సాక్షి, న్యూఢిల్లీ : ఊహించినట్టుగానే జీఎస్‌టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో భేటీ అయిన 36 వ జీఎస్టీ కౌన్సిల్ విద్యుత్తు వాహనాలు, ఈ వాహనాల చార్జీలపై జీఎస్టీ తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నర్ణయించింది. ఈవీ చార్జర్లపై జీఎస్‌టీనీ 18 నుంచి తగ్గించి 5 శాతంగా ఉంచింది.
అలాగే స్థానిక అధికారులకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై జీఎస్‌టీ నుంచి మినహాయింపునివ్వడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త పన్ను రేట్లు ఆగస్టు 1 వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే రానున్న సమావేశాలోల బీఎస్- 6వాహనాలపై చర్చించనుంది. అయితే ఇ-వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయాన్ని ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు పూర్తిగా సమర్ధించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment