సాక్షి, ముంబై: అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన రుణ రేటును 0.20 శాతం తగ్గించింది. ఫండ్స్ బేస్డ్ లెండింగ్ (ఎంసీఎల్‌ఆర్) రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. సవరించిన ఈ వడ్డీరేట్టు ఈనెల 7నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంక్ వెల్లడించింది. సవరించిన రేట్ల ప్రకారం ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్‌ఆర్ 7.95 శాతం, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ 8.15 శాతంగా మారిందని తెలిపింది. దీంతో గురువారం నాటి మార్కెట్టలో హెచ్‌డిఎఫ్‌సి షేరు లాభపడుతోంది. కరోనా వైరస్ విస్తరణ, లాక్ డౌన్ నేపథ్యంలో ముందస్తు పరపతి విధాన సమీక్ష చేపట్టిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండయా కీలక వడ్డీరేట్లను బాగా తగ్గించింది. దీంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా రుణాలు, డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా డిపాజిట్లు, రుణాల వడ్డీరేటు కోతను ప్రకటించింది.
చదవండి: లాభాల ప్రారంభం : ఫార్మా జోరు
Comments
Please login to add a commentAdd a comment