ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు షాకిచ్చింది. తాజా రివ్యూలో కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ కీలక వడ్డరీట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను సైలెంట్‌గా పెంచేసింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) గరిష్టంగా 10 పాయింట్ల బేసిస్ పాయింట్ల వరకు పెంచింది
బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్‌మార్క్ PLR 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్)
తాజా ఎంసీఎల్‌ఆర్ రేట్లు
ఓవర్ నైట్ రుణాలపై MCLR 10 bps 8.50 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది. నెల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెరిగి 8.55 శాతం నుండి 8.65 శాతానిచేరింది మూడు నెలల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.85 శాతంగా ఉంటుంది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 9.05 శాతం నుంచి 9.10కి పెంచింది. ఇక ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.20 శాతంగానూ, రెండేళ్ల కాలానికి గాను 9.20గాన ఉంటుంది. అదే మూడేళ్ల వ్యవధి రుణాలపై వర్తించే ఎంసీఎల్‌ఆర్ 9.25 శాతంగా ఉంటుంది. (స్పోర్ట్స్ ఈవెంట్‌లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!)
Comments
Please login to add a commentAdd a comment