సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలపై వడ్డీరేటును తగ్గించిందది. మార్జినల్-కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను (ఎంసిఎల్‌ఆర్) 10 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) దాకా తగ్గిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల వ్యవధిగల గృహ,వాహన రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. సవరించిన వడ్డీరేట్లు నేటి (నవంబర్ 7) నుంచే అమలు చేయనున్నట్టు తెలిపింది.
రేట్ కట్ కట్ తరువాత, 6 నెలల ఎంసిఎల్ఆర్ 5 బీపీఎస్ పాయింట్లు తగ్గి 8.10 శాతానికి చేరింది. అలాగే 1 సంవత్సరాల రేటు 8.30 శాతం, 2 సంవత్సరాల 8.40 శాతం, 3 సంవత్సరాల రేటు 10 బీపీఎస్ పాయింట్లు తగ్గి 8.5 శాతంగా ఉండనుంది. అయితే ఓవర్ నైట్, ఒక నె ల,మూడు నెలల కాల వ్యవధిల రుణాలపై వసూలు రేటును మాత్రం యథాతథంగా ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment