![Axis Bank Launches New Paid Saving Account With No Charges For Services - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/30/axisbank.jpg.webp?itok=6Qcnyc3n)
ముంబై: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. పరిశ్రమలో వినూత్నంగా సబ్‌స్క్రిప్షన్ (చందా) ఆధారిత సేవింగ్స్ అకౌంట్‌ను తీసుకొచ్చింది. ఈ ఖాతాలో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. చాలా రకాల సేవలకు విడిగా ఎలాంటి చార్జీలు పడవు. కాకపోతే ప్రతి నెలా చందా కింద రూ.150 చెల్లించుకోవాలి. లేదంటే ఏడాదికోసారి అయితే రూ.1,650 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ అకౌంట్’ అని పేరు పెట్టింది.
మెజారిటీ బ్యాంక్‌లు సేవింగ్స్ ఖాతాలను కనీస బ్యాలన్స్‌తో అందిస్తున్నాయి. ఇది ప్రాంతాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య ఉంది. ఈ కనీస బ్యాలన్స్ తగ్గిపోతే పెనాల్టీ రూపంలో బ్యాంక్‌లు చార్జీలు బాదుతుంటాయి.
చందా విధానంలో ఖాతాలో కనీస బ్యాలన్స్ అవసరం లేదని, దేశీయ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు లేవని, ఉచిత డెబిట్ కార్డులను అందిస్తున్నట్టు, ఎన్ని సార్లు అయినా ఉచితంగా వినియోగించుకోవచ్చని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment