ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులే! | good days for economic growth | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులే!

Published Tue, Oct 18 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులే!

ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులే!

2016 టోకు ద్రవ్యోల్బణం సగటు 1.5%: నొమురా
క్యాడ్ జీడీపీలో 1 శాతం లోపేనని డీబీఎస్ అంచనా

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు సంబంధించి దేశ స్థూల ఆర్థిక అంశాలు ఈ ఏడాది పటిష్టంగానే ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. 2016లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ సగటున 1.5 శాతంగా ఉంటుందని జపాన్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- నొమురా అంచనావేసింది. ఇక 2016లో కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్- ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం)  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే, 1.5 శాతంగా గ్లోబల్  ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- డీబీఎస్ అంచనావేసింది. ఆయా సంస్థల అంచనాలు ఇలా...

ఆహారోత్పత్తుల ధరలు తగ్గుతాయి: నొమురా
ఆహారోత్పత్తుల ధరలు తక్కువగా ఉండడమే టోకు ద్రవ్యోల్బణం 1.5 శాతం వార్షిక సగటుకు కారణం. దీనితోపాటు సంస్థల బలహీన ‘ప్రైసింగ్ పవర్’ కూడా దీనికి ఒక కారణమే. తగిన వర్షపాతంతో పంటలు బాగుండడం, ప్రభుత్వ చక్కటి సరఫరా నిర్వహణ కూడా కనిష్ట ద్రవ్యోల్బణానికి దోహదపడుతుంది. 

డీబీఎస్ అంచనాలు ఇవీ...
ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు తగ్గడం మొత్తం కరెంట్ అకౌంట్‌లోటుపై సానుకూల ప్రభావం చూపుతుంది. 2015-16లో ఇది - 1.1 శాతం. ఎగుమతులతో పాటు దేశ దిగుమతులు కూడా మందగమనం కొనసాగుతుండడం గమనార్హం. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విధాన చర్యలకు ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణం ధోరణే ప్రాతిపదికగా ఉంటుంది.  రేటు కోతకు తగిన విధంగానే వచ్చే కొద్ది నెలల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఉండే వీలుంది. అయితే దీనితోపాటు రేటు కోతకు విధాన నిర్ణేతలు డిమాండ్ పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేటు పరిస్థితులు, పెట్టుబడుల వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకునే వీలుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement