ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు తన ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ ను అందించింది. మినిమం బ్యాలన్స్ విషయంలో యాక్సిస్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ల మినిమం బ్యాలన్స్ ను యాక్సిస్ బ్యాంకు పెంచింది. పలు కేటగిరీల్లోనీ సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబధించి మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను మార్పు చేసినట్లు తెలుస్తోంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఈజీ సేవింగ్స్ అకౌంట్ లేదా అలాంటి అకౌంట్స్ ఉన్నవారు ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ రూ.12,000 మెయింటైన్ చేయాలి. గతంలో ఈ బ్యాలెన్స్ రూ.10,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు రూ.2,000కు పెరిగింది. ఈ నిర్ణయం అన్ని డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఈజీ అకౌంట్, డిజిటల్, సేవింగ్స్ SBEZY, స్మార్ట్ ప్రివిలేజ్ లాంటి అకౌంట్స్కు వర్తించనుంది.
ఇక సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వుండనుంది. ఆయా ఖాతాదారులు బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీల మోత మోగనుంది. ఇప్పటికే పలు బ్యాంకులు మినిమం బ్యాలన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఖాతాదారులపై ఫైన్ వసూలు చేస్తున్నాయి.
యాక్సిస్ బ్యాంక్ నగదు లావాదేవీ పరిమితిపై కూడా నిబంధనలను సవరించింది. ఉచిత నగదు లావాదేవీల పరిమితిని తగ్గించింది. ఉచిత నగదు లావాదేవీల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు తగ్గించబడింది. ఈ నిబంధనల మార్పు ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment