DBS
-
కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ జూమ్!
ముంబై: ప్రపంచ కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్ డాలర్లు. డీబీఎస్ సీనియ ర్ ఎకనమిస్ట్ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23 ట్రేడ్ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్ వాటా దాదాపు 4%మే. ► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్‌కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది. ► 2022–23లో సాఫ్ట్వేర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరగా, సర్వీసెస్ ట్రేడ్ మిగులు 142 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది. సర్వీసెస్ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం. ► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► కంప్యూటర్ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం. ► బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద సేవల ట్రేడ్ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ► సేవల ఎగుమతి పెరుగుదల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది ► సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్‌ది మొదటి స్థానం. -
లక్ష్మీ విలాస్ ‘ఖాతా’ క్లోజ్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ని డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో (డీబీఐఎల్) విలీన ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదముద్ర పడింది. విలీన స్కీమ్‌నకుకేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే దీనిపై ఒక ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్ .. నవంబర్ 27 (శుక్రవారం) నుంచి విలీనం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆ రోజు నుంచి ఎల్వీబీపై విధించిన మారటోరియం కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రూ. 25,000 విత్‌డ్రాయల్ పరిమితులు తొలగిపోనున్నాయి. ‘‘నవంబర్ 27 నుంచి విలీనం అమల్లోకి వస్తుంది. ఎల్వీబీ శాఖలన్నీ కూడా ఆ రోజు నుంచి డీబీఎస్ బ్యాంక్ ఇండియా శాఖలుగా మారతాయి. ఎల్వీబీ డిపాజిటర్లంతా కూడా డీబీఎస్ ఖాతాదారులుగా మారతారు. అలాగే, ఎల్వీబీపై విధించిన మారటోరియం కూడా ఇక అమల్లో ఉండదు’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఎల్వీబీ ఖాతాదారులకు యథాప్రకారంగా సర్వీసులు అందేలా చూసేందుకు డీబీఎస్ బ్యాంక్ ఇండియా అన్ని ఏర్పాట్లూ చేస్తోందని వివరించింది. వాస్తవానికి మారటోరియం గడువు డిసెంబర్ 16తో ముగియనున్నప్పటికీ అంతకన్నా ముందుగానే ఎత్తివేయనుండటం గమనార్హం. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎల్వీబీ ఉద్యోగులందరికీ కూడా నవంబర్ 17నకు ముందు నుంచి అందుకుంటున్న వేతనాలు, సర్వీసు నిబంధనలే ఇకపైనా వర్తిస్తాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీ బోర్డును ఆర్బీఐ నవంబర్ 17న రద్దు చేసి ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆర్బీఐ సిఫార్సుల మేరకు డిపాజిటర్లు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోకుండా కేంద్రం .. ఎల్వీబీపై 30 రోజుల మారటోరియం విధించింది. సింగపూర్‌కి చెందిన సంస్థ డీబీఎస్ భారత విభాగం డీబీఐఎల్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను విలీనం చేసే ప్రతిపాదనను ఆర్బీఐ రూపొందించింది. తాజాగా ఇదే అమల్లోకి రానుంది. ఈ ఏడాది పెను సంక్షోభం ఎదుర్కొన్న బ్యాంకుల్లో యస్ బ్యాంక్ తర్వాత ఎల్వీబీ రెండోది. నిధుల కొరతతో కుదేలైన యస్ బ్యాంక్‌పై ప్రభుత్వం మార్చిలో మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐతో 45 శాతం వాటాలు కొనిపించి, రూ. 7,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టించి యస్ బ్యాంక్‌ను గట్టెక్కించింది. షేరు జూమ్.. దాదాపు వారం రోజులుగా లోయర్ సర్క్యూట్లకు పడిపోతూ వస్తున్న ఎల్వీబీ షేర్లు తాజా పరిణామాలతో బుధవారం 5 శాతం పెరిగాయి. బీఎస్ఈలో రూ. 7.65 వద్ద (అప్పర్ సర్క్యూట్) ముగిశాయి. ఒక దశలో లోయర్ సర్క్యూట్ స్థాయి రూ. 6.95కి, ఏడాది కనిష్టానికి కూడా పడిపోయినప్పటికీ ఆ తర్వాత గణనీయంగా కోలుకోవడం గమనార్హం. ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత నవంబర్ 17 నుంచి 24 మధ్య షేరు ధర 53 శాతం పడిపోయింది. షేర్హోల్డర్లకు సున్నా..? ఈ మొత్తం లావాదేవీలో షేర్హోల్డర్లకు దక్కేదేమీ లేదు. విలీన ప్రతిపాదన తుది స్కీమ్‌ను బట్టి చూస్తే ముసాయిదాలో పేర్కొన్న ఈక్విటీ రైటాఫ్‌లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం లావాదేవీ అనంతరం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తాన్ని రైటాఫ్ చేయనున్నారు. గురువారం నుంచి ట్రేడింగ్‌ను ఎన్ఎస్ఈ నిలిపివేయనుంది. శుక్రవారం ఎక్సే్చంజీల నుంచీ ఎల్వీబీ షేర్లను డీలిస్ట్ చేయనున్నారు. డిపాజిట్లు సురక్షితం.. ఎల్‌వీబీకి చెందిన 20 లక్షలకు పైగా ఖాతాదా రులు, 4,000 మంది పైగా ఉద్యోగులకు తాజా పరిణామం ఊరట కలిగిస్తుందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. డిపాజిట్ల విత్‌డ్రాయల్‌పై ఇతరత్రా మరే ఆంక్షలు ఉండబోవని ఆయన చెప్పారు. ‘‘ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదు. డిపాజిట్లు సురక్షితమైన చేతుల్లోనే ఉన్నాయి. విత్‌డ్రాయల్ కోసం పరుగెత్తాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి తెలిపారు. డీబీఐఎల్‌కు తగినంత స్థాయిలో మూలధనం ఉన్నప్పటికీ విలీనానంతరం కార్యకలాపాల వృద్ధి కోసం ముందుగానే మరో రూ. 2,500 కోట్ల నిధులను కూడా సమకూర్చుకుంటుందని చెప్పారు. ఎల్వీబీ కనుమరుగు.. సుమారు 94 ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్వీబీని వీఎస్ఎన్ రామలింగ చెట్టియార్ సారథ్యంలో తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో ఏర్పాటు చేశారు. 19 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో ఎల్‌వీబీకి 566 శాఖలు, 918 ఏటీఎంలు ఉన్నాయి. బడా సంస్థలకు భారీ స్థాయిలో రుణాలివ్వడం మొదలెట్టినప్పట్నుంచి ఎల్‌వీబీకి కష్టాలు మొదలయ్యాయి. మొండిబాకీలు భారీగా పేరుకుపోవడంతో బ్యాంకుపై ఆర్బీఐ గతేడాది ఆంక్షలు కూడా విధించింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్ సంస్థలతో విలీనమయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. 2019–20లో రూ. 836 కోట్ల నికర నష్టం ప్రకటించిన ఎల్వీబీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 397 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా పరిణామాలతో ఎల్వీబీ ఇక పూర్తిగా కనుమరుగు కానుంది. పటిష్టంగా డీబీఐఎల్... సింగపూర్ కేంద్రంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డీబీఎస్‌కు డీబీఐఎల్ భారతీయ అనుబంధ సంస్థ. డీబీఎస్‌కు ఆసియాలోని 18 మార్కెట్లలో కార్యకలాపాలు ఉన్నాయి. ఎల్వీబీని విలీనం చేసుకోవడంతో డీబీఐఎల్ శాఖల సంఖ్య 600కు పెరుగుతుంది. బాధ్యులపై చర్యలు ఉంటాయి.. ఎల్వీబీ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని జవదేకర్ తెలిపారు. ‘‘తప్పులు చేసిన వారిపై చర్యలుంటాయి. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా పర్యవేక్షణ మెరుగుపరుస్తాం. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇవి కూడా భాగం’’ అని ఆయన చెప్పారు. ఆర్బీఐ కూడా పర్యవేక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పరిస్థితి చేయి దాటిపోవడానికి ముందే సమస్యను ఆర్బీఐ అంచనా వేయగలగాలి. రాబోయే సమ స్యలను పసిగట్టగలిగితే పరిష్కారం సులువవుతుంది’’ అని జవదేకర్ వ్యాఖ్యానించారు. -
డీబీఎస్‌కు అప్పట్లోనే వాటాలు..!
ముంబై: ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంక్‌లో (ఎల్వీబీ) 50 శాతం వాటాలు కొనేందుకు సింగపూర్‌కి చెందిన డీబీఎస్ 2018లోనే ప్రయత్నించింది. కానీ రిజర్వ్ బ్యాంక్ అప్పట్లో ఈ డీల్‌ని తిరస్కరించింది. ఎల్‌వీబీలో అత్యధిక వాటాలు గల (4.8 శాతం) ఏకైక ప్రమోటర్ అయిన కేఆర్ ప్రదీప్ ఈ విషయాలు వెల్లడించారు. ‘2018లో మూలధన సమీకరణ ప్రణాళికల్లో భాగంగా ఇన్వెస్టర్లను అన్వేషించేందుకు జేపీ మోర్గాన్ సంస్థను ఎల్వీబీ నియమించుకుంది. ఈ క్రమంలో షేరు ఒక్కింటికి రూ. 100–155 శ్రేణిలో ఆఫర్లు వచ్చాయి. షేరుకి రూ. 100 చొప్పున కనీసం 50% వాటా తీసుకునేందుకు డీబీఎస్ ముందుకొచ్చింది. అయితే, ఆ సంస్థ ఎల్వీబీపై నియంత్రణాధికారాలు కావాలని కోరుకుంది. కానీ ఆర్బీఐ పెట్టిన నిబంధనలతో వెనక్కి తగ్గింది‘ అని చెప్పారు. ఒకవేళ అప్పుడే గ్రీన్ సిగ్నల్ లభించి ఉంటే డీబీఎస్ షేరుకి రూ. 100 ఇచ్చేదని, ఇప్పుడైతే పూర్తి ఉచితంగానే తీసుకున్నట్లవుతుందని ప్రదీప్ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికైనా షేర్హోల్డర్లు, ప్రమోటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని, వారిని ఉత్తి చేతులతో పోనివ్వదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్వీబీ బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ.. దాన్ని డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేసే ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రదీప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎల్‌వీబీలో ప్రదీప్‌తో పాటు మరో ముగ్గురు ప్రమోటర్ల కుటుంబాలకు (ఎన్ రామామృతం, ఎన్టీ షా, ఎస్బీ ప్రభాకరన్) 2% వాటాలు ఉన్నాయి. మొత్తం మీద ప్రమోటర్లకు 6.8% వాటా ఉండగా, ఇండియాబుల్స్ హౌసింగ్ నేతృత్వంలోని సంస్థాగత ఇన్వెస్టర్లకు 20% వాటాలు ఉన్నాయి. రిటైల్ షేర్హోల్డర్లకు ఎల్‌వీబీలో మొత్తం 45 శాతం వాటాలు ఉన్నాయి. లక్ష్మీ విలాస్ బ్యాంకును డీబీఎస్‌లో విలీనం చేసిన పక్షంలో వీటికి విలువ లేకుండా పోతుందనేది షేర్‌హోల్డర్ల ఆందోళన శుక్రవారం బీఎస్ఈలో ఎల్వీబీ షేరు 10 శాతం క్షీణించి రూ. 9 వద్ద క్లోజయ్యింది. -
చమురు చిక్కులకు.. డాలర్లతో చెక్!
చమురు బావుల ప్రధాన కేంద్రం పశ్చిమాసియాలో అమెరికా– ఇరాన్ ప్రతీకార చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇటీవలి కాలంలో ఉన్న ధరలతో చూస్తే బ్యారెల్‌కు 5 డాలర్ల వరకు పెరిగాయి. చమురును అత్యధికంగా వినియోగిస్తూ, వినియోగంలో 80%కి పైగా దిగుమతి చేసుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఈ ధరల పెరుగుదల పెద్ద ఇబ్బందే. అయితే, ఆర్బీఐ ముందుచూపు మన ఆర్థిక వ్యవస్థ చమురు ప్రకంపనల నుంచి తట్టుకునేలా దృఢంగా నిలిపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు గత డిసెంబర్ 27వ తేదీ నాటికి 457.5 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది (2019లో) ఆర్బీఐ భారీ ఎత్తున డాలర్లను కొనుగోలు చేసింది. ఫలితంగా 64 బిలియన్ డాలర్ల మేర ఫారెక్స్ నిల్వలు 2019లో (డిసెంబర్ 27 నాటికి) పెరిగాయి. ఆసియాలోని ఇతర దేశాల్లో మరే కేంద్ర బ్యాంకు ఈ స్థాయిలో డాలర్ల కొనుగోళ్లకు దిగకపోవటాన్ని ఇక్కడ గమనించాలి. మనం చమురు దిగుమతులను అధిక శాతం డాలర్ల రూపంలోనే చేసుకుంటున్నందున... దండిగా ఉన్న డాలర్ నిల్వలు ఈ సమయంలో మనకు కలసిరానున్నాయి. 2019లో తైవాన్ 15 బిలియన్ డాలర్లు, థాయిలాండ్ 14 బిలియన్ డాలర్ల చొప్పున కొన్నాయి. ఇక ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేసియా, దక్షిణ కొరియా ఇంకా తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేయడం గమనార్హం. ఆరేళ్లలో 176 బిలియన్ డాలర్లు ఆర్బీఐ డాలర్ల కొనుగోళ్ల తీరును సింగపూర్‌కు చెందిన డీబీఎస్ గ్రూపు అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. 2013 ఆగస్ట్ ట్యాపర్ టాంటమ్ (యూఎస్ ఫెడ్ పరిమాణాత్మక ద్రవ్య సడలింపు విధానం నుంచి వెనక్కి మళ్లడం) తర్వాత నుంచి భారత రిజర్వ్ బ్యాంకు మొత్తం మీద 176 బిలియన్ డాలర్ల మేర ఫారెక్స్ నిల్వలను పెంచుకుంది. పరిమాణాత్మక సడలింపు విషయంలో నిదానంగా వ్యవహరించనున్నట్టు నాడు యూఎస్ ఫెడ్ చేసిన ప్రకటనకు అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ కఠినంగా మారడంతో వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం అధికమైంది. ఈ ఆరేళ్ల కాలంలో ఫారెక్స్ నిల్వల విషయంలో దక్షిణ కొరియా 76 బిలియన్ డాలర్లను పెంచుకుని రెండో స్థానంలో, తైవాన్ 65 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలను పెంచుకుని మూడో స్థానంలో ఉన్నాయి. 10 నెలల వరకూ ఓకే..! ప్రస్తుతం ఆర్బీఐ వద్దనున్న ఫారెక్స్ నిల్వలు పది నెలల దిగుమతుల అవసరాలను తీర్చగలవు. తాజా అంతర్జాతీయ అనిశ్చితిలో రూపాయి విలువను కాపాడేందుకు ఈ నిల్వలు ఆర్బీఐకి ఆయుధంగా పనిచేస్తాయనేది నిపుణుల మాట. అంతర్జాతీయ అనిశ్చితుల నుంచి బలమైన నిల్వల ఏర్పాటు దిశగా అధికార యంత్రాంగం వేగంగా వ్యవహరిస్తున్నట్టు డీబీఎస్లోని భారత ఆర్థిక వేత్త రాధికా రావు తెలిపారు. స్వల్పకాలిక నిధుల రాక, ఎక్స్టర్నల్ రుణాల రూపేణా వచ్చే ఒత్తిళ్లను తట్టుకునేందుకు ఈ నిల్వలు ఉపకరిస్తాయన్నారు. అయితే, నాణేనికి మరోవైపు అన్నట్టు.. పెరిగిన డాలర్ నిల్వలు రూపాయి మారకంపై ప్రభావం చూపించొచ్చనని చెప్పారామె. -
భారత్‌కు అనుకూలించిన అంతర్జాతీయ వాతావరణం
సింగపూర్: భారత ఆర్థిక వ్యవస్థ 2019లో అంతర్జాతీయంగా ఉన్న సానుకూల వాతావరణంతో ప్రయోజనం పొందిందని, ఈక్విటీ, డెట్ విభాగాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కొన్నేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని సింగపూర్‌కు చెందిన బ్యాంకింగ్ గ్రూపు డీబీఎస్ ఓ నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి నిలకడగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా అధిక లిక్విడిటీ (పెట్టుబడులు), చమురు ధరలు నిలకడగా ఉండడం వంటివి సానుకూలించినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2019–20లో ఇప్పటి వరకు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సగటున 65 డాలర్లుగా ఉందని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 70 డాలర్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. -
ఈసారి ఆర్బీఐ రూటు ఎటువైపు?
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేతృత్వంలో మానిటరీ కమిటి వెలువరిచిన తొలి పాలసీలో అటు కార్పొరేట్ వర్గాలకు, ఇటు సామాన్య ప్రజలకు ఆశ్చర్యకరంగా వడ్డీరేట్లలో పావు శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలో డిసెంబర్లో వెలువడే రెండో పాలసీ ఎలా ఉండబోతుంది అని అప్పుడే మార్కెట్ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అసలకే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, రూపాయి భారీగా పతనం, మరో వైపు దేశీయంగా పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ కొనసాగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో ఈ సారి పాలసీలో రేట్ కోతపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.. దేశ వృద్ధికి మద్దతు పలికేందుకు ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ డిసెంబర్లో కూడా రేట్ కోత విధిస్తుందని డీబీఎస్ రిపోర్టు పేర్కొంటోంది. పెద్దనోట్ల రద్దుతో మోర్గాన్ స్టాన్లీ, ఫిచ్ లాంటి పలు రేటింగ్ సంస్థలు ఇప్పటికే దేశీయ వృద్ధి రేట్లో కోత విధించాయి. నోట్ల రద్దు సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటూ వృద్ధి అంచనాలను వెల్లువరుస్తున్నాయి. ముఖ్యంగా వినియోగత్వం, సప్లై చైన్, నగదు ఆధారిత పరిశ్రమలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపనుందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రేట్లలో కోత విధించవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ అనిశ్చితలతో పాటు రూపాయి పతనం 2017 మొదటి క్వార్టర్లో రేట్ల తగ్గింపును ప్రతిపాదిస్తున్నాయని పేర్కొంది. వృద్ధికి మద్దతు ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంకు డిసెంబర్ వెలువడే పాలసీ రేట్లలో కోత విధిస్తుందని డీబీఎస్ రీసెర్చ్ రిపోర్టుచెప్పింది. ఇది ద్రవ్యోల్బణానికి అనుకూలంగా మారనుందని వెల్లడించింది. కాగ గత నెలలో వెలువరిచిన పాలసీ రేట్లలో ఉర్జిత్ నేతృత్వంలోని కమిటీ 0.25 శాతం తగ్గించి, 6.25శాతంగా ఉంచింది. తదుపరి పాలసీ డిసెంబర్ 7న జరుగునుంది. -
ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులే!
• 2016 టోకు ద్రవ్యోల్బణం సగటు 1.5%: నొమురా • క్యాడ్ జీడీపీలో 1 శాతం లోపేనని డీబీఎస్ అంచనా న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు సంబంధించి దేశ స్థూల ఆర్థిక అంశాలు ఈ ఏడాది పటిష్టంగానే ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. 2016లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ సగటున 1.5 శాతంగా ఉంటుందని జపాన్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- నొమురా అంచనావేసింది. ఇక 2016లో కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్- ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే, 1.5 శాతంగా గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- డీబీఎస్ అంచనావేసింది. ఆయా సంస్థల అంచనాలు ఇలా... ఆహారోత్పత్తుల ధరలు తగ్గుతాయి: నొమురా ఆహారోత్పత్తుల ధరలు తక్కువగా ఉండడమే టోకు ద్రవ్యోల్బణం 1.5 శాతం వార్షిక సగటుకు కారణం. దీనితోపాటు సంస్థల బలహీన ‘ప్రైసింగ్ పవర్’ కూడా దీనికి ఒక కారణమే. తగిన వర్షపాతంతో పంటలు బాగుండడం, ప్రభుత్వ చక్కటి సరఫరా నిర్వహణ కూడా కనిష్ట ద్రవ్యోల్బణానికి దోహదపడుతుంది. డీబీఎస్ అంచనాలు ఇవీ... ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు తగ్గడం మొత్తం కరెంట్ అకౌంట్‌లోటుపై సానుకూల ప్రభావం చూపుతుంది. 2015-16లో ఇది - 1.1 శాతం. ఎగుమతులతో పాటు దేశ దిగుమతులు కూడా మందగమనం కొనసాగుతుండడం గమనార్హం. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలకు ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణం ధోరణే ప్రాతిపదికగా ఉంటుంది. రేటు కోతకు తగిన విధంగానే వచ్చే కొద్ది నెలల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఉండే వీలుంది. అయితే దీనితోపాటు రేటు కోతకు విధాన నిర్ణేతలు డిమాండ్ పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేటు పరిస్థితులు, పెట్టుబడుల వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకునే వీలుంది. -
ఏం చేసినా లాభం లేదు...: డీబీఎస్
ముంబై: ప్రభుత్వం తాజాగా చేపడుతున్న విధాన చర్యల వల్ల రూపాయి విలువ పుంజుకోవడం అసాధ్యమని, అయితే పతనం స్పీడ్‌కు కొంత అడ్డుకట్టపడొచ్చని సింగపూర్‌కు చెందిన ప్రముఖ బ్యాంక్ డీబీఎస్ పేర్కొంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందే బ్యాంక్ ఒక నోట్‌ను విడుదల చేసింది. ఇందులో రూపాయి 75కు కూడా పడిపోతుందని డీబీఎస్ పేర్కొనడం గమనార్హం. గడచిన కొద్దిరోజులుగా కొనసాగుతున్న పతనం మరింత తీవ్రతరం అవుతుందనికూడా చెప్పింది. కరెన్సీ విలువ క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం చేసే ఏ ప్రయత్నమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిష్ఫలమేనని కూడా తేల్చిచెప్పింది.