దేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) పరిస్థితి కొంత మెరుగుపడింది. 2024–25 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 11.2 బిలియన్ (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ 1.2 శాతం) డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో క్యాడ్ 11.3 బిలియన్ (జీడీపీ 1.3 శాతం) డాలర్లు. దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలు ఇవీ...
2024–25 క్యూ2లో: 11.2 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు.
2023–24 క్యూ2లో: 11.3 బిలియన్ (జీడీపీలో 1.3 శాతం) డాలర్లు.
2024–25 తొలి భాగం (ఏప్రిల్–సెప్టెంబర్ ): 21.4 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు.
2023–24 తొలి భాగం (ఏప్రిల్–సెప్టెంబర్): 20.2 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు.
వాణిజ్య లోటు ఇలా...
2024–25 రెండో త్రైమాసికంలో ఎగుమతి–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 75.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2023–24 ఇదే కాలంలో ఈ లోటు 64.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
నికర సేవల ఆదాయం
2024–25 రెండో త్రైమాసికంలో నికర సేవల ఆదాయం 44.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 39.9 బిలియన్ డాలర్లుగా ఉంది. సమీక్షా కాలంలో కంప్యూటర్, వ్యాపార, ప్రయాణ, రవాణా సేవల వంటి రంగాలలో సేవల ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment