term deposits
-
టర్మ్ డిపాజిట్లకే ఆదరణ
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ డిపాజిట్లకు బదులు, అధిక రాబడినిచ్చే టర్మ్ డిపాజిట్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా బ్యాంకులకు నిధులపై వ్యయాలు పెరిగిపోయి, వాటి నికర వడ్డీ మార్జిన్లకు చిల్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఐదు ప్రముఖ బ్యాంక్‌ల్లో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.7–3 శాతం మధ్య ఉండగా, ఏడాది కాల టర్మ్ డిపాజిట్లపై అవే బ్యాంకులు 7.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే టర్మ్ డిపాజిట్ల రూపంలో 18.64 శాతం అధికంగా రూ.116 లక్షల కోట్లను సమీకరించాయి. అదే కాలంలో బ్యాంకుల సేవింగ్స్ డిపాజిట్లు కేవలం 6 శాతం పెరిగి రూ.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 13.5 శాతంగా ఉంటే, సేవింగ్స్ డిపాజిట్లలో పరుగుదల 4.9 శాతంగానే ఉండడం గమనార్హం. 2021–22లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 9.6 శాతంగానే ఉంది. అదే ఏడాది సేవింగ్స్ డిపాజిట్లు ఇంతకంటే అధికంగా 12.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 13.5 శాతం వృద్ధి చెందాయి. అంతకుముందు వరుస ఆర్థిక సంవత్సరాల్లో ఈ వృద్ధి వరుసగా 9.6 శాతం, 8.9 శాతం చొప్పున ఉంది.అధిక రాబడుల కోసమే..పొదుపు నుంచి టర్మ్ డిపాజిట్లకు పెట్టుబడుల మరళింపు స్పష్టంగా కనిపిస్తున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. రేట్లు గరిష్ట స్థాయిలో ఉండడంతో టర్మ్ డిపాజిట్లలోకి పొదుపు నిధులు మళ్లించుకోవడం ద్వారా రాబడులను పెంచుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ (డిపాజిట్లలో 22.6 శాతం వాటా) ఎస్బీఐ డిపాజిట్ బేస్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11.13 శాతం వృద్ధితో రూ.49.16 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘2023–24లో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో టర్మ్ డిపాజిట్లు 16.38 శాతం మేర వృద్ధి చెంది రూ.27.82 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు (కరెంట్, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు) 4.25 శాతం పెరిగి రూ.19.42 లక్షల కోట్లకు చేరాయి’’అని ఎస్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల నుంచి డిపాజిట్లు కేవలం టర్మ్ డిపాజిట్లలోకే కాకుండా, ఇంకా మెరుగైన రాబడులు వచ్చే ఈక్విటీలు, ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లోకి వెళుతున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా బ్యాంకు రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి తగ్గడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి క్షీణించడం పట్ల ఆర్బీఐ సైతం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. డిపాజిట్లు ఆకర్షించేందుకు బ్యాంకులు వినూత్నమైన మార్గాలను అన్వేíÙంచాలని సైతం ఆర్బీఐ సూచించింది. ‘‘బ్యాంక్‌లు డిపాజిటర్లను ఆకర్షించేందుకు మెరుగైన సంబంధాల దిశగా కృషి చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా వ్యాపార విధానాలు సైతం మారాల్సిందే. కేవలం డిపాజిట్ల స్వీకరణకే పరిమితం కాకుండా, సంపద నిర్వహణ సేవలు, క్లయింట్లతో పూర్తి సంబంధాల దిశగా వ్యవహరించాల్సిందే’’అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొనడం గమనార్హం. -
‘కాసా’ నుంచి ‘టర్మ్’కు డిపాజిటర్ల చూపు! బ్యాంకుల లాభాలపై ప్రభావం
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ– కాసా) డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బ్యాంకు వినియోగదారులు వేగంగా టర్మ్ డిపాజిట్ల వైపునకు మారిపోతున్నారు. కాసాలో అతి తక్కువ వడ్డీరేటు, టర్మ్ డిపాజిట్లలో కొంత మెరుగైన వడ్డీరేటు ఈ పరిస్థితికి కారణమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ– ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విడుదల చేసిన సర్వే (17వ రౌండ్) ఒకటి పేర్కొంది. ఈ పరిస్థితి బ్యాంకుల లాభాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణుల అభిప్రాయం. కాసా అంటే బ్యాంకులు సమీకరించే తక్కువ వడ్డీరేటు డిపాజిట్లు. అధిక మొత్తంలో తక్కువ వడ్డీ వ్యయాల డిపాజిట్లు ఒక బ్యాంకుకు ఉన్నాయంటే ఆ బ్యాంకుకు మెరుగైన మార్జిన్లు ఉంటాయని అర్థం. సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రసాయనాలు వంటి రంగాలు నిరంతర వృద్ధిని సాధిస్తున్నందున, ఆయా రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్స్, ఐరన్, స్టీల్ రంగాల్లో కూడా గత ఆరు నెలల్లో వేగవంతమైన దీర్ఘకాలిక రుణాల పంపిణీ జరిగింది. మౌలిక రంగాన్ని పరిశీలిస్తే, 16వ రౌండ్ సర్వేలో 57 శాతం మంది ఈ రంగంలో రుణ వృద్ధి ఉందని పేర్కొంటే, ప్రస్తుత 17వ రౌండ్లో ఈ సంఖ్య 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో నాన్–ఫుడ్ ఇండస్ట్రీలో భారీ రుణ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఆరు నెలల్లో తమ మొండిబకాయిలు తగ్గాయని సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 75 శాతం మంది తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో మొండిబకాయిలు 3 నుంచి 4 శాతం వరకే ఉంటాయని బ్యాంకర్లలో మెజారిటీ విశ్వసిస్తున్నారు. సుస్థిర దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయంతో కూడిన రుణ వృద్ధి, పటిష్ట ఆర్థిక పునరుద్ధరణ యంత్రాంగం, మొండిబకాయిలకు అధిక నిధులు కేటాయింపు (పొవిజనింగ్), భారీ రైట్–ఆఫ్ (పుస్తకాల నుంచి మొండి పద్దుల రద్దు) వంటి అంశాలు రానున్న ఆరు నెలల్లో బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుదలకు కారణం. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్!
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం... ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తంపై సాధారణ ప్రజలకు 3.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మూడు నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ సాధారణ ప్రజలకు 7.75 శాతం, అదే సీనియర్ సిటిజన్లకైతే 8.25 శాతం ఉంటుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పెరిగిన వడ్డీరేట్లు మార్చి 18 నుంచి అమలులోకి వస్తాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా.. 7 నుంచి 30 రోజుల వ్యవధి డిపాజిట్లపై 3.5 శాతం, 31 నుంచి 45 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4 శాతం, 46 నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.5 శాతం, 61 నుంచి 90 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.60 శాతం వడ్డీ ఉంటుంది. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! 91 నుంచి 120 రోజుల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 4.75 శాతం, 121 నుంచి 180 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5 శాతం, 181 నుంచి 210 రోజులలో మెచ్యూర్ అయ్యే దేశీయ టర్మ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. అలాగే 211 నుంచి 269 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5.80 శాతం, 270 నుంచి 354 రోజుల వ్యవధి డిపాజిట్లపై 6 శాతం, 355 నుంచి 364 రోజుల వ్యవధితో చేసిన డిపాజిట్లపై 6.25 శాతం అందిస్తుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఐఫోన్! -
‘బ్యాంకు టర్మ్ డిపాజిట్ల కంటే బంగారమే మేలు’
ముంబై: పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారం కుటుంబాల బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై ప్రభావం చూపుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశోధనా పత్రం ఒకటి పేర్కొంది. ద్రవ్యోల్బణం అంచనాలు గృహాల వినియోగం తీరు, తత్ఫలితంగా పొదుపులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆర్బీఐ వర్కింగ్ పేపర్ అభిప్రాయపడింది. భారత్‌లోని కుటుంబాలపై ద్రవ్యోల్బణం అంచనాలు, ప్రభావం అన్న అంశంపై దేవేంద్ర ప్రతాప్ సింగ్, ఆదిత్య మిశ్రా, పూర్ణిమా షాలు ఈ పరిశోధనా పత్రాన్ని విడుదల చేశారు. అయితే రచయితల అభిప్రాయాలతో ఆర్బీఐ ఏకీభవించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. డాక్యుమెంట్‌లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... - భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ విషయంలో కుటుంబాలు రుణం లేదా ఈక్విటీ వంటి ఆర్థిక సాధనాల్లో పొదుపు చేయడం మంచిది. ఇది ఉత్పత్తిని పెంచే కార్యకలాపాలలో మరింతగా ఉపయోగపడుతుంది. - ద్రవ్యోల్బణం తీవ్రత వల్ల పొదుపులు పడిపోయే ప్రభావం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. - కార్పొరేట్ బాండ్ మార్కెట్ల అభివృద్ధి ఇంకా ప్రారంభ దశ లోనే ఉంది. ఈక్విటీ మార్కెట్లపై తక్కువ అవగాహనా ఉంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, చాలా భారతీయ కుటుంబాలకు అందుబాటులో ఉండే ఆర్థిక సాధనం ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లే. ద్రవ్యోల్బణం తీవ్రమైతే వీటిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు తప్పకపోవచ్చు. - ద్రవ్యోల్బణం పెరుగుతుందని కుటుంబాలు భావించే పక్షంలో వడ్డీరేట్ల తక్కువగా ఉండడం, ప్రతికూల రిటర్న్స్ వల్ల గృహాలు డిపాజిట్లకు దూరంగా ఉండే వీలుంది. దీనితో వారు టర్మ్ డిపాజిట్లలో పొదుపు చేయడం కంటే విలువైన లోహాలు, ఆభరణాలు మొదలైన వాటిపై పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని భావించే అవకాశం ఉంది. - భారత్‌తో పాటు అమెరికా, ఇంగ్లండ్, జపాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, చెక్ రిపబ్లిక్, ఫిలిప్పీన్స్, రష్యా వంటి ఇతర దేశాలలో కూడా ద్రవ్యోల్బణం అంచనాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. భారతీయ కుటుంబాల ద్రవ్యోల్బణం అంచనాలు ఇతర అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే ఉన్నాయన్న విషయాన్ని ఇది సూచిస్తోంది. - ద్రవ్యోల్బణం అంచనాలలో మార్పులు తప్పనిసరిగా ఏదైనా నిర్దిష్ట ఆహార వస్తువుపైనే ప్రభావం చూపబోవు. వినియోగదారుల ధరల సూచీలో వివిధ ఉత్పత్తుల్లో ధరల మార్పులు ‘ఆయా ఉత్పత్తుల వెయిటేజ్‌తో సంబంధం లేకుండా’ వివిధ సమయాల్లో వినియోగానికి సంబంధించి కుటుంబాల మనోభావాలను ప్రభావితం చేస్తాయి. ఏదైనా ఒక వస్తువు ధర హఠాత్తుగా పెరిగితే, దామాషా ప్రాతిపదికన మొత్తం వినియోగ ప్రవర్తనపై ఆ ప్రభావం పడుతుంది. - ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, భారత్‌లో ప్రస్తుతం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ స్థాయి వడ్డీరేట్ల వల్ల బ్యాంకింగ్‌లో ఇప్పటికే ప్రతికూల రిటర్న్స్ వస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్బీఐ పరిశోదనా పత్రం వెలువడ్డం గమనార్హం. చదవండి:ముత్తూట్ విభాగానికి షాక్.. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ రద్దు! -
ఎస్బీఐ గుడ్ న్యూస్, వారికి ప్రత్యేక పథకం
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు మరోసారి శుభవార్త అందించింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు ను తగ్గించింది. అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో వారికి అదనంగా వడ్డీని చెల్లించనుంది. అన్ని రకాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా సవరింపుతో వార్షిక ఎంసీఎల్ఆర్ 7.40 శాతం 7.25 శాతానికి దిగి వచ్చింది. ఈ రేట్లు మే 10వ తేదీనుంచి అమల్లోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్లో ఇది వరుసగా పన్నెండవ తగ్గింపు అని బ్యాంకు వెల్లడించింది. అలాగే మూడేళ్ల కాల పరిమితిగల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 20 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్లను మార్చి 12వ తేదీనుంచి అమలు చేయనుంది. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను కాపాడటానికి, రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో 'ఎస్బీఐ fవీకేర్ డిపాజిట్' పథకాన్ని లాంచ్ చేసింది. 5 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ వ్యవధిలో ఈ డిపాజిట్లను అందుబాటులో ఉంచనుంది. వీటిపై అదనంగా 30 బీపీఎస్ పాయింట్ల ప్రీమియం వడ్డీని అందించనుంది. 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ పథకం అందుబాటులో వుంటుందని ఎస్బీఐ తెలిపింది. (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత) (విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్జీ కెమ్ స్పందన) -
డిపాజిట్లపై వడ్డీరేటు పెంపు
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. రీటైల్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం వెబ్సైట్లో ఒక ప్రకటన జారీ చేసింది. తాజా పెంపు ప్రకారం 7 నుంచి 45 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటు 5.25 శాతం నుంచి 5.75 శాతానికి పెంచింది. వార్షిక వడ్డీ రేటు 6.40శాతంగా పేర్కొంది. ఇప్పటివరకు ఇది 6.25శాతం. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.50శాతం వడ్డీని అందించనుంది. ఇప్పటివరకూ ఇది 6శాతం. అలాగే కోటి రూపాయలకు పైన డిపాజిట్లపై కూడా ఈ పెంపు వర్తింప చేయనుంది. సీనియర్ పౌరుల డిపాజిట్లపై 7శాతం వడ్డీ. అంతకు ముందు 6.50 శాతం. ఈ సవరించిన వడ్డీరేట్లు ఒత్త డిపాజిట్లకు , రెన్యూవల్ చేసుకునే డిపాజిట్లకు కూడా వర్తిస్తుందనిఎస్బీఐ తన నోటిఫికేషన్లో తెలిపింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లను కూడా త్వరలోనే భారీగా పెంచనుందని నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) తన పాలసీ రేట్లను వరుసగా మూడవ సారి కూడా యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. -
ఖాతాదారులకు పీఎన్బీ గుడ్‌న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు తీపికబురు అందించింది. రూ 10 కోట్ల వరకూ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 1.25 శాతం మేర పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు 2018, జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రూ కోటి వరకూ స్వల్పకాలిక డిపాజిట్లపై ప్రస్తుతం నాలుగు శాతంగా ఉన్న వడ్డీరేటును 5.25 శాతానికి పెంచింది. 91 నుంచి 179 రోజుల మెచ్యూరిటీ గల డిపాజిట్లపై వడ్డీ రేటును ప్రస్తుత 6 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. ఏడాది వ్యవధి కలిగిన బల్క్ టర్మ్ డిపాజిట్లపై 5 శాతంగా ఉన్న వడ్డీని 5.7 శాతానికి పెంచింది. మూడునుంచి పదేళ్ల వ్యవధి గల డిపాజిట్లపై వడ్డీరేటును 5 నుంచి 5.25 శాతానికి పెంచింది. -
ఎస్బీఐ డిపాజిట్ రేట్లపై అర శాతం కోత
6.25 శాతానికి తగ్గింపు ముంబై: ఇప్పటికే వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిల్లో కొనసాగుతుండగా ప్రభుత్వ రంగ ఎస్బీఐ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గిస్తూ సోమవారం అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించిం ది. రూ.కోటి లోపు విలువగల మధ్య కాల, దీర్ఘకాల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లు తాజాగా చేసే డిపాజిట్లు, గత డిపాజిట్ల పునరుద్ధరణకు ఏప్రిల్ 29 నుంచి వర్తిస్తుందని ఎస్బీఐ తెలిపింది. కాగా, బ్యాంకు ఎంసీఎల్ఆర్లో ఎటువంటి మార్పులేదు. ఏడాది ఎంసీఎల్ఆర్ 8%. నోట్: ఏడాది నుంచి 455 రోజుల టర్మ్ డిపాజిట్‌పై మాత్రం 6.90% వడ్డీని ఆఫర్ చేస్తోంది. -
డిపాజిట్లపై ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వం రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మరోషాకిచ్చింది. టెర్మ్ డిపాజిట్లపై రేట్లలో భారీ కోత పెట్టింది. మీడియం టెర్మ్, లాంగ్ టెర్మ్ డిపాజిట్ల పై రేట్లను సమీక్షించింది. ఈ మేరకు కోటి రూపాయల లోపు డిపాజిట్ల మెచ్యూరిటీపై చెల్లించే వడ్డీరేటులో 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25శాతంగా నిర్ణయించింది. ఏప్రిల్ 29, 2017 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్టు ఎస్బీఐ అధికారికంగా వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయలలోపు డిపాజిట్లపై ఎస్బీఐ గరిష్ఠంగా 6.75 శాతంతో పోలిస్తే 6.25 శాతం వడ్డీని అందించనుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఏడు రోజుల నుంచి రెండు సంవత్సరాల మధ్య ఉండే స్వల్పకాలిక డిపాజిట్లకు చెల్లించే వడ్డీ రేటును మాత్రం యథాతథంగా ఉంచింది. అలాగే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటుపై కూడా కోత పెట్టింది. ఇప్పటిదాకా 7.25శాతంగా వున్న ఈ రేటును 6.75శాతంగా నిర్ణయించింది. మూడేళ్లనుంచి పదిసం.రాల లోపు ఉన్న టెర్మ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లను తగ్గించి 6.50శాతంగా ఉంచింది. సంవత్సరం నుంచి 455 రోజుల డిపాజిట్లపై 6.90 శాతం అత్యధిక రేటును అందిస్తోంది. ఎస్బీఐ నిధుల ఆధారిత రుణ రేట్లను మార్చలేదు. వార్షిక ఎంసీఎల్ఆర్ ఎనిమిది శాతంగా ఉంది. -
ఐడీబీఐ బ్యాంక్ డిపాజిట్ల రేట్ల సవరణ
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మంగళవారం సవరించింది. సవరించిన రేట్లు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి. దీర్ఘకాల టర్మ్ డిపాజిట్లపై రేట్లను అర శాతం పెంచామని, కొన్ని టర్మ్ డిపాజిట్లపై రేట్లను పావు శాతం తగ్గించామని బ్యాంకు తెలియజేసింది. దీని ప్రకారం 7 నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను 9 శాతానికి పెంచుతున్నారు. 5-7 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీరేట్లను 8.75 శాతం నుంచి 9 శాతానికి పెంచారు. 501 రోజుల నుంచి 5 ఏళ్ల లోపు అన్ని కాల పరిమితుల డిపాజిట్లపై ఒకే వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నామని, వీటిపై 9% వడ్డీనిస్తామని బ్యాంకు వివరించింది. గతంలో ఈ సెగ్మెంట్లో మూడు రకాల వడ్డీరేట్లు ఉండేవి. 500 రోజుల డిపాజిట్లపై చెల్లిస్తున్న వడ్డీరేటును 9.40% నుంచి 9.30 శాతానికి (0.10%)తగ్గించామని ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది.