మినిమం బ్యాలెన్స్ ​నిబంధన తొలగింపు | Sakshi
Sakshi News home page

మినిమం బ్యాలెన్స్ ​నిబంధన తొలగింపు

Published Wed, Mar 11 2020 5:17 PM

 SBI does away with minimum balance in savings accounts - Sakshi

సాక్షి, ముంబై:  ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. ఇకపై  మినిమం బ్యాలెన్స్‌ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో  కనీస నిల్వను (నెలవారీ) పాటించాల్సిన అవసరం లేదు. దీంతో ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. అలాగే  పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. దేశంలో ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌  ప్రోత్సాహ చర్యల్లో  భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్‌బీఐ ఖాతాల్లో యావరేజ్‌ మంత్లీ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్టున్నట్టు తెలిపింది.

అలాగే ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది.  కాగా ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ వినియోగదారుల మెట్రో, సెమీ అర్బన్,  గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా  రూ. 3వేలు,  రూ. 2 వేలు,  వెయ్యి రూపాయల నెలవారీ కనీస నిల్వను ఉంచాలి. లేదంటే పన్నులతో పాటు 5 నుంచి 15 రూపాయల వరకు జరిమానా వసూలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు  ఎస్‌బీఐ బుధవారం ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను, డిపాజిట్లపై  బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లను తగ్గించింది.

Advertisement
Advertisement