సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. రీటైల్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన జారీ చేసింది.
తాజా పెంపు ప్రకారం 7 నుంచి 45 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటు 5.25 శాతం నుంచి 5.75 శాతానికి పెంచింది. వార్షిక వడ్డీ రేటు 6.40శాతంగా పేర్కొంది. ఇప్పటివరకు ఇది 6.25శాతం. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.50శాతం వడ్డీని అందించనుంది. ఇప్పటివరకూ ఇది 6శాతం. అలాగే కోటి రూపాయలకు పైన డిపాజిట్లపై కూడా ఈ పెంపు వర్తింప చేయనుంది. సీనియర్ పౌరుల డిపాజిట్లపై 7శాతం వడ్డీ. అంతకు ముందు 6.50 శాతం. ఈ సవరించిన వడ్డీరేట్లు ఒత్త డిపాజిట్లకు , రెన్యూవల్ చేసుకునే డిపాజిట్లకు కూడా వర్తిస్తుందనిఎస్‌బీఐ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లను కూడా త్వరలోనే భారీగా పెంచనుందని నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) తన పాలసీ రేట్లను వరుసగా మూడవ సారి కూడా యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment