Minimum Balance
-
పేదల నుంచి బ్యాంకులు గుంజేసింది బిలియన్ డాలర్లపైనే...
డబ్బులు లేనందుకు డబ్బులే జరిమానాగా చెల్లించాల్సి వస్తే!!. పేదలు కనక పెనాల్టీ చెల్లించాలంటే!!. ఈ దారుణ పరిస్థితి ఇపుడు మన బ్యాంకుల్లో చాలామంది కస్టమర్లకు అనుభవంలోకి వచ్చింది. ఖాతాల్లో కనీస నిల్వలు లేవన్న కారణంతో... ఉన్న కాసింత నగదునూ జరిమానా రూపంలో బ్యాంకులు గుంజేసుకోవటం సాధారణమైపోయింది. అందుకేనేమో... గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ బ్యాంకులకు ఈ జరిమానాల రూపంలోనే బిలియన్ డాలర్లకు పైగా సొమ్ము వచ్చి పడిపోయింది. మరి ఈ జరిమానాలు కట్టినవారంతా ఎవరు? శ్రీమంతులు కాదు కదా? ఖాతాల్లో కనీసం రూ.5వేలో, 10వేలో ఉంచలేక.. వాటిని కూడా తమ అవసరాలకు వాడుకున్నవారే కదా? ఇలాంటి వారి నుంచి గుంజుకుని బ్యాంకులు లాభాలు ఆర్జించటం... అవికూడా ప్రభుత్వ బ్యాంకులు కావటం మన దౌర్భాగ్యం కాక మరేంటి!.డిజిటల్ పేమెంట్ల యుగం వచ్చాక బ్యాంకు ఖాతా లేని వ్యక్తులెవరూ లేరన్నది వాస్తవం. పది రూపాయలు పార్కింగ్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చేస్తున్న పరిస్థితి. నెలకు రూ.5-10 వేలు సంపాదించే వ్యక్తులకూ పేటీఎం, ఫోన్‌పేలే దిక్కు. వీళ్లంతా తమ ఖాతాల్లో రూ.5వేలో, లేకపోతే రూ.10వేలో అలా వాడకుండా ఉంచేయటం సాధ్యమా? అలా ఉంచకపోతే జరిమానా రూపంలో వందలకు వందల రూపాయలు గుంజేసుకోవటం బ్యాంకులకు భావ్యమా? బ్యాంకులు లాభాల్లోకి రావాలంటే ‘డిపాజిట్లు- రుణాల’ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవాలి తప్ప ఇలా జరిమానాలతో సంపాదించడం కాదు కదా? గడిచిన ఐదేళ్లలో మన ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులు కలిసి అక్షరాలా ఎనిమిదివేల నాలుగువందల తొంభై ఐదు కోట్ల రూపాయల్ని ఈ మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి గుంజేసుకున్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఎస్బీఐ మానేసింది కనక...2014-15లో ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయటంతో పాటు సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విధించింది. వాటికి లోబడి ఆ ఛార్జీలు ఎంతనేది బ్యాంకులే సొంతంగా నిర్ణయం తీసుకుంటాయి. వసూలు చేయాలా? వద్దా? అన్నది కూడా సదరు బ్యాంకుల బోర్డులో నిర్ణయిస్తాయి. 2019-20లో ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులూ ఈ జరిమానాల కింద రూ.919.44 కోట్లు వసూలు చేస్తే... 2023-24కు వచ్చేసరికి అది అమాంతం రూ.2,331.08 కోట్లకు పెరిగిపోయింది. అంటే రెండున్నర రెట్లు. నిజానికి మన బ్యాంకుల వ్యాపారం కూడా ఈ స్థాయిలో పెరగలేదు. మరో గమనించాల్సిన అంశమేంటంటే 2019-20లో వసూలు చేసిన రూ.919 కోట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటాయే ఏకంగా రూ.640 కోట్లు. అంటే 70 శాతం. ఖాతాదారుల అదృష్టం బాగుండి.. 2020 నుంచి ఈ రకమైన జరిమానాలు వసూలు చేయకూడదని ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎస్బీఐ కూడా ఇప్పటికీ వీటిని వసూలు చేస్తూ ఉంటే ఈ ఐదేళ్లలో మొత్తం జరిమానాలు రూ.15వేల కోట్లు దాటిపోయి ఉండేవేమో!!. అత్యధిక వసూళ్లు పీఎన్‌బీవే...ఈ ఐదేళ్లలో 13 బ్యాంకులూ కలిసి రూ.8,495 కోట్లు జరిమానాగా వసూలు చేసినా... అందులో అత్యధిక వాటా నీరవ్ మోడీ స్కామ్‌లో ఇరుక్కున్న పంజాబ్ నేషనల్ బ్యాంకుదే. ఎస్బీఐ జరిమానాలు వసూలు చేయటం లేదు కాబట్టి ఆ తరువాతి స్థానంలో ఉండే పీఎన్బీ ఏకంగా రూ.1,537 కోట్లను ఖాతాదారుల నుంచి జరిమానాగా వసూలు చేసింది. అత్యంత తక్కువగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.19.75 కోట్లు వసూలు చేసింది. ఇక ఇండియన్ బ్యాంకు రూ.1466 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1250 కోట్లు, కెనరా బ్యాంకు రూ.1157 కోట్లతో పీఎన్బీ తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. వీటిలో కొన్ని బ్యాంకులు నెలవారీ కనీస నిల్వలు లేవన్న కారణంతో... మరికొన్ని బ్యాంకులు క్వార్టర్లీ కనీస నిల్వలు లేవన్న కారణంతో ఈ జరిమానాలు వసూలు చేశాయన్నది మంత్రి వ్యాఖ్యల సారాంశం.-రమణమూర్తి.ఎం -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్!
ముంబై: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. పరిశ్రమలో వినూత్నంగా సబ్స్క్రిప్షన్ (చందా) ఆధారిత సేవింగ్స్ అకౌంట్‌ను తీసుకొచ్చింది. ఈ ఖాతాలో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. చాలా రకాల సేవలకు విడిగా ఎలాంటి చార్జీలు పడవు. కాకపోతే ప్రతి నెలా చందా కింద రూ.150 చెల్లించుకోవాలి. లేదంటే ఏడాదికోసారి అయితే రూ.1,650 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ అకౌంట్’ అని పేరు పెట్టింది. మెజారిటీ బ్యాంక్‌లు సేవింగ్స్ ఖాతాలను కనీస బ్యాలన్స్తో అందిస్తున్నాయి. ఇది ప్రాంతాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య ఉంది. ఈ కనీస బ్యాలన్స్ తగ్గిపోతే పెనాల్టీ రూపంలో బ్యాంక్‌లు చార్జీలు బాదుతుంటాయి. చందా విధానంలో ఖాతాలో కనీస బ్యాలన్స్ అవసరం లేదని, దేశీయ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు లేవని, ఉచిత డెబిట్ కార్డులను అందిస్తున్నట్టు, ఎన్ని సార్లు అయినా ఉచితంగా వినియోగించుకోవచ్చని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. -
బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!
భారతదేశంలో దాదాపు చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అందులో ఉద్యోగాలు చేసేవారు, సాధారణ ప్రజలు, కర్షకులు, కార్మికులు ఇలా అందరూ ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే సంబంధిత బ్యాంక్ దానికి ఫెనాల్టీ చార్జీలను విధిస్తుంది. ఈ విధానం బ్యాంక్ ఖాతాదారులకు తలనొప్పిగా మారిపోయింది. అయితే ఈ విధానానికి చరమగీతం పాడటానికి ఆర్బిఐ సన్నద్ధమైంది. సేవింగ్ అకౌంట్లో బ్యాలన్స్ సున్నా ఉన్నప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు విధించే చార్జీలను నిలిపివేయాలని ఆర్బిఐ బ్యాంకులను కోరింది. గతంలోనే ఈ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ.. కొన్ని బ్యాంకులు మాత్రమే పాత పద్ధతినే పాటిస్తున్నాయి. ఆర్బిఐ అందించిన సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత, కస్టమర్ తన ఉద్యోగాన్ని మార్చుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది. అప్పుడు మునుపటి అకౌంట్ లావాదేవీలు దాదాపు నిలిచిపోతాయి. లావాదేవీలు నిలిచిపోయిన తరువాత బ్యాంక్ దానికి ఫెనాల్టీ విధిస్తుంది. అప్పుడు బ్యాలన్స్ మైనస్‌లోకి వెళ్ళిపోతుంది. బ్యాంక్ ఆ మొత్తాన్ని రికవరీ చేయనప్పటికీ.. ఒకవేళా అకౌంట్లోకి డబ్బు జమ చేసినప్పుడు చెలించాల్సిన మొత్తం ఆటోమాటిక్‌గా కట్ అవుతుంది. దీని వల్ల వినియోగదారుడు నష్టపోయే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిమిషం.. ఇవి తెలుసుకోండి!) ఇదిలా ఉంటే 'హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్' మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయదని, అంతే కాకుండా మళ్ళీ ఆ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడానికి కూడా డబ్బు వసూలు చేయదని చెబుతున్నారు. దీనితో పాటు యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోలో ఉన్నా.. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా కూడా ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విధానాన్ని ఏదైనా బ్యాంక్ అనుసరించకపోతే లేదా మీ అకౌంట్ నెగెటివ్ బ్యాలెన్స్‌లోకి వెళ్తే దీనిపైన మీరు ఆర్బిఐకి పిర్యాదు చేయవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీఅభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. Source: RBI -
మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే?
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్నారు. ఇక ఉద్యోగులు, వ్యాపారస్తులు ఏకంగా రెండు పైనే ఖాతాలను నిర్వహిస్తున్నారు. కొందరు బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో మినిమం బ్యాలెన్స్ (కనీస మొత్తంలో నగదు) నిల్వ చేయలేక జరిమానాలు, అదనపు ఛార్జీలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్లో ఇక మినిమం బ్యాలెన్స్ జరిమానాలపై తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కిషన్రావ్ కారడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీని మాఫీ చేయడంపై వ్యక్తిగత బ్యాంకుల బోర్డులు నిర్ణయం తీసుకోవచ్చని కారడ్ తెలిపారు. ‘బ్యాంకులు స్వతంత్ర సంస్థలు. పెనాల్టీని రద్దు చేసే నిర్ణయం తీసుకునే అధికారం బోర్డులకు ఉన్నాయని’ అన్నారు. బ్యాంక్ రూల్స్ ప్రకారం తక్కువ నిల్వ (మినిమం బ్యాలెన్స్) ఉన్న ఖాతాలపై జరిమాన విధిస్తున్న విషయం విదితమే. అయితే ఇలాంటి అకౌంట్లపై ఎలాంటి పెనాల్టీ వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించడంపై కేంద్రం పరిశీలిస్తుందా అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 58 శాతంగా ఉందని, దానిని పెంచాలని అధికారులను కోరినట్లు కారడ్ తెలిపారు. అయితే ఇక్కడ క్లిష్టమైన భూభాగాలు ఉన్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్లో బ్యాంకు కమ్యూనికేషన్ లేని ఒక్క గ్రామం కూడా లేదని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
కొత్త రూల్స్..బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్..!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు తన ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ ను అందించింది. మినిమం బ్యాలన్స్ విషయంలో యాక్సిస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ల మినిమం బ్యాలన్స్ ను యాక్సిస్ బ్యాంకు పెంచింది. పలు కేటగిరీల్లోనీ సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబధించి మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను మార్పు చేసినట్లు తెలుస్తోంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఈజీ సేవింగ్స్ అకౌంట్ లేదా అలాంటి అకౌంట్స్ ఉన్నవారు ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ రూ.12,000 మెయింటైన్ చేయాలి. గతంలో ఈ బ్యాలెన్స్ రూ.10,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు రూ.2,000కు పెరిగింది. ఈ నిర్ణయం అన్ని డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఈజీ అకౌంట్, డిజిటల్, సేవింగ్స్ SBEZY, స్మార్ట్ ప్రివిలేజ్ లాంటి అకౌంట్స్‌కు వర్తించనుంది. ఇక సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వుండనుంది. ఆయా ఖాతాదారులు బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీల మోత మోగనుంది. ఇప్పటికే పలు బ్యాంకులు మినిమం బ్యాలన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఖాతాదారులపై ఫైన్ వసూలు చేస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ నగదు లావాదేవీ పరిమితిపై కూడా నిబంధనలను సవరించింది. ఉచిత నగదు లావాదేవీల పరిమితిని తగ్గించింది. ఉచిత నగదు లావాదేవీల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు తగ్గించబడింది. ఈ నిబంధనల మార్పు ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. -
ఛార్జీల రూపంలో బ్యాంకులకు భారీ ఆదాయం
2020-21 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బి)కు చార్జీల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. ఖాతాదారులు తమ ఖాతాల్లో అవసరమైన కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఛార్జీలు విధించడం వల్ల దాదాపు 170 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆర్టీఐ సమాచారం తెలిసింది. ఛార్జీల విధించడం వల్ల ఆర్జించిన పీఎన్‌బి ఆదాయం 2019-20లో రూ.286.24 కోట్లుగా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు త్రైమాసిక ప్రాతిపదికన ఛార్జీలను విధిస్తుంటాయి. 2020-21 ఏప్రిల్-జూన్ కాలంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(క్యూఏబి) రూ.35.46 కోట్లుగా(పొదుపు, కరెంట్ ఖాతా రెండింటిలోనూ) ఉంది. అయితే ఎఫ్ వై21 రెండో త్రైమాసికంలో ఏటువంటి ఛార్జీలు విధించలేదు. మూడో, నాలుగో త్రైమాసికాల్లో క్యూఏబీ నిర్వహణేతర ఛార్జీలు వరుసగా రూ.48.11 కోట్లు, రూ.86.11 కోట్లుగా ఉన్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త చంద్ర శేఖర్ గౌర్ సహచట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా.. పీఎన్బీ ఈ సమాధానమిచ్చింది. అలాగే, రుణదాత సంవత్సరంలో ఏటీఎం లావాదేవీ ఛార్జీల రూపంలో రూ.74.28 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు ఏడాది 2019-20లో ఇది రూ.114.08 కోట్లుగా ఉంది. 2020-21 మొదటి త్రైమాసికంలో ఏటీఎం లావాదేవీ ఛార్జీలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రద్దు చేసినట్లు బ్యాంకు తెలిపింది.(చదవండి: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..!) -
మినిమం బ్యాలెన్స్ నిబంధన తొలగింపు
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. ఇకపై మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ఎస్బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను (నెలవారీ) పాటించాల్సిన అవసరం లేదు. దీంతో ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. అలాగే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. దేశంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రోత్సాహ చర్యల్లో భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్బీఐ ఖాతాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్టున్నట్టు తెలిపింది. అలాగే ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. కాగా ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ వినియోగదారుల మెట్రో, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా రూ. 3వేలు, రూ. 2 వేలు, వెయ్యి రూపాయల నెలవారీ కనీస నిల్వను ఉంచాలి. లేదంటే పన్నులతో పాటు 5 నుంచి 15 రూపాయల వరకు జరిమానా వసూలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎస్బీఐ బుధవారం ఎంసీఎల్ఆర్ రేట్లను, డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లను తగ్గించింది. -
ఎస్బీఐ కొత్త నిబంధనలు, అక్టోబరు 1 నుంచి
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగబ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఖాతాల్లో మినిమం బాలెన్స్‌కు సంబంధించి పరిమితిపై ఊరటనిచ్చినా, సర్వీసు చార్జీలు బాదుడు మాత్రం వినియోగదారులకు తప్పదు. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని బ్రాంచుల్లో ఖాతాదారులు నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ.3,000 ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం రూ.5వేలు ఉన్న పరిమితిని రూ.2వేలకు తగ్గిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. సెమీ అర్బన్ ఖాతాల్లో రూ. 2వేలు కనీస నిల్వ ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాల విషయానికి వస్తే ఈ పరిమితిని వెయ్యి రూపాయలుగా ఉంచింది. బ్యాంక్ ఖాతాలో నెలవారీ మినిమమ్ బ్యాలెన్స్ రూ.3000 ఉండకపోతే వినియోగదారుడికి వడ్డన తప్పదు. ఉదాహరణకు రూ.3 వేల పరిమితి గల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ 50 శాతం తగ్గితే అంటే రూ.1500 ఉంటే అప్పుడు రూ.10. అదే అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ 50-75 శాతం (రూ.750) కన్నా తక్కువగా ఉంటేరూ.12. 75 శాతానికి పైగా తగ్గితే రూ.15 పెనాల్టీ చెల్లించాలి. దీనికి అదనంగా జీస్టీ కూడా చెల్లించాలి. ఈ పెనాల్టీ శాతం అన్ని ఖాతాలకు వర్తిస్తుంది. మినిమం బాలెన్స్ పరిమితి రూ. 2 వేలు ఉన్న ఖాతాల్లో కనీస నిల్వ తగ్గితే పెనాల్టీ ఇలా 50శాతం తగ్గితే రూ. 7.50 ప్లస్ జీఎస్టీ 50-75 శాతం తగ్గితే రూ. 10 ప్లస్ జీఎస్టీ 75శాతానికిపైన తగ్గితే రూ. 12 ప్లస్ జీఎస్టీ మినిమం బాలెన్స్ పరిమితి వెయ్యి రూపాయలు న్న ఖాతాల్లో కనీస నిల్వ తగ్గితే పెనాల్టీ ఇలా 50 శాతం తగ్గితే రూ. 5 ప్లస్ జీఎస్టీ 50-75 శాతం తగ్గితే రూ. 7.50 ప్లస్ జీఎస్టీ 75 శాతానికి పైన తగ్గితే రూ. 10 ప్లస్ జీఎస్టీ డిపాజిట్లు, విత్‌డ్రాలు కొత్త నిబంధనల ప్రకారం సేవింగ్ ఖాతాలో నెలకు బ్యాంకుల్లో నేరుగా నగదు డిపాజిట్ కేవలం మూడుసార్లు మాత్రమే చేయాలి. ఆ తర్వాత చేసిన ప్రతి సారీ ఛార్జీ తప్పదు. కనీస మొత్తం రూ.100లు డిపాజిట్ చేసినా రూ. 50 ఛార్జ్ చెల్లించాల్సిందే. దీనికి జీఎస్టీ అదనం. అలాగే నాన్ హోం బ్రాంచిలలో నగదు డిపాజిట్లకు గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు. ఆపై డిపాజిట్లను స్వీకరించాలా లేదా అనేది ఆ బ్యాంకు మేనేజర్ నిర్ణయిస్తారు. నెలకు సగటున 25వేల రూపాయల బాలెన్స్ ఉంచే ఖాతాదారుడు నెలకు రెండు సార్లు ఉచితంగా నగదు డ్రా చేసుకునే అవకాశం. అదే రూ. 25-50 వేలు అయితే 10 సార్లు ఉచితం. రూ. 50- లక్ష మధ్య అయితే 15 సార్లు ఉచితం ఈ పరిమితి మించితే రూ.50 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు. నెలకు సగటున లక్ష రూపాయలకు పైన ఖాతాలో ఉంచితే ఈ సదుపాయం పూర్తిగా ఉచితం. ఏటీఎం లావాదేవీల సంఖ్య పెంపు నగరాల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ సంఖ్య పెరగనుంది. మెట్రో నగరాల్లో ఈ ట్రాన్సాక్షన్ల సంఖ్య నెలకు 10కి పెరగనున్నాయి. నాన్ మెట్రో ప్రాంతాల్లో ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎస్బీఐ ఏటీఎంలలో 12 లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎం కార్డులకు 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఉచితం. ఇక, ఏదైనా కారణాలతో చెక్ బౌన్స్ అయితే జీఎస్టీతో కలుపుకొని రూ.168 చెల్లించాలి. ఖాతాలో రూ.25 వేలు అంతకంటే ఎక్కువ నగదు ఉంచే ఖాతాదారులకు అపరిమిత ఏటీఎం సేవలు అందనున్నాయి. అలాగే వేతనాలు పొందే ఖాదాదారులకు కూడా అన్లిమిటెడ్ ఏటీఎం సేవలు. పూర్తి వివరాలు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
గుడ్‌న్యూస్ : నో మినిమం బ్యాలెన్స్
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ), లేదా నో ఫ్రిల్స్ అకౌంట్స్‌గా పిలిచే ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు విత్ డ్రాలపై నిబంధనలను కూడా సడలించింది. నెలకు 4 సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్ చేసుకునే సదుపాయంతోపాటు ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఇప్పుడు కేంద్ర బ్యాంకు తొలగించింది. వీరికి కనీస సదుపాయాలకు తోడు చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఇప్పుడు ఆర్బీఐ కల్పించింది. అయితే ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు గాను వారినుంచి మినిమం బాలెన్స్ చార్జీలు వసూలు చేయరాదని ఆర్బీఐ పేర్కొంది అయితే బీఎస్‌బీడీ ఖాతాకు సంబంధించి ఎటువంటి చార్జీ లేకుండానే ఏటీఎం కార్డు, పాస్‌పుస్తకం లభిస్తుంది. ఖాతా ఉన్న ఖాతాదారులు మరి ఏ ఇతర ఖాతాను కలిగి వుండడానికి వీల్లేదు. ఒక వేళ వుంటే అకౌంట్‌ను ఓపెన్ చేసిన 30 రోజుల వ్యవధిలోనే సదరు ఖాతాను మూసి వేయాల్సి వుంటుంది. అంతేకాదు నో ఫ్రిల్ ఖాతాలను తెరవడానికి ముందే...తనకు ఇతర బ్యాంకుల్లో బీఎస్‌బీడీ ఖాతా ఏదీ లేదని ధృవీకరణ కూడా చేయాల్సి వుంది. -
బీఓబీ మినిమం బ్యాలెన్స్ నిర్వహణ రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) పొదుపు ఖాతాదారులు తమ ఖాతాల్లో నిర్వహించే కనీస బ్యాలెన్స్‌ను రెట్టింపు చేసింది. నగర, మెట్రో, సెమీ అర్బన్ బ్రాంచ్‌ల్లో కనీస నిల్వను రూ 1000 నుంచి రూ 2000కు పెంచుతున్నట్టు బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్‌ల్లో కనీస నిల్వను రూ 500 నుంచి రూ 1000కి పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి నూతన మినిమం బ్యాలెన్స్‌లు అమల్లోకి వస్తాయని బ్యాంకు పేర్కొంది. బీఓబీలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లు విలీనం కావడంతో ఈ రెండు బ్యాంకుల పొదుపు ఖాతాలకూ ఇవే నిబంధనలు వర్తించనున్నాయి. కాగా మినిమం బ్యాలెన్స్ నిర్వహణను వంద శాతం మేర బ్యాంకు పెంచినప్పటికీ కనీస నిల్వను నిర్వహించని ఖాతాదారులపై విధించే జరిమానాను పెంచకపోవడం ఖాతాదారులకు కొంత ఊరట ఇస్తోంది. అయితే అదనంగా మినిమమ్ బ్యాలెన్స్‌ను నిర్వహించడం ఖాతాదారులపై భారం మోపనుంది. -
ఎయిర్‌టెల్‌కు 7 కోట్లమంది యూజర్లు షాకిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం మార్కెట్ సంచలనం రిలయన్స్ జియో దెబ్బతో విలవిలలాడిన ప్రయివేటు దిగ్గజ టెల్కో ఎయిర్‌టెల్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తాజా నివేదికల ప్రకారం ఇప్పటికే.. జియో దెబ్బకు కుదేలైన ఎయిర్టెల్ సుమారు 5-7 కోట్ల ఖతాదారులను ఎయిర్టెల్ కోల్పోనుంది. జీవిత కాల కస్టమర్లు ఉచిత ఇన్కమింగ్ కోసం 35రూపాయల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధన కంపెనీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లైఫ్ టైం ఫ్రీ ఇన్‌కం ప్లాన్‌లో ఉన్న కస్టమర్లు నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ. 35గా ఎయిర్టెల్ ఇటీవల ఆదేశించింది. కస్టమర్లు నెలకు ఈ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని లేదంటే కనెక్షన్‌ను కట్ చేస్తానని నోటీసులు కూడా పంపింది. దీంతో చాలా మంది కస్టమర్లు ఎయిర్‌టెల్‌ను వీడనున్నారని సమాచారం. ఎయిర్టెల్ ఏమంటోంది? తమ తాజా నిర్ణయం వల్ల తమకు నష్టం ఏమీ ఉండదని ఎయిర్టెల్ ధీమాగా చెబుతోంది. ఖాతాదారులను నష్టపోనుందన్న అంశంపై స్పందించిన ఎయిర్టెల్ ఈ చర్య వల్ల యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (సగటు వినియోగదారుని నుండి వచ్చే ఆదాయం) ఏపీఆర్‌యూ పెరుగుతుందని, ఇప్పటికే చాలా సిమ్‌లు లైఫ్ టైం ప్యాకేజ్ కింద కేవలం ఇన్కమింగ్ కాల్స్ కోసమే వాడుతున్నారని , దీన్ని అరికట్టడానికే ఈ చర్య తీసుకున్నామని ఎయిర్టెల్ తెలిపింది. అంతేకాదు ఒక వేళ కస్టమర్లు తగ్గినా ఆ భారాన్ని మోయడానికే తాము సిద్ధ పడ్డామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 4జీ సేవలతో బాటు , ఇతర రంగాల్లో నుంచి తమకు ఆదాయం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. -
బ్యాంకు చార్జీలకే 10వేల కోట్లు
పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకపోవడం, పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీలు నిర్వహించడం వల్ల బ్యాంకులు ఖాతాదారుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తం అక్షరాలా రూ.పది వేల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడున్నరేళ్లలో ఖాతాదారుల నుంచి ఈ సొమ్ము వసూలు చేశాయని, అయితే, ప్రైవేటు బ్యాంకులు ఇంకా భారీగానే రాబట్టి ఉంటాయని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటించింది. కనీస నిల్వ నిబంధనను ఎస్బీఐ 2012వ సంవత్సరంలో ఆపివేసింది. 2017 ఏప్రిల్ నుంచి మళ్లీ వసూలు చేయడం మొదలు పెట్టింది. మిగతా బ్యాంకులు కూడా అదేబాటను అనుసరిస్తున్నాయి. ఈ పదివేల కోట్లలో ఖాతాదారు అకౌంట్లో కనీస నిల్వ లేనందుకు రూ.6,246 కోట్లు, పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు జరిపినందుకు రూ.4,145 కోట్లు వసూలు చేశాయి. ఇందులో ఎస్బీఐ వాటా.. కనీస నిల్వకు సంబంధించి రూ.2,894 కోట్లు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రూ.1,554 కోట్లు. జన్‌థన్ ఖాతాలకు, బేసిక్ పొదుపు ఖాతాలకు కనీస నిల్వ పరిమితి లేదు. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి మెట్రో నగరాల్లో నెలకు మూడు లావాదేవీలు(ఇతర బ్యాంకు ఏటీఎంలలో), మిగతా చోట్ల ఐదు లావాదేవీలు ఉచితం. ఈ పరిమితి దాటితే కనీసం రూ.20 చొప్పున ప్రతి లావాదేవీకి వసూలు చేస్తున్నాయి. ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలలో ఉచిత లావాదేవీలు ఐదు వరకు చేసుకోవచ్చు. -
మినిమమ్ బ్యాలెన్స్‌లపై ఎస్బీఐ ప్రకటన
న్యూఢిల్లీ : ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారుల నుంచి బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల మేర జరిమానాను వసూలు చేశాయని వస్తున్న వార్తలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. నెలవారీ నిర్వహించే కనీసం బ్యాలెన్స్‌లను ఏప్రిల్ నుంచి తాము 40 శాతం తగ్గించామని పేర్కొంది. అంతేకాక 40 శాతం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను ఈ నిబంధనల నుంచి మినహాయించామని వెల్లడించింది. కనీస బ్యాలెన్స్ నిర్వహించలేకపోవడంపై విధించే ఛార్జీలు, ఇండస్ట్రీలోనే తమవే అత్యంత తక్కువగా ఉన్నాయని చెప్పింది. ఎస్బీఐ భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వస్తున్న రిపోర్టులపై బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఎస్బీఐ ఆ నిబంధనల కింద నాలుగు కేటగిరీల్లో బ్రాంచులను క్లాసిఫై చేసింది. రూరల్, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో. బ్రాంచు ఉండే ప్రాంతం బట్టి సగటు నెలవారీ నిల్వలు బ్యాంక్ అకౌంట్లో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ కస్టమర్ కనుక ఈ నిల్వలను నిర్వహించలేని పక్షంలో, జరిమానాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎస్బీఐ బ్రాంచ్ టైప్ సగటు నెలవారీ నిల్వలు మెట్రో రూ.3000 అర్బన్ రూ.3000 సెమీ-అర్బన్ రూ.2000 రూరల్ రూ.1000 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు వినియోగదారుల నుంచి రూ.5 వేల కోట్లను జరిమానా పేరిట వసూలు చేశాయని బ్యాంకింగ్ డేటాలో వెల్లడైంది. వీటిలో ఎస్బీఐ జరిమానాల పేరిట అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎస్బీఐ కొన్ని సేవింగ్స్ అకౌంట్లను ఈ సగటు నెలవారీ మొత్తాల నిబంధల నుంచి మినహాయించింది. వాటిలో ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజన్ స్కీన్ జన్ ధన్ యోజన, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్, పీఎంజేడీఐ/బీఎస్‌బీడీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యురిటీ బెనిఫిట్ హోల్డర్స్ అకౌంట్లు ఈ నిబంధన నుంచి మినహాయింపు పొందుతున్నాయి. ఈ అకౌంట్ల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని ఎస్బీఐ ప్రకటించింది. మొత్తం 42.5 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో సుమారు 40 శాతం అకౌంట్లను కనీస బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాక కస్టమర్లు ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి బీఎస్‌బీడీ అకౌంట్లలోకి మారడానికి ఎలాంటి ఛార్జీలను వేయడం లేదని తెలిపింది. -
వినియోగదారులకు రూ. 5 వేల కోట్ల ఫైన్
న్యూఢిల్లీ : ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారులకు బ్యాంకులు వసూలు జరిమానా లెక్కలు చూస్తే కళ్లు తిరగాల్సిందే. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు వినియోగదారుల నుంచి రూ.5 వేల కోట్లను జరిమానా పేరిట వసూలు చేశాయి. ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ. 6,547 కోట్ల నష్టాన్ని చవి చూసిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) జరిమానాలను వసూలు చేసేందుకు ఇతర బ్యాంకులకు నేతృత్వం వహించింది. మొత్తం 24 బ్యాంకుల్లో అధికంగా జరిమానాలు వసూలు చేసింది కూడా ఎస్బీఐనే. ఏప్రిల్ 2017 నుంచి కనీస బ్యాలెన్స్ నిల్వ చేయకపోతే విధించే జరిమానాను ఎస్బీఐ తిరిగి ప్రవేశపెట్టింది. దీంతో ఎస్బీఐ జరిమానాల పేరిట అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఎస్బీఐ కస్టమర్లకు లేటెస్ట్ ఆఫర్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2018 ఆగస్టు వరకు ఎలాంటి కనీస మొత్తం(మినిమమ్ బ్యాలెన్స్) అవసరం లేకుండా అకౌంట్ ప్రారంభించుకునే సౌకర్యాన్ని అందిస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. సేవింగ్స్ అకౌంట్లలో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదనుకునే వినియోగదారులకు ఈ తాజా ఆఫర్ గొప్ప అవకాశమని పేర్కొంది. ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్ పేరుతో ఈ అకౌంట్‌ను తెరుచుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌ను ప్రారంభించడానికి బ్యాంకుకు కూడా వెళ్లాల్సినసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్.... ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చు ఎలాంటి డాక్యుమెంట్లను కస్టమర్లు సమర్పించాల్సివసరం లేదు. ‘పేపర్‌లెస్ అకౌంట్ ఓపెనింగ్’ ను ఇది ఆఫర్ చేస్తోంది. వెంటనే ఈ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోచవ్చు. కస్టమర్లు ఎవరైతే ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభిస్తారో ఆ వినియోగదారులు రూపే డెబిట్ కార్డు పొందుతారు. లక్ష రూపాయల వరకు ఈ అకౌంట్లో మెయిన్‌టైన్స్ చేసుకోవచ్చు. ఏడాది లోపు ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌ను రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లోకి మార్చుకోవచ్చు. 2018 ఆగస్టు వరకు ఈ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాల్సినవసరం లేదు. 18 ఏళ్ల పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చు యోనో మొబైల్ యాప్‌లో ఈ సేవింగ్స్ అకౌంట్‌ను దరఖాస్తు చేసేటప్పుడు యూజర్లు, ఆధార్, పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. -
ఎస్బీఐ కనీస బ్యాలెన్స్ చార్జీల తగ్గింపు
ముంబై: ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కనీస బ్యాలెన్స్ పెనాల్టీ చార్జీలను 75 శాతం మేర తగ్గించింది. దీంతో ఇకపై నగరాల్లో నెలకు సగటు బ్యాలెన్స్ పరిమితులను పాటించని పక్షంలో రూ. 15 (పన్నులు అదనం), సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 12, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ. 10 విధించనుంది. ప్రస్తుతం మెట్రోలు, అర్బన్ ప్రాంతాల్లో ఈ చార్జీలు గరిష్టంగా నెలకు రూ. 50 (పన్నులు అదనం), సెమీ అర్బన్.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40గా ఉన్నాయి. కొత్త మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, పెనాల్టీ చార్జీలను తగ్గించినప్పటికీ కనీస బ్యాలెన్స్ పరిమితులను మాత్రం ఎస్బీఐ యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం ఇకపై కూడా మెట్రో నగరాల్లో కనీస నెలవారీ బ్యాలెన్స్ పరిమితి రూ. 3,000 గాను, సెమీ అర్బన్ ఖాతాల్లో రూ. 2,000, గ్రామీణ ప్రాంతాల ఖాతాల్లో రూ. 1,000గాను కొనసాగుతుంది. కనీస బ్యాలెన్స్ నిబంధనలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పెనాల్టీ చార్జీలు విధిస్తూ.. భారీ లాభాలు గడిస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. పెనాల్టీ చార్జీల తగ్గింపుతో బ్యాంకు ఫీజు ఆదాయం కొంత మేర తగ్గనుంది. ‘ఖాతాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం చార్జీలను తగ్గించడం జరిగింది. కస్టమర్స్ ప్రయోజనాలే మా ప్రధాన లక్ష్యం‘ అని ఎస్బీఐ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) పి.కె. గుప్తా తెలిపారు. దాదాపు అయిదేళ్ల విరామం అనంతరం గతేడాది ఏప్రిల్‌లో కనీస నెలవారీ బ్యాలెన్స్ చార్జీలను మళ్లీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అక్టోబర్‌లో వీటిని కొంత సవరించింది. ఏప్రిల్–నవంబర్‌లో ప్రధానంగా ఇలాంటి చార్జీల ద్వారానే ఎస్బీఐ ఏకంగా రూ. 1,772 కోట్లు ఆర్జించినట్లు ఆర్థిక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. ఇది బ్యాంకు రెండో త్రైమాసికం లాభం కన్నా అధికం కావడం గమనార్హం. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తాజా చర్య తీసుకుంది. ఎస్బీఐకి 41 కోట్ల పొదుపు ఖాతాలు ఉన్నాయి. వీటిలో 16 కోట్లు ప్రధానమంత్రి జన ధన యోజన/ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్, పింఛనర్లు మొదలైన వర్గాలకు చెందినవి. వీటిపై కనీస బ్యాలెన్స్ చార్జీలు లేవు. దీంతో ప్రస్తుత సవరణతో దాదాపు 25 కోట్ల ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. కనీస బ్యాలెన్స్ చార్జీల బాదరబందీ లేకుండా సేవింగ్స్ ఖాతా నుంచి కావాలంటే ప్రాథమిక సేవింగ్స్ ఖాతా (బీఎస్‌బీడీ)కి కూడా బదలాయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు గుప్తా వివరించారు. ఎస్బీఐలో 41.2 లక్షల ఖాతాలు క్లోజ్ ఇండోర్: ప్రభుత్వరంగ ఎస్బీఐ కనీస నిల్వలేమి కారణంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా 41.2 లక్షల సేవింగ్స్ బ్యాంకు ఖాతాలను మూసేసింది. కనీస బ్యాలెన్స్‌ల నిర్వహణలో విఫలమైతే చార్జీల విధింపును గతేడాది ఏప్రిల్ నుంచి బ్యాంకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఏప్రిల్ నుంచి ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనం జరిగిన విషయం గమనార్హం. కనీస నిల్వ లేని కారణంగా వాటికి నిధులు కేటాయింపులు చేయాల్సి ఉండటంతో 41.16 లక్షల ఖాతాలను మూసేసినట్టు సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఎస్బీఐ సమాధానం ఇచ్చింది. -
41 లక్షల ఖాతాలు మూసివేసిన ఎస్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి పదినెలల్లో ఎస్బీఐ 41 లక్షలకు పైగా ఖాతాలను మూసివేసింది. తమ ఖాతాల్లో కనీస నిల్వలను నిర్వహించని ఖాతాదారులకు అకౌంట్ల రద్దుతో ఎస్బీఐ షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ కింద రాబట్టిన సమాచారంతో ఈ విషయం వెలుగుచూసింది. ఫిబ్రవరి 28న ఎస్బీఐ ఈ మేరకు దరఖాస్తుదారుకు లిఖితపూర్వకంగా వివరాలు అందించినట్టు ప్రభాత్ ఖబర్ పేర్కొంది. కనీస నిల్వలు నిర్వహించని ఖాతాలపై విధించే జరిమానాను 75 శాతం తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించిన రోజే ఖాతాల మూసివేత నిర్ణయం బహిర్గతమైంది. మెట్రో నగరాల్లో కనీస నెలవారీ నిల్వలు రూ 3000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ 2000, గ్రామీణ ప్రాంతాల్లో రూ 1000గా నిర్వహించాలని ఎస్బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆరేళ్ల విరామం అనంతరం గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలను ఎస్బీఐ అమలు చేస్తోంది. -
మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై ఎస్బీఐ గుడ్‌న్యూస్
ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. సగటు నెలవారీ మొత్తాలను నిర్వహించని సేవింగ్స్ అకౌంట్లపై విధిస్తున్న ఛార్జీలకు ఎస్బీఐ భారీగా కోత పెట్టింది. ఈ ఛార్జీల కోత 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందనున్నట్టు తెలిపింది. అంతకముందు మెట్రో, అర్బన్ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న ఛార్జీ 50 రూపాయల(+జీఎస్టీ) నుంచి 15 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటన విడుదల చేసింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల సేవింగ్స్ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ 3వేల రూపాయలు. అదేవిధంగా సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల నెలవారీ ఛార్జీలను కూడా 40 రూపాయల(+జీఎస్టీ) నుంచి 10 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఛార్జీల తగ్గింపుతో పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌ను బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌గా మార్చుకోవడానికి సదుపాయం కల్పిస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. దీంతో కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఉపశమనం పొందుతారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు ఈ మినిమమ్ బ్యాలెన్స్‌లను ఛార్జీలను విధించడం లేదు. తగ్గించిన ఎస్బీఐ ఛార్జీల వివరాలు: తమ కస్టమర్ల సెంటిమెంట్లు, ఫీడ్బ్యాక్ల అనంతరం ఛార్జీలకు కోత పెట్టినట్టు ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పీకే గుప్తా తెలిపారు. కస్టమర్ల ప్రయోజనాలకే బ్యాంకు తొలుత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఎస్బీఐ వద్ద 41 కోట్ల సేవింగ్స్ అకౌంట్లు ఉండగా.. పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యురిటీ బెనిఫిట్ హోల్డర్ల పీఎంజేడీవై, బీఎస్‌బీడీ అకౌంట్లు 16 కోట్లు ఉన్నాయి. 21 కంటే తక్కువ వయసున్న అకౌంట్స్ హోల్డర్స్‌కు కూడా మినిమమ్ ఛార్జీల నిబంధనలను బ్యాంకు వర్తింపచేయడం లేదు. -
‘మినిమం బ్యాలెన్స్’కు ఎస్బీఐ కత్తెర!
ముంబై: పొదుపు ఖాతాల కనీస నిల్వ మొత్తం (ఎంబీఏ) నిర్వహణ నిబంధనలు... వీటిని పాటించకపోతే కస్టమర్లపై భారీ చార్జీల మోత. ఇందుకు సంబంధించి వస్తున్న తీవ్ర విమర్శలకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ దిగివస్తున్నట్లు కనిపిస్తోంది. కనీస నిల్వను ప్రస్తుత స్థాయి నుంచి తగ్గించాలని, సగటు నిల్వ... దీనిని పాటించకపోతే జరిమానాకు వర్తించే కాలాన్ని సైతం ‘నెల’ నుంచి ‘త్రైమాసికానికి’ మార్చాలని ఎస్బీఐ నిర్ణయం తీసుకుంటున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఒక కస్టమర్ అకౌంట్లో ఒక నెలలో అవసరమైన సగటు నగదు నిల్వ కొరవడినా, మూడు నెలల్లో వచ్చే–పోయే నిధుల వల జరిమానా సమస్య నుంచి ఖాతాదారుడికి ఊరట లభించవచ్చు. విమర్శల పర్వం... ఎన్‌బీఐ చార్జీల బాదుడుపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలు, కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడులు ఎస్బీఐ తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. కనీస నిల్వ పాటించని కారణంగా 2017 ఏప్రిల్– నవంబర్ మధ్య కాలంలో ఎస్బీఐకి ఫీజులుగా రూ.1,772 కోట్లు లభించాయన్న వార్తల నేపథ్యంలో... తాజా పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం. ఎస్బీఐ ప్రస్తుతం 40 కోట్ల పొదుపు ఖాతా వినియోగదారులను కలిగి ఉంది. ప్రస్తుతం ఎస్బీఐ వసూలు చేస్తున్న రూ.3,000 కనీస నిల్వ విధానం ఇతర పలు ప్రభుత్వ బ్యాంకులతో పోల్చిచూస్తే ఎక్కువకాగా, ప్రైవేటు బ్యాంకులకన్నా తక్కువ. ‘‘నెలవారీ సగటు బ్యాలెన్స్‌పై మేము తరచూ సమీక్షిస్తున్నాం. అక్టోబర్‌లో దీనికి కొంత తగ్గించాం. మళ్లీ ఈ విషయంలో సమీక్ష ప్రక్రియలో ఉన్నాం. వచ్చిన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని బ్యాంక్ ఎండీ పీకే గుప్తా శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. -
అత్యధిక మొత్తంలో బ్యాంకుల పెనాల్టీలు
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకు, ప్రైవేట్‌రంగ బ్యాంకులు కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీలను భారీగా మోత మోగిస్తున్నాయి. తమ సేవింగ్స్ అకౌంట్లలో బ్యాంకు నిర్దేశించిన మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే, ఇక అంతే సంగతులు. కానీ అసలు బ్యాంకులు విధించే ఈ ఛార్జీలు సమంజమేనా? లేదా? అని ఐఐటీ ముంబై ప్రొఫెసర్ ఓ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం లేదని కస్టమర్లకు విధిస్తున్న ఛార్జీలు అసమంజసంగా ఉన్నాయని తేలింది. ఆశిష్ దాస్ ఈ సర్వే చేపట్టారు. యస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ లాంటి బ్యాంకులు విధిస్తున్న పెనాల్టీలు వార్షికంగా 100 శాతం కంటే పైననే ఉన్నాయని తేలింది. అయితే మినిమమ్ బ్యాలెన్స్‌లు నిర్వహించలేని కస్టమర్లకు విధించే ఛార్జీల విషయంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూపొందించిన మార్గదర్శకాలు, చాలా సమంజసంగా ఉన్నాయని, సర్వీసులు అందజేసే ఖర్చుల కంటే ఎక్కువగా ఇవి ఉండవని దాస్ సర్వే పేర్కొంది. కానీ చాలా బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు సగటున చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయని తెలిపింది. దాస్ అందించిన డేటా ప్రకారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వార్షిక ఛార్జీ 159.48 శాతంగా, యస్ బ్యాంకు ఛార్జీ 112.8 శాతంగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఛార్జీ 83.76 శాతంగా, యాక్సిస్ బ్యాంకు ఛార్జీ 82.2 శాతంగా ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ విధించే పెనాల్టీలు కూడా 24.6 శాతంగా ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. ఈ పెనాల్టీలను బ్యాంకులు అసమంజసంగా విధిస్తున్నట్టు పేర్కొంది. -
ఎస్బీఐ ‘బ్యాలెన్స్’ ఊరట
ముంబై: మినిమం బ్యాలెన్స్ నిబంధనల పేరిట బ్యాంకులు ఎడాపెడా జరిమానాలు బాదేస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ ఖాతాదారులకు ఊరటనిచ్చింది. కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనలను సడలించింది. సేవింగ్స్ ఖాతాలపై ఇప్పటిదాకా రూ. 5,000గా ఉన్న ఎంఏబీని రూ. 3,000కు తగ్గించింది. అలాగే బ్యాలెన్స్ నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాల పరిమాణాన్ని కూడా సవరించింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం .. పెన్షనర్లు, మైనర్లతో పాటు ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మినిమం బ్యాలెన్స్ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది. ‘మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాలను ఒకే కేటగిరీ కింద లెక్కించాలని నిర్ణయించడం జరిగింది. దీనికి తగ్గట్లు మెట్రో నగరాల్లో ఎంఏబీ రూ. 3,000కు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఎస్బీఐ పేర్కొంది. 50 శాతం దాకా జరిమానా తగ్గుదల.. మరోవైపు, ఎంఏబీ నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాలను కూడా తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. దీన్ని 20–50% మేర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో చార్జీలు రూ. 20–40 మధ్య, పట్టణ.. మెట్రో నగరాల్లో రూ. 30–50 మధ్య ఉంటాయని తెలిపింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, ప్రధాన మంత్రి జన ధన ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలు వర్తించవు. ఎస్బీఐలో మొత్తం 42 కోట్ల పొదుపు ఖాతాలు ఉండగా, ఈ కోవకి చెందిన ఖాతాలు 13 కోట్లు ఉన్నాయి. ‘పెన్షనర్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మైనర్ల ఖాతాలకు మినహాయింపు ఉంటుంది. తాజా సవరణలతో అదనంగా 5 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుంది‘ అని బ్యాంకు పేర్కొంది. ఇప్పటిదాకా బాదుడు ఇదీ.. దాదాపు అయిదేళ్ల విరామం తర్వాత ఎస్బీఐ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ కనీస నెలవారీ బ్యాలెన్స్, తత్సంబంధిత చార్జీలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెట్రోపాలిటన్ నగరాల్లో ఎంఏబీ రూ. 5,000గాను, పట్టణాల్లో రూ. 3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2,000, గ్రామీణ శాఖల్లో రూ. 1,000 కనీస బ్యాలెన్స్‌గా నిర్ణయించింది. ఒకవేళ కనీస నెలవారీ బ్యాలెన్స్ నిర్దేశిత రూ. 5,000 కన్నా 75% తగ్గితే మెట్రో నగరాల్లో రూ. 100 (జీఎస్టీ అదనం) చార్జీలు విధిస్తోంది. అదే 50% లేదా అంతకన్నా తక్కువగా ఉంటే.. పెనాల్టీ రూ. 50 (జీఎస్టీ అదనం) విధిస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో జరిమానాలు రూ. 20–50 మధ్యలో (జీఎస్టీ అదనం) ఉంటున్నాయి. సందేహాలు తీర్చే.. చాట్‌బోట్ ముంబై: ఖాతాదారుల సందేహాలు తీర్చేందుకు, సత్వర సేవలందించేందుకు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ’ఎస్బీఐ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ (ఎస్ఐఎ)’ పేరిట చాటింగ్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి బ్యాంకు ప్రతినిధి తరహాలోనే ఇది పూర్తి స్థాయి సేవలు అందిస్తుందని దీన్ని రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం సంస్థ పేజో తెలియజేసింది. బ్యాంకింగ్ రంగంలో ఇది విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలదని పేజో వ్యవస్థాపక సీఈవో శ్రీనివాస్ నిజయ్ తెలిపారు. సెకనుకు 10,000 పైచిలుకు, రోజుకు 86.4 కోట్ల మేర ఎంక్వైరీలను ఈ చాట్‌బోట్ హ్యాండిల్ చేయగలదని ఆయన తెలియజేశారు. సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ సామర్ధ్యంలో ఇది 25 శాతం. ఈ చాట్‌బోట్ ద్వారా కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించగలమని ఎస్బీఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శివ్ కుమార్ భాసిన్ చెప్పారు. ప్రస్తుతం ఇది బ్యాంకు ఉత్పత్తులు, సర్వీసులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది. -
మినిమమ్ బ్యాలెన్స్ పై ఎస్బీఐ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : నెలవారీ కనీస మొత్తాల నిబంధనల నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు కొంత ఉపశమనం కల్పించింది. వీటిపై విధించే ఛార్జీలను, ఈ మొత్తాన్ని ఎస్బీఐ సమీక్షించింది. కనీసం బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తాన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో రూ.5000 నుంచి రూ.3000కు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ సోమవారం ప్రకటించింది. అంతేకాక పెన్షనర్లను, ప్రభుత్వం నుంచి సామాజిక ప్రయోజనాలు పొందే లబ్దిదారులను, మైనర్ అకౌంట్లను, ఫైనాన్సియల్ ఇంక్లూజిన్ అకౌంట్లను ఈ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పింది. పీఎంజేడీఐ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్లు కేటగిరీలను ఇప్పటికే ఎస్బీఐ ఈ నిబంధన నుంచి మినహాయించిన సంగతి తెలిసిందే. మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను నిబంధనను పాటించిన వారికి వేస్తున్న ఛార్జీలను కూడా 20 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించింది. అందరికీ ఈ తగ్గించిన ఛార్జీలే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఈ ఛార్జీలను సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల వారికి రూ.20 నుంచి రూ.40 వరకు, అర్బన్, మెట్రో సెంటర్ల వారికి రూ.30 నుంచి రూ.50 వరకు విధించనున్నట్టు చెప్పింది. ఈ సమీక్షించిన ఛార్జీలు 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కనీస నగదు నిల్వలను ఉంచని ఖాతాదారులపై సర్వీస్ టాక్స్‌తో పాటు 100 రూపాయల పెనాల్టీని విధించనున్నట్టు ఎస్బిఐ అంతకముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 శాతం కంటే తక్కువ నిల్వలున్న ఖాతాలపై సర్వీస్ టాక్స్‌తో పాటు 50 రూపాయలు, 50-75 శాతం తక్కువ ఉన్న నిల్వలపై సర్వీస్ టాక్స్ సహా 75 రూపాయల పెనాల్టీని బ్యాంకు విధిస్తోంది. ఇక నుంచి ఈ ఛార్జీలు తగ్గిపోనున్నాయి. జన్‌ధన్ అకౌంట్లకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. The Monthly Average Balance in Savings Bank Accounts has been revised w.e.f. 1/10/2017. For more details visit: https://t.co/lGxM6RRO37 pic.twitter.com/i0cDsR6XJV — State Bank of India (@TheOfficialSBI) September 25, 2017 -
మినిమమ్ బ్యాలెన్స్ పై ఎస్బీఐ గుడ్ న్యూస్
ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలని.. లేకపోతే ఛార్జీల మోత మోగిస్తామని ఎస్బీఐ అంతకమునుపు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఛార్జీల బాదుడు ప్రక్రియను కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే ఏ బ్యాంకు అకౌంట్లకు ఎంత ఛార్జీవేస్తారో? మా అకౌంట్ల పరిస్థితేమిటి? అని ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనలపై ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం స్పందించింది. కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు పేర్కొంది. స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ అకౌంట్లు లేదా ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన పరిమితి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. అంతేకాక, కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకులను ఎస్బీఐ ఇటీవలే తనలో విలీనం చేసుకుంది. బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు వేస్తామని తెలిపింది. ఈ ప్రభావం పెన్షనర్లు, విద్యార్థులతో కలుపుకుని మొత్తం 31 కోట్ల మంది డిపాజిట్ దారులపై ప్రభావం చూపనుందని తెలిసింది. Account holders of the following types of accounts are exempt from requiring to maintain an average monthly balance: pic.twitter.com/61U8QNu7xR — State Bank of India (@TheOfficialSBI) April 11, 2017 -
ఎస్బీఐ ఛార్జీల బాదుడు నేటినుంచే..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఛార్జీల బాదుడు కార్యక్రమం నేటినుంచే ప్రారంభించబోతుంది.. కనీస బ్యాలెన్స్ ఉంచని పక్షంలో జరిమానాలు, నిర్దేశించిన మొత్తం కంటే నగదు లావాదేవీలు జరిపితే ఛార్జీల బాదుడు కార్యక్రమాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించబోతున్నట్టు ఎస్బీఐ అంతకముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఛార్జీల బాదుడుపై ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చిన్నప్పటికీ, ఎస్బీఐ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎస్బీఐ అమలు చేయబోతున్న ఛార్జీల బాదుడుకు మొత్తం 31 కోట్ల డిపాజిట్ దారులు ప్రభావితం కానున్నారని తెలుస్తోంది. దీనిలో పెన్షనర్లు, విద్యార్థులు కూడా ఉన్నారు. ఎస్బీఐ తన ఐదు అనుబంధ బ్యాంకులు విలీనమవుతున్న తరుణంలో ఈ బాదుడు కార్యక్రమాన్ని బ్యాంకు ప్రారంభించబోతుంది. కనీస బ్యాలెన్స్ కింద మెట్రో బ్రాంచు ఖాతాదారులు తమ అకౌంట్లో కచ్చితంగా నెలకు రూ.5000 ఉంచుకోవాల్సిందే. లేదంటే 50 రూపాయల నుంచి 100 రూపాయల పెనాల్టీని భరించాల్సి ఉంటుంది. అలాగే అర్బన్, సెమీ-అర్బన్ బ్రాంచు ఖాతాదారులైతే కనీసం తమ బ్యాంకు బ్యాలెన్స్ రూ.3000, రూ.2000 ఉంచుకోవాల్సిందే. దీన్ని కనుక ఖాతాదారులు ఉల్లంఘిస్తే వీరికి కూడా రూ.20 నుంచి రూ.50 వరకు జరిమానా పడుతుందని బ్యాంకు అంతకమున్నుపే హెచ్చరించింది. సమీక్షించిన ఛార్జీల అనంతరం ఏటీఎం విత్ డ్రాయల్స్ పై కూడా 20 రూపాయల వరకు మోత మోగించనున్నారు. ఎస్బీఐ ఏటీఎంలలో కూడా ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు డ్రా చేస్తే రూ.10 ఛార్జీని బ్యాంకు విధించనుంది. రూ.25వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండి సొంత ఏటీఎంలలో డ్రా చేసుకుంటే ఎలాంటి విత్ డ్రా ఛార్జీలుండవు. అలాగే ఇతర బ్యాంకు ఏటీఎంలలో డ్రా చేసుకుంటూ ఛార్జీల మోత నుంచి తప్పించుకోవాలంటే బ్యాంకు బ్యాలెన్స్ రూ.లక్షకు మించి ఉంచుకోవాలని బ్యాంకు సూచించింది. అయితే ఈ ఛార్జీల మోతను తమపై ఉన్న జన్ ధన్ అకౌంట్ల భారాన్ని తగ్గించుకోవడానికేనని ఎస్బీఐ సమర్ధించుకుంటోంది. అంతకముందు కూడా తాము ఈ పెనాల్టీలు వేశామని బ్యాంకు చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెబుతున్నారు. 2012లో వీటిని విత్ డ్రా చేసినట్టు తెలిపారు.