ఈసారి ఆర్బీఐ రూటు ఎటువైపు?
ఈసారి ఆర్బీఐ రూటు ఎటువైపు?
Published Tue, Nov 29 2016 3:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేతృత్వంలో మానిటరీ కమిటి వెలువరిచిన తొలి పాలసీలో అటు కార్పొరేట్ వర్గాలకు, ఇటు సామాన్య ప్రజలకు ఆశ్చర్యకరంగా వడ్డీరేట్లలో పావు శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలో డిసెంబర్లో వెలువడే రెండో పాలసీ ఎలా ఉండబోతుంది అని అప్పుడే మార్కెట్ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అసలకే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, రూపాయి భారీగా పతనం, మరో వైపు దేశీయంగా పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ కొనసాగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో ఈ సారి పాలసీలో రేట్ కోతపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.. దేశ వృద్ధికి మద్దతు పలికేందుకు ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ డిసెంబర్లో కూడా రేట్ కోత విధిస్తుందని డీబీఎస్ రిపోర్టు పేర్కొంటోంది.
పెద్దనోట్ల రద్దుతో మోర్గాన్ స్టాన్లీ, ఫిచ్ లాంటి పలు రేటింగ్ సంస్థలు ఇప్పటికే దేశీయ వృద్ధి రేట్లో కోత విధించాయి. నోట్ల రద్దు సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటూ వృద్ధి అంచనాలను వెల్లువరుస్తున్నాయి. ముఖ్యంగా వినియోగత్వం, సప్లై చైన్, నగదు ఆధారిత పరిశ్రమలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపనుందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రేట్లలో కోత విధించవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ అనిశ్చితలతో పాటు రూపాయి పతనం 2017 మొదటి క్వార్టర్లో రేట్ల తగ్గింపును ప్రతిపాదిస్తున్నాయని పేర్కొంది. వృద్ధికి మద్దతు ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంకు డిసెంబర్ వెలువడే పాలసీ రేట్లలో కోత విధిస్తుందని డీబీఎస్ రీసెర్చ్ రిపోర్టుచెప్పింది. ఇది ద్రవ్యోల్బణానికి అనుకూలంగా మారనుందని వెల్లడించింది. కాగ గత నెలలో వెలువరిచిన పాలసీ రేట్లలో ఉర్జిత్ నేతృత్వంలోని కమిటీ 0.25 శాతం తగ్గించి, 6.25శాతంగా ఉంచింది. తదుపరి పాలసీ డిసెంబర్ 7న జరుగునుంది.
Advertisement
Advertisement