saving account
-
ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా
DCB Rates Hike డీసీబీ బ్యాంకు తన ఖాతాదారులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచి వారికి పండగ బొనాంజా అందించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన వడ్డీరేట్లు ఈ రోజు (సెప్టెంబరు 27) నుంచే అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అలాగే సేవింగ్స్ ఖాతాలో ఉన్న నిల్వ ఆధారంగా డీసీబీ కస్టమర్లకు గరిష్టంగా 8.00 శాతం వడ్డీ లభించనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ట వడ్డీరేటు 7.90 శాతంగా ఉంచింది. సేవింగ్స్ ఖాతాల నిల్వపై వడ్డీ రేట్లు ఒక లక్ష వరకు ఉన్న పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 1.75శాతం, 5 లక్షల లోపు నిల్వలపై 3.00 శాతం వడ్డీ అందిస్తుంది. 5 - 10 లక్షల లోపు , 10 లక్షల నుండి 2 కోట్ల లోపు ఖాతాలకు వరుసగా 5.25శాతం, 8.00శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే . రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 5.50శాతం రూ. 10 కోట్ల లోపు నిల్వ ఉన్న ఖాతాలకు 7.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది. (UP Scorpio Accident Death: ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు, కంపెనీ క్లారిటీ ఇది) బ్యాంక్ FDలపై చెల్లించే రేట్లు 7- 45 రోజుల డిపాజిట్లపై 3.75శాతం , ఏడాదిలోపు డిపాజట్లపై 7.15శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. 12 నెలల 1 రోజు నుండి 12 నెలల 10 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 7.75శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. 38 నెలల నుండి 61 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న వాటికి 7.40శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు అన్ని పదవీకాలానికి ప్రామాణిక రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు అందిస్తోంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్!
ముంబై: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. పరిశ్రమలో వినూత్నంగా సబ్స్క్రిప్షన్ (చందా) ఆధారిత సేవింగ్స్ అకౌంట్‌ను తీసుకొచ్చింది. ఈ ఖాతాలో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. చాలా రకాల సేవలకు విడిగా ఎలాంటి చార్జీలు పడవు. కాకపోతే ప్రతి నెలా చందా కింద రూ.150 చెల్లించుకోవాలి. లేదంటే ఏడాదికోసారి అయితే రూ.1,650 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ అకౌంట్’ అని పేరు పెట్టింది. మెజారిటీ బ్యాంక్‌లు సేవింగ్స్ ఖాతాలను కనీస బ్యాలన్స్తో అందిస్తున్నాయి. ఇది ప్రాంతాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య ఉంది. ఈ కనీస బ్యాలన్స్ తగ్గిపోతే పెనాల్టీ రూపంలో బ్యాంక్‌లు చార్జీలు బాదుతుంటాయి. చందా విధానంలో ఖాతాలో కనీస బ్యాలన్స్ అవసరం లేదని, దేశీయ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు లేవని, ఉచిత డెబిట్ కార్డులను అందిస్తున్నట్టు, ఎన్ని సార్లు అయినా ఉచితంగా వినియోగించుకోవచ్చని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఈ స్కీమ్ గడువు పెంపు!
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. 400 రోజుల స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలశ్ డిపాజిట్ పథకాన్నిఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ వాస్తవానికి 2023 జూన్ 30తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఖాతాదారుల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ స్కీమ్‌ను జూన్ 30 వరకు అందుబాటులో ఉంచినట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎస్బీఐ కస్టమర్లు ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌పై లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. -
Amrit Kalash : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలశ్ డిపాజిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. 400 రోజుల గడువు కలిగిన ఈ ప్లాన్ వాస్తవానికి 2023 మార్చి 31తో ఈ స్కీమ్ గడువు ముగియాల్సి ఉంది. అయితే ఖాతాదారుల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ స్కీమ్‌ను జూన్ 30 వరకు అందుబాటులో ఉంచినట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎస్బీఐ కస్టమర్లు ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌పై లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. -
సేవింగ్స్ అకౌంట్లపై బ్యాంకులు వడ్డీ జమ చేస్తాయని మీకు తెలుసా?
2022 ఏప్రిల్ 1 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు .. ఆ తర్వాత 2023 మార్చి 31 వరకు మీ బ్యాంకు ఖాతాలను ముందుగా అప్డేట్ చేయించండి. అన్ని బ్యాంకుల్లో మీకున్న అన్ని అకౌంట్లు, అలాగే మీకున్న జాయింట్ బ్యాంకు ఖాతాలు, మీరు .. మీ కుటుంబ సభ్యులు.. రెసిడెంటు కావచ్చు లేదా నాన్ రెసిడెంటు కావచ్చు .. అందరివి అన్ని ఖాతాలను అప్డేట్ చేసి విశ్లేషణ మొదలుపెట్టండి. ముందు జమలను పరిశీలించండి. ప్రతి జమకి వివరాలు వేరే లాంగ్ నోట్‌బుక్‌లో రాయండి. మీ సేవింగ్స్ అకౌంటు ఖాతాలో బ్యాంకులు సాధారణంగా మూడు నెలలకోసారి..లేదా కొన్ని బ్యాంకులు ఆరు నెలలకోసారి వడ్డీని జమ చేస్తుంటాయి. అలాంటి పద్దుల్ని గుర్తించి అవన్నీ ఒక చోట రాయండి. సాధారణంగా ఎక్కువ మంది ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. సినిమా పరిభాషలో చెప్పాలంటే ’లైట్’గా తీసుకోకండి. ఇక మిగిలినవి మీరు నిర్వహించిన జమలు. వీటిలో .. 1. నగదు జమలు: ఈ డిపాజిట్లు ఎందుకు చేశారో తెలుసుకోండి. మొదట్లో డ్రా చేయగా, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినవా? లేదా అద్దెనా? పారితోషికమా? ఆదాయమా? అప్పుగా వచ్చినదా? ఎవరిచ్చారు? కుటుంబ సభ్యులా? ఇతరులా? దేని నిమిత్తం ఇచ్చారు? వందలు అయితే ఫర్వాలేదు. ఏదో కథ చెప్పొచ్చు. వేలల్లో ఉంటే సంతృప్తికరమైన జవాబు ఇవ్వండి. అమ్మకాలా? ట్యూషన్ ఫీజులా? ఆదాయమే కాదా? తగిన జాగ్రత్త వహించాలి. 2. నగదు కాని జమలు: ఇవి చెక్కులు, డీడీలు, పే ఆర్డర్లు, ఫోన్‌పే, గూగుల్‌పే, బదిలీలు కావచ్చు. మీరే ఒక అకౌంటు నుండి మరో అకౌంటుకు బదిలీ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. విదేశాల నుండి మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. మీ నికర జీతం కావచ్చు.. ఇంటద్దె కావచ్చు .. వడ్డీ కావచ్చు.. వ్యవసాయం మీద ఆదాయం కావచ్చు .. జీవిత బీమా .. ఎన్ఎస్సీల మెచ్యూరిటీ మొత్తం కావచ్చు. బ్యాంకు లోన్ కావచ్చు.. అప్పు ఇచ్చి ఉండవచ్చు.. లేదా గతంలో మీరు ఇచ్చిన అప్పును వారు వెనక్కి ఇచ్చి ఉండవచ్చు. అలాగే మీ ఆదాయం కావచ్చు .. ఏదైనా స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన బాపతు కావచ్చు. ఇందులో మళ్లీ అడ్వాన్సు ఉండొచ్చు.. వాయిదాలు .. ఫైనల్ సెటిల్మెంట్ ఉండొచ్చు. సేల్స్ కావచ్చు .. ఫీజులు కావచ్చు టీడీఎస్ పోనూ మిగిలిన మొత్తమే జమవుతుంది. అప్పుడు టీడీఎస్‌తో కలిపి లెక్కలోకి తీసుకోవాలి. ఇలా ప్రతి జమని విశ్లేషించండి. ప్రత్యేకంగా ఆదాయాలు ఒక పక్కన రాయండి. ఆదాయాలు కానివి మరో పక్కన వివరంగా రాయండి. ఇక చెప్పేదేముంది. మీ ముందే ఉంది చిట్టా. పరీక్షించండి. పరికించి చూడండి ప్రతీ జమని. -
సేవింగ్ అకౌంట్‌తో డబ్బులు సంపాదించండిలా
మీరు డబ్బులు ఎక్కడ దాస్తుంటారు. సేవింగ్స్ అకౌంట్‌లోనా? అయితే మీ సేవింగ్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో వడ్డీని పొందవచ్చు. ఆ విషయం మీకు తెలుసా? మీ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంకు అధికారుల్ని సంప్రదించండి. నా సేవింగ్ అకౌంట్‌కు స్వీప్ - ఇన్ ఎఫ్డీ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయమని అడగండి. అలా అడిగితే ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వినియోగదారులకు అందించే వడ్డీ.. మీ సేవింగ్ అకౌంట్లో ఉన్న మనీకి అందిస్తారు. కానీ ఈ మొత్తం ఆయా బ్యాంకులు విధించిన నిబంధనలకు లోబడి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ అకౌంట్‌ను నుంచి డబ్బులు తీయాలని అనుకుంటున్న ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ ఆకౌంట్ వినియోగిస్తున్నప్పుడు సేవింగ్ అకౌంట్గాను, వినియోగించకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌గా పనిచేస్తుంది. షార్ట్ టర్మ్‌లో డబ్బులపై వడ్డీ పొందాలంటే ఇదే మంచి ఆప్షన్ అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ స్వీప్-ఇన్ స్వీప్ ఇన్ లేదా ఆటో స్వీప్ సదుపాయం అనేది సేవింగ్ అకౌంట్లో బ్యాంకు అధికారులు నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండాలి. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వన్ ఇయర్ టెన్యూర్ కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజిట్‌గా బదిలీ చేసుకోవచ్చు. ఆ మొత్తానికే మీరు ఇంట్రస్ట్‌ను పొందవచ్చు. స్వీప్ ఆప్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే? సేవింగ్ అకౌంట్‌పై ఉన్న మొత్తానికి ఇంటస్ట్ర్ పొందడంతో పాటు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. స్వీప్ ఇన్ ఫెసిలిటీ ఎలా పని చేస్తుంది? కొన్ని బ్యాంకులు సేవింగ్ అకౌంట్‌ను .. ఫిక్స్డ్ డిపాజిట్‌కి లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు మీరు నిర్వహించే లావాదేవీల ఆధారంగా ఆ సదుపాయాన్ని అందిస్తాయి. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా వడ్డీని అందిస్తాయి. కానీ అది చాలా తక్కువ మొత్తంలో ఉండనున్నాయి. ఈ స్వీప్- ఇన్ ఆప్షన్ పొందాలి అంటే బ్యాంకు అధికారుల వద్ద పూర్తి సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది. స్వీప్-ఇన్ అకౌంట్ అర్హతలు అవును, మీరు కనీసం రూ.25వేలతో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. దీనిలో నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన కనీస బ్యాలెన్స్ రూ. 25, 000 - రూ.1, 00, 000. డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త!
ఇండియా పోస్ట్ తన పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త అందించింది. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది. ఇండియా పోస్ట్ తీసుకోచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవ శాఖలో ఒక రోజులో రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకుముందు విత్ డ్రా లిమిట్ రూ.5,000గా ఉండేది. ఇండియా పోస్ట్ తన కొత్త మార్గదర్శకాలలో పేర్కొన్న ప్రకారం ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం) ఒక రోజులో ఒక ఖాతాలో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ గా స్వీకరించరాదని పేర్కొంది. అంటే ఒక ఖాతా ద్వారా రూ.50,000 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు ఒక రోజులో చేయలేము. పీపీఎఫ్, కెవిపీ, ఎన్ఎస్ సీ కొత్త రూల్స్ ఇండియా పోస్ట్ యొక్క కొత్త నిబంధనల ప్రకారం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్ సీఎస్ఎస్), మంత్లీ ఇన్ కమ్ స్కీం (ఎంఐఎస్), కిసాన్ వికాస్ పాత్రా(కెవిపి), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్ సీ) స్కీంల కోసం డిపాజిట్ లేదా విత్ డ్రా చెక్కులు ద్వారా చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం: కనీస బ్యాలెన్స్ పోస్టాఫీసు పొదుపు పథకంపై 4% వడ్డీ లభిస్తుంది. తపాలా కార్యాలయ పొదుపు పథకం ఖాతాలో కనీసం రూ.500 బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. అయితే కనీస బ్యాలెన్స్ రూ.500 కంటే తక్కువగా ఉంటే ఖాతా నిర్వహణ చార్జీల కింద జరిమానాగా రూ.100 వసూలు చేస్తారు. పోస్టాఫీసు పొదుపు పథకాలు: వడ్డీ రేటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా: 4% ఏడాది వరకు టీడీ ఖాతా: 5.5% 2 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 5.5% 5 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 6.7% 5 ఏళ్ల ఆర్ డి: 5.8% సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం: 7.4% పీపీఎఫ్ పొదుపు పథకం: 7.1% కిసాన్ వికాస్ పాత్ర: 6.9% సుకన్య సమృద్ధి ఖాతాదారులకు: 7.6% -
దూసుకొస్తున్న క్రిప్టో కరెన్సీ బ్యాంక్
సాక్షి, ముంబై: ఇటీవలి క్రిప్టోకరెన్సీకి ఆదరణపెరుగుతున్న నేపథ్యంలో యూకేకు చెందిన క్రిప్టో బ్యాంక్ కాషా భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. కాషా, యునైటెడ్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల జాయింట్ వెంచర్ అయిన క్రిప్టో బ్యాంక్ యునికాస్ ఆగస్టు15 నాటికి దేశంలో కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ బ్యాంకుగా అవతరించనున్నామని యూనికాస్ వెల్లడించింది. ఇతర బ్యాంకుల మాదిరిగానే క్రిప్టో బ్యాంక్ పొదుపు, రుణ, వాణిజ్య సేవలను అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన వెంటనే, బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలలో ఎఫ్డీలను,ఆర్డీలను ప్రారంభించాలని భావిస్తోంది. క్రిప్టో ఎఫ్డీకి నిర్దిష్ట మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. అదేవిధంగా, ఇతర బ్యాంకుల ఆర్డీ మాదిరిగానే చిన్న పెట్టుబడిదారులు చిన్న మొత్తంలో రోజువారీ పెట్టుబడి పెట్టడానికి యూనికాస్ అనుమతించాలని యోచిస్తోంది. రిటైల్ పెట్టుబడిదారులు, వ్యాపారులను ఆకర్షించడమే లక్ష్యమనీ, రీటైల్ పెట్టుబడిదారులు తమ భవిష్యత్ అవసరాల నిమితం పెట్టుబడిపెట్టేలా ప్రోత్సహిస్తామని యునికాస్ మేనేజింగ్ పార్టనర్, సీఈఓ దినేష్ కుక్రేజా చెప్పారు. ఎఫ్డిలతోపాటు ఆర్డీల మాదిరిగానే, చిన్నపెట్టుబడిదారులు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టొచ్చన్నారు. ప్రస్తుతం యునికాస్కు దేశంలో ఢిల్లీ, జైపూర్, గుజరాత్లో మూడు శాఖలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం రాజస్థాన్ లోని జైపూర్‌లో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను ప్రారంభించాలని భావిస్తున్నామని కుక్రేజా చెప్పారు. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ జెబ్‌పే, ఇప్పటికే ఎఫ్డీలను ఆఫర్ చేస్తోంది. ఇక్కడ క్రిప్టోకరెన్సీని 90 రోజుల వరకు డిపాజిట్ చేసి స్థిర వడ్డీని సంపాదించవచ్చు మరోవైపు యునికాస్ క్రిప్టో కరెన్సీ పొదుపు ఖాతాలపై సంవత్సరానికి 4 శాతం నుండి 9.67 శాతం దాకా వడ్డీ అందిస్తుంది. అంతేకాదు క్రిప్టో బ్యాంక్ ఫిజికల్ బ్రాంచెస్ ఉన్న నగరాల్లో తన ప్రీమియం కస్టమర్లకు డోర్-స్టెప్ సేవలను కూడా అందిస్తుంది. -
పిల్లల కోసం తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే మంచిదే
‘నగదు నిర్వహణ’ (మనీ మేనేజ్మెంట్/ఫైనాన్షియల్ మేనేజ్మెంట్)కు జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘మనీ’ పాఠాలను ఎంత ముందుగా నేర్చుకుంటే ఆర్థికంగా అంత మెరుగైన స్థానానికి బాటలు వేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న నాటి నుంచే డబ్బు విషయాలను తెలియజేస్తూ వెళితే భవిష్యత్తులో వారికి స్పష్టమైన బాట ఏర్పాటు చేసినవారవుతారని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా స్కూళ్లలో మనీ పాఠాలకు చోటుండదు. కనుక తల్లిదండ్రులే ఈ విషయంలో చొరవ చూపించాలి. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్ మనీ ఇస్తుంటారు. కొందరు అయితే పిగ్గీ బ్యాంకు (డిబ్బీ) ఇచ్చి అందులో పొదుపు దిశగా ప్రోత్సహిస్తుంటారు. ప్రేమతో ఇలా ఇచ్చే డబ్బును పిల్లల పేరిట బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను ప్రారంభించి.. అందులోకి మళ్లించడం మంచి ఆలోచన అవుతుంది. పిల్లలకు బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ప్రారంభించడం వల్ల వారి కంటూ తల్లిదండ్రులు ఓ ఆదాయ వనరును సమకూర్చినవారు అవుతారు. దీనివల్ల బ్యాంకు ఖాతా అవసరం, ప్రయోజనాలను చిన్నారులు తెలుసుకుంటారు. సంపాదన వయసుకు వచ్చే నాటికి బ్యాంకింగ్ లావాదేవీలపై వారికి చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చిన్నప్పుడే బ్యాంకు లావాదేవీలకు సన్నిహితంగా మెలగడం వారిపై ఆర్థికంగా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణుల విశ్లేషణ. పిగ్గీ బ్యాంకులో ఎంత వేస్తే అంతే ఉంటుంది. కానీ, బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తంపై ఎంతో కొంత వడ్డీ జమ అవుతూ, కాంపౌండింగ్‌తో మరింత వృద్ధి చెందుతుంది. అందుకే పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని బ్యాంకు పొదుపు ఖాతాలో పొదుపు చేసుకునే దిశగా పిల్లలను ప్రోత్సహించాలి. అసలు.. వడ్డీ.. వడ్డీపై వడ్డీ అంతా కలసి.. మైనర్లు కాస్తా మేజర్లు అయ్యే నాటికి కొద్ది మొత్తమే మంచి నిధిగా మారుతుంది. పిల్లలు దీన్ని బాగా అర్థం చేసుకుంటే, వారి భవిష్యత్తుకు ప్రయోజనం. అర్హతలు పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బ్యాంకులో ఖాతాను ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంది. పిల్లలకు ఎంత వయసు ఉండాలి? అన్న సందేహం అక్కర్లేదు. రోజుల వయసు ఉన్నా కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. చాలా బ్యాంకుల్లో మైనర్ ఖాతా గరిష్ట వయసు 18 ఏళ్లుగా అమలవుతోంది. 18 ఏళ్లు నిండిన తర్వాత మైనర్ ఖాతాను పూర్తి స్థాయి సాధారణ ఖాతాగా మార్చేందుకు అర్హత లభిస్తుంది. కాకపోతే ఆ సమయంలో పూర్తి స్థాయి కేవైసీ వివరాలను సమరి్పంచాలి. వార్షిక వడ్డీ ఆదాయం సంగతి... మైనర్ ఖాతాలకు సంబంధించి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం పన్ను. పిల్లల పేరిట బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికే కలిపి చూపించుకోవాల్సి ఉంటుంది. పలు రకాల ఖాతాలు.. తల్లి లేదా తండ్రి ఉమ్మడి ఖాతాదారుగా జాయింట్ అకౌంట్‌ను ప్రారంభించుకునేందుకు వీలుంది. లేదా చిన్నారి పేరు మీదే ఖాతాను తెరవొచ్చు. ఎస్బీఐ ‘పెహ్లాకదమ్’, ఐసీఐసీఐ బ్యాంకు ‘యంగ్ స్టార్స్ సేవింగ్స్ అకౌంట్’లకు కచ్చితంగా తల్లిదండ్రులు జాయింట్ అకౌంట్ హోల్డర్‌గా ఉండాలన్న నిబంధన అమల్లో ఉంది. మరి కేవలం చిన్నారి పేరుతోనే ఖాతా తెరవాలనుకుంటే ఎస్బీఐలో పెహ్లీఉడాన్ అనే పథకం ఉంది. కాకపోతే 15-18 ఏళ్ల వయసు వారికే ఇది పరిమితం. అదే పదేళ్లు దాటిన చిన్నారులకు ప్రత్యేకమైన ఖాతా తెరవాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు ‘స్మార్ట్స్టార్ సేవింగ్స్ అకౌంట్’ పథకం అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంకు ‘ఫ్యూచర్ స్టార్స్ సేవింగ్స్ అకౌంట్’లో అయితే పిల్లలకు పదేళ్లు వచ్చే వరకు వారి తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులే లావాదేవీలు నిర్వహించేందుకు వీలుంటుంది. ఒకవేళ చిన్నారుల పేరిట ఖాతాను ప్రారంభించేట్టు అయితే.. అదే బ్యాంకు శాఖలో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సైతం ఖాతా ఉండాలని చాలా బ్యాంకులు కోరుతున్నాయి. వడ్డీ రేట్లు/ చార్జీలు చాలా బ్యాంకులు సాధారణ సేవింగ్స్ ఖాతాల మాదిరే వడ్డీ రేటును మైనర్ ఖాతాలకూ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల పరిధిలో 2.7 శాతం నుంచి 7 శాతం మధ్యలో ఉన్నాయి. కాకపోతే పిల్లల పేరిట తెరిచే ఖాతా విషయంలో వడ్డీ రేటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖాతాకు ఉన్న సదుపాయాలు, సౌకర్యాలనే ప్రధానంగా చూడాలి. ప్రారంభ డిపాజిట్ ఎంత చేయాలి?, కనీస నెలవారీ బ్యాలన్స్ నిర్వహించలేకపోతే విధించే చార్జీలు ఎలా ఉంటాయి?, నగదు ఉపసంహరణకు పరిమితులు? ఇతరత్రా నియమ నిబంధనలను ప్రధానంగా చూడాలి. ఉదాహరణకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో మైనర్ సేవింగ్స్ ఖాతా ప్రారంభానికి రూ.25,000 ఉండాలి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే ‘కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్’లో మైనర్లు నెలవారీ కనీసం రూ.5,000ను బ్యాలన్స్‌గా నిర్వహించాలని కోరుతోంది. రూ.5,000 నిర్వహణలో విఫలమైతే తిరిగి కనీస బ్యాలన్స్ ఖాతాలో చేరే వరకు రూ.150–300 మధ్య చార్జీలను అమలు చేస్తోంది. అదే ఎస్బీఐ ‘పెహ్లీ ఉడాన్’ ఖాతాలో ఎటువంటి బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. అంటే ఇది జీరో బ్యాలన్స్ అకౌంట్. గరిష్టంగా ఖాతాలో రూ.10లక్షల వరకు బ్యాలన్స్‌ను నిర్వహించుకోవచ్చు. సాధారణ ఖాతాలకు మాదిరే మైనర్ ఖాతాదారులూ చెక్కు బుక్, ఏటీఎం కార్డు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. ఉపసంహరణ పరిమితులు, తల్లిదండ్రుల ప్రమేయం అన్నది బ్యాంకుల మధ్య మార్పు చెందొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ‘కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్’ అయితే చిన్నారుల పేరిటే ఏటీఎం/డెబిట్ కార్డులను జారీ చేస్తారు. రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ.2,500గా ఉంది. వర్తకుల వద్ద ఒక్కరోజులో రూ.10,000కు మించి కార్డుతో చెల్లించడానికి అవకాశం లేదు. అదే ఎస్బీఐ అయితే పీవోఎస్ వద్ద రోజువారీ పరిమితిని రూ.5,000గానే అమలు చేస్తోంది. తల్లిదండ్రుల నియంత్రణలు చాలా బ్యాంకులు మైనర్ ఖాతాలకు సంబంధించి ఎటువంటి ఆంక్షల్లేకుండా ఏటీఎం/డెబిట్ కార్డుల సదుపాయాలను కలి్పస్తున్నాయి. కనుక కార్డుల దురి్వనియోగం రిస్క్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాంకులు మైనర్ ఖాతాల లావాదేవీలపై తల్లిదండ్రులు లేదా సంరక్షకుల మొబైల్ నంబర్లకు అలర్ట్ సందేశాలను పంపిస్తున్నాయి. అంతేకాదు, నెట్‌బ్యాంకింగ్ ద్వారా లావా దేవీలను పరిశీలించుకునేందుకు అనుమతిస్తున్నా యి. తమ పిల్లల కార్డు ల పరిమితులను ఎప్పటికప్పుడు మా ర్చుకునేందుకూ అవకాశం కల్పిస్తున్నాయి. సిటీ బ్యాంకు జూనియర్ అకౌంట్, ఏయూ స్మాల్ ఫైనాన్స్‌కు చెందిన ఏయూ కిడ్స్ అకౌంట్ ఇందుకు ఉదాహరణలు. పిల్లల చేతికే తాళాలు ఇవ్వడం నచ్చని తల్లిదండ్రులు ఖాతాల కంట్రోలింగ్‌ను తమ చేతుల్లోనే ఉంచుకునే సదుపాయం ఉంది. అదనపు ప్రయోజనాలు.. కొన్ని బ్యాంకులు మైనర్ ఖాతాలపై అదనపు ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐ ‘పెహ్లీ ఉడాన్’ పెహ్లాకదమ్’ ఖాతాలకు ఆటో స్వీప్ ఫిక్స్డ్ డిపాజిట్ (బ్యాలన్స్ కనీస పరిమితి మించిన సందర్భాల్లో అదనపు బ్యాలన్స్‌ను డిపాజిట్‌గా మార్చే ఆటో సదుపాయం) సదుపాయాన్ని అందిస్తోంది. రికరింగ్ డిపాజిట్‌పై స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ సదుపాయాన్ని కూడా కలి్పస్తోంది. వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని, ఎస్బీఐ లైఫ్ తరఫున మార్కెట్ లింక్డ్ ప్లాన్ ‘స్మార్ట్ స్కాలర్’ను ఆఫర్ చేస్తోంది. పెహ్లాకదమ్ ఖాతాలో అయితే ఎఫ్డీపై ఓడీ సదుపాయాన్ని తల్లిదండ్రులు/సంరక్షకులు తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంకు కిడ్స్ అడ్వాంటేజ్ ఖాతాదారులకు రూ.లక్ష విలువతో ఉచితంగా ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించినట్టయితే మైనర్ ఖాతాదారులకు బ్యాంకు రూ.లక్ష పరిహారంగా చెల్లిస్తుంది. చదవండి: రేషన్ కోసం ప్రత్యేక యాప్ లాంచ్ చేసిన కేంద్రం సామాన్యుల కోసం ఎల్ఐసీ సరికొత్త భీమా పాలసీ -
ఆ వడ్డీరేట్లకు ఐసీఐసీఐ బ్యాంకు కోత
ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత పెట్టింది. సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. దీంతో రూ.50 లక్షలు కన్నా తక్కువున్న డిపాజిట్లపై వడ్డీరేట్లు 3.5 శాతానికి దిగొచ్చాయి. రూ.50 లక్షలు , ఆపై ఉన్న డిపాజిట్లకు వడ్డీరేట్లను యథాతథంగా 4 శాతంగానే ఉంచినట్టు బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన ఈ వడ్డీరేట్లు నేటి నుంచి అంటే ఆగస్టు 19 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. తొలుత జూలై 31న ప్రభుత్వం రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి, 3.5 శాతానికి తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస బెట్టి బ్యాంకులన్నీ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీలను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకు, కర్నాటక బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి. గత రెండు రోజుల కిందట హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత పెట్టింది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. -
రూ.50తోనే సేవింగ్ ఖాతా
అనంతపురం రూరల్ : తపాలశాఖ పరిధిలోని పోస్టాఫీసుల్లో రూ.50తోనే సేవింగ్ ఖాతాతోపాటు ఏటీఎం కార్డును పొందొచ్చని తపాలశాఖ అదనపు సూపరింటెండెంట్ సంజీవ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్లుల్లో శుక్రవారం నుంచి ఖాతాలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా చెక్కుబుక్ సౌకర్యాన్ని సైతం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.