ఆ వడ్డీరేట్లకు ఐసీఐసీఐ బ్యాంకు కోత
ఆ వడ్డీరేట్లకు ఐసీఐసీఐ బ్యాంకు కోత
Published Sat, Aug 19 2017 2:50 PM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM
ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత పెట్టింది. సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. దీంతో రూ.50 లక్షలు కన్నా తక్కువున్న డిపాజిట్లపై వడ్డీరేట్లు 3.5 శాతానికి దిగొచ్చాయి. రూ.50 లక్షలు , ఆపై ఉన్న డిపాజిట్లకు వడ్డీరేట్లను యథాతథంగా 4 శాతంగానే ఉంచినట్టు బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన ఈ వడ్డీరేట్లు నేటి నుంచి అంటే ఆగస్టు 19 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి.
తొలుత జూలై 31న ప్రభుత్వం రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి, 3.5 శాతానికి తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస బెట్టి బ్యాంకులన్నీ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీలను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకు, కర్నాటక బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి. గత రెండు రోజుల కిందట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత పెట్టింది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
Advertisement
Advertisement