దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్ తగిలింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొన్ని పీరియడ్ లోన్‌లపై ఎంసీఎల్‌ఆర్‌ని సవరించింది. ఇది హోమ్ లోన్‌లు, పర్సనల్ లోన్‌లు, ఆటో లోన్‌లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్‌ల ఈఎంఐని ప్రభావితం చేస్తుంది.
ఎంసీఎల్‌ఆర్ పెరిగినప్పుడు, రుణ వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు ఈరోజు జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) బెంచ్‌మార్క్ 9.05% నుంచి 9.40% మధ్య ఉండగా బ్యాంక్ దీన్ని 0.10 శాతం వరకు పెంచింది.
కొత్త ఎంసీఎల్‌ఆర్‌లు ఇవే..
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.95 నుంచి 9.05 శాతానికి పెరిగింది.
» ఒక నెల ఎంసీఎల్‌ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది.
» మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ కూడా 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది.
» ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది.
» ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్‌ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. (ఇది అనేక రకాల రుణాలకు అనుసంధానమై ఉంటుంది)
» 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్‌ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.
» 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్‌ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment