సాక్షి,న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు తీపికబురు అందించింది. రూ 10 కోట్ల వరకూ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 1.25 శాతం మేర పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు 2018, జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
రూ కోటి వరకూ స్వల్పకాలిక డిపాజిట్లపై ప్రస్తుతం నాలుగు శాతంగా ఉన్న వడ్డీరేటును 5.25 శాతానికి పెంచింది. 91 నుంచి 179 రోజుల మెచ్యూరిటీ గల డిపాజిట్లపై వడ్డీ రేటును ప్రస్తుత 6 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. ఏడాది వ్యవధి కలిగిన బల్క్ టర్మ్ డిపాజిట్లపై 5 శాతంగా ఉన్న వడ్డీని 5.7 శాతానికి పెంచింది. మూడునుంచి పదేళ్ల వ్యవధి గల డిపాజిట్లపై వడ్డీరేటును 5 నుంచి 5.25 శాతానికి పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment