ఎస్‌బీఐ కొత్త నిబంధనలు, అక్టోబరు 1 నుంచి | SBI update: New service charges to be rolled out on October 1 | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ కొత్త నిబంధనలు, అక్టోబరు 1 నుంచి

Published Fri, Sep 13 2019 1:17 PM | Last Updated on Fri, Sep 13 2019 2:18 PM

SBI update: New service charges to be rolled out on October 1 - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగబ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఖాతాల్లో మినిమం బాలెన్స్‌కు సంబంధించి పరిమితిపై ఊరటనిచ్చినా, సర్వీసు చార్జీలు బాదుడు మాత్రం వినియోగదారులకు తప్పదు. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని బ్రాంచుల్లో ఖాతాదారులు నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ.3,000 ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం రూ.5వేలు ఉన్న పరిమితిని రూ.2వేలకు తగ్గిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. సెమీ అర్బన్‌ ఖాతాల్లో రూ. 2వేలు కనీస నిల్వ ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాల విషయానికి వస్తే ఈ పరిమితిని వెయ్యి రూపాయలుగా ఉంచింది. 

బ్యాంక్ ఖాతాలో నెలవారీ మినిమమ్ బ్యాలెన్స్ రూ.3000 ఉండకపోతే వినియోగదారుడికి వడ్డన తప్పదు. ఉదాహరణకు రూ.3 వేల పరిమితి గల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ 50 శాతం తగ్గితే అంటే  రూ.1500 ఉంటే అప్పుడు రూ.10. అదే అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ 50-75 శాతం (రూ.750) కన్నా తక్కువగా ఉంటేరూ.12. 75 శాతానికి పైగా తగ్గితే రూ.15 పెనాల్టీ చెల్లించాలి. దీనికి అదనంగా జీస్‌టీ కూడా చెల్లించాలి.  ఈ పెనాల్టీ శాతం అన్ని  ఖాతాలకు వర్తిస్తుంది. 

మినిమం బాలెన్స్‌ పరిమితి  రూ. 2  వేలు  ఉన్న ఖాతాల్లో  కనీస నిల్వ తగ్గితే  పెనాల్టీ ఇలా
50శాతం తగ్గితే రూ. 7.50 ప్లస్‌ జీఎస్‌టీ
50-75 శాతం తగ్గితే రూ. 10 ప్లస్‌ జీఎస్‌టీ
75శాతానికిపైన  తగ్గితే రూ. 12 ప్లస్‌ జీఎస్‌టీ

మినిమం బాలెన్స్‌  పరిమితి వెయ్యి రూపాయలు న్న ఖాతాల్లో  కనీస నిల్వ తగ్గితే   పెనాల్టీ ఇలా
50 శాతం తగ్గితే రూ. 5 ప్లస్‌ జీఎస్‌టీ
50-75 శాతం తగ్గితే రూ. 7.50 ప్లస్‌ జీఎస్‌టీ
75 శాతానికి పైన  తగ్గితే రూ. 10 ప్లస్‌ జీఎస్‌టీ

డిపాజిట్లు, విత్‌డ్రాలు
కొత్త నిబంధనల ప్రకారం సేవింగ్‌ ఖాతాలో నెలకు బ్యాంకుల్లో నేరుగా నగదు డిపాజిట్ కేవలం మూడుసార్లు మాత్రమే చేయాలి. ఆ తర్వాత చేసిన ప్రతి సారీ ఛార్జీ తప్పదు. కనీస మొత్తం రూ.100లు డిపాజిట్  చేసినా  రూ. 50 ఛార్జ్  చెల్లించాల్సిందే. దీనికి జీఎస్‌టీ అదనం. అలాగే నాన్‌ హోం బ్రాంచిలలో నగదు డిపాజిట్లకు గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు. ఆపై డిపాజిట్లను స్వీకరించాలా లేదా అనేది ఆ బ్యాంకు మేనేజర్‌ నిర్ణయిస్తారు. నెలకు సగటున 25వేల రూపాయల బాలెన్స్‌ ఉంచే ఖాతాదారుడు నెలకు  రెండు సార్లు ఉచితంగా నగదు డ్రా చేసుకునే అవకాశం. అదే రూ. 25-50 వేలు అయితే 10 సార్లు ఉచితం.  రూ. 50- లక్ష మధ్య అయితే 15 సార్లు ఉచితం  ఈ పరిమితి మించితే రూ.50 ప్లస్‌ జీఎస్‌టీ వసూలు చేస్తారు. నెలకు సగటున లక్ష రూపాయలకు పైన ఖాతాలో ఉంచితే ఈ సదుపాయం పూర్తిగా ఉచితం. 

ఏటీఎం లావాదేవీల సంఖ్య పెంపు
నగరాల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ సంఖ్య పెరగనుంది. మెట్రో నగరాల్లో ఈ ట్రాన్సాక్షన్ల సంఖ్య నెలకు 10కి పెరగనున్నాయి. నాన్ మెట్రో ప్రాంతాల్లో ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎస్బీఐ ఏటీఎంలలో 12 లావాదేవీలు నిర్వహించవచ్చు.  ఇతర బ్యాంకుల ఏటీఎం కార్డులకు 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఉచితం. ఇక, ఏదైనా కారణాలతో చెక్ బౌన్స్ అయితే జీఎస్టీతో కలుపుకొని రూ.168 చెల్లించాలి.  ఖాతాలో రూ.25 వేలు అంతకంటే ఎక్కువ నగదు ఉంచే  ఖాతాదారులకు అపరిమిత ఏటీఎం సేవలు అందనున్నాయి. అలాగే వేతనాలు పొందే ఖాదాదారులకు కూడా అన్‌లిమిటెడ్ ఏటీఎం సేవలు. పూర్తి వివరాలు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement