rate cut
-
ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?
ముంబై: కీలక వడ్డీ రేట్ల కోతను ఆర్బీఐ(RBI) ఈ వారంలో జరిగే సమీక్షతో షురూ చేయొచ్చని ప్రముఖ ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కొత్త ఆర్బీఐ గవర్నర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలిసారిగా ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య భేటీ కానుంది. ఈ సందర్భంగా రెపో రేటును (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించొచ్చని భావిస్తున్నారు.రెండేళ్లుగా కీలక రెపో, రివర్స్ రెపో (ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగిస్తోంది. కేంద్ర బడ్జెట్లో వినియోగానికి మద్దతుగా ఆదాయపన్ను విషయంలో పెద్ద ఎత్తున ఊరట కల్పించినందున, దీనికి కొనసాగింపుగా వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రణ పరిధి 6 శాతం లోపే ఉన్నందున రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉందని నిపుణులు అంటున్నారు. సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడు కనిష్టాల త్రైమాసిక స్థాయిలో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇదీ చదవండి: షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల జోరుఇవీ సానుకూలతలు..‘రేట్ల తగ్గింపునకు రెండు బలమైన కారణాలున్నాయి. ఆర్బీఐ ఇప్పటికే లిక్విడిటీ పెంచే చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇది రేట్ల కోత ముందస్తు సూచికగా ఉంది’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ తన అభిప్రాయాలు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో చర్యలకు మద్దతుగా రెపో రేటును తగ్గించొచ్చన్నారు. ‘కేంద్ర బడ్జెట్లో ద్రవ్యపరమైన ఉద్దీపనలు ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయని భావించడం లేదు. కనుక 2025 ఫిబ్రవరి సమీక్షలో రేట్ల కోతకు సానుకూలతలు ఉన్నాయి’ అని ఇక్రా రేటింగ్స్ రీసెర్చ్ హెడ్, చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ వారంలో రూపాయి విలువ మరింత బలహీనపడే అంతర్జాతీయ పరిణామాలు చోటుచేసుకుంటే రేట్ల కోత వాయిదా పడొచ్చన్నారు. -
రేటు తగ్గింపునకు తొందరలేదు..!
సింగపూర్: రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలలుగా పూ ర్తిగా అదుపులోనికి వచి్చనప్పటి కీ, రేటు తగ్గింపునకు తొందరపడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఈ దిశలో (రేటు తగ్గింపు) నిర్ణయానికి ఇంకా చాలా దూరం ఉందని ఆయన అన్నారు. సింగపూర్‌లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్ ఫోరమ్ 2024’లో దాస్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. → 2022లో గరిష్ట స్థాయి 7.8% వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 4% లక్ష్యం దిగువకు చేరింది. అయితే ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు (రేటు తగ్గింపు) తీసుకోడానికి ఇంకా చాలా దూరం ఉంది. మరోవైపు (సరళతర ద్రవ్య విధానాల వైపు) చూసే ప్రయత్నం చేయలేము. → ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం చాలా వరకు కష్ట నష్టాలను తట్టుకుని నిలబడుతున్నప్పటికీ, ద్రవ్యో ల్బణం చివరి మైలు లక్ష్య సాధన సవాలుగానే ఉందని పలుసార్లు నిరూపణ అయ్యింది. ద్రవ్యోల్బణం సవాళ్లు ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలకు దారితీస్తాయి. → ద్రవ్యోల్బణం కావచ్చు... ప్రతిద్రవ్యోల్బణం కావచ్చు. సమస్య తీవ్రమైనది. ఈ పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సడలించడంలో జాగ్రత్త అవసరం. కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన నిర్వహణలో వివేకం ఉండాలి. మరోవైపు సరఫరా వైపు ప్రభుత్వం చర్యలు చురుకుగా ఉండాలి. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నుండి సరళతర పాలసీ సంకేతాల నేపథ్యంలో రేటు తగ్గింపులకు సంబంధించి మార్కెట్ అంచనాలు ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే పాలసీల మార్పు విషయంలో అన్ని విషయాలను విస్తృత స్థాయిలో పరిగణనలోని తీసుకుంటూ, ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిని అనుసరించని సెంట్రల్ బ్యాంకులు– తమ దేశీయ ద్రవ్యోల్బణం–వృద్ధి సమతుల్యత అంశాలపై నిఘా ఉంచి తగిన పాలసీ ఎంపిక చేసుకోవాలి. భారత్ వృద్ధిలో వినియోగం, పెట్టుబడుల కీలక పాత్ర భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆయన వ్యాఖ్యానిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, ద్రవ్యోలోటు, కరెంటు అకౌంట్ లోటు వంటి అంతర్లీన పటిష్టతను ప్రతిబింబిస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ పురోగతిలో – ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని దాస్ విశ్లేíÙంచారు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ బయటకు వచి్చందని, 2021–24 మధ్య సగటు వాస్తవ జీడీపీ వృద్ధి 8 శాతం కంటే అధికంగా నమోదైందని గవర్నర్ పేర్కొన్నారు. ద్రవ్య పటిష్టతతోపాటు ప్రభుత్వ భారాలు తగ్గుతుండడం సానుకూల పరిణామమన్నారు. కార్పొరేట్ పనితీరు పటిష్టంగా కొనసాగుతున్నట్లు వివరించారు. ఆర్బీఐ నియంత్రించే బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు కూడా బలపడ్డాయని గవర్నర్ తెలిపారు. అన్ని స్థాయిల్లో ప్రపంచ దేశాల పరస్పర సహకారం ప్రపంచ పురోగతికి కీలకమని భారత్ భావిస్తున్నట్లు తెలిపారు. 2023లో భారత జీ20 ప్రెసిడెన్సీ, దాని తర్వాత ప్రపంచ దేశాలతో నిరంతర సహకార విధానాలను పరిశీలిస్తే, ఆయా అంశాలు ‘ప్రపంచం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే న్యూ ఢిల్లీ దృష్టిని ప్రతిబింబిస్తాయని దాస్ వివరించారు. పరస్పర సహకారంతోనే ప్రపంచ పురోగతి 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బహుళజాతి అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం, ఉత్పాదకత లాభాలను సాధించడం, మధ్య–ఆదాయ దేశాలకు రుణ పరిష్కారం వంటివి భారత్ ప్రాధాన్యతలలో కొన్నని గవర్నర్ ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచ అభివృద్ధి మెరుగుదల కోసం రాబోయే దశాబ్దాలలో ప్రపంచ క్రమాన్ని పునరి్నర్మించడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం మానవజాతి కోసం ఇందుకు సంబంధించి ’ఒక భవిష్యత్తు’ కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు ఇటీవలి నెలల్లో సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతోందని అన్నారు. ఈక్విటీ, బాండ్ ఈల్డ్ వంటి అంశాల్లో ఒడిదుడుకులు చాలా తక్కువగా ఉంటున్నాయని వివరించారు. అయితే స్టాక్ మార్కెట్లలో ధరల అసాధారణ పెరుగుదల ఒక అనూహ్య పరిణామమన్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ గవర్నెన్స్‌లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను అనుసంధానానికి, ఈ విషయంలో అసమతుల్యత పరిష్కారానికి సంస్కరణలు అవసరమని అన్నారు. ప్రపంచ ఆర్థిక భద్రతా వలయాన్ని (జీఎఫ్ఎస్ఎన్) బలోపేతం చేయడంపై కూడా సంస్కరణలు దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.బేస్ మాయతోనే ద్రవ్యోల్బణం తగ్గిందా? 2023 జూలై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ భారీగా (వరుసగా 7.44 శాతం, 6.83 శాతం) ఉన్నందునే 2024 జూలై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) కనబడుతున్నాయని కొందరు నిపుణుల చేస్తున్న వాదనను గవర్నర్ శక్తికాంతదాస్ శక్తికాంతదాస్ తాజా వ్యాఖ్యలు (రేటు తగ్గింపుపై) సమరి్థంచినట్లయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా (మైనస్ లేదా ప్లస్) 4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ కీలక ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానానికి ఈ సూచీనే ప్రాతిపదికగా ఉండడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు– రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని కూడా గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా రేటు తగ్గింపును (సరళతర వడ్డీరేట్ల విధానం) కోరుతున్న ప్రభుత్వం– రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్ల జారీ ప్రతిపాదనను సైతం ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్: రుణాలపై భారీగా తగ్గనున్న భారం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. ఇటీవలి కాలంలో రుణాలపై వడ్డీరేట్ల పెంపుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లను తగ్గించి భారీ ఊరటనిచ్చింది.మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని 85 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఫలితంగా ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన రుణ రేట్లు ఏప్రిల్ 10 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు తర్వాత బ్యాంకు ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 40 బేసిస్ పాయింట్లు తగ్గి 8.30 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.7 శాతానికి దిగొచ్చింది. మరోవైపు 1-3 ఏళ్ల కాలానికి చెందిన ఎంసీఎల్ఆర్ స్థిరంగా ఉంటాయని బ్యాంకు ప్రకటించింది. కాగా రివ్యూలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లనుయథాతథంగానే ఉంచిన సంగతి తెలిసిందే. (‘ఆడి చాయ్‌వాలా’ ఏమైంది భయ్యా? వైరల్ వీడియో) ఇదీ చదవండి: Lava Blaze-2: అదిరిపోయే ఫీచర్లు: పరిచయ ఆఫర్ చూస్తే ఫిదా! -
చమురు ధరలకు భారత్ చెక్!
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా మండుతున్న ముడిచమురు ధరలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు వీలుగా అత్యవసర వినియోగానికి పక్కనపెట్టే చమురు నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారళ్లను విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా యూఎస్, చైనా, జపాన్ బాటలో నడవనుంది. దేశ చరిత్రలోనే తొలిసారి కేంద్ర ప్రభుత్వం 3.8 కోట్ల బ్యారళ్ల(5.33 మిలియన్ టన్నులు) ముడిచమురును నిల్వ చేసింది. ఇందుకు తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో ఏర్పాటు చేసిన భూగర్భ బిలాలను వినియోగించుకుంది. వీటి నుంచి తాజాగా నిర్ణయించిన 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 1.33 మిలియన్ టన్నులు, కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నులు, పాడూర్‌లో 2.5 మిలియన్ టన్నులు చొప్పున చమురు స్టోరేజీలున్నాయి. కాగా.. దేశీయంగా రోజుకి 4.8 మిలియన్ బ్యారళ్ల చమురును వినియోగిస్తుండటం గమనార్హం! అమెరికా రెడీ ప్రపంచ ఇంధన ధరలు తగ్గేందుకు వీలుగా నిల్వల నుంచి చమురును విడుదల చేయవలసిందిగా గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో గత వారం యూఎస్ ప్రభుత్వం అభ్యర్థించింది. ఇందుకు ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు చైనా, ఇండియా, జపాన్ తదితరాలనుద్ధేశించి కలసికట్టుగా వ్యవహరించాలంటూ సూచించింది. చమురు ఉత్పత్తిని పెంచమంటూ పలుమార్లు చేసిన అభ్యర్థనలను పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్), తదితర దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో యూఎస్ వినియోగ దేశాలకు చమురు విడుదలకు సూచించింది. ఇందుకు మార్గదర్శకత్వాన్ని వహిస్తూ 50 మిలియన్ బ్యారళ్లను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బాటలో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వుల నుంచి 5 మిలియన్ బ్యారళ్ల విడుదలకు భారత్ సైతం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇతర ప్రధాన వినియోగ దేశాలతో చర్చల ద్వారా భారత్ ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వివరించాయి. చమురు వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో పెద్ద దేశంగా నిలుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా 72.7 కోట్ల బ్యారళ్ల చమురును నిల్వ చేయగా.. జపాన్ 17.5 కోట్ల బ్యారళ్ల చమురును రిజర్వులో ఉంచుతోంది. సహేతుకంగా లిక్విడ్ హైడ్రోకార్బన్ల ధరలు సహేతుకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మార్కెట్ శక్తులు ధరలను నిర్ణయించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. చమురు ఉత్పాదక దేశాలు డిమాండ్ కంటే తక్కువగా సరఫరాలను కృత్రిమంగా సర్దుబాటు చేయడంపై పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఇది ధరల పెంపునకు దారితీస్తున్నట్లు పేర్కొంది. అయితే చమురు విడుదల తేదీని వెల్లడించనప్పటికీ రానున్న 7–10 రోజుల్లోగా నిర్ణయానికి వీలున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మక రిజర్వుల నుంచి పైపులైన్లు కలిగిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్(ఎంఆర్‌పీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)కు చమురును విక్రయించనున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా ప్రకటన... వాషింగ్టన్: దేశ వ్యూహాత్మక రిజర్వుల నుంచి 5 కోట్ల బ్యారళ్ల చమురు విడుదలకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా నిర్ణయించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తద్వారా అమెరికన్ల ఇంధన వ్యయాలను తగ్గించనున్నట్లు తెలియజేసింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఇండియా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూకేలతో సంప్రదింపుల తదుపరి బైడెన్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడుతున్న సమయంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి ఇతర దేశాలతో బైడెన్ చర్చలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఈ అంశంపై కొద్ది వారాలుగా ఇతర దేశాలతో నిర్వహిస్తున్న చర్చలు వెల్లడవుతున్న నేపథ్యంలో ధరలు 10% దిగివచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేసింది. ఇటీవల గ్యాస్ ధరలు గ్యాలన్‌కు 3.4 డాలర్లను తాకినట్లు పేర్కొంది. ఇది ఏడాదిక్రితం ధరలతో పోలిస్తే 50% అధికమని తెలియజేసింది. ధరలు దిగివస్తాయ్.. ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు యూఎస్, చైనా, భారత్ తదితరాలు చేతులు కలపడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాల్లో కోతలకు వ్యతిరేకంగా యూఎస్, భారత్ అత్యవసర నిల్వల నుంచి చమురును దేశ వ్యవస్థలలోకి విడుదల చేయనుండటంతో ధరలకు కొంతమేర చెక్ పడే వీలున్నట్లు తెలియజేశాయి. చమురు సరఫరాలు పెరిగితే.. దిగుమతులను తగ్గించుకోవలసి ఉంటుంది. దీంతో ముడిచమురుకు తాత్కాలికంగా డిమాండ్ తగ్గనుంది. వెరసి ధరలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు కోవిడ్–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడం పలు దేశాలలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు యూఎస్ ప్రభుత్వం తాజాగా వ్యాఖ్యానించింది. డిమాండుకు తగిన రీతిలో సరఫరాలను పెంచమంటూ చమురు ఉత్పత్తి, ఎగుమతి(ఒపెక్) దేశాలను అభ్యర్థించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇంధన వినియోగ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు ఏకంకావడంతో ధరలు బలహీనపడే అవకాశమున్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
భారత్ ఎకానమీకి వెలుగు రేఖలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొంత ఆశావహమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రితం క్షీణ రేటు అంచనాల తగ్గింపు వరుసలో తాజాగా మూడీస్ నిలిచింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం మైనస్ 10.6 శాతానికి తగ్గించింది. తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ఉద్దీపన చర్యలు దోహదపడతాయని సూచించింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడీస్ క్షీణ రేటు కుదింపునకు తగిన విశ్లేషణలతో ముందుకు వచ్చింది. 2020లోసైతం క్షీణ రేటు అంచనాలను మూడీస్ ఇంతక్రితం మైనస్ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ధ్యేయంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్) 3.0 పేరుతో కేంద్రం నవంబర్ 12వ తేదీన 2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) ఈ ప్యాకేజ్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనకు, మౌలిక రంగంలో పెట్టుబడులకు మద్దతునివ్వడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన చర్యలు ‘‘క్రెడిట్ పాజిటివ్’’అని తెలిపింది. 2021–22లో భారత్ వృద్ధి సైతం 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం. ఏడాదిలోనే ఆర్థిక రికవరీ: ఇండియాలెండ్స్ సర్వే భరోసా వచ్చే 12 నెలల్లో ఆర్థిక రికవరీ నెలకొంటుందన్న విశ్వాసం ఒక జాతీయ సర్వేలో వ్యక్తం అయ్యింది. సర్వేలో 77 శాతం మంది ఏడాదిలోపే రికవరీ ఉంటుందన్న భరోసాతో ఉంటే, వీరిలో 27 శాతం మంది మూడు నెలల్లోపే రికవరీ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫాం ఇండియాలెండ్స్ ఈ సర్వే నిర్వహించింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం లేదా సొంత వ్యాపారం ప్రారంభించే పనిలో చాలా మంది నిమగ్నమయ్యారని సర్వేలో తేలింది. ఈ సర్వేలో 18–55 ఏళ్ల వయసున్న వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న 1,700 మంది పాల్గొన్నారు. వీరిలో 41 శాతం మంది 25–35 ఏళ్ల వయసున్న యువత ఉన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 9.5 శాతం: ఇక్రా జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో 9.5 శాతం క్షీణిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. నవంబర్ 27న తాజా గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇక్రా ఈ అంచనాలను ఆవిష్కరించింది. ఉత్పత్తి వరకూ పరిగణనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) విషయంలో పరిశ్రమల క్షీణ రేటు అంచనాలను 38.1% నుంచి 9.3 శాతానికి తగ్గించింది. తయారీ, నిర్మాణ, సేవల రంగాలు తొలి అంచనాలకన్నా మెరుగుపడే అవకాశం ఉందని ఇక్రా ఈ సందర్భంగా పేర్కొంది. 2020–25 మధ్య వృద్ధి 4.5 శాతమే: ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–25 మధ్య 4.5 శాతం వృద్ధి రేటునే సాధిస్తుందని ప్రపంచ గణాంకాల దిగ్గజ సంస్థ– ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ గురువారం అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 6.5 శాతం. కరోనా ప్రేరిత అంశాలే తమ అంచనాల సవరణకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో 7 శాతం ఉంటుందని సంస్థ విశ్లేషించింది. పలు సంస్థల అంచనాలు ఇలా... కరోనా కల్లోల పరిస్థితులతో మొదటి త్రైమాసికం భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 8 శాతం నుంచి 11% వరకూ ఉంటుందని అంచనావేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో) సంస్థ క్షీణత అంచనా కేర్ 8.2 యూబీఎస్ 8.6 ఎస్అండ్పీ 9 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 9 ఆర్బీఐ 9.5 ప్రపంచబ్యాంక్ 9.6 ఫిచ్ 10.5 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 ఇక్రా 11 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 11.8 ఐఎంఎఫ్ 10.3 -
వడ్డీరేట్లు తగ్గించిన పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బి) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రుణాల వడ్డీరేటును తగ్గిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అన్ని కాల పరిమితి గల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 15 బీపీఎస్‌పాయింట్లు తగ్గించింది. అలాగే రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ను 40 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది. దీంతో 7.05 నుంచి 6.65 శాతానికి తిగి వచ్చింది. ఈ సవరించిన రేట్లు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది ఫండ్ డిపాజిట్ రేటును కూడా తగ్గించింది. గరిష్టంగా 3.25 శాతం చెల్లించనున్నట్టు తెలిపింది. వివిధ మెచ్యూరిటీల టర్మ్ డిపాజిట్ రేట్లను గరిష్టంగా 5.50 శాతంగా ఉంచింది. రూ .2 కోట్లకు పైన డిపాజిట్లపై సీనియర్ సిటిజనులకు సాధరణ వాటికంటే కంటే 75 బీపీఎస్ పాయింట్ల మేర అధిక వడ్డీ రేటును అందివ్వనుంది. ఇటీవల ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో దీనికనుగుణంగా దేశీయ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను సవరిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ రేట్ కట్ : రూపాయి బలహీనం
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు తగ్గింపు చర్య పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను బలహీన పర్చడంతో దేశీయ కరెన్సీ రూపాయి కుప్పకూలింది. డాలరు మారకంలో రూపాయి విలువ శుక్రవారం 34 పైసలు తగ్గి 75.95 వద్ద స్థిరపడింది. తద్వారా మరోసారి 76 కనిష్ఠ స్థాయికి చేరువైంది. గురువారం 75.61 వద్ద ముగిసింది. మార్కెట్వర్గాల అంచనాలకు అనుగుణంగా వడ్డీరేట్లలో కోత లేకపోవడం మార్కెట్లను నిరాశపర్చాయి.దీంతో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 75.72 వద్ద బలహీనంగా ప్రారంభమైనా రూపాయి అనంతరం మరింత క్షీణించి చివరికి 75.95 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీల బలహీనతకు తోడు, అమెరకా డాలరు బలం, దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రభావాన్ని చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. ఇక కమోడిటీ విషయానికి వస్తే జూన్ కాంట్రాక్ట్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.46,690గా ఉంది. (ఆర్బీఐ దెబ్బ: మార్కెట్ల పతనం) ఆర్బీఐ రేటు కట్ ఫారెక్స్ వ్యాపారులను ఉత్సాహపరచలేదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు.. 40 పాయింట్ల రేట్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, రుణాల పూర్తి స్థాయి పునర్నిర్మాణాన్ని అందించలేదన్నారు. అలాగే 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ అంచనాలను వెల్లడించకపోవడం దెబ్బతీసిందని తెలిపారు. ఆయా రంగాల ఆధారంగా ప్రత్యేక చర్యలు తీసుకోవలసి ఉందని గుప్తా అన్నారు. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) కాగా ఆర్బీఐ శుక్రవారం వడ్డీ రేట్లను తగ్గించింది, రుణాల చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. అలాగే నాలుగు దశాబ్దాల్లో మొదటిసారిగా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్రయత్నంలో బ్యాంకులకు కార్పొరేట్ ఎక్కువ రుణాలు ఇవ్వడానికి అనుమతించింది. -
ఆర్బీఐ దెబ్బ: మార్కెట్ల పతనం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు లేకపోవడంతో భారీ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ , ఫైనాన్సియల స్టాక్స్ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 600 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో 30552 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 8999 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా నిఫ్టీ మళ్ళీ కీలక 9వేల దిగువకు పడిపోయింది. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ , జీ ఎంటర్టైన్మెంట్, ఏషియన్ పెయింట్స్ , భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా లాభాల్లో ఉన్నాయి యూఎస్-చైనాల మధ్య మళ్ళీ ఉద్రికత్తలు. గ్లోబల్ మార్కెట్ల సంకేతాలతో అటు రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది, డాలరుతోపోలిస్తే రూపాయి 30 పైసలు నష్టంతో 75.91 వద్దకు చేరింది. కాగా కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో 0.4 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. -
షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కాలంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ తాజాగా తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. వివిధ కాల పరిమితుల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 50 బేసిస్ పాయింట్ల వకు కోత విధించినట్లు బ్యాంక్ తెలిపింది. సవరించిన రేట్లు మే 11 నుంచే అమలులోకి వచ్చినట్టు పేర్కొంది. (తగ్గిపెరిగిన ఎస్బీఐ ‘రేటు’) ఐసీఐసీఐ బ్యాంక్ తాజా రేట్ల కోత నిర్ణయంతో ఏడాది కాల పరిమితి డిపాజిట్లపై ఇప్పుడు 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. అదే ఏడాది పైన కాల పరిమితిలోని ఎఫ్డీలపై 5.7- 5.75 శాతం మధ్య వడ్డీని చెల్లించనుంది. మరోవైపు రుణరేట్ల (ఎంసీఎల్ఆర్) ను కూడా తగ్గించే అవకాశం వుందని భావిస్తున్నారు. అటు నిరాశాజనక ఫలితాలతో స్టాక్మార్కెట్లో బ్యాంకు షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది. కాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు కోత విధించిన సంగతి తెలిసిందే. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ) చదవండి : రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే! కరోనా: ఎయిరిండియా ఉద్యోగికి పాజిటివ్ -
ఎస్బీఐ గుడ్ న్యూస్, వారికి ప్రత్యేక పథకం
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు మరోసారి శుభవార్త అందించింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు ను తగ్గించింది. అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో వారికి అదనంగా వడ్డీని చెల్లించనుంది. అన్ని రకాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా సవరింపుతో వార్షిక ఎంసీఎల్ఆర్ 7.40 శాతం 7.25 శాతానికి దిగి వచ్చింది. ఈ రేట్లు మే 10వ తేదీనుంచి అమల్లోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్లో ఇది వరుసగా పన్నెండవ తగ్గింపు అని బ్యాంకు వెల్లడించింది. అలాగే మూడేళ్ల కాల పరిమితిగల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 20 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్లను మార్చి 12వ తేదీనుంచి అమలు చేయనుంది. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను కాపాడటానికి, రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో 'ఎస్బీఐ fవీకేర్ డిపాజిట్' పథకాన్ని లాంచ్ చేసింది. 5 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ వ్యవధిలో ఈ డిపాజిట్లను అందుబాటులో ఉంచనుంది. వీటిపై అదనంగా 30 బీపీఎస్ పాయింట్ల ప్రీమియం వడ్డీని అందించనుంది. 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ పథకం అందుబాటులో వుంటుందని ఎస్బీఐ తెలిపింది. (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత) (విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్జీ కెమ్ స్పందన) -
రుణాలపై వడ్డీరేటును తగ్గించిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై: అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రుణ రేటును 0.20 శాతం తగ్గించింది. ఫండ్స్ బేస్డ్ లెండింగ్ (ఎంసీఎల్ఆర్) రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. సవరించిన ఈ వడ్డీరేట్టు ఈనెల 7నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంక్ వెల్లడించింది. సవరించిన రేట్ల ప్రకారం ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ 7.95 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.15 శాతంగా మారిందని తెలిపింది. దీంతో గురువారం నాటి మార్కెట్టలో హెచ్‌డిఎఫ్‌సి షేరు లాభపడుతోంది. కరోనా వైరస్ విస్తరణ, లాక్ డౌన్ నేపథ్యంలో ముందస్తు పరపతి విధాన సమీక్ష చేపట్టిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండయా కీలక వడ్డీరేట్లను బాగా తగ్గించింది. దీంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా రుణాలు, డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా డిపాజిట్లు, రుణాల వడ్డీరేటు కోతను ప్రకటించింది. చదవండి: లాభాల ప్రారంభం : ఫార్మా జోరు -
ఎస్బీఐ గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. అన్నిరకాల రుణాలపై బ్యాంకు వసూలు చేసే ఎంసీఎల్ఆర్ను 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ తాజా ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటు యథాతథంగా ఉంచింది సంగతి తెలిసిందే. దీని ప్రకారం బ్యాంకులు సంబంధిత చర్యలు వెంటనే చేపట్టాలని ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా సవరణ ప్రకారం ఎస్బీఐ వసూలు చేసే వార్షిక వడ్డీ రేటు 7.90 శాతంగా ఉంటుంది. ఈ రేట్లు రేపు (మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: ఆ ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లు ఇక పనిచేయవు! -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు శుభవార్త
సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణాలపై వడ్డీరేటును తగ్గించిందది. మార్జినల్-కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను (ఎంసిఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) దాకా తగ్గిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల వ్యవధిగల గృహ,వాహన రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. సవరించిన వడ్డీరేట్లు నేటి (నవంబర్ 7) నుంచే అమలు చేయనున్నట్టు తెలిపింది. రేట్ కట్ కట్ తరువాత, 6 నెలల ఎంసిఎల్ఆర్ 5 బీపీఎస్ పాయింట్లు తగ్గి 8.10 శాతానికి చేరింది. అలాగే 1 సంవత్సరాల రేటు 8.30 శాతం, 2 సంవత్సరాల 8.40 శాతం, 3 సంవత్సరాల రేటు 10 బీపీఎస్ పాయింట్లు తగ్గి 8.5 శాతంగా ఉండనుంది. అయితే ఓవర్ నైట్, ఒక నె ల,మూడు నెలల కాల వ్యవధిల రుణాలపై వసూలు రేటును మాత్రం యథాతథంగా ఉంచింది. -
ఆర్బీఐ రేట్ కట్ : మార్కెట్ల పతనం
సాక్షి, ముంబై : ఆర్బీఐ రేటు కోత ప్రకటించిన వెంటనే స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. రేట్ కట్ అంచనాలతో ఆరంభంలో భారీగా ఎగిసన సూచీలు ఆర్బీఐ ప్రకటన తరువాత కుప్పకూలాయి. సెన్సెక్స్ 120 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయింది. అనంతరం ఫైనాన్స్ సంస్థలకు ఊరటనివ్వడంతో మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 214 పాయింట్లుకుప్పకూలి 37906 వద్ద, నిఫ్టీ 77పాయింట్ల పతనమై 11243 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలూ నష్టపోతున్నాయి. కోటక్ మహీంద్ర, గ్రాసిం, జీ, బీపీసీఎల్, ఐటీసీ, భారతి ఎయిర్టెల్ , హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టపోతుండగా ఐన్ఫోసిస్, ఎం అండ్ ఎం, టీసీఎస్, హీరో మోటో కార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంకు, రిలయన్స్ లాభపడుతున్నాయి. -
ఊహించినట్టుగానే జీఎస్టీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఊహించినట్టుగానే జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో భేటీ అయిన 36 వ జీఎస్టీ కౌన్సిల్ విద్యుత్తు వాహనాలు, ఈ వాహనాల చార్జీలపై జీఎస్టీ తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నర్ణయించింది. ఈవీ చార్జర్లపై జీఎస్టీనీ 18 నుంచి తగ్గించి 5 శాతంగా ఉంచింది. అలాగే స్థానిక అధికారులకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త పన్ను రేట్లు ఆగస్టు 1 వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే రానున్న సమావేశాలోల బీఎస్- 6వాహనాలపై చర్చించనుంది. అయితే ఇ-వాహనాలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు పూర్తిగా సమర్ధించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే కావడం విశేషం. -
బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ తీపికబురు
ముంబై : గృహ, వ్యక్తిగత, వాహన రుణాల వినియోగదారులకు కేంద్ర బ్యాంక్ తీపికబురు అందించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష కమిటీ (ఎంపీసీ) విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వడ్డీరేటు (రెపో రేటు)ను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. కాగా, బ్యాంకులకు ఆర్బీఐ అందించే స్వల్పకాల రుణాలపై విధించే వడ్డీని రెపో రేటుగా పరిగణిస్తారు. రెపో రేటు తగ్గడంతో తదనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. బ్యాంకులు వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని మళ్లిస్తే ఆయా రుణాలపై వారు చెల్లించే నెలసరి వాయిదా (ఈఎంఐ)లు కొంతమేర దిగివస్తాయి. పెట్టుబడుల మందగమనంతో పాటు ప్రైవేట్ వినిమయంలో వృద్ధి ఆశించిన మేర లేకపోవడంతో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపునకు మొగ్గుచూపింది. ఆర్థిక వృద్ధి మందగించడం, అంతర్జాతీయ ఆర్థిక అస్ధిరతల నేపథ్యంలో గత రెండు విధాన సమీక్షల సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను 7.2 శాతం నుంచి ఏడు శాతానికి కుదించింది. తదుపరి ఎంపీసీ భేటీ ఆగస్ట్ 5 నుంచి 7 వరకూ జరుగుతుందని పేర్కొంది. ఖాతాదారులకు ఊరట డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలను తొలగించింది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా ఆన్లైన్ లావాదేవీలపై చార్జీల రద్దుతో ఖాతాదారులకు ఊరట కల్పించింది. -
ఆర్బీఐ అసాధారణ నిర్ణయం తీసుకుంటుందా?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకోనుందా? కీలక వడ్డీరేట్ల పెంపు విషయంలో అసాధారణ అడుగు వేయబోతోందా? తాజా అంచనాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం ప్రారంభించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతం వద్ద అయిదేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీరేను ఈ సారి 0.35 శాతం లేదా 35 బేసిస్ పాయింట్లనుతగ్గించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. 0.25శాతం రేట్ కట్ ఉంటుందని ఇప్పటికే చాలామంది విశ్లేషకులు భావించినప్పటికీ ఏప్రిల్ మాస ద్రవ్యోల్బణం 2.92 శాతానికి చేరిన నేపథ్యంలో ఆర్బీఐ 35 బేసిస్ పాయింట్ల కోతకు మొగ్గు చూపే అవకాశం ఉందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా మే నెలలో ద్రవ్యోల్బణం 3.3 శాతానికి పెరగవచ్చని విదేశీ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే గత నెలలో న్యూయార్క్‌లో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ 0.25 శాతం లేదా అంతకంటే ఎక్కువ రేట్ కట్ ఉండవచ్చన్న ప్రసంగాన్ని సంస్థ గుర్తు చేస్తోంది. కాగా సోమవారం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు గురువారం వెలువడనున్నాయి. రంజాన్ (ఈదుల్ ఫితర్) పండుగ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు . -
రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ
ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు గృహ, వాహన, వ్యక్తిగత రుణాల కస్టమర్లకు ఊరట ఇచ్చేలా ఆర్బీఐ వరుసగా రెండోసారి కీలక రేట్లను తగ్గించింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరు శాతానికి పరిమితం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలిసారి మూడు రోజుల భేటీ అనంతరం ఆర్బీఐ కీలక రేట్ల నిర్ధారణ కమిటీ గురువారం వడ్డీ రేట్ల తగ్గింపును వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటును ఉత్తేజింపచేసేందుకు ఆర్బీఐ రెపోరేటును పావు శాతం మేర తగ్గిస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆశించాయి. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును రెపోరేటుగా పరిగణిస్తారు. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులకు కేంద్ర బ్యాంక్ నుంచి తీసుకునే నిధులపై వ్యయం తగ్గడంతో అవి రుణ కస్టమర్లకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇప్పటికే రుణాలు పొంది నెలవారీ వాయిదాలు చెల్లించే కస్టమర్లకూ ఈఎంఐల భారం కొంతమేర తగ్గనుంది. -
మళ్లీ వడ్డీ రేట్ల కోత చాన్స్..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో దఫా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం)కు తగిన ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో కేవలం 2.05 శాతంగా నమోదయ్యింది. గడచిన 19 నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఇక పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2018 డిసెంబర్లో కేవలం 2.4 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 7.3 శాతం. ధరలు తక్కువగా ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడడం నేపథ్యంలో ఏప్రిల్ 2 పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ మరోదఫా రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలకు మరింత బలం చేకూరింది. పారిశ్రామిక విభాగాలు వేర్వేరుగా... ► తయారీ: సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధిరేటు డిసెంబర్లో 8.7 శాతం (2017 డిసెంబర్) నుంచి 2.7 శాతానికి (2018 డిసెంబర్) పడిపోయింది. అయితే 2018 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఈ రేటు 3.8 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలను నమోదుచేశాయి. ► మైనింగ్: డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –1.0 శాతం క్షీణించింది. 2017 ఇదే నెలలో ఈ రేటు కనీసం 1.2 శాతంగా ఉంది. అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి చూస్తే, వృద్ధి రేటు 2.9 శాతం నుంచి 3.1 శాతానికి పెరిగింది. ► విద్యుత్: డిసెంబర్లో వృద్ధి అక్కడక్కడే 4.4 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో మాత్రం ఈ రేటు 5.1 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులకు, యంత్ర సామగ్రి కొనుగోలుకు సూచిక అయిన ఈ రంగంలో వృద్ధి రేటు 13.2 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ రంగంలో మాత్రం వృద్ధి 2.1 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: ఈ విభాగంలో ఉత్పాదకత వృద్ధి రేటు భారీగా 16.8 శాతం నుంచి 5.3 శాతానికి దిగజారింది. జనవరిలో మరింత తగ్గిన ధరలు జనవరిలో రిటైల్ ధరల పెరుగుదల వేగం (ద్రవ్యోల్బణం) కేవలం 2.05 శాతంగా ఉంది. 2018లో ఈ రేటు 5.07 శాతం. జనవరిలో మొత్తం ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం సూచీ పెరక్కపోగా –1.29 శాతం తగ్గింది. వేర్వేరుగా చూస్తే, గుడ్లు (–2.44 శాతం), పండ్లు (13.32 శాతం), కూరగాయలు (–13.32 శాతం), పప్పు దినుసులు (–5.5 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తుల (–8.16 శాతం) ధరలు 2018 ఇదే నెలతో పోల్చితే తగ్గాయి. అయితే మాంసం, చేపల ధరలు 5.06 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 1.45 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్ మీల్స్ ధరలు 3.48 శాతం పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణంలో మరో నాలుగు ప్రధాన విభాగాలను చూస్తే... పాన్, పొగాకు, ఇతర మత్తు ప్రేరితాల విభాగం బాస్కెట్ ధర 5.62 శాతం పెరిగింది. దుస్తులు, పాదరక్షల విభాగంలో ధరల సూచీ 2.95 శాతం ఎగసింది. హౌసింగ్ ధర 5.20 శాతం పెరిగితే, ఫ్యూయెల్ అండ్ లైట్లో ద్రవ్యోల్బణం 2.20 శాతం పెరిగింది. -
కీలక వడ్డీరేట్లు పావు శాతం కోత
సాక్షి, ముంబై: ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ఆధ్వర్యంలో జరిగిన తొలి సమీక్ష సమావేశంలో యథాతథ నిర్ణయానికి బ్రేక్ వేసి రేట్ కట్కు నిర్ణయించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేస్తూ ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ) తీర్మానించింది. దీంతో రెపో రేటు 6.50 శాతంనుంచి 6.25శాతానికి దిగి వచ్చింది. అలాగే బ్యాంకు రేటు 6.75 నుంచి 6.50 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణ అంచనాలను కూడా సవరించింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ)లో నలుగురు రేటు కట్కు ఆమోదం తెలిపారని శక్తి కాంత దాస్ వెల్లడించారు. ఆరవ ద్వైమాసిక రివ్యూలో రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ తీసుకునే వడ్డీరేటు)ను 6.25 శాతంగా ఉంచింది. రివర్స్ రెపో (వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) 6.25శాతంనుంచి 6 శాతానికి తగ్గింది. దీంతోస్టాక్‌మార్కెట్లు పాజిటివ్ స్పందిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లు లాభపడుతున్నాయి. -
గెలాక్సీ ఎస్9ప్లస్ ధర భారీ తగ్గింపు..శాశ్వతంగా
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోయేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త ప్రణాళికలతో వస్తోంది. చైనా కంపెనీ షావోమికి దీటుగా ఇటీవల బడ్జెట్ ధరల్లో ఎం10, ఎం20 స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన సంస్థ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ శాసంగ్ గెలాక్సీ ఎస్9ప్లస్ ధరలపై శాశ్వత తగ్గింపును ప్రకటించింది. ఎస్9ప్లస్ అన్ని వేరియంట్లపై రూ.7వేల తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపు ఆన్లైన్ విక్రయాలకు మాత్రమే వర్తించనుంది. గెలాక్సీ ఎస్9 + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 57,900, దీని లాంచింగ్ ధర రూ. 64,900. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ 61,900. లాంచింగ్ ధర రూ. 68,900 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ 65,900. లాంచింగ్ ధర 72,000. శాంసంగ్ ఆన్లైన్ అందించిన సమాచారం ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై రూ.4వేల క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే రూ. 9వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. కాగా గెలాక్సీ ఎస్ 9ప్లస్‌ను గత ఏడాది ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
40 వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గింపు
-
గుడ్‌న్యూస్ : జీఎస్టీ రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశంలో పన్ను రేటు తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ స్లాబుల్లో మార్పులకు ఆమోదం తెలిపింది. 33 అంశాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటులను తగ్గించింది. 28శాతం జీఎస్టీ ఉన్న సుమారు ఏడింటిని 18శాతం శ్లాబులోకి తీసుకొచ్చింది. అలాగే మరో 26 వస్తువులను 18శాతం శ్లాబు నుంచి 12శాతం, 5శాతం శ్లాబులకు మార్చాలని నిర్ణయించారు. 28 విలాసవంతమైన వస్తువులపై 28శాతం జీఎస్టీ వసూలు యథాతథంగా ఉంటుంది. అయితే సిమెంట్‌పై జీఎస్టీ 18 శాతానికి కోతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారికి నిరాశే మిగిలింది. 33 వస్తువులపై జీఎస్టీ తగ్గించేందుకు కౌన్సిల్ నిర్ణయించిందని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి వివరించారు. ముఖ్యంగా టీవీలు కంప్యూటర్లు, ఆటో పార్ట్స్ తదితరాల ధరలు దిగి రానున్నాయని ఉత్తరాఖండ్ ఆర్తికమంత్రి ప్రకాశ్ పంత్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 31వ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. అనంతరం జైట్లీ సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వివరాలను ప్రకటించారు. వందలాది వస్తువులపై జీఎస్టీ కోత -జైట్లీ వందలకొద్దీ వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించామని అని అరుణ్ జైట్లీ చెప్పారు 28శాతం జీఎస్టీ వసూలు చేసే 34 స్తువుల నుంచి ఆరు అంశాలను తొలగించినట్టు చెప్పారు. మూడు వస్తువులపై జీఎస్టీని 18శాతంనుంచి 12శాతానికి తగ్గించినట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో దాదాపు 55వేల కోట్ల రూపాయల భారం పడునుందని, తగ్గించిన జీఎస్టీ రేట్లు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయని జైట్లీ వెల్లడించారు. అలాగే సాధారణ పొదుపు ఖాతాలు, జనధన్ సేవింగ్స్ బ్యాంక్స్ ఖాతాలపై బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి జీఎస్టీ వుండదని పేర్కొన్నారు. దీంతోపాటు కేంద్రీకృత అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఏర్పాటునకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అరుణ్ జైట్లీ ప్రకటించారు.ఈ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని ఆర్థికమంత్రి తెలిపారు. ఎయిర్ కండిషనర్లు, 32 అంగుళాల టీవీలు, టైర్లు, లిథియం బ్యాటరీల పవర్ బ్యాంక్స్ 18శ్లాబులోకి దివ్యాంగులకు సంబంధించిన పలు ఉత్పత్తులపై 18నుంచి అతితక్కువగా 5శాతానికి తగ్గింపు వంద రూపాయిలలోపు వున్న సినిమా టికెట్లపై 18 శాతంనుంచి 12శాతానికి రూ.100 పైన ఉన్న టికెట్లపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు థర్డ్ పార్ట్ ఇన్సూరెన్స్‌పై వసూలు చేసే జీఎస్టీ18 -12 శాతానికి తగ్గింపు తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు సంబంధించిన ప్రత్యేక విమానాలపై ప్రీమియం పన్ను వసూలు ఉండదు. ఎకానమీ 5, బిజినెస్ 12శాతం వుంటుంది. జనవరిలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో రియల్ ఎస్టేట్ సెక్టార్‌పై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. -
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం
లండన్: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలం తరువాత బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచుతూ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దాదాపు 10 ఏళ్ల తరువాత మొదటిసారిగా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లనుపెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో 0.25నుంచి 0.50శాతానికి చేరింది. పాలసీ సమీక్ష చేపట్టిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటులో 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత తొలిసారిగా వడ్డీరేట్లను 0.25 శాతం మేర పెంచడంతో మాణిక వడ్డీ రేటు 0.50 శాతానికి చేరింది. అలాగే తదుపరి మూడు సంవత్సరాలలో క్రమంగా స్వల్ప పెరుగుదల ఉంటుందని అంచనాలను వెల్లడించింది ఈ స్వల్ప పెంపునకు , ద్రవ్య విధాన కమిటీ 7-2 ఓటుతో ఆమోదం తెలిపిందని బీఓఈ డిప్యూటీ గవర్న్‌ర్లు జాన్ కున్లిఫ్ఫ్ , డేవ్ రామ్స్‌డెన్ వెల్లడించారు. మరోవైపు రేటు పెంపుపై అక్కడి ఆర్థిక వేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్న పరిస్థితుల్లో విధానాలను మరింత పటిష్టం చేయడం అవసరమని బీఓఈ గవర్నర్ మార్క్‌కార్నే అభిప్రాయపడ్డారు. కాగా 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్ ఆర్థికవ్యవస్థ దశాబ్దాలుగా తీవ్ర మాంద్యంలో చిక్కుకుంది. అలాగు ఆగస్టు 2016 లో బ్రెగ్జిట్ అనంతరం అత్యవసర రేట్‌కట్‌ను ప్రకటించింది. -
10నెలల్లో తొలిసారి: ఎస్బీఐ శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహకొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. గృహ రుణాల వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం జారీ చేసిన ప్రకటనలో మార్జినల్కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇది రేపటి నుంచే (బుధవారం) అమల్లోకి వస్తాయని తెలిపింది. 10 నెలల్లో దాని మొట్టమొదటి రుణ రేటు తగ్గింపుగా నిలిచింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 7.95 శాతానికి దిగి వచ్చింది. ఇప్పటివరకు 8 శాతంగా ఉంది. -
ఆ వడ్డీరేట్లకు ఐసీఐసీఐ బ్యాంకు కోత
ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత పెట్టింది. సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. దీంతో రూ.50 లక్షలు కన్నా తక్కువున్న డిపాజిట్లపై వడ్డీరేట్లు 3.5 శాతానికి దిగొచ్చాయి. రూ.50 లక్షలు , ఆపై ఉన్న డిపాజిట్లకు వడ్డీరేట్లను యథాతథంగా 4 శాతంగానే ఉంచినట్టు బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన ఈ వడ్డీరేట్లు నేటి నుంచి అంటే ఆగస్టు 19 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. తొలుత జూలై 31న ప్రభుత్వం రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి, 3.5 శాతానికి తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస బెట్టి బ్యాంకులన్నీ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీలను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకు, కర్నాటక బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి. గత రెండు రోజుల కిందట హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత పెట్టింది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. -
8,800 మార్కు దాటేసిన నిఫ్టీ
ముంబై : వడ్డీరేట్ల కోత అంచనాలతో మార్కెట్లు సోమవారం ఐదు నెలల గరిష్టంలోకి ఎగిశాయి. 198.76 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ 28,439.28 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం తన కీలకమైన మార్కు 8,800ను దాటేసింది. గత నాలుగు నెలలో నిఫ్టీ 8,800 మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్ షేర్ల కొనుగోలు మద్దతుతో మార్కెట్లు నేడు లాభాల్లో నడిచాయి. అదేవిధంగా రేపటి నుంచి జరుగబోయే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్షలో సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లలో 0.25 శాతం కోత పెడుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో దలాల్ స్ట్రీట్‌లో బులిష్ సెంటిమెంట్ నెలకొంది. నేటి మార్కెట్లో అంబుజా సిమెంట్స్, సన్ ఫార్మా, ఏసీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, అరబిందో ఫార్మా టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఓఎన్జీసీ, హిందాల్కో, కోల్ ఇండియా, ఎస్బీఐ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.11 పైసల లాభపడి, 67.21 వద్ద ముగిసింది. గోల్డ్ ధరలు కూడా ఎంసీఎక్స మార్కెట్లో 100 రూపాయలు పెరిగి, రూ.29,009గా నమోదయ్యాయి. -
రేటు కోత బాటలో బీఓబీ.. యూబీఐ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు తమ మార్జినల్ కాస్ట్ ఫండ్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను గురువారం తగ్గించాయి. వివిధ బ్యాంకు నిర్ణయాలు చూస్తే... బీఓబీ..: రుణ రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గింది. జనవరి 7వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. కొత్త, రెన్యువల్ రుణ అకౌంట్లు అన్నింటికీ తాజా నిర్ణయం వర్తిస్తుందని ప్రకటన పేర్కొంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.80 శాతం నుంచి 8.10%కి తగ్గుతుంది. నెల కాలపరిమితి రేటు 8.15%గా ఉంది. మూడు నెలల రేటు 8.95% నుంచి 8.20 శాతానికి చేరింది. ఏడాది రేటు 70 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 9.05% నుంచి 8.35 శాతానికి చేరింది. యూబీఐ కూడా 0.90 శాతం కోత ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) కూడా తన రుణ రేటును 0.60–0.90 శాతం శ్రేణిలో తగ్గించింది. ఆరవ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏడాది రుణ రేటు 0.60 శాతం తగ్గి, 8.8 శాతానికి చేరింది. నెలవారీ రుణ రేటు 0.90 శాతం తగ్గి 8.35 శాతానికి చేరింది. డీమోనిటైజేషన్ నేపథ్యంలో బ్యాంకుల వద్ద భారీ ద్రవ్య లభ్యత పరిస్థితి నెలకొనడంతో ఎస్బీఐ సహా పలు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇదే దారిపట్టాయి. -
రేపటి పాలసీలో ఉర్జిత్ ముందున్న సవాళ్లివే!
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండో మానిటరీ పాలసీ ప్రకటన బుధవారం వెలువడబోతోంది. రేపటి పాలసీ సమీక్షలో కీలక రెపో రేటును ఆర్బీఐ 0.25 శాతం కోత విధిస్తుందని పలువురు అంచనావేస్తుండగా.. ఈ కోత 0.50 శాతం వరకు ఉంటుందని మరి కొంతమంది అంటున్నారు. పాత నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన అనంతరం వెలువడతున్న మొదటి పాలసీ ఇదే కావడంతో, రేట్ల కోతపై అంచనాలు భారీగానే ఉన్నాయని వెల్లడవుతోంది.. దీంతో పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో రోజుల భేటీ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేటి నుంచి ప్రారంభమైంది. రేపు మధ్యాహ్నం 2.30లకు రేట్ల కోతపై ఆర్బీఐ నిర్ణయం వెలువరుస్తుంది. ఈ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని మానిటరీ పాలసీ కమిటీ ముందున్న సవాళ్లేమిటో ఓ సారి చూద్దాం.... 1. ఆర్థికవేత్తల ప్రకారం డీమానిటైజేషన్ కనీసం వచ్చే రెండో త్రైమాసికాల్లో కచ్చితంగా నెగిటివ్ ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థికవ్యవస్థను ఊపందుకునేలా చేయడానికి మానిటరీ పాలసీ కమిటీ ఏ మేరకు రేట్లలో కోత విధించాలో నిర్ణయించాల్సి ఉంటుంది. అది పావు శాతమో, అరశాతమో వచ్చే రెండో క్వార్టర్లలో పడబోయే నెగిటివ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వారు అంచనావేయనున్నారు. 2. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వు నుంచి ఈ నెలలో షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల చివరిలో ప్రకటించబోయే ఫెడ్ పాలసీలో కచ్చితంగా రేట్ల పెంపు ఉంటుందని సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా క్షీణిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న రేట్ల కోత నిర్ణయం కూడా రూపాయిపై ప్రతికూలం ప్రభావం చూపనుంది. 3. అదేవిధంగా 2008 తర్వాత మొదటిసారి చమురు మార్కెట్ సమతుల్యం కోసం ఆయిల్ ఉత్పత్తిలో కోత విధించనున్నట్టు ఒపెక్ సభ్యులు ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయంతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే ఈ ధర పెరుగుదలను మానిటరీ పాలసీ కమిటీ పరిగణలోకి తీసుకోనుంది. 4. డీమానిటైజేషన్ తర్వాత మొదటిసారి ఆర్బీఐ చీఫ్ ఉర్జిత్ పటేల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో పాత నోట్ల రద్దు ప్రక్రియలో ఆర్బీఐ పాత్ర, పెద్ద నోట్ల రద్దుకు ఆర్బీఐ ముందస్తుగా ఎలాంటి ప్లానింగ్ చేపట్టిందనే పలు ప్రశ్నలను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. 5. గత పాలసీలో ఆరుగురు సభ్యుల మానిటరీ కమిటీ ఏకగ్రీవంగా 25 బేసిక్ పాయింట్ల రెపో రేటు కోతకు అంగీకరించింది. కానీ ఇప్పటి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈసారి కూడా ఏకగ్రీవంగా రేట్ల కోతకు మొగ్గుచూపుతారా? లేదా? అనేది సందిగ్థత నెలకొంది. -
ఈసారి ఆర్బీఐ రూటు ఎటువైపు?
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేతృత్వంలో మానిటరీ కమిటి వెలువరిచిన తొలి పాలసీలో అటు కార్పొరేట్ వర్గాలకు, ఇటు సామాన్య ప్రజలకు ఆశ్చర్యకరంగా వడ్డీరేట్లలో పావు శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలో డిసెంబర్లో వెలువడే రెండో పాలసీ ఎలా ఉండబోతుంది అని అప్పుడే మార్కెట్ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అసలకే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, రూపాయి భారీగా పతనం, మరో వైపు దేశీయంగా పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ కొనసాగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో ఈ సారి పాలసీలో రేట్ కోతపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.. దేశ వృద్ధికి మద్దతు పలికేందుకు ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ డిసెంబర్లో కూడా రేట్ కోత విధిస్తుందని డీబీఎస్ రిపోర్టు పేర్కొంటోంది. పెద్దనోట్ల రద్దుతో మోర్గాన్ స్టాన్లీ, ఫిచ్ లాంటి పలు రేటింగ్ సంస్థలు ఇప్పటికే దేశీయ వృద్ధి రేట్లో కోత విధించాయి. నోట్ల రద్దు సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటూ వృద్ధి అంచనాలను వెల్లువరుస్తున్నాయి. ముఖ్యంగా వినియోగత్వం, సప్లై చైన్, నగదు ఆధారిత పరిశ్రమలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపనుందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రేట్లలో కోత విధించవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ అనిశ్చితలతో పాటు రూపాయి పతనం 2017 మొదటి క్వార్టర్లో రేట్ల తగ్గింపును ప్రతిపాదిస్తున్నాయని పేర్కొంది. వృద్ధికి మద్దతు ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంకు డిసెంబర్ వెలువడే పాలసీ రేట్లలో కోత విధిస్తుందని డీబీఎస్ రీసెర్చ్ రిపోర్టుచెప్పింది. ఇది ద్రవ్యోల్బణానికి అనుకూలంగా మారనుందని వెల్లడించింది. కాగ గత నెలలో వెలువరిచిన పాలసీ రేట్లలో ఉర్జిత్ నేతృత్వంలోని కమిటీ 0.25 శాతం తగ్గించి, 6.25శాతంగా ఉంచింది. తదుపరి పాలసీ డిసెంబర్ 7న జరుగునుంది. -
వడ్డీరేట్ల కోతను ఇక మర్చిపోండి!
ముంబై : బ్యాంకుల వద్ద జమవుతున్న భారీ డిపాజిట్లతో, రుణాలపై భారీ రేట్ల కోత ఉంటుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు దిగొస్తాయని బ్యాంకులతోపాటు పలు రిపోర్టులు కూడా అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా సెంట్రల్ బ్యాంకు ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్ఫత్తిని 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఇక ఇప్పుడు వడ్డీ రేట్ల కోతపై ఆశలను వదులుకోవాల్సిందేనని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. ఆర్బీఐ తాజా ఆదేశాలతో బ్యాంకుల నుంచి రూ.3 ట్రిలియన్ నగదు తరలిపోనుందని, ఇది వడ్డీరేట్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. సెప్టెంబర్ 16- నవంబర్ 11 మధ్య కాలానికి ఆర్బీఐ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. అంటే నవంబర్ 26నుంచీ బ్యాంకులు ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా బ్యాంకుల వద్ద జమవుతున్న డిపాజిట్ల నేపథ్యంలో లిక్విడిటీని నియంత్రించేందుకు తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ ఈ నిర్ణయంతో రుణాలపై వడ్డీరేట్ల కోత ఆశలు ఆవిరయ్యాయని క్రిసిల్ పేర్కొంది. బ్యాంకులు వడ్డీరేట్ల కోతను జాప్యం చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై బ్యాంకులు అందిస్తాయని 3-4 శాతం వడ్డీరేట్ల వాగ్దానం కూడా నెరవేరబోదని తెలిపింది. సీఆర్ఆర్కు నగదు తరలిపోతున్నందున్న డిపాజిట్లపై ఎలాంటి వడ్డీలు కస్టమర్లు పొందే అవకాశముండదని వ్యక్తంచేసింది. పెద్దనోట్ల రద్దుతో వృద్ధి అంచనాలు తగ్గుతున్న నేపథ్యంలో డిసెంబర్ 7న జరుగబోయే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేట్ నిర్ణయం కీలకంగా మారనుందని క్రిసిల్ పేర్కొంది. -
ఆర్బీఐకు మరో ఛాన్స్: దిగొచ్చిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : మరోసారి రిజర్వు బ్యాంకు ఆఫ్ రేట్ల కోతకు అవకాశం కల్పిస్తూ, రిటైల్ ద్రవ్యోల్బణం చల్లటి కబురు అందించింది. ఆహార ఉత్పత్తుల ధరలు కిందకి దిగి రావడంతో సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31శాతంగా నమోదై 13 నెలల కనిష్ట స్థాయికి దిగొచ్చినట్టు వెల్లడైంది. ఆగస్టు నెలలో ఈ ద్రవ్యోల్బణం 5.05శాతంగా ఉంది. వరుసగా రెండు నెలల పాటు ఈ ద్రవ్యోల్బణం పడిపోయినట్టు ప్రభుత్వ అధికారిక డేటా ప్రకటించింది. వినియోగదారుల ధరలకు అనుగుణంగా ఈ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు. గత నెల 5.91శాతంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఆశ్చర్యకరంగా 3.88శాతానికి దిగిజారినట్టు వెల్లడైంది. 2016-17 ఆర్థిక సంవత్సంలో మొదటిసారి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 5 శాతం కంటే తక్కువగా నమోదకావడం విశేషం. అయితే ఈ ద్రవ్యోల్బణంలో చక్కెర, మిఠాయి ధరలు మరింత ప్రియంగా మారి, 25.77శాతంగా రికార్డు అయ్యాయి. పప్పుల ద్రవ్యోల్బణం 14.33 శాతంగా, దుస్తులు,ఫుట్‌వేర్ ద్రవ్యోల్బణం 5.19శాతం, ఇంధన ద్రవ్యోల్బణం 3.07శాతంగా ఉన్నాయి. ఈ ద్రవ్యోల్బణం 5 శాతం కంటే కిందకి పడిపోవడం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్యవిధాన కమిటీకి మరోసారి రేట్ల కోతకు అవకాశం కల్పిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. 50 బేసిస్ పాయింట్లు వరకు ఈ ఏడాది రేటుకు కోత పడుతుందని అంచనావేస్తున్నారు. కిందటి పాలసీలో కూడా ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని కమిటీ మార్కెట్ విశ్లేషకులకు ఆశ్చర్యకరంగా రేటు కోత ప్రకటిస్తూ దీపావళి కానుక అందించారు. అంచనావేసిన దానికంటే ఎక్కువగా పారిశ్రామికోత్పత్తి పడిపోయినట్టు డేటా విడుదలైన తర్వాతి రోజే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్టు వెల్లడైంది. -
మళ్లీ పడకేసిన పరిశ్రమలు..!
జూలైలో పారిశ్రామికోత్పత్తి మైనస్ 2.4 శాతం క్షీణత... • 8 నెలల కనిష్ట స్థాయికి తిరోగమనం • ఐదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం • ఆగస్టులో 5.05 శాతం రేటు కోత తప్పదని పరిశ్రమ విజ్ఞప్తి • తాము ఇదే భావిస్తున్నామని కేంద్రం సంకేతం న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో తదుపరి రేటు కోత అవకాశాలకు తాజా దేశ స్థూల ఆర్థిక గణాంకాలు అద్దం పట్టాయి. వినియోగ ధరల (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో ఐదు నెలల కనిష్ట స్థాయి 5.05 శాతానికి పడిపోయింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు కేంద్రం నిర్దేశిత లక్ష్యం 4 ప్లస్ 2 శాతం స్థాయి కన్నా దిగువ కావడం గమనార్హం. జూలైలో ఈ రేటు ఈ స్థాయిని దాటి (6.07 శాతం) ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. ఇక జూలై పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) తీవ్ర నిరాశ కలిగించింది. అసలు వృద్ధి లేకపోగా క్షీణతను నమోదుచేసుకుంది. ఎనిమిది నెలల కనిష్ట స్థాయిలో -2.4 శాతంగా నమోదయ్యింది. తయారీ, క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి పేలవ పనితీరు దీనికి కారణం.గత ఏడాది జూలైలో 4.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. పారిశ్రామిక ఉత్పత్తి తీరు... తయారీ: మొత్తం ఐఐపీ సూచీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో ఉత్పత్తి అసలు వృద్ధిలేకపోగా -3.4 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి 4.8 శాతం. ఈ విభాగంలో 22 పారిశ్రామిక గ్రూపులకు 12 ప్రతికూలతలో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ విభాగంలో భారీగా 29.6% క్షీణత (మైనస్) నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ రేటు 10.1 శాతం. విద్యుత్: వృద్ధి రేటు 3.5 శాతం నుంచి 1.6 శాతానికి దిగింది. మైనింగ్: ఈ రంగంలో వృద్ధి కూడా 1.3% నుంచి 0.8%కి తగ్గింది. వినియోగం: మొత్తంగా వినియోగ ఉత్పత్తుల ఉత్పత్తి వృద్ధి 1.1 శాతం నుంచి 1.3 శాతానికి పెరిగింది. ఇందులో భాగమైన కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి వృద్ధి 10.5 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది. కన్జూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉత్పత్తి -1.7 శాతం క్షీణించింది. ఈ క్షీణత గత ఏడాది ఇదే కాలంలో -4.4 శాతంగా ఉంది. నాలుగు నెలల కాలంలో...: ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచీ గడచిన నాలుగు నెలల్లో (ఏప్రిల్-జూలై) పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా -0.2 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 3.5 శాతం. అక్టోబర్4పై దృష్టి... అక్టోబర్ 4వ తేదీన ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో వెల్లడైన తాజా ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు తదుపరి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం) కోతకు దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి పురోగతికి ఇది తప్పదని పారిశ్రామిక వర్గాలూ డిమాండ్ చేస్తున్నాయి. కాగా తాజా గణాంకాలను పరిశీలనలోకి తీసుకుని ఆర్బీఐ అక్టోబర్ 4న రెపో రేటు కోత విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. రిటైల్ ధరల ఊరట.. వినియోగ ధరల (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో ఐదు నెలల కనిష్ట స్థాయి 5.05 శాతానికి పడిపోయింది. జూలైలో ఈ రేటు 6.07 శాతం. దాదాపు 100 బేసిస్ పాయింట్లు పడిపోవడానికి ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ తగ్గడం ప్రధాన కారణ మయ్యింది. కీలక విభాగాలను చూస్తే... ⇔ ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 5.83 శాతంగా నమోదయ్యింది. ⇔ పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల ధరలు 6.86 శాతం ఎగశాయి. ⇔ క్లాథింగ్ అండ్ ఫుట్‌వేర్ ధరలు 5.21 శాతం ఎగిశాయి. ⇔ హౌసింగ్ ధరలు 5.29 శాతం పెరిగాయి. ⇔ ఇంధనం, లైట్లో ధరలు 2.49 శాతం ఎగిశాయి. ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను చూస్తే.. వార్షికంగా ఆగస్టులో ఐదు శాతంకన్నా ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో కూరగాయలు (1.02 శాతం), పండ్లు (4.46 శాతం), నూనె, వెన్న (4.94 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (4.36 శాతం), ఆల్కహాలేతర పానీయాలు(4.24%) ఉన్నాయి. ఇక పప్పు ధాన్యాల ధరలు ఏకంగా 22% ఎగశాయి. చక్కెర, సంబంధిత పదార్థాల ఉత్పత్తులు 25% ఎగశాయి. గుడ్ల ధరలు 10 శాతం పెరిగాయి. -
20 శాతం తగ్గనున్న గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు ధరలు మరోసారి తగ్గనున్నాయి. అక్టోబర్1 నుంచి యూనిట్‌కు (ఎంబీటీయూ) 20 శాతం మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం 3.06 డాలర్ల నుంచి 2.45 డాలర్లకు దిగి రానున్నాయి. తగ్గించిన ధరలు అక్టోబర్ 1వ తేది నుంచే అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా గత 18 నెలలుగా ఇది నాలుగవ తగ్గింపు. 2014 లో ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించిన నిర్దిష్ట ఫార్ములా ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. గత ఏప్రిల్ లో 3.82 డాలర్లనుంచి 3.06 డాలర్లకు తగ్గించారు. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓన్ జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ధరలు తగ్గనున్నాయి. ఈ పథకం అమలు తరువాత గ్యాస్ ధరలు దాదాపు 39 శాతం క్షీణించాయి.గత ఏడాది ప్రభుత్వం ఆమోదించిన ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే తాజాగా మార్పులు జరగనున్నాయి. -
లాభాల వర్షం
విస్తరిస్తున్న రుతుపవనాలు స్టాక్ ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. మార్కెట్ ఒక్కసారిగా రివ్వున ఎగసింది. చివరి వరకూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 222 పాయింట్లు ఎగసింది. 25,229 వద్ద ముగిసింది. వెరసి ఐదు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,100 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 72 పాయింట్లుపైగా పుంజుకుని 7,527 వద్ద నిలిచింది. అటు టోకు ధరలు, ఇటు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఉపశమించడంతో వడ్డీ ప్రభావిత రంగాలపై ఇన్వెస్టర్లు కన్నేశారని విశ్లేషకులు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తగ్గడంతో వచ్చే నెలలో చేపట్టనున్న పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశముందన్న అంచనాలు ఇందుకు దోహదపడ్డాయని తెలిపారు. ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలు 2-3% మధ్య పుంజుకున్నాయి. మే నెల పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడం కూడా సెంటిమెంట్‌ను మెరుగుపరచిందని విశ్లేషకులు తెలిపారు.