బ్యాంకు తొలుత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఎస్బీఐ వద్ద 41 కోట్ల సేవింగ్స్ అకౌంట్లు ఉండగా.. పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యురిటీ బెనిఫిట్ హోల్డర్ల పీఎంజేడీవై, బీఎస్‌బీడీ అకౌంట్లు 16 కోట్లు ఉన్నాయి. 21 కంటే తక్కువ వయసున్న అకౌంట్స్ హోల్డర్స్‌కు కూడా మినిమమ్ ఛార్జీల నిబంధనలను బ్యాంకు వర్తింపచేయడం లేదు. -
మినిమమ్ బ్యాలెన్స్‌లపై మరో గుడ్‌న్యూస్
ముంబై : దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మినిమమ్ బ్యాలెన్స్‌లపై మరో గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. కనీస నిల్వల మొత్తాన్ని 75 శాతం తగ్గించాలని ఎస్బీఐ ప్లాన్చేస్తోంది. ప్రస్తుతం మెట్రోల్లో రూ.3000, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.2000, రూరల్ ప్రాంతాల్లో రూ.1000గా ఉన్నాయి. అదేవిధంగా నెలవారీ పరిమితిని కూడా క్వార్టర్లీకి మార్చాలని చూస్తోంది. మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాలను నిర్వహించని ఖాతాల నుంచి సేకరిస్తున్న ఫీజుల ఆదాయంపై ప్రతికూల వార్తలు వెలువడుతున్న క్రమంలో బ్యాంకు ఈ నెలవారీ మొత్తాన్ని రూ.1000కి తగ్గించాలని చూస్తోంది. నెలవారీ మొత్తాలను నిర్వహించని కస్టమర్ల పెనాల్టీ వివరాలను ఆర్థికమంత్రిత్వ శాఖ సమర్పించిన అనంతరం ఎస్బీఐకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విధించే పెనాల్టీ కంటే ఎస్బీఐ విధిస్తున్న పరిమితులే ఎక్కువగా ఉన్నాయి తెలిసింది. ఇటీవలే బొంబై-ఐఐటీ ప్రొఫెసర్ విడుదల చేసిన అధ్యయన రిపోర్టులో కూడా మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు అసంమజసంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్బీఐ మొత్తం 40.5 కోట్ల సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లను కలిగి ఉంది. ఆరేళ్ల విరామం అనంతరం 2017 ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ ఈ నెలవారీ సగటు నిల్వల ఛార్జీలను పునఃప్రవేశపెట్టింది. పలు విమర్శల అనంతరం అక్టోబర్ 1 నుంచి ఈ ఛార్జీలను కొంత తగ్గించింది. ప్రస్తుతమున్న ఛార్జీలు మెట్రో ఏరియాలు - రూ.3000 రూ.2999 నుంచి రూ.1500 మధ్యలోకి బ్యాలెన్స్ పడిపోతే, రూ.30 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.1499 నుంచి రూ.750 బ్యాలెన్స్ వారు రూ.40 పెనాల్టీ భరించాలి. రూ.750 కంటే తక్కువుంటే రూ.50 ఫైన్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో - రూ.2000 రూ.1999 నుంచి రూ.1000 వారికి జరిమానా రూ.20 రూ.999 నుంచి రూ.500 బ్యాలెన్స్‌లకు రూ.30 ఫైన్ రూ.500 కంటే తక్కువుంటే రూ.40 ఫైన్ రూరల్ ప్రాంతాల్లో : రూ.1000 రూ.999 నుంచి రూ.500 బ్యాలెన్స్‌లకు : రూ.20 ఫైన్ రూ.499 నుంచి రూ.250 బ్యాలెన్స్‌లకు : రూ.30 ఫైన్ రూ.249 కంటే తక్కువకు : రూ.40 జరిమానా -
అత్యధిక మొత్తంలో బ్యాంకుల పెనాల్టీలు
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకు, ప్రైవేట్‌రంగ బ్యాంకులు కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీలను భారీగా మోత మోగిస్తున్నాయి. తమ సేవింగ్స్ అకౌంట్లలో బ్యాంకు నిర్దేశించిన మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే, ఇక అంతే సంగతులు. కానీ అసలు బ్యాంకులు విధించే ఈ ఛార్జీలు సమంజమేనా? లేదా? అని ఐఐటీ ముంబై ప్రొఫెసర్ ఓ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం లేదని కస్టమర్లకు విధిస్తున్న ఛార్జీలు అసమంజసంగా ఉన్నాయని తేలింది. ఆశిష్ దాస్ ఈ సర్వే చేపట్టారు. యస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ లాంటి బ్యాంకులు విధిస్తున్న పెనాల్టీలు వార్షికంగా 100 శాతం కంటే పైననే ఉన్నాయని తేలింది. అయితే మినిమమ్ బ్యాలెన్స్‌లు నిర్వహించలేని కస్టమర్లకు విధించే ఛార్జీల విషయంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూపొందించిన మార్గదర్శకాలు, చాలా సమంజసంగా ఉన్నాయని, సర్వీసులు అందజేసే ఖర్చుల కంటే ఎక్కువగా ఇవి ఉండవని దాస్ సర్వే పేర్కొంది. కానీ చాలా బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు సగటున చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయని తెలిపింది. దాస్ అందించిన డేటా ప్రకారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వార్షిక ఛార్జీ 159.48 శాతంగా, యస్ బ్యాంకు ఛార్జీ 112.8 శాతంగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఛార్జీ 83.76 శాతంగా, యాక్సిస్ బ్యాంకు ఛార్జీ 82.2 శాతంగా ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ విధించే పెనాల్టీలు కూడా 24.6 శాతంగా ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. ఈ పెనాల్టీలను బ్యాంకులు అసమంజసంగా విధిస్తున్నట్టు పేర్కొంది. -
ఈ బ్యాంకులు పొదుపు ఖాతాలపై 7.25శాతం వడ్డీ!
ముంభై: ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో కొత్త పేమెంట్ బ్యాంకులు , స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రంగంలో దిగనున్నాయి. 300 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువగా పొదుపు ఖాతాలపై సుమారు 7.25 శాతం వడ్డీని అందించనున్నాయి. త్వరలోనే ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. విశ్వబ్యాంకులు పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేటుతో పోలిస్తే..అధిక వడ్డీ చెల్లించడానికి ముందుకు రావడానికి విశేషం. ముఖ్యంగా ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఇప్పటికే పే మెంట్ బ్యాంకింగ్ సేవలకోసం ఆర్బీఐ అనుమతి లభించిన ఫినో టెక్ ఈ భారీ ఆఫర్ ను అందించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఫినో పేటెక్ చెల్లింపు బ్యాంకునుత్వరలో లాంచ్ చేయనుంది. కొద్ది కాలంలో తమ చెల్లింపు బ్యాంకు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, ఇందుకు ఐసీఐసీఐ బ్యాంకు సహకారం తీసుకుంటున్నామని ఫినో పేటెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిషి గుప్తా తెలిపారు. దాదాపు రూ.లక్షవరకు డిపాజిట్లను స్వీకరించనున్నట్టు చెప్పారు. ఈ చెల్లింపు బ్యాంకులో ఐసీఐసీఐ బ్యాంకు 20 శాతం వాటాను కలిగి ఉంటుందన్నారు. మరోపక్క వ్యూహాత్మక భాగస్వామి అయిన ఐసీఐసీఐ గ్రూప్ అందించే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీఐసీఐ పుడెన్షియల్ పాలసీలను ఈ బ్యాంకు ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రధానంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని, ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవలకు నోచుకోని ప్రాంతాల్లో ఈ బ్యాంకులు సేవలందించాల్సి ఉంటుంది. ఈ బ్యాంకులు దేశంలో ఎక్కడైనా శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే రుణ పోర్ట్‌ఫోలియోలో 50 శాతం వాటి విలువ రూ.25 లక్షల వరకు ఉండాలి. షెడ్యూలు వాణిజ్య బ్యాంకులకు వర్తించే నిబంధనలన్నీ చిన్న బ్యాంకులకూ వర్తిస్తాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లు సేకరించడంతోపాటు రైతులు, అసంఘటిత రంగానికి చెందిన చిన్న వ్యాపారులు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణాలిచ్చేందుకు వీలుంటుంది. అలాగే యూనివర్సల్ బ్యాంకుల్లాగే ఇవి కూడా ఆర్బీఐ వద్ద విధిగా నగదు నిల్వ నిష్పత్తి(సీఆర్ఆర్) నిబంధన ప్రకారం డిపాజిట్లలో కొంత వాటాను జమచేయాల్సి ఉంటుంది. అలాగే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) నిబంధన ప్రకారం ప్రభుత్వ రంగ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాగా భారతి ఎయిర్‌టెల్‌కుచెందిన ఎయిర్టెల్ పే మెంట్ బ్యాంకు వినియోగదారుల ఖాతాలోని సొమ్ముకు 7శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
నగదు విత్ డ్రా పై ఆంక్షలు ఎత్తివేత!
ముంబై : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో బ్యాంకుల్లో, ఏటీఎంలలో విధించిన ఆంక్షల నుంచి ఇక ప్రజలకు పూర్తి విముక్తి లభించనుంది. ఈ ఆంక్షలను సేవింగ్స్ అకౌంట్స్‌కు 2017 మార్చి 13 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్టు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. రెండు విడతల్లో నగదు విత్ డ్రా పరిమితి పై ఆంక్షలు తొలగిస్తామన్నారు. తొలుత 2017 ఫిబ్రవరి 20న ప్రస్తుతం వారానికి రూ.24వేలుగా ఉన్న విత్ డ్రా పరిమితిని రూ.50వేలకు పెంచుతామని ఉర్జిత్ తెలిపారు. ఆరవ ద్వైపాక్షిక సమీక్షను బుధవారం ప్రకటించిన ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ నగదు విత్ డ్రాపై విధించిన ఆంక్షలపై కూడా గుడ్‌న్యూస్ ప్రకటించింది. కాగ, నేటి ప్రకటనలో ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు కీలక నిర్ణయం వెలువరించింది. దీంతో రెపో రేటు 6.25 శాతం, రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ నిర్వహించిన పాలసీలో ఇది రెండవది. బ్యాంకుల్లో వడ్డీరేట్లు కూడా కిందకి దిగిరానున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. -
పెన్షనర్లకు ఖాతా తప్పనిసరి
పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా పంపిణీ కోసం ప్రభుత్వ ఆదేశం మూడు నెలల్లోగా ఆధార్ సమర్పించకుంటే పింఛన్ నిలిపివేత వీటిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచన ఇప్పటివరకు 23.11 లక్షల మందికి రూ. 456.67 కోట్లు పంపిణీ సాక్షి, హైదరాబాద్: పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా ‘ఆసరా’ పింఛన్లను పంపిణీ చేయాలని యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లబ్ధిదారులందరికీ పొదుపు ఖాతాలు ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందు కు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మురళి శుక్రవారం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పింఛన్ల పంపిణీ తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సాంకేతిక సమస్యల కారణంగా పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోందని, మరికొంత గడువు కావాలని పలు జిల్లాల అధికారులు కోరారు. దీనిపై స్పందించిన సీఈవో మురళి.. ఈ నెల 25వ తేదీలోగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధార్ లేకుంటే అంతే! పింఛన్ల లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను అందజేయాలని సెర్ప్ సీఈవో మురళి స్పష్టం చేశారు. ఆధార్ సమర్పించేందుకు ప్రభుత్వం 3 నెలల గడువు ఇచ్చినందున, ఆధార్ లేనివారు ఈలోగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గడువులోగా ఆధార్ సమర్పించని వారికి ఆ తర్వాతి నెల పింఛన్‌ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై లబ్ధిదారులను అప్రమత్తం చేయాలని సూచించారు. కొత్త పింఛన్లు జనవరిలోనే.. ఈ నెల 20వ తేదీ తర్వాత మంజూరు చేసే పింఛన్లను వచ్చే జనవరి నెల నుంచే వర్తింపజేయాలని మురళి అధికారులకు సూచించారు. లబ్ధిదారుల జాబితాల్లో మరణించిన వారి పేర్లు, ఒకరి పేర్లు రెండు మార్లు రావడం, వలస వెళ్లిన వారి పేర్లు ఉండడం వంటివాటిని క్షేత్రస్థాయిలోనే తొలగించేందుకు సాంకేతిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా పెన్షనర్ల కేటగిరీని మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. పంపిణీ చేసిన పింఛన్లకు సంబంధించి లబ్ధిదారుల నుంచి తీసుకున్న రశీదు (అక్విటెన్స్)ల డేటా ఎంట్రీని 29వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి విభాగం నుంచి ఆయా మండలాల అధికారులకు కేటాయించిన నిధులు, అందిన నిధుల వివరాలను సరిచూసుకోవాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 23.11 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 456.67 కోట్లను పంపిణీ చేసినట్లు మురళి తెలిపారు. -
2018కల్లా 5 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ వ్యాపార విస్తరణపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం భారీ ఎత్తున కొత్త శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ (కాసా)పై దృష్టిసారిస్తున్నట్లు విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్.రామారావు తెలిపారు. హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన 1,550 శాఖను రామారావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే నాలుగు నెల్లో మరో 150 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మార్చి నాటికి మొత్తం శాఖల సంఖ్యను 1,700కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రస్తుతం 135 శాఖలు ఉండగా, వచ్చే 16 నెలల్లో కొత్తగా 65 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో రూ. 15,000 కోట్లుగా ఉన్న వ్యాపారం ఈ ఏడాది చివరి నాటికి రూ. 17,000 కోట్లకు చేరుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న శాఖలు, సగటున ఏటా పదవీ విరమణ చేస్తున్న 600 మందిని దృష్టిలో పెట్టుకుంటే 1500 నుంచి 2,000 మంది కొత్త సిబ్బందిని తీసుకోవాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూలధన ఇబ్బందులు లేవు బాసెల్ 3 నిబంధనల ప్రకారం మూలధనానికి ఎటువంటి ఇబ్బందులు లేవని, త్వరలోనే టైర్-1, టైర్-2 క్యాపిటల్ కింద రూ.1,100 కోట్లు సమీకరించనున్నట్లు రామారావు తెలిపారు. బాగా పతనమైన షేరు ధర కొద్దిగా పెరిగిన తర్వాత క్విప్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. గత నెలలో టైర్ 2 బాండ్స్ కింద రూ. 500 కోట్లు సేకరించింది. కిందటి నెలలో బ్యాంకులో ప్రభుత్వ వాటా 74 శాతం ఉంటే టైర్-2 బాండ్స్ ఇష్యూ తర్వాత 68 శాతానికి తగ్గిందని, ఇది క్విప్ ఇష్యూ తర్వాత 58 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోనున్నట్లు ప్రకటించడంతో, వారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఫాలోఆన్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గినా ఆర్బీఐ వెంటనే వడ్డీరేట్లు తగ్గిస్తుందని భావించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించడం, కాసా అకౌంట్లపై దృష్టిపెట్టడం ద్వారా లాభదాయకతను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 19 శాతంగా ఉన్న కాసా డిపాజిట్లు మార్చి, 2015 నాటికి 22 శాతానికి చేరుకుంటుందన్నారు. పీఎస్‌యూ బ్యాంకుల్లోనే అత్యల్ప ఎన్పీఏలు కలిగి ఉన్న బ్యాంకుగా విజయాబ్యాంకు రికార్డులకు ఎక్కిందని, ప్రస్తుతం రూ. 2,239 (2.85%) కోట్లుగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులను ఈ ఆర్థిక ఏడాది చివరి నాటికి రూ. 2,100 కోట్లకు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కింద అందరికీ బ్యాంక్ అకౌంట్లను కల్పించడంపై దృష్టిసారించడంతో పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనాలకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. -
చిన్నారులకోసం సేవింగ్స్ ఖాతాలు
నిజామాబాద్ బిజినెస్ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రాబ్యాంక్ బాలల కోసం ఏబీ లిటిల్ స్టార్స్, ఏబీ టీన్స్ అనే రెండు కొత్త సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించిందని ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ ఆర్.మల్లికార్జున తెలిపారు. బ్యాంకు ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి స్థానిక ప్రగతినగర్‌లోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో బహుమతుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రజాలికుడు జాదూ యుగేందర్ రంగనాథ్ తన ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. అనంతరం విజేతలకు బహుమతులతోపాటు, కొత్త స్కీమ్ ఖాతా పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసాచారి, ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం చీఫ్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఫ్లెక్సి ఖాతాలతో మరింత ఆదాయం..
ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకునేందుకు.. కాస్తంత వడ్డీ ఆదాయం సంపాదించుకునేందుకు బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు ఉపయోగపడతాయి. కానీ, ఒకట్రెండు మినహా చాలా బ్యాంకులు 4% మించి వడ్డీ ఇవ్వటం లేదు. అయితే, సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలన్నీ కల్పిస్తూనే మరింత రాబడి అందించే పథకాలే ఫ్లెక్సిబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములు. ఇవెలా పనిచేస్తాయంటే.. మన సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్ నిర్దిష్ట మొత్తాన్ని మించినప్పుడు.. ఆ అదనపు డబ్బు ఆటోమేటిక్‌గా ఫిక్సిడ్ డిపాజిట్ కింద మారుతుంది. దాన్ని ఎన్నాళ్ల పాటు అలాగే ఉంచితే అన్నాళ్ల కాలవ్యవధికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు లభిస్తుంది. అంటే నాలుగైదు శాతం కన్నా మరింత ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. మన సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ రూ. 10,000 అనుకుందాం. ఏదో ఒక దశలో మన అకౌంట్లో సొమ్ము రూ. 15,000కి పెరిగిందనుకుందాం. అప్పుడు, అదనంగా ఉన్న రూ. 5,000ను బ్యాంకు ఆటోమేటిక్‌గా ఎఫ్డీ కింద మార్చేస్తుంది. అలాగని, ఇక ఈ మొత్తాన్ని వాడుకోవడానికి వీలు ఉండదనేమీ లేదు. ఒకవేళ, రూ.12,000కు చెక్కు ఇచ్చారనుకోండి.. సరిపడేంత బ్యాలెన్స్ లేదంటూ బ్యాంకు తిప్పి పంపదు. ఎఫ్డీని బ్రేక్ చేసి ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఒకవేళ ఎఫ్డీ కాలవ్యవధి పూర్తయ్యే దాకా అలాగే ఉంచితే.. అధిక వడ్డీని ఖాతాదారుకు అందిస్తుంది. ఈ ఫెక్సీ ఫిక్సిడ్ డిపాజిట్ అకౌంట్లపై 90% దాకా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునేందుకు కూడా బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి.