సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు మరోసారి శుభవార్త అందించింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు ను తగ్గించింది. అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో వారికి అదనంగా వడ్డీని చెల్లించనుంది.
అన్ని రకాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా సవరింపుతో వార్షిక ఎంసీఎల్ఆర్ 7.40 శాతం 7.25 శాతానికి దిగి వచ్చింది. ఈ రేట్లు మే 10వ తేదీనుంచి అమల్లోకి వస్తాయి. ఎంసీఎల్‌ఆర్‌లో ఇది వరుసగా పన్నెండవ తగ్గింపు అని బ్యాంకు వెల్లడించింది.
అలాగే మూడేళ్ల కాల పరిమితిగల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 20 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్లను మార్చి 12వ తేదీనుంచి అమలు చేయనుంది. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను కాపాడటానికి, రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో 'ఎస్‌బీఐ fవీకేర్ డిపాజిట్' పథకాన్ని లాంచ్ చేసింది. 5 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ వ్యవధిలో ఈ డిపాజిట్లను అందుబాటులో ఉంచనుంది. వీటిపై అదనంగా 30 బీపీఎస్ పాయింట్ల ప్రీమియం వడ్డీని అందించనుంది. 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ పథకం అందుబాటులో వుంటుందని ఎస్‌బీఐ తెలిపింది. (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత) (విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ కెమ్ స్పందన)
Comments
Please login to add a commentAdd a comment