75 Years of Independence: SBI Launches Utsav Fixed Deposit Scheme - Sakshi
Sakshi News home page

Utsav Fixed Deposit Scheme: కస్టమర్లకు ఎస్బీఐ స్వాతంత్య్ర దినోత్సవ కానుక: కొత్త స్కీం

Published Mon, Aug 15 2022 4:17 PM | Last Updated on Mon, Aug 15 2022 5:01 PM

75 years of Independence :SBI launches Utsav fixed deposit scheme - Sakshi

సాక్షి,ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  75  సంవత్సరాల భారత స్వాతంత్ర్య దినోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో  భాగంగా ఖాతాదారులకు ఒక కొత్త పథకాన్ని లాంచ్‌ చేసింది. "ఉత్సవ్ డిపాజిట్" అనే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంలో అధిక వడ్డీరేట్లను ఆఫర్‌ చేస్తోంది. అయితే ఇది  పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ ఒక ట్వీట్‌లో వెల్లడించింది.

చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి

ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో, 1000 రోజుల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.10శాతం వడ్డీ రేటును అందిస్తోంది.  సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50శాతం అదనపు వడ్డీ రేటును పొందేందుకు అర్హులు. ఈ రేట్లు 15 ఆగస్టు 2022 నుండి అమలులోకి వస్తాయి.  ఇఇది 75 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement